6, నవంబర్ 2013, బుధవారం

గయ

File:Vishnupad Temple- Rear side.JPG
గయలో విష్ణాలయం 

విష్ణాలయ గోపురం 
ఫల్గుణీ నది 
ఈ సారి మేము కాశీ గయ యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. జీవితంలో కాశీ యాత్ర చేయాలన్నది నా చిరకాల
వాంచ. ఎలాగో నా కోరిక తీరే
సమయం భగవంతుని కృప వలన
ఆసన్నమైంది. మొత్తం యాత్రా మార్గదర్శితో  కలిసి 13 మందిమి బయలుదేరాము.  మాకు మేమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. రైలు ప్రయాణంతో మొత్తం 13 రోజుకు. అంటే తిరిగి రెండవసారి ఢిల్లీ, ఆగ్రా, మథుర, గోకులం, బృందావనం చూసాము. రెండవసారి అయినప్పటికీ సరికొత్త ప్రదేశాల సందర్శన సరికొత్త అనుభవాలు కనుక అయా ఊర్లను నాతో తిరిగి సందర్శించబోతున్నారన్న మాట. ఎప్పటిలా చెన్నైలో రైలు ఎక్కి రెండు రోజులు ప్రయాణం చేసి రెండరోజు రాత్రికి గయ చేరుకున్నాము. గయ బుద్ధ గయ ఒక్కటే. గయలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పరమ ఉత్తమమని హిందూ ధర్మం భోదిస్తుంది. మూడు తరాలకు చెందిన పితరులు
తమ వంశములో ఎవరైనా గయాశ్రాద్ధం పెడతారని ఎదురుచూసిన తరువాత భగవంతుని ఆజ్ఞతో తిరిగి జన్మిస్తారని పురాణాలలో ప్రస్తావించబడింది. మేము అకాలానికి చెందిన వారం కనుక మాకా విశ్వాసం ఉంది కనుక మాయాత్రలో ప్రధానాంశం శ్రాద్ధ కర్మలు ఆచరించడమే.





విష్ణాలయ శిఖరం 




ముందుగా మీకు గయాసుర వృత్తాంతం గురించి వివరింకాలి కదా ! గయాసురుని వృత్తాతంతం ఇదే. పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని 
యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి 
పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు 
పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి 

విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
File:Footprints of Lord Vishnu.jpg
విష్ణుపాదం  
‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి 
పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి 
గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, 
“దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై 
వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను 
చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని 
ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.


మర్గలో ఒక ఆలయం 
గయలో కోనేరు 
గయలో మేము ముందుగా ఏర్పాటు చేసుకున్నట్లు పురోహితుని ఇంటికి చేరుకున్నాము. పురోహితుడు మాకు
విశ్రమించడానికి గదులను ఏర్పాటు చేసారు. మామా గదులలో విశ్రాంతి తీసుకుని ఉదయం అక్కడే స్నానాదులు పూర్తి చేసుకున్నము. గయలో ఉన్న ఫల్గుణీ నదిలో తగినన్ని నీరు ఉండదు కనుక స్నానాదులు  పురోహితుని
ఇంట్లో పూర్తి చేసుకున్నము.  ఉదయం అల్పాహారం వచ్చింది.  మాలో కొందరు మాత్రమే అల్పాహారం తీసుకున్నాము. మిగిలినవారపిండప్రదానం అయిన తరువాత ఒకేసారి భొజనం చేస్తామని చెప్పారు.


పురోహితుని ఇంతో గణేశపూజ 


పిలుపు కొరకు ఎదురుచూస్తూ కూర్చుని ఉన్న సమయంలో మాకు పురోహితుని పిలుపు వచ్చింది. అమదరం కిందకు దిగి పురోహితుడు ఉన్న చిన్నపాటి హాలులో ప్రవేశించాము. లోపల పురోహితుడు చిన్నపాటి దర్భారులా ఉంది. అయన ఒకవేదిక మీద ఆసీనుడయ్యాడు.
ఎదురుగా కూర్చోవడానికి చాపలాంటివి పరిచి ఉన్నాయి. ఒక వైపుగా గోడవారగా కొన్ని పరుపులు దిండ్లు వేసి
ఉన్నాయి. మేము పురోహితుని ముందు కూర్చోగానే అయన గయప్రాశస్థం గురించి అక్కడ శ్రాద్ధకర్మలను
ఆచరించడం వలన కలిగే ప్రయోజనం గురించి చెప్పి మాతో ఒక సహాయకుడిని జతచేసి ఆలయానికి పన్పాడు. ఆ హాలులో ఒక మూలగా ఉన్న పూజా మందిరంలో పురోహితుని సతీమణి వినాయకుని పూజ నిర్వహిస్తున్నారు. వినాయక చవితి తరువాత నిర్వహిస్తున్న పూజలవి. మేము వినాయకునికి నమస్కరించి సహాయకునితో
ఆలయానికి బయలుదేరాము. అక్కడి నుండి ఆటోలలో ఆలయప్రాంగణానికి చేరుకున్నాము

File:Vishnupad Temple- Riverview.JPG
ఆలయం నుండి ఫల్గుని నదికి పోయేదారి 

పిండప్రదానం 
File:Vishnupath Tempal.JPG
ఫల్గుని నదిలో మందిరం 
ముందుగా పురుషులు అందరికీ చెంబులు తీసుకు వచ్చి ఇచ్చారు. తరువాత అందరినీ ఆలయం సమీపంలో
ఉన్న ఫల్గుణి నదికి తీసుకు వెళ్ళారు. ఫల్గుణీ నదిలో జలాలు తక్కువగా ఉంటాయి. సీతాదేవి శాపం కారణంగా ఆ నదిలో ