31, జులై 2012, మంగళవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-5

హస్త 

  1. హస్తా నక్షత్ర మొదటి పాదం :-  హస్తా నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు . హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం  కావడం వలన వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. అవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు మార్చి మార్చి ప్రదర్శిస్తారు. అభిప్రాయాలూ తరచూ  మార్చుకుంటారు. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు వీరికి అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి   వృత్తులు  , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత   వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 15 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశి వాసం, ఉన్నత విద్యాభ్యాసం సంభవం. 33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభం ఔతుంది. సంపాదించినది పదిల పరచుకుంటే ఇబ్బందులు ఉండవు . 49 సంవత్సరాలకు ఆరంభం అయ్యే  శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది . తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సాఫీగా జరిగిపోతుంది.
  2.   హస్తా నక్షత్ర రెండవ  పాదం :-   హస్తా నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది.  వృషభరాశి అధిపతి శుక్రుడు .  హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు.  దేవగణ నక్షత్రం  కావడం వలన వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. ధర్మం పట్ల  ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. సోదర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలంకరణ వస్తువులను సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం.  కళారంగం   వృత్తులు  , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.  ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వుహర ప్రదేశాలు, జల సంబంధిత వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.  సత్ప్రవర్తన కలిగి ఉంటారు.  13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశి వాసం, ఉన్నత విద్యాభ్యాసం సంభవం. 31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభం ఔతుంది. సంపాదించినది పదిల పరసుచుకుంటే  ఇబ్బందులు ఉండవు.  47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే  శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది . తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సాఫీగా జరిగిపోతుంది.
  3. హస్తా నక్షత్ర మూడవ  పాదం:-  హస్తా నక్షత్ర మూడవ  పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు.  హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు.  హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు.  దేవగణ నక్షత్రం  కావడం వలన వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. ధర్మం పట్ల  ఆసక్తి కలిగి ఉంటారు.  బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి   వృత్తులు  , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ తయారీ,   ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో  సంబంధిత వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి  అనుకూలిస్తాయి. భూ  సంబంధిత వృత్తులు , వ్యాపారాలు,  ఉద్యోగాలు  వీరికి  అనుకూలిస్తాయి.   11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశి వాసం, ఉన్నత విద్యాభ్యాసం సంభవం. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభం ఔతుంది. సంపాదించినది పదిలపరచుకుంటే  ఇబ్బందులు ఉండవు.  45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే  శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది . తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సాఫీగా జరిగిపోతుంది.
  4. హస్తా నక్షత్ర నాలుగవ  పాదం :-  హస్తా నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది.  కటకరాశి అధిపతి చంద్రుడు.  హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృ వర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. ఔషధ   వృత్తులు , వ్యాపారాలు,  ఉద్యోగాలు  వీరికి  అనుకూలిస్తాయి.  బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి   వృత్తులు  , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.   9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశివాసం, ఉన్నత విద్యాభ్యాసం సంభవం. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభం ఔతుంది. సంపాదించినది పదిల పరచుకుంటే  ఇబ్బందులు ఉండవు.  43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే  శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది . తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సాఫీగా జరిగిపోతుంది.

చిత్త 


  1. చిత్తా నక్షత్ర మొదటి పాదం :-  చిత్తా నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి అధిపతి సూర్యుడు .  చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. వీరు రాక్షసగణ ప్రధానులు.  ఆవేశం, అతిశయం, పట్టుదల వీరికి అత్యధికం. వీరు విద్యుత్, అగ్ని , భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలం. యునియన్ లీడర్లుగా ఉండడానికి వీరు ఆసక్తి చూపుతారు. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులుగా బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. భూ సంబంధిత, అగ్ని సంబంధిత  వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి  అనుకూలిస్తాయి. 6 సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి . రహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవలసినది చాలా  అవసరం. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
  2. చిత్తా నక్షత్ర రెండవ  పాదం :-  చిత్తా నక్షత్ర రెండవ  పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు.  వీరు రాక్షసగణ ప్రధానులు.  ఆవేశం,  పట్టుదల వీరికి అత్య ధికం. భూ  సంబంధిత  వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి  అత్యధికంగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అనుకులిస్తుంది. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు.  సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.   4 సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి . రహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవలసినది చాలా అవసరం. లేకుంటే 38 సంవత్సరాలకు వచ్చే శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం  ఉంది.   57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
  3. చిత్తా నక్షత్ర మూడవ పాదం:-  చిత్తా నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.  చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు.  వీరు రాక్షసగణ ప్రధానులు. వీరు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. కళారంగంలో ప్రవేసించే అవకాసం ఉంది. స్టంట్ ఆర్టిస్ట్  స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం  ఉంది.  వీరికి పట్టుదల అధికం. ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.  3 సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి . రహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 21 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవలసినది చాలా చాలా  అవసరం. లేకుంటే 37 సంవత్సరాలకు వచ్చే శనిదశ లో ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం  ఉంది.   56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. 
  4. చిత్తా నక్షత్ర నాలువ  పాదం :-   చిత్తా నక్షత్ర నాలువ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది.  వృశ్చికరాశి అధిపతి కుజుడు,  చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు.  వీరు రాక్షసగణ ప్రధానులు. విరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలమతే బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత  సంబంధిత  వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి  అత్యధికంగా అనుకూలిస్తాయి. ధర్యసాహసాలు వీరికి అధికమే.  1 సంవత్సరం తరువాత  రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి . రహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవలసినది చాలా చాలా  అవసరం. లేకుంటే 36 సంవత్సరాలకు వచ్చే శని దశ లో ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం  ఉంది.   55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది .మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. 

స్వాతి 

  1. స్వాతి నక్షత్ర మొదటి పాదం :-   స్వాతి నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు .  స్వాతి నక్షత్ర అధిపతి రాహువు.  దేవగణ ప్రధానులు కనుక వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి  మీద  గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రచయితలు కావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం  ఉంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం కూడా ఉంది. వీరు దత్తు పోవడానికి అవకాసం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు. వీరు రాహుదశలో జన్మిస్తారు కనుక కొన్ని సమస్యలు ఎదురైనా తల్లి తండ్రుల చాటున కష్టం తెలియకుండా జరిగి పోతుంది. వీరికి హైస్కులు తరువాత గురుదశ కాలంలో కాలేజి విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. 16 సంవత్సరాలకే గురుదశ వస్తుంది కనుక సౌఖ్యవంతమైన జీవితం ఆరంభ ఔతుంది. విద్యలో చక్కని అభివృద్ధి సాధించి ఉద్యోగాలలో స్థిరపడతారు. సకాలంలో వివాహం ఔతుంది. సంపాదించినది జాగ్రత్త చేయవలసిన అవసరం వీరికి అత్యవసరం. లేకుంటే 32 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికం గనుక ఇబ్బందులకు గురి ఔతారు. 51 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  2. స్వాతి నక్షత్ర రెండవ పాదం:-  స్వాతి నక్షత్ర రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది.   మకరరాశి అధిపతి శని.  స్వాతి నక్షత్ర  అధిపతి రాహువు.  దేవగణ ప్రధానులు కనుక వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు.   వీరి  మీద  శని  రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి బద్ధకం కొంచం ఎక్కువ. అయినప్పటికీ పని ఆరంభించారంటే   బాగా శ్రమించి పని చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు. అలంకరణ మీద ఆసక్తి ఉండదు. కర్మాగారాలు , పరిశ్రమలు  స్థాపించి నిర్వహించగలరు.   కర్మాగారాలలో  , పరిశ్రమలలో   వృత్తి , ఉద్యోగం,  వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.  వీరు దత్తు పోవడానికి అవకాసం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు. వీరికి రాహుదశ దాదాపు 11 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 27 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 46 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధదశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తరువాత 63 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం  అనుకులిస్తుంది.  వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 
  3. స్వాతి నక్షత్ర మూడవ పాదం :-  స్వాతి నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని ,  స్వాతి నక్షత్ర అధిపతి రాహువు.  దేవగణ ప్రధానులు కనుక వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి  మీద  గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది.   అయినప్పటికీ పని ఆరంభించారంటే   బాగా శ్రమించి పని చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు.  కర్మాగారాలు , పరిశ్రమలు  స్థాపించి నిర్వహించగలరు.   కర్మాగారాలలో  , పరిశ్రమలలో   వృత్తి , ఉద్యోగం,  వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. స్థిరమైన అభిప్రాయలు ఉంటాయి.   వీరు దత్తు పోవడానికి అవకాసం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు. వీరికి రాహుదశ దాదాపు 7 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  ఆరంభంలో రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు.  వివాహంలో జాప్యం జరుగుతుంది. 23 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 42సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధదశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తరువాత 59 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం  అనుకులిస్తుంది.   66 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి.  వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 
  4. స్వాతి నక్షత్ర నాలుగవ పాదం:-   స్వాతి నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు,   స్వాతి నక్షత్ర  అధిపతి రాహువు .  దేవగణ ప్రధానులు కనుక వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి  మీద  గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రచయితలు కావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం  ఉంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం కూడా ఉంది. వీరు దత్తు పోవడానికి అవకాసం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.  వీరికి రాహుదశ దాదాపు 3 సంవత్సరాల కాలం ఉంటుంది.  చదువునిరాటంకంగా   కొనసాగుతుంది.  16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులలో కొంత మందకొడితనం ఉంటుంది. ప్రయత్నంతో విజయం సాధించ వచ్చు.జీవితంలో త్వరగా స్థిరపడతారు.  వివాహం జాప్యం జరుగుతుంది. 19 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల శనిదశ  కాలం ఉంటుంది కనుక  ఆ కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 38 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధదశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తరువాత 55 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం  అనుకులిస్తుంది. 62 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి.  వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది.

29, జులై 2012, ఆదివారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-4

మఖ 

  1. మఖ నక్షత్ర మొదటి పాదం :-  మఖ నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు.  మఖ నక్షత్ర అధిపతి కేతువు. ఇది రాక్షసగణ నక్షత్రం. కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అసురవేగంతో పూర్తిచేస్తారు. కేతు గ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. ఏ  కార్యమైనా  దైవనమ్మకంతో చేస్తారు. రాజ్యంగ సంబంధిత వృత్తి , ఉద్యోగ , వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ  సంబంధిత వృత్తి , వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. బాల్యంలోనే శుక్రదశ వస్తుంది. ఈ కారణంగా వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. కనుక ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసిన ఉంటుంది. 26 సంవత్సరాల వరకుజీవితం సుఖసౌఖ్యాలతో సాగుతుంది తరువాత కొంత సుఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకు వచ్చే అవకాశం ఉంది.  రాహుదశ అనుకూలంగా ఉంటే విదేశీ యానం సంభవం.18 సంవత్సరాల  రాహుదశ  అనంతరం వచ్చే గురుదశ కారణంగా 67 సంవత్సరాల తరువాత సౌఖ్యవంతమైన  జీవితం తిరిగి ప్రారభం ఔతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది.
  2. మఖ నక్షత్ర రెండవ పాదం:-  మఖ నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలోఉంటుంది. వృషభరాశి అధిపతి శుక్రుడు  నక్షత్రాధిపతి కేతువు. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. అలంకరణ వస్తువుల సేకరణ అంటే  విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి  ఇష్టపడతారు.  చిన్న వయసులో వచ్చే శుక్రదశ కారణంగా బాల్యం నుండే కళారంగ ప్రవేశం చేస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కళా సంబంధిత వృత్తి,  ఉద్యోగాలు, వ్యాపారం  వీరికి అనుకూలిస్తాయి.  సౌఖ్యమైన జీవితం అనుభవిస్తారు. 24  సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సుఖ్యం తగ్గినా 47 సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ   కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా 65 సంవత్సరాల తరువాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలౌతుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది .  
  3. మఖ నక్షత్ర మూడవ పాదం:-  మఖ నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది .  మిధునరాశి అధిపతి బుధుడు . నక్షత్ర అధిపతి కేతువు .  వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో  సంబందిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  కేతు గ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం  మీద సమానమైన ఆసక్తి ఉంటుంది. చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ, సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజం సాధించవలసిన అవసరం ఉంది. 22 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కొంచెం సౌఖ్యం తగ్గినా 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా  కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.రాహుదశ  అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ 63 సంవత్సరాల నుండి కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది.
  4. మఖనక్షత్ర నాలుగవ పాదం :- మఖనక్షత్ర  నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది.  కటకరాశి అధిపతి చంద్రుడు.  మఖనక్షత్ర అధిపతి కేతువు .  ఇది రాక్షసగణ నక్షత్రం. కనుక వీరికి పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది.   కేతు గ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలు కోపతాపాలు మార్చి మార్చి  ప్రదర్శిస్తారు. పాలు , బియ్యం, ముత్యం, కాగితం, డైరి ఉత్పత్తులు, ఔషధ తయారీ  విక్రయం వంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  21 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కొంచెం సౌఖ్యం తగ్గినా 44 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా  కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.రాహుదశ  అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ 62 సంవత్సరాల నుండి కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగి పోతుంది.

పుర్వఫల్గుణి 


  1. పూర్వఫల్గుణి  నక్షత్ర మొదటి పాదం :-  పూర్వఫల్గుణి  నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి అధిపతి సూర్యుడు.  పుర్వఫల్గుణి  నక్షత్ర అధిపతి శుక్రుడు. కనుక వీరి  మీద సూర్య శుక్ర గ్రహ ప్రభావం ఉంతుది. వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి అధిఖ్యభావం , అతిశయం కలగలుపుగా ఉంటాయి. వీరికి తండ్రి అంటే అభిమానం అధికం. వీరు బాల్యం నుండే కళాకారులుగా రాణించగలరు. ఇతరులను యాచించడం  అంటే వీరికి అంతగా ఇష్టం ఉండదు. ఎక్కడ వీరు తలవంచ లేరు.  వీరికి అగ్ని సంబంధిత, జల సంబంధిత వ్యాపారం, వృత్తులు , ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరు పుట్టిన నాటి నుండి 17 సంవత్సరాల వరకు సౌఖ్యంగా జరుగుతుంది. వీరు విద్య కంటే సౌందర్య పోషణకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కనుక ప్రయత్న పూర్వకంగా  మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. తరువాత జీవితంలో కొంత సౌఖ్యం తగ్గినా 40 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత రాహుదశ  కారణంగా సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 58 సంవత్సరాల అనంతరం గురుదశ వస్తుంది కనుక సమస్యలు పరిష్కరించబడి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం ప్రారంభం ఔతుంది. తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  2. పూర్వఫల్గుణి  నక్షత్ర రెండవ పాదం:-  పూర్వఫల్గుణి  నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.   వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు.  వీరు బాలకళాకారులుగా రాణించగలరు. వీరికి కళలకు, జలానికి, అలంకరణకు  సంబందించిన ఉద్యోగ వ్యాపారాలు వృత్తులు అనుకూలిస్తాయి. అలాగే మేధస్సుకు , భూమికి సంబంధించిన  సంబందించిన ఉద్యోగ వ్యాపారాలు వృత్తులు అనుకూలిస్తాయి.  వీరికి వ్యాపారం అంటే ఆసక్తి ఉంటుంది. వీరు పుట్టిన నాటి నుండి 12 సంవత్సరాల వరకు సౌఖ్యంగా జరుగుతుంది. వీరు విద్య కంటే సౌందర్య పోషణకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కనుక ప్రయత్న పూర్వకంగా  మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. తరువాత జీవితంలో కొంత సౌఖ్యం తగ్గినా 35 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత రాహుదశ  కారణంగా సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 53 సంవత్సరాల అనంతరం గురుదశ వస్తుంది కనుక సమస్యలు పరిష్కరించబడి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం ప్రారంభం ఔతుంది. తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది.  
  3. పూర్వఫల్గుణి  నక్షత్ర మూడవ పాదం:-  పుర్వఫల్గుణి  నక్షత్ర మూడవ పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు ,   పూర్వఫల్గుణి  నక్షత్ర అధిపతి శుక్రుడు .  వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరిపై  శు క్రగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది కనుక వీరు కళాకారులుగా అత్యంత చక్కగా రాణించగలరు. కళా సంబంధిత వృత్తులు , ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన  వృత్తులు , ఉద్యోగాలు,   వ్యాపారాలు అనుకూలిస్తాయి . సముద్ర సంబంధిత, జల సంబందియా, విహరప్రదేశ   సంబంధించిన  వృత్తులు , ఉద్యోగాలు,   వ్యాపారాలు  అనుకూలిస్తాయి. పరిశుభ్రమైన, అందమైన, సౌకర్యవంతమైన  వాతావరణంలో నివసించడానికి ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితం గడపడానికి ఆసక్తి ఉంటుంది. అలంకరణ వస్తువులను సేకరించడం మీద ఆసక్తి కనబరుస్తారు.   వీరు పుట్టిన నాటి నుండి 7 సంవత్సరాల వరకు సౌఖ్యంగా జరుగుతుంది. వీరు విద్య కంటే సౌందర్య పోషణకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు కనుక ప్రయత్న పూర్వకంగా  మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. తరువాత జీవితంలో కొంత సౌఖ్యం తగ్గినా 30 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ  కారణంగా సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 48 సంవత్సరాల అనంతరం గురుదశ వస్తుంది కనుక సమస్యలు పరిష్కరించబడి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం ప్రారంభం ఔతుంది. తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది.  
  4. పూర్వఫల్గుణి  నక్షత్ర నాలుగవ పాదం:-  పూర్వఫల్గుణి  నక్షత్ర నాలుగవ పాదం వృశ్చికరాశిలో ఉంటుంది.  వృశ్చికరాశి అధిపతి కుజుడు.  పూర్వఫల్గుణి  నక్షత్ర శుక్రుడు .  వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు. జలవిద్యుత్ సంబంధిత ఉద్యోగం , వ్యాపారం , వృత్తులు వీరికి అనుకూలం. భూ సంబందిత,  జల సంబధిత ఉద్యోగాలు,  వ్యాపారం,  వృత్తులు వీరికి అనుకూలమే.  వీరు పుట్టిన నాటి నుండి 4 సంవత్సరాల వరకు సౌఖ్యంగా జరుగుతుంది. విద్య మొదలు పెట్టినప్పటి నుండి నిరాటంకంగా సాగుతుంది. జీవితంలో సకాలంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం  ఉంది. శుక్రదశ తరువాత జీవితంలో కొంత సౌఖ్యం తగ్గినా 24 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ  కారణంగా సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 42 సంవత్సరాల అనంతరం గురుదశ వస్తుంది కనుక సమస్యలు పరిష్కరించబడి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం ప్రారంభం ఔతుంది. తరువాత జీవితం సాఫీగా జరిగి పోతుంది.

ఉత్తరఫల్గుణి 

  1. ఉత్తరఫల్గుణి నక్షత్ర మొదటి పాదం :-  ఉత్తరఫల్గుణి నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది .  ఉత్తరఫల్గుణి నక్షత్ర  అధిపతి సూర్యుడు.   వీరికి ఆధిఖ్యభావం, అతిశయం కలగలుపుగా ఉంటాయి. వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి తండ్రి  అంటే అభిమానం ఎక్కువగా ఉంటుంది.  వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి.   వీరు ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు చక్కాగా నిర్వహిస్తారు.  వీరు ప్రజానా యకత్వం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అధికార పదవులను సహితం చాకచక్యంతో నిర్వహిస్తారు. వీరికి ప్రభుత్వ  ఉద్యోగాలు సులువుగా లభిస్తాయి. రాజకీయాలలో అధికార పదవులు అధిరోహిస్తారు. ఉపాధ్యాయులుగా , అధికారులుగా రాణించగలరు. అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగం వీరికి అనుకూలిస్తాయి . విద్య నిరాటంకంగా సాగుతుంది. ఉన్నత విద్య విదేశాలలో అభ్యసించే అవకాశాలు కలుగ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం ఉంది .  24 సంవత్సరాల వరకు సాఫీగా సాగే జీవితంలో  తరువాత 18 సంవత్సరాల రాహుదశా కాలంలో కొన్ని సమస్యలు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ రాహువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగ అవకాసం ఉంది. 42 సంవత్సరాల అనంతరం వచ్చే గురుదశ కారణంగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు . మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది. 
  2. ఉత్తరఫల్గుణి నక్షత్ర రెండవ పాదం :-  ఉత్తరఫల్గుణి నక్షత్ర రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శని .  ఉత్తరఫల్గుణి నక్షత్ర సూర్యుడు.  వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు.  వీరికి తండ్రి  అంటే అభిమానం ఎక్కువగా ఉంటుంది.  వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి.  ఆధిఖ్యగుణం, పట్టుదల వీరికి అధికంగా ఉంటాయి. పరిశ్రమలు , కర్మాగారాలు, మెకానిక్ షెడ్లు  సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారాలు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.నౌకా సంబంధిత  వృత్తులు, ఉద్యోగం, వ్యాపారాలు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి . వీరికి శ్రమించి పనిచేసే గుణం ఉంటుంది.  జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం ఉంది . 22 సంవత్సరాల వరకు సాఫీగా సాగే జీవితంలో  తరువాత 18 సంవత్సరాల రాహుదశా కాలంలో కొన్ని సమస్యలు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ రాహువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగ అవకాసం ఉంది. 40 సంవత్సరాల అనంతరం వచ్చే గురుదశ కారణంగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది. 
  3. ఉత్తరఫల్గుణి నక్షత్ర మూడవ పాదం :-  ఉత్తరఫల్గుణి నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని.  ఉత్తరఫల్గుణి నక్షత్ర సూర్యుడు.  వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు.   వీరికి తండ్రి  అంటే అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఆధిఖ్యగుణం, పట్టుదల వీరికి అధికంగా ఉంటాయి  పరిశ్రమలు , కర్మాగారాలు, మెకానిక్ షెడ్లు  సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారాలు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.నౌకా సంబంధిత  వృత్తులు, ఉద్యోగం, వ్యాపారాలు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి . వీరికి శ్రమించి పనిచేసే గుణం ఉంటుంది.  జీవితంలో నిదానంగా స్థిరపడతారు. ఉన్నత విద్య విదేశాలలో అభ్యసించే అవకాశం ఉంటుంది.   20 సంవత్సరాల వరకు సాఫీగా సాగే జీవితంలో  తరువాత 18 సంవత్సరాల రాహుదశా కాలంలో కొన్ని సమస్యలు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ రాహువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగ అవకాసం ఉంది. 38 సంవత్సరాల అనంతరం వచ్చే గురుదశ కారణంగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది.
  4. ఉత్తరఫల్గుణి నక్షత్ర నాలుగవ పాదం :-   ఉత్తరఫల్గుణి నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు.  ఉత్తరఫల్గుణి నక్షత్ర సూర్యుడు .   వీరు మానవగణ  ప్రధానులు కనుక వీరు సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం కలిగి ఉంటారు.  వీరికి తండ్రి  అంటే అభిమానం ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. వీరికి స్వల్పంగా అతిశయం, ఆధిక్యం ఉంటాయి. వీరు ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు చక్కాగా నిర్వహిస్తారు.  వీరు ప్రజానాయకత్వం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.  వీరు  ఉపాధ్యాయులు, అగ్ని సంబంధిత వృత్తులు, అధికారులుగ ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం వీరికి అధికంగా ఉంటుంది. 18 సంవత్సరాల వరకు సాఫీగా సాగే జీవితంలో  తరువాత 18 సంవత్సరాల రాహుదశా కాలంలోకాలేజి చదువులకు అడ్డంకులు  కొన్ని సమస్యలు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ రాహువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగ అవకాశం ఉంది. 38 సంవత్సరాల అనంతరం వచ్చే గురుదశ కారణంగా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది. 

28, జులై 2012, శనివారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-3

పునర్వసు 

* పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది  దేవగణం.  కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా  మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి  వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు  కూడా  వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం  జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత  జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి.  51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7  సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.
*  పునర్వసు నక్షత్ర రెండవ  పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి 
శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు  గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు.  వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ  పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా ,  ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా  19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది.  46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో  కొన్ని సమస్యలు  ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో  సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం  ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా  జరిగుతుంది. 
*   పునర్వసు నక్షత్ర మూడవ పాదం:-  పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో  ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత  వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది.  6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది.  విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ  సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో  వీరికి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.
*  పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి  తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో  సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి  అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.

పుష్యమి  

* పుష్యమి నక్షత్ర  మొదటి పాదం :-  పుష్యమి నక్షత్ర  మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. వీరికి తండ్రి అంటే కొంత విముఖత కలుగ వచ్చు. సూర్యుడు, శని గ్రహ ప్రభావం వీరి మిద ఉంటుంది.  కొంత పట్టుదల  అతిశయం కూడా వీరికి ఉండవచ్చు. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకుచదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా కాలేజ్ చదువులు కొనసాగిస్తీ అతి చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 సంవత్సరాల అనంతరం వచ్చే కేతుదశలో  వీరికి సమస్యలు  ఉన్నా  కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే  విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం  కూడా ఇస్తుంది. కేతుదశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  ప్రభుత్వ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. శుక్ర దశ  నుండి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.
*  పుష్యమి నక్షత్ర  రెండవ పాదం:- పుష్యమి నక్షత్ర  రెండవ పాదం కన్యా రాశిలో ఉంటుంది . కన్యా రాశి అధిపతి బుధుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని.బుధ శని గ్రహ ప్రభావం వీరి మీద ఉన్నాయి. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి  ప్రాధమిక విద్య వరకు మందకొడిగా సాగినా తరువాత విద్యలో చక్కగా ప్రకాశిస్తారు. వీరికి విద్య విజయవంతంగా సాగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ఉన్నతి సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు . మేధా సంపన్నత కలిగిన ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నతోద్యాగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.  సకాలంలో జీవితంలో స్థిరపడతారు . సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు .  7 సంవత్సరాల అనంతరం వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
* పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం:- పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం తులారాశి లో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు . పుష్యమి నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు.  నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధదశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం అరభం ఔతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ  అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా జరిగిపోతుంది.
*  పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం:- పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది. వృశ్చికరాశి అధిపతి కుజుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు.  వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందు ఉంటారు. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగం వ్యాపారం వృత్తులు వీరికి అనుకూలం. 2 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది.  ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు .  కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే   జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగి పోతుంది.

ఆశ్లేష 

* ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం:- ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు,            
ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో 7 సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు. కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య పూర్తి  కాగానే జీవితంలో స్థిరపడతారు.  వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ  సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 
* ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం:-  ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం మకరరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి శని . ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే  వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.  18 సంవత్సరాల వయసులో శుక్రదశ వస్తుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్ళుతుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి .విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే  విదేశీవాసం,  విదేశీయాత్ర  చేయడానికి అవకాశం ఉంది . వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
* ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం:- ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది. కుంభరాశి అధిపతి శని .  ఆశ్లేష నక్షత్ర  బుధుడు . కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. 7 సంవత్సరాల వయసులో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కాలేజ్ చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 
 * ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం:- ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర  బుధుడు . వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే 3 సంవత్సరాల నుండి వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది.  53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహుదశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది. 

27, జులై 2012, శుక్రవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-2


రోహిణి 

* రోహిణి నక్షత్ర మొదటిపాదం :- రోహిణి నక్షత్ర మొదటిపాదం మేషరాశిలో ఉంటుంది. నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరు సమయస్పూర్తి కలిగి సమయానుకూలంగా వ్యవహరిస్తారు. తరచుగా  ఉద్రేకానికి కూడా లోనౌతుంటారు.  సైనికపరమైన ఉద్యోగాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . రక్షణదళ ఉద్యోగాలలోరాణించగలరు. ఔషధి రంగానికి సంబంధించిన వ్రుత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి  అనుకూలిస్తాయి. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి  పట్ల ఆసక్తి ఉంటుంది. ఉన్నది. 14 సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు.అవకాశాలు ఉన్నాయి.  జీవితంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 32 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
* రోహిణి నక్షత్ర రెండవ పాదం :- రోహిణి నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది. కనుక సహజమైన నక్షత్ర గుణాలతో వృషభరాశి అధిపతి అయిన శుక్రుగ్రహ ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . సుందరమైన కళాత్మకమైన వస్తువులంటే వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. కళా సంబందిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విహారప్రదేశాల  నిర్వహణ, ఉద్యానవనాల నిర్వహణ , పర్యాటకరంగం , వెండి, ముత్యాల వంటి వ్యాపారాలు , సముద్ర సంబంధిత లేక జల సంబంధిత , వినోదాత్మక వ్రుత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సౌందర్య పోషణ , కళాత్మక వస్తు  సేకరణ అంటే వీరికి మక్కువ ఎక్కువ. విహరప్రదేశ  సందర్సన పట్ల ఆసక్తి అధికం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. 12 సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు .  జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలుగవచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 30 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
*  రోహిణి నక్షత్ర మూడవ పాదం :- రోహిణి నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో ఉంటుంది.  వీరి పై రోహిణి నక్షత్ర గుణాలతో చేరి మిధునరాశి అధిపతి బుధగ్రహ ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి .కనుక వీరు ఔషధ సంబంధ బ్రుట్టి వ్యాపారాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్ర అధ్యయనం , ఔషధ తయారీ వంటివి వీరికి అనుకూలిస్తాయి. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు రెండు వీరికి అనుకూలమే. 1 0 సంవత్సరాల వయసు నుండి  రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు.  జీవితంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 28 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
* రోహిణి నక్షత్ర నాలుగవ  పాదం :-  రోహిణి నక్షత్ర నాలుగవ  పాదం కటక రాశిలో ఉంటుంది. నక్షత్రాధిపతి చంద్రుడు కటకరాశి అధిపతి చంద్రుడు కనుక వీరికి తల్లి పట్ల అనురాగం అనుభందం అధికంగా ఉంటాయి . బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . మాతృ వర్గ బంధువులతో అనుబంధం వీరికి అధికమే. వీరికి శ్వేతవర్ణం కలిగిన వస్తువుల ఉత్పత్తి తయారీ రంగంలో ఉద్యోగావ్యాపారాలు అనుకూలిస్తాయి. పాలు, బియ్యం, ముత్యం, కాగితం వంటివి అన్నమాట. ఔషధ రంగంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలమే. 8 సంవత్సరాల వయసు నుండి  రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు .  జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలుగవచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 26 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది.  

మృగశిర 

* మృగశిర నక్షత్ర మొదటి పాదం:- మృగశిర నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. కనుక నక్షత్రధిపతి కుజగ్రహ  ప్రభావంతో సింహరాశి అధిపతి అయిన సూర్యుని ప్రభావం వీరిపై ఉంటుంది. వీరికి ఆధిఖ్యభావం అధికంగా ఉంటుంది. వీరికి విద్యుత్ సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అవేశ పూరిత స్వభావం ఉంటుంది. అగ్ని సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు కూడా అనుకూలమే. ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం నివసించడం వంటివి కొనసాగవచ్చు.  విద్యాభ్యాసం సాధారణంగా సాగినా ఉన్నత విద్యా సమయంలో చురుకుగా సాగుతుంది. సరి అయిన సమయంలో వివాహం జరిగే అవకాశాలు అధికం. వివాహానంతరం జీవితం సౌఖ్యంగా సాగుతుంది. సకాలంలో ఉద్యోగ వ్యాపారాలు అనుకులించి జీవితంలో త్వరగా స్థిరపడతారు. జీవితం దాదాపు సాఫీగా జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. 
* మృగశిర నక్షత్ర రెండవ పాదం:- మృగశిర నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంటుంది. మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు , కన్యా రాసి అధిపతి కుజుడు కనుక వీరికి భూమి సంబంధిత వృత్తులు వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో అభివృద్ధి కొనసాగించాలి.రియల్ ఎస్టేట్ రంగంలో వీరు చక్కగా రాణించగలరు. భూములు, ఆస్తులు సంపాదిస్తారు. చిన్న వయస్సులోనే సంపాదన మొదలుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.
* మృగశిర నక్షత్ర మూడవ పాదం:- మృగశిర నక్షత్ర మూడవ పాదం తులారాశిలో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు . కనుక వీరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. అలంకరణ వస్తువులను సేకరిస్తారు విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఉద్యానవనాల నిర్మాణం నిర్వహణ వంటివి కూడా వీరికి అనుకూలిస్తాయి. ఆకర్షణీయమైన నిర్మాణ రంగంలో అభివృద్ధి సాధిస్తారు. వీరికి కల సంబంధిత వ్యాపారం, వృత్తి , ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యాభ్యాసం పుర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. ప్రయత్నపూర్వకంగా విద్యలో అభివృద్ధి కొనసాగించాలి. వివాహం సకాలంలో జరుగుతుంది. చిన్న వయస్సులోనే సంపాదన మొదలుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.
* మృగశిర నక్షత్ర నాలుగవ పాదం :- మృగశిర నక్షత్ర నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. వీరు మనో ధైర్యం కలిగి ఉంటారు. ధైర్యసాహసాలకు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలం. అగ్నిమాపకదళం, సైనిక రంగం, రక్షణ దళం, సెక్యూరిటి వంటి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత ఉద్యోగం, వృత్తి , వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. విద్యలో అడ్డంకులు ఎదురైనా విద్య పూర్తికాగానే జీవితంలో త్వరగా స్థిరపడతారు. ఉన్నత విద్య లో అభివృద్ధి ఉంటుంది.సకాలంలో  వివాహం జరుగుతుంది. చిన్న వయసులో ధన సంపాదన చేస్తారు. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.

ఆరుద్ర 

* ఆరుద్ర నక్షత్ర మొదటి పాదం :- ఆరుద్ర నక్షత్ర మొదటి పాదం ధనుస్సు రాశిలో ఉంటుంది. ధనుస్సు రాశి అధిపతి గురువు . నక్షత్రాధిపతి రాహువు. కనుక వీరు రాజకీయ రంగంలో బాగా రాణించగలరు. అత్యంత సమస్పుర్తితో వ్యవహరించి ప్రజా నాయకత్వం వహించి అభివృద్ధి సాధిస్తారు. విరు రచయితలుగా రాణించగలరు. బంగారు ఆభరణ తయారీ ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. కళారంగంలో శిక్షణ  వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఎరంగలో నైనా చాకచక్యంతో వీ రు ముందుకు పోగలరు.  వరకు మందకొడిగా సాగినవిద్య తరువాత అభివృద్ధి పదంలో సాగుతుంది. చిన్న వయసులో వివాహం జరిగే అవకాశాలు అధికం. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహానంతర జీవితం సాఫీగానే జరుగుతుంది. ధనసంపాదన చేస్తారు. సంపాదించిన  ధనం జాగ్రత్త చేసుకోనవలసిన అవసరం వీరికి ఉంది. 
* ఆరుద్ర నక్షత్ర రెండవ పాదం:- ఆరుద్ర నక్షత్ర రెండవ పాదం మకరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి శని. కనుక నక్షత్ర అధిపతి రాహువు,  మకరరాశి అధిపతి శనిగ్రహ ప్రభావం వీరికి అధికంగా ఉంటుంది. వీరు శ్రమకు ఓర్చుకుని పని చేయగలరు. పట్టుదలతో పని చేస్తారు . ఇనుము సంబంధిత వస్తువుల తయారి రంగంలో వీరికి ఉద్యోగాలు ,  వృత్తులు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మెకానిక్ రంగానికి సంబంధించిన విద్య అంటే ఆసక్తి కలిగి ఉంటారు. హైస్కులు నుండి విద్యలో అభివృద్ధి కొనసాగుతుంది. విద్యాభ్యాసం చక్కగా కొనసాగుతుంది. విద్యాభ్యాసం పూర్తీ కాగానే జీవితంలో స్థిరపడతారు. ధనసంపాదన చేస్తారు. సంపాదించిన ధనం జాగ్రత్త చేసుకోనవలసిన అవసరం వీరికి ఉంది. 66 సంవత్సరాల తరువాత కేతు దశ కారణంగా 7 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 73 నుండి సమస్యలు తిరి మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది.
*  ఆరుద్ర నక్షత్ర మూడవ పాదం:- ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం కుంభ రాశిలో ఉంటుంది.  కుంభ రాశి అధిపతి శని .నక్షత్ర అధిపతి రాహువు . కనుక వీరి మీద రాహు మరియు శని  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కర్మాగారాలు, పరిశ్రమలు మొదలైన వాటిలో వృత్తి, ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చుకుని పని చేయగలరు. పట్టుదలతో పని చేస్తారు . మెకానిక్ షెడ్ వంటివి వీరికి అనుకూలమైనవి. నూనె , చమురు సంబంధిత ఉద్యోగావ్యాపారాలు వీరికి అనుకూలం. బాల్యంలో మందంగా సాగిన విద్యాభ్యాసం హైస్కులు తరువాత అభివృద్ధి కనపడుతుంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాసం ఉంది. చిన్న వయసులో సంపాదించినది జాగ్రత్త చేసుకుని జీవితం సాగిస్తే ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్ధికపరమైన పొడుపు అవసరం. వివాహానికి ముందు సౌఖ్యంగా జరిగి పోతుంది. తరువాత కొంత వరకు సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 60 సంవత్సరముల తరువాత కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా  కొన్ని సంవత్సరాల తరువాత సమస్యలు తీరి సౌఖ్యంగా ఉంటారు. వృద్ధాప్యం వీరికి సౌఖ్యంగా జరిగి పోతుంది.
*  ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం:-ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు.నక్షత్ర అధిపతి రాహువు . కనుక వీరి మీద రాహు మరియు గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కళా రంగంలో గుర్తించ తగిన స్థితికి చేరుకోవడానికి అవకాశాలు ఉనాయి,  బంగారు సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  రచయితలుగా కూడా వీరు రాణించగలరు. వీరు నిరటంకగా విద్యాభ్యాసం పూర్తి  చేస్తారు. వివాహానికి పూర్వం ఉన్న సౌఖ్యంలో వివాహానంతరం తగ్గు ముఖం పడుతుంది. అయినప్పటికీ జీవితం సాఫీగా జరిగి పోతుంది. సంపాదిమ్చిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.ఉన్నత విద్యాభ్యాసంలో కొంచెం జాప్యం జరిగినా ప్రయత్నిస్తే సాధించగలరు. రాజకీయాలలో వీరు అభివృద్ధి సాధిస్తారు. ప్రజానాయకులుగా ఉన్నతి సాధించగలరు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కొంచం జాప్యం కలగవచ్చు. 56 కేతు దశ కారణంగా సంవత్సరాల అనంతరం కొన్ని సమస్యలు ఎదురైనా కొన్ని సంవత్సరాల తరువాత సమస్యలు తొలగి వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది. 

26, జులై 2012, గురువారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-1

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు 

అశ్విని 

* అశ్విని నక్షత్ర మొదటి పాదం :-  అశ్విని నక్షత్ర మొదటిపాదం మేషరాశిలో ఉంటుంది. నక్షత్ర అధిపతి కేతువు. రాశి అధిపతి కుజుడు.  నక్షత్ర అధి  దేవతలు అశ్వినీ  దేవతలు.  అశ్వినీ  దేవతలు దేవవైద్యులు.  అశ్వినీ దేవతలు సూర్యుడు సంజ్ఞా దేవి అశ్వరుపాలలో ఉన్నప్పుడు కలిగిన సంతానం. ఈ కారణంగా అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఉత్సాహవంతులుగా ఉంటారు. కనుక క్రీడా స్పూర్తి, వైద్యంలో నైపుణ్యం వీరికి సహజ గుణం. మొదటి పాదంలో జన్మించినవారు శస్త్రచికిత్స తత్సంబంధిత వృత్తులలో చక్కగా రాణించగలరు.  ఉత్సాహవంతులైన వీరికి కుజాధి పత్యం తోడు  ఔతుంది కనుక వీరవిద్యలు  నేర్చుకోవడానికి  వీరు ఆసక్తి కలిగి ఉంటారు. సైనికపరమైన వ్రత్తి ఉద్యోగాలలో  వీరు రాణించగలరు. ధైర్యవంతులై ఉంటారు. అవసరసమయాలలో దైర్యసహసాలు ప్రదర్శి స్తారు. వీరికి కేతు దశా శేషం దాదాపు అయిదు సంవత్సరాలు ఉంటుంది జన్మించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా తరువాత ఆరంభం అయ్యే శుక్ర దశ  కారణంగా విలాసవంతమైన సుఖవంతమైన జీవితం  మొదలుతుంది. ఇరవై అయిదు సంవత్సరాల కాలం సుఖవంతమైన జీవితం గడుపుతారు. తరువాత కొంత సౌక్యం తగ్గినా దాదాపు 51 సంవత్సరాల వరకు సమస్యా రహితంగా జరిగి పోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 69 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందివిద్యార్ధి దశలో విద్యకంటే  అలంకరణ వైపు, విలాసాల వైపు  మనసు మొగ్గే  ప్రమాదం ఉన్నది  కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్యవైపు మళ్ళించి విద్యలో విజయం సాధించి ముందుకు  సాగవలసి ఉంటుంది. తగిన సమయంలో వీరు జీవితంలో స్థిరపడతారు.  అశ్వినీ నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  ప్రభుత్వరంగ ఉద్యోగాలలో స్థిరపడే అవకాశాలు వీరికి  అధికంగా ఉంటాయి. సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.
* అశ్వినీ నక్షత్ర రెండవపాదం :- అశ్విని నక్షత్ర రెండవపాదం వృషభ రాశి లో ఉంటుంది. కనుక అశ్వినినక్షత్ర  రెండవ  పాదంలో జన్మించిన వారి మీద వృషభ రాశి అధిపతి  శుక్రుడు, నక్షత్ర అధిపతి కేతువు. నక్షత్ర అధి  దేవతలు అశ్వినీ  దేవతలు కలిసిన ప్రభావం ఉంటుంది. వీరికి బాల్యం నుండి విలాసవంతమైన, సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం ఔతుంది. వీరికి అందమైన వస్త్రాలు, ఆభరణాలు,  అలంకరణ వస్తువుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీ యమైన క్రీడలయందు ఆసక్తి కలిగి ఉంటారు. ఈత వంటి జల సంబంధిత క్రీడలు, ఉత్సాహవంతమైన ఆకర్షణ కలిగిన వ్రుత్తి ఉద్యోగాలలో వీరు రాణించగలరు. సముద్ర సంబంధిత వృత్తులలో స్థిరపడే అవకాశాలు వీరికి అధికం. ఇతర జల సంబంధియా వ్రుత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. వీరు ప్రయత్నపూర్వకంగా మనసును విద్యవైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది.  23 సంవత్సరాల కాలం సౌఖ్యంగా సాగిన జీవితం తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం దాదాపు 49 సంవత్సరాలకాలం సాఫీగాసాగుతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 67 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందిఅశ్వినీ నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  వీరికి పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడం పట్ల అధికంగా ఆసక్తి చూపుతారు. సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది. 
* అశ్విని నక్షత్ర మూడవ పాదం :-   అశ్విని నక్షత్ర ముడవపాదం మిధునరాశిలో ఉంటుంది. మిధునరాసి అధిపతి  బుధుడు. బుధుడు వైశ్యులకు అధిపతి. కనుక వీరు క్రీడలకు, వైద్యానికి సంబంధించిన వ్యాపారాలలో కూడా చక్కగా రాణిస్తారు. వీరు తమ వ్యవహారాలను మేధస్సును ఉపయోగించి పనులను చక్కబెట్టుకుంటారు.వీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా రాణించగలరు. వీరు బాల్యం నుండి సుఖసౌఖ్యాలను అనుభవిస్తారు. 22 సంవత్సరాల అనంతరం కొంత సౌఖ్యం కోరవడినా జీవితం 47 సంవత్సరాల కాలం సాఫీగా సాగి పోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 65 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందివీరు క్రికెట్, టెన్నిస్, పరుగు పందాలు  వంటి క్రీడలలో రాణిస్తారు. వైద్యపమైన వ్యాపారం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. క్రీడ , వైద్య సంబంధిత వృత్తులలో అభివృద్ధిని సాధిస్తారు. మేధావంతులైన వీరు ప్రయత్న పూర్వకంగా విద్యయందు విజయం సాధించ వలసిన అవసరం ఎంతో ఉన్నది. అశ్వినీ నక్షత్ర  అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.
* అశ్విని నక్షత్ర నాలుగవ పాదం :-  అశ్విని నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది. కనుక వీరి మీద అశ్వినీ నక్షత్ర గుణమైన క్రీడా స్పూర్తి , మరియు వైద్యంలో ఆసక్తి నైపుణ్యంతో  చేరి కటకరాశి అధిపతి చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఔషధీ సంబంధిత వృత్తి ఉద్యోగాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది. రసాయనశాస్త్రం సంబంధిత విద్య ఉద్యోగాలంటే ఆసక్తి చూపుతారు. తామున్న రంగాలలో అందరికంటే ముందుండాలన్న పోటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఉత్సాహం నిరుత్సాహం కూడా వీరికి ఒక దాని వెంట ఒకటి ఉంటుంది. క్రీడా రంగంలో  కూడా వీరికి ఆసక్తి ఉండడం సహజం. బాల్యం నుండి సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. చిన్న వయసులో జీవితంలో స్థిరపడగలరు. విద్యకంటే వీరు సౌందర్య పోషణ పట్ల శ్రద్ధ వహిస్తారు కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి జీవితంలో ముందుకు సాగవలసిన  అవసరం ఏంటో ఉంది. 22 సంవత్సరాల వరకు సౌఖ్యవంతంగా సాగిన జీవితం తరువాత కొంత సౌఖ్యం కోరవడినా  45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 63 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుంది.అశ్వినీ  నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.

భరణి 

* భరణి నక్షత్ర మొదటి పాదం :- భరణి నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు.
నక్షత్ర అధిపతి శుక్రుడు. అధిదేవత యముడు. వీరికి ఆత్మవిశ్వాసం, అధిఖ్యభావన, అతిశయం కలిసి ఉంటాయి. వీరు జన్మించినది మొదలు సౌఖ్యంగానే జీవిస్తారు.  ప్రయత్నపూర్వకంగా వీరికి  విద్య పట్ల ఆసక్తి కలిగించాలి. విద్య ఆటంకం లేకుండా సాగిపోతుంది. ప్రభుత్వోద్యాగాలలో స్థిరపడే అవకాశాలు వీరికి అధికంగా ఉంటాయి. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వెండి వస్తువులు,  సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందమైన వస్త్రాలను  ధరించడం పట్ల వీరు జీవితమంతా ఆసక్తి కలిగి ఉంటారు. జల సంబంధ వృత్తులు , ఉద్యోగాలు,  వ్యాపారలపట్ల ఆసక్తులై ఉంటారు. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది.బాల్యంలో సౌఖ్యం తరువాత కాలంలో తగ్గు ముఖం పడుతుంది. 40 సంవత్సరాల వరకు సాఫీగా సాగిన జీవితంలో అ తరువాత రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని ఒడిదుడుకులకు ఎదురుతాయి .  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది . అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనంతర జీవితం సౌఖ్యంగా సాగుతుంది. అంటే వృద్ధాప్యం సౌఖ్యంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ధర్మం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది.  అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వెండి వస్తువులు, జలం సంబంధించిన వృత్తులు ఉద్యోగం వ్యాపారం వీరికి అనుకులిస్తుంది.
*  భరణీ నక్షత్ర రెండవ పాదం :-  భరణీ నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంతుంది. కన్యా రాసి అధిపతి బుధుడు. బుధుడు భుమికి అధిపతి. బుధుడు మేధస్సుకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడు వైశ్యులకు అధిపతి. కనుక వీరికి విలాస ప్రదేశాల నిర్వహణ, అలంకరణ సంబంధించిన వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగావ్యాపారాలు రెండూ వీరికి అనుకూలమే. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికం. అలంకరణ సామగ్రి, ఆభరణాలు సేకరించడం పట్ల శ్రద్ధ వహిస్తారు. బాల్యం కొంత కాలం సౌఖ్యంగా సాగినా తరువాత సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది. ప్రధమికానంతర విద్య లో అభివృద్ధి ఉంటుంది. బాల్యంలో విద్యపట్ల ఆసక్తి  కలిగించవలసిన అవసరం ఉంది. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది. తగిన వయసులో జీవితంలో స్థిరపడతారు. 35 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .అయినప్పటికీ 53 తరువాత జీవితంలో తిరిగి సౌఖ్యం కలిసి వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది.
*   భరణీ నక్షత్ర మూడవ  పాదం :- భరణి నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అనివార్యం. నక్షత్రాధిపతి శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు కనుక విరు ఏపని అయినా అందంగా చేయడానికి ఆసక్తి చూపుతారు. సముద్ర సంబంధిత వృత్తి వ్యాపారం వీరికి అత్యంత అనుకూలం. సముద్రయానం వీరికి అనుకులిస్తుంది. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది. విద్య నిరాటంకంగా సాగుతుంది. బాల్యంలో కొంత మందకొడిగా సాగిన విద్య మాధ్యమిక విద్యకు ముందుగానే  అభివృద్ధి ఉంటుంది. విద్యానంతరం జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి  ఉంటుంది.  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .అయినప్పటికీ 48 సంవత్సరాల తరువాత జీవితంలో చక్కని అభివృద్ధి కని పిస్తుంది. మధ్య వయసు దాటినప్పటి నుండి జీవితం సౌఖ్యవంతంగా సాగే అవకాశం అధికం.
* భరణి నక్షత్ర నాలుగవ పాదం :- భరణి నక్షత్ర నాలుగవ పాదం వృశ్చికరాశిలో ఉంటుంది. కనుక వీరి స్వభావం మీద కుజుని ప్రభావం ఉంటుంది. ధైర్యసాహసాలతో కూడిన వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. నౌకాదళ ఉద్యోగాలు వీరికి అత్యంత అనుకూలం. అలంకరణ సామగ్రి సేకరణ సౌందర్య పోషణ పట్ల వీరికి ఆసక్తి అధికం. విద్య నిరాటంకంగా సాగుతుంది. ఉన్నత విద్య విదేశాలలో సాగే అవకాసం కూడా ఉంది. విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. పుట్టిన ఊరికి దూరంగానే ఉద్యోగ వ్యాపారాలు సాగే అవకాశం అధికం. 25 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .43 సంవత్సరాల అనంతరం జీవితం తిరిగి అభివృద్ధి పదంలో సాగి తరువాతి సౌఖ్యంగా సాగుతుంది.

కృత్తిక 

* కృత్తికా నక్షత్ర మొదటిపాదం :- కృత్తికా నక్షత్ర మొదటిపాదం ధనుస్సు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. కనుక వీరిపై గురుగ్రహప్రభావం ఉంటుంది. కృత్తికా నక్షత్ర అధిదేవత కూడా సూర్యుడే కనుక వీరు అత్యంత ఆధిఖ్యభావంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. గురుగ్రహప్రభావం కారణగా నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. కనుక ఏ రంగంలో ఉన్నా వీరు అవసర సమయాలలో తోటి వారికి నాయకత్వం వహించి ప్రతిభావంతంగా పనులు నిర్వహించగలరు. రాజకీయాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. ఉన్నత విద్య లో ఆటంకం వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఉన్నత విద్యలు విదేశాలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. విదేశి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వివాహంలో కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉంది. 21 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .40 సంవత్సరాల నుండి చక్కని అభివృద్ది సాధించి పురోగతిలో ఉంటారు. తరువాత జీవితం సౌఖ్యవంతంగా జరుగుతుంది. అగ్నిసంబందిత వృత్తి ఉద్యోగాలు వీరికి చక్కగా అనుకూలిస్తాయి. బంగారంతో  సంబంధం ఉన్న వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు  , సమాచార రంగం వ్యాపారాలు , విద్యుత్ పరికరాల  సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలం.
* కృత్తికానక్షత్ర రెండవ పాదం :- కృత్తికానక్షత్ర రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది. కృత్తికా నక్షత్ర సహజగుణా లకు మకరరాశి అధిపతి శనిగ్రహ ప్రభావం కూడా తోడుగా ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి సహజంగా అన్నింటా ఆధిక్య గుణానికి శనిగ్రహ ప్రభావం చేత పట్టుదల మొండితనం తోడుతాయి. కనుక వీరు అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు. ఇనుము సంబంధించిన వృత్తి  ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.  ఇనుపపరికరాల తయారి, మెకానిక్ షెడ్ , వెల్డింగ్ వృత్తి వీరికి అనుకూలం. అలాగే పరిశ్రమలు స్థాపించడం, కర్మాగారాలు స్థాపించడం వీరికి చక్కగా అనుకూలిస్తాయి. ఇనుము అగ్ని సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. పరిశ్రమలు స్థాపించి నిర్వహణ చేయగల సమర్ధత వీరికి ప్రత్యేకం. పట్టభద్రులయ్యే వరకు చదువు నిరాటంకంగా సాగుతుంది. ఉన్నత విద్యలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. విదేశాలలో చదువుకునే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి.
విదేశాలలో ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు . 20 సంవత్సరాల  అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదురైనా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది . 38 సంవత్సరాల అనంతరం విరున్న రంగంలో అభివృద్ధి సాధించి ధన సంపాదన  చేస్తారు. 38 సంవత్సరాల అనంతరం వీరి జీవితం సౌఖ్యంగా సాగిపోతుంది. పాలిటెక్నిక్ వంటి  విద్యలు వీరికి అనుకూలిస్తాయి. 
* కృత్తికానక్షత్ర మూడవ  పాదం :- కృత్తికానక్షత్ర మూడవ  పాదం కుంభరాశిలో ఉంటుంది. కనుక కృత్తికా నక్షత్ర సహజగుణా లకు శనిగ్రహ ప్రభావం తోడుగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. మంచి కాని చేదు కాని అభిప్రాయాలను త్వరగా మార్చుకోరు. అనుకున్నది సాధించే పట్టుదల వీరికి సహజం. నిర్వహణ సామర్ధ్యం కూడా వీరికి అధికం .  ఇనుము సంబంధించిన వృత్తి  ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.  ఇనుపపరికరాల తయారి, మెకానిక్ షెడ్ , వెల్డింగ్ వృత్తి వీరికి అనుకూలం. అలాగే పరిశ్రమలు స్థాపించడం, కర్మాగారాలు స్థాపించడం వీరికి చక్కగా అనుకూలిస్తాయి. ఇనుము అగ్ని సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. పాలిటెక్నిక్ , ఐ టి ఐ వంటి  విద్యలు వీరికి అనుకూలిస్తాయి. పరిశ్రమలు స్థాపించి నిర్వహణ చేయగల సమర్ధత వీరికి ప్రత్యేకం. ఆటంకాలను అధిగమించి కాలేజ్ విద్య కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. వివాహంలో కొంత జాప్యం జరగా వచ్చు. 20 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .37 సంవత్సరాల అనంతరం జీవితంలో ఆధిఖ్యత సాధిస్తారు. ఉన్న ఊరుకు దూరంగా కాలేజ్ విద్యలను అభ్యసిస్తారు. విదేశివిద్య  విదేశీ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉన్న ఉరుకు దూరంగా వృత్తి  వ్యాపారాలు సాగించే అవకాశాలు అధికంగా ఉంటాయి.
* కృత్తికానక్షత్ర నాలుగవ పాదం :- కృత్తికానక్షత్ర నాలుగవ పాదం  మీన రాశిలో ఉంటుంది. కనుక వీరిపై కృత్తికా నక్షత్ర గుణాలతో మీనరాశి అధిపతి అయిన గురుగ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి సముద్ర సంబధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిర్వహణా సామర్ధ్యం నాయకత్వ లక్షణం వీరికి సహజంగానే ఉంటుంది. బంగారు సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఆర్ధిక లావాదేవీలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. కాలేజిచదువులో కొన్ని ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. ఉన్నఊరుకు దూరంగా కాలేజి విద్య కొనసాగిస్తారు. వివాహంలో కొంత జాప్యం కలిగే అవకాశం  ఉంది. విదేశాలలో విద్యను  కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. 18 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా 35 సంవత్సరాల తరువాత ధనసంపాదనలో అభివృద్ధి కొనసాగుతుంది. తరువాత జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

20, జులై 2012, శుక్రవారం

నవాంశ

నవాంశ జ్యోతిష శాస్త్రంలో నవాంశకు ప్రత్యేక  స్థానం ఉన్నది. నవాంశ చెప్పే ఫలితాలు తుల్యంగా ఉంటాయని విశ్వస్తుంది. అసలు ఈ నవాంశ గణన ఎలా చేయాలన్నది తెలుసుకోవలసిన విషయం. నవాంశ ఫలితాలు చూడడానికి ఒక్కో రాశిని తొమ్మిది భాగాలుగా  విభజిస్తారు. అందుకే దీనిని నవాంశ. సాధారణంగానే రాశి చక్రంలోని రాశులలో ఒక్కో దానిలో తొమ్మిది నక్షత్ర  పాదాలు ఉంటాయి. నవాంశలోను అలాగే ఉన్నా కూడా  నవాంశలో నక్షత్రపాదాలు మారుతుంటాయి. మేషము, కటకము, తుల , మకరము నవాంశ ఆరంభ రాశులు. ధనసు, కన్య , మిధునము నవాంశలోని కడపటి రాసులు.  ఇక ఒక్కో రాశిలో  ఉండే నక్షత్రపాదాలు గురించి చూద్దాము.

  1. మేషరాశి  :- మేషరాశి లో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మొదటి పాదాలు ఉంటాయి. అశ్విని  నక్షత్రం లోని మొదటిపాదం ,  రోహిణి  నక్షత్రం లోని  మొదటిపాదం, పునర్వసు  నక్షత్రం లోని  మొదటిపాదం, మఖ  నక్షత్రం లోని  మొదటిపాదం, హస్థా  నక్షత్రం లోని  మొదటిపాదం, విశాఖ  నక్షత్రం లోని  మొదటిపాదం, మూలా  నక్షత్రం లోని  మొదటిపాదం, శ్రవణా  నక్షత్రం లోని  మొదటిపాదం, పూర్వాభాద్ర  నక్షత్రం లోని  మొదటిపాదం ఉంటాయి.
  2. వృషభరాశి  :-   వృషభరాశిలో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని రెండవ పాదాలు ఉంటాయి. అశ్విని  నక్షత్రం లోని  రెండవ పాదం ,  రోహిణి  నక్షత్రం లోని   రెండవ పాదం, పునర్వసు  నక్షత్రం లోని   రెండవ పాదం, మఖ  నక్షత్రం లోని   రెండవ పాదం, హస్థా  నక్షత్రం లోని   రెండవ పాదం,  రెండవ  నక్షత్రం లోని   రెండవ పాదం, మూలా  నక్షత్రం లోని   రెండవ పాదం, శ్రవణా  నక్షత్రం లోని   రెండవ పాదం, పూర్వాభాద్ర  నక్షత్రం లోని   రెండవ పాదం ఉంటాయి.
  3. మిథునరాశి   :- మిధునరాశిలో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మూడవ పాదాలు ఉంటాయి. అశ్విని  నక్షత్రం లోని  మూడవ పాదం ,  రోహిణి  నక్షత్రం లోని   మూడవ పాదం, పునర్వసు  నక్షత్రం లోని   మూడవ పాదం, మఖ  నక్షత్రం లోని   మూడవ పాదం, హస్థా  నక్షత్రం లోని   మూడవ పాదం, విశాఖ  నక్షత్రం లోని   మూడవ పాదం, మూలా  నక్షత్రం లోని   మూడవ పాదం, శ్రవణా  నక్షత్రం లోని   మూడవ పాదం, పూర్వాభాద్ర  నక్షత్రం లోని   మూడవ పాదం ఉంటాయి.
  4. కటకరాశి   :-  కటకరాశి లో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని  నాలుగవ   పాదాలు ఉంటాయి. అశ్విని  నక్షత్రం లోని  నాలుగవ  పాదం ,  రోహిణి  నక్షత్రం లోని  నాలుగవ  పాదం, పునర్వసు  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, మఖ  నక్షత్రం లోని  నాలుగవ పాదం, హస్థా  నక్షత్రం లోని   నాలుగవ పాదం, విశాఖ  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, మూలా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, శ్రవణా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, పూర్వాభాద్ర  నక్షత్రం లోని   నాలుగవ  పాదం ఉంటాయి.
  5. సింహరాశి   :- సింహరాశిలో  వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మొదటి పాదాలు ఉంటాయి. భరణి  నక్షత్రం లోని మొదటిపాదం ,  మృగశిర  నక్షత్రం లోని  మొదటిపాదం, పుష్యమి   నక్షత్రం లోని  మొదటిపాదం, పూర్వఫల్గుణ  నక్షత్రం లోని  మొదటిపాదం, చిత్తా  నక్షత్రం లోని  మొదటిపాదం, అనురాధా  నక్షత్రం లోని  మొదటిపాదం, పూర్వాషాడా  నక్షత్రం లోని  మొదటిపాదం, ధనిష్టా  నక్షత్రం లోని  మొదటిపాదం, ఉత్తరభాద్రా   నక్షత్రం లోని  మొదటిపాదం ఉంటాయి.
  6. కన్యారాశి    :- కన్యారాశి లో  వక్షత్ర పాదాలు అన్ని  ఆ నక్షత్రం లోని రెండవ  పాదాలు ఉంటాయి. భరణి  నక్షత్రం లోని రెండవ పాదం ,  మృగశిర  నక్షత్రం లోని   రెండవ  పాదం, పుష్యమి   నక్షత్రం లోని  రెండవ పాదం, పూర్వఫల్గుణీ   నక్షత్రం లోని   రెండవ  పాదం,  రెండవ నక్షత్రం లోని  మొదటిపాదం,  రెండవ  నక్షత్రం లోని  మొదటిపాదం, పూర్వా నక్షత్రం లోని   రెండవ పాదం, ధనిష్టా  నక్షత్రం లోని   రెండవ పాదం, ఉత్తరాభాద్ర   నక్షత్రం లోని   రెండవ పాదం ఉంటాయి.
  7. తులారాశి   :- తులారాశి లో  వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మూడవ  పాదాలు ఉంటాయి. భరణి  నక్షత్రం లోని  మూడవ  పాదం ,  మృగశిర  నక్షత్రం లోని   మూడవ  పాదం, పుష్యమి   నక్షత్రం లోని   మూడవ  పాదం, పూర్వఫల్గుణీ   నక్షత్రం లోని   మూడవ  పాదం, చిత్తా  నక్షత్రం లోని   మూడవ  పాదం, అనురాధా  నక్షత్రం లోని   మూడవ  పాదం, పూర్వాషాడా    నక్షత్రం లోని   మూడవ  పాదం, ధనిష్టా  నక్షత్రం లోని   మూడవ  పాదం, ఉత్తరాభాద్ర   నక్షత్రం లోని   మూడవ  పాదం ఉంటాయి.
  8. వృశ్చికరాశి   :- వృశ్చికరాశి లో  వక్షత్ర పదాలు అన్ని   ఆ నక్షత్రం లోని నాలుగవ  పాదాలు ఉంటాయి. భరణి  నక్షత్రం లోని  నాలుగవ  పాదం ,  మృగశిర  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, పుష్యమి   నక్షత్రం లోని   నాలుగవ  పాదం, పూర్వఫల్గుణీ  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, చిత్తా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, అనురాధా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, పూర్వాషాడా     నక్షత్రం లోని   నాలుగవ  పాదం, ధనిష్టా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, ఉత్తరాభాద్ర   నక్షత్రం లోని   నాలుగవ  పాదం ఉంటాయి. 
  9. ధనసురాశి    :- ధనసురాశి లో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మొదటి పాదాలు ఉంటాయి. కృత్తికా  నక్షత్రం లోని మొదటిపాదం ,    అరుద్రా నక్షత్రం లోని  మొదటిపాదం, ఆశ్లేషా  నక్షత్రం లోని  మొదటిపాదం, ఉత్తర ఫల్గుణి  నక్షత్రం లోని  మొదటిపాదం, స్వాతీ   నక్షత్రం లోని  మొదటిపాదం, జ్యేష్టా  నక్షత్రం లోని  మొదటిపాదం, ఉత్తరాషాడా   నక్షత్రం లోని  మొదటిపాదం,  శతభిషా నక్షత్రం లోని  మొదటిపాదం, రేవతీ   నక్షత్రం లోని  మొదటిపాదం ఉంటాయి.
  10. మకరరాశి     :- మకరరాశిలో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని రెండవ పాదాలు ఉంటాయి. కృత్తికా  నక్షత్రం లోని  రెండవ పాదం ,    అరుద్రా నక్షత్రం లోని   రెండవ పాదం, ఆశ్లేషా  నక్షత్రం లోని   రెండవ పాదం, ఉత్తర ఫల్గుణి  నక్షత్రం లోని   రెండవ పాదం, స్వాతీ  నక్షత్రం లోని   రెండవ పాదం, జ్యేష్టా  నక్షత్రం లోని   రెండవ పాదం, ఉత్తర ఆషాడా  నక్షత్రం లోని   రెండవ పాదం,  శతభిషా  నక్షత్రం లోని   రెండవ పాదం, రేవతీ నక్షత్రం లోని   రెండవ పాదం ఉంటాయి.
  11. కుంభరాశి    :- కుంభరాశిలో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని మూడవ పాదాలు ఉంటాయి. కృత్తికా  నక్షత్రం లోని  మూడవ పాదం ,    ఆరుద్ర నక్షత్రం లోని   మూడవ పాదం, ఆశ్లేషా  నక్షత్రం లోని   మూడవ పాదం, ఉత్తర ఫల్గుణి   నక్షత్రం లోని   మూడవ పాదం, స్వాతీ  నక్షత్రం లోని   మూడవ పాదం, జ్యేష్టా నక్షత్రం లోని   మూడవ పాదం, ఉత్తర ఆషాడా  నక్షత్రం లోని   మూడవ పాదం,  శతభిషా  నక్షత్రం లోని   మూడవ పాదం, రేవతీ   నక్షత్రం లోని   మూడవ పాదం ఉంటాయి.
  12. మీనరాశి    :- మీనరాశిలో వక్షత్ర పాదాలు అన్ని   ఆ నక్షత్రం లోని నాలుగవ  పాదాలు ఉంటాయి. కృత్తికా  నక్షత్రం లోని  నాలుగవ  పాదం ,    ఆర్ద్ర  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, ఆశ్లేషా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, ఉత్తరఫల్గుణి    నక్షత్రం లోని   నాలుగవ  పాదం, స్వాతి  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, జ్యేష్టా  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, ఉత్తర ఆషాడా    నక్షత్రం లోని   నాలుగవ  పాదం,  నాలుగవ  నక్షత్రం లోని   నాలుగవ  పాదం, రేవతి  నక్షత్రం లోని   నాలుగవ  పాదం ఉంటాయి.

12, జులై 2012, గురువారం

కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్


కార్ల్స్‌బాడ్ ఫ్లవర్ ఫీల్డ్


దస్త్రం:Flower feld 15.jpg
50 ఎకరాల ప్రదేశంలో ఉన్న సుందరమైన పూలతోట 


పూల తోటల ప్రవేశం 


కార్లు నిలిపే ప్రదేశంలో ఉన్న పూల చెట్లు 
అమెరికా లోని లాస్ ఏంజలెస్ నగరంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. అక్కడ హాలివుడ్, యూనివర్సల్ స్టూడియో,  డిస్నీలాండ్ వంటివి అత్యంత పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశా లన్నవి  చాల మందికి తెలుసు. అయినా అక్కడ ఆకర్షణ కలిగిన పూలతోటలు కూడా  ఉన్నాయని చాల మందికి తెలియదు. లాస్ ఏంజలెస్ నుండి శాన్ డియాగో పోయే మార్గంలో కార్ల్ బాడ్ వద్ద జాతీయరహదరికి సమీపంలో చాల అందమైన పూలతోటలు ఉన్నాయి. ఈ పూలతోటలు లాస్ ఏంజలెస్ కు 87.4 మైళ్ళ దూరంలోనూ  37.6 మైళ్ళ దూరంలోనూ ఉన్నాయి. లాస్ ఏంజలె నుండి 1.30 నిముషాలకు ఇకాడికి చేరుకోవచ్చు. శాన్ డియాగో నుండి 40 నిముషాలలో చేరుకోవచ్చు. కార్ల్స్‌బాడ్ బీచ్, చిల్డ్రెన్స్ మ్యూజియమ్, థీమ్ పార్క్ వంటి ఆకర్షణలు ఉన్నా ఇక్కడి ఫ్లవర్ ఫీల్డ్ మాత్రం పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. మార్చ్ 1వ తారీఖు నుండి మే 13 వరకూ పర్యాటకుల సందర్శన కొరకు తెరచి ఉంచే ఈ పూలతోటలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తాయి.

తోటలో ప్రవేసించే ముందు ఉన్న చిన్న తోటలు 
కార్లను పార్కు చేసే ప్రదేశం 

శాన్ డియాగో చూడాలన్న ప్రయత్నంతో బయలుదేరే సమయంలో ఈ  పూలతోటల విషయం  మాకు తెలిసింది. ఇకనేం కోసం ముందుగా  బయలుదేరి పూలతోటలు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. కార్లు పార్కు చేసే ప్రదేశంలోనే చిన్న పూలతోటలు ఉన్నాయి. అక్కడ పూలతోటలు చూడడానికి టిక్కెట్లు కొనుక్కుని తోటలోనికి ప్రవేసించే ముందుగానే కొన్ని ఆకర్షణీయమైన పూలచెట్లు అందగా పెంచబడ్డాయి. వాటి  అందం మాటలలో చెప్పాలంటే కుదరదు.  అంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మెల్లగా వాటిని అన్నింటిని చూసి ఛాయాచిత్రాలను తీసుకుని లోనికి వెళ్ళాం.  ఇక్కడ ఇంకో ప్రత్యేకత  కూడా ఉన్నది. ఈ  తోటలు సంత్సర కాలంలో 10 వారాలపాటు మాత్రమే సందర్సకుల కొరకు తెరచి ఉంచబడతాయి.  కనుక ఆసమయంలో మాత్రమే వీటిని సందంర్సించే అవకశం ఉంటుంది.  లోపలకు ప్రవేశించే దారిలో ఒక ప్రదర్సన శాల కూడా ఉంది. అక్కడ సందర్సకులు  తమకు కావలసిన పులమోక్కలను పులతొట్లను మరికొన్ని  పులతోటలకు కావలసిన పరికరాలను కూడా కొనవచ్చు. దానిని దాటి లోనికి ప్రవేసించే సమయంలో పిల్లలకు ఉత్సాహ పరిచే కొన్ని ఆటలు ఉన్నాయని చెప్పి కొన్ని పేపర్లు ఇచ్చారు. వాటిని తీసుకుని పిల్లలు తోట అంత తిరిగి వారు సూచించిన ప్రదేశాలలో స్టాంపింగ్ చేసుకున్నారు. తరువాత ఆ పేపర్లను చూపి కొంత తగ్గింపు ధరలో పిల్లలకు కొన్ని వసువులను కొనే అవకాశం ఇచ్చారు. పిల్లలు అవి చూపి తమకు కావలసినవి కొనుక్కుని ఆనందించారు. ఇక లోపలకు వెళ్ళిన తరువాత 50 ఎకరాల పుల తోటలో పలు వర్ణాలలో విస్తారంగా కనువిందు చేస్తూ ప్రత్యక్షమైనయి. పూలతోటల మధ్యకు వెళ్ళడానికి  అక్కడక్కడ దారులు కూడా ఉన్నాయి. అక్కడ వరకు వెళ్లి ఛాయాచిత్రాలను తీసుకోవచ్చు . అందరు అలా  లోనికి వెళ్లి  
ఛాయాచిత్రాలు తీసుకుని ఆనందిస్తున్నారు.  అన్ని పూలచెట్లు ఒక్కచోట చూడడం మాకు చాల సంభ్రమం కలిగించింది. అప్పటికే చెట్లన్ని చక్కగా పుష్పించి ఉండడం అందుకు ఒక కారణం. 
దస్త్రం:Flower feld 33.jpg
పర్యాటకులు చూడడానికి ఏర్పాటు చేసిన ట్రక్కులు

పూల బోకేలను తయారుచేస్తున్న సందర్శకుడు 
సమీపం నుండి రాన్యు నిక్యులాస్ పూలు 

ఈ తోటలు చూడడానికి పాతకాలపు నమూనలలో ట్రక్కులు కూడా ఉన్నాయి. వారు కొంత రుసుము తీసుకుని ఈ పులతోటలను పూర్తిగా చూపిస్తారు.  పర్యాటకులు అ ట్రక్కు లలో ఎక్కి తోటలు చూస్తున్నారు. తోటలు చూసే సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం మొబైల్ మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. పూల తోటల మద్య ఆసక్తి ఉన్న వారు పూలను కత్తిరించి బోకేలను తాయారు చేస్తున్నారు. అలా తాయారు చేసిన వాటిని యాజమాన్యం వారికీ అందిస్తారు. ఆసక్తి ఉన్న పర్యాటకులు ఈ  బొకేలు తాయారు చేయవచ్చు .  పూలతోటల మద్య చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని చిరు తిండ్లు కూడా లభిస్తాయి.
అమెరికన్ జెందకు ఉపయోగించిన వైట్యు నియా  పూలు 
దస్త్రం:Flower feld 32.jpg
చరిత్రాత్మకమైన సెట్టియా మొక్కలు 
అందమైన గ్రాడియోలస్ పూలు 

 అతోటలు చుట్టు ఉన్న నివాసాలు అ ప్రకృతి దృశ్యాల అందం మనసారా తిలకించి అల తిరుగుతూ అక్కడ ఉన్న ఒక గ్రీన్ హుస్ కూడా చూసాం. అక్కడ ఒకే జాతి చెట్లు కొన్ని పెంచబడుతున్నాయి. అవి కూడా చాల బాగున్నాయి. 1920లో గ్రోవర్ లూధర్ జార్జ్ చేత ఈ  చెట్లు మొదటగా నాటబడి తరువాత ఇలా తోటలుగా అభివృద్ది  చేయబడ్డాయి. ప్రస్తుత ఈ పూల తోటలు 85 సంవత్సరాలు పూల ఉత్పత్తి రంగంలో జరిగిన కృషిఫలితం. ఈ తోటలకు పైభాగంలో అమెరికన్ జండాను పుల మొక్కలతో పెంచడం ఈ తోటలకు ప్రత్యేక  ఆకర్షణ. ఈ జండాకు ప్రత్యేక వైట్యు నియా  మొక్కలను వాడారు.  ప్రధాన తోటలకు రాన్యునిక్యులాస్ పూ ల ముక్కలను నాటారు.  ఇక్కడ ఉన్న తోటలలో గ్రడియోలస్ పులు కూడా ఉన్నాయి. వీటిని పూల బోకేలకు కూడా ఉపయోగిస్తారు. 

ఇక్కడ ఈ సమయంలో పలు ఆకర్షణ కలిగిన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకత. విద్యార్ధులకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పుల తోటల పెంపకం పులతోతలను గురించిన వివరణ వంటి కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్స్ లో కూడా ఇక్కడి నిర్వాహకులు విద్యార్ధులకు ఈ పూల తోటలను గురిచిన వివరణాత్మక తరగతులు జరిపే  కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. చివరగా స్వీట్ బీన్ మేజ్ అనే చిన్న తోట కూడా ఉన్నది. అక్కడ స్వీట్ బిన్ చెట్లతో ఫజిల్ ఆకారంలో చెట్లు పెంచబడ్డాయి. అక్కడ ఫజిలో ప్రవేశించి నడుస్తూ దారి కనుక్కుంటూ వెలుపలికి రావడం అత్యంత ఆసక్తికరమైన ఒక క్రీడ. అక్కడ లోనికి ప్రవేసించిన పెద్దలు కూడా బాల్యంలోకి వెళ్లి అనందించడం చూడవచ్చు. ఇలా తోటలు చూసి ముందు ఉన్న విక్రయశాలలో ఉన్న అకర్షణీయమైన  మొక్కలను ఇతరాలను కూడా చూసి ఇలాంటి పులతోతలను చూడాలన్న మా చిరకాల వాంఛ తీరినందుకు మనసు నిండా అనందం నింపుకుని వేనుతిరిగాం .


8, జులై 2012, ఆదివారం

నక్షత్రాలు గుణగణాలు 3


 మూలానక్షత్రము గుణగణాలు 

మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి  వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం  ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.


 పూర్వాషాఢ నక్షత్రము  గుణగణాలు

పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం , జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం  మోసం చెస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మద్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.


 ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు 

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు  మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి  అయిన  నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది.  తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి.  ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు.  స్వంతవారిని వీరు  ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు  నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.  వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు  వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు.  వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది.   కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను  దాచగలగటంలో  వీరు నేర్పరులు.

 శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు 


శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా  నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ.  వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

 ధనిష్ఠానక్షత్రము గుణగణాలు


ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శీఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మెండి తనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనె నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మియులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందు వలన నష్తపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించు కుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించ వచ్చు. సంతానంను అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుంటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి.


శతభిషానక్షత్రము గుణగణాలు 

ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు,  రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా  పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.


 పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు

పూర్వాభాద్ర నక్షత్రాధిపతి  గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.


ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు 

ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.


 రేవతీనక్షత్రము గుణగణాలు 
రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో  చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.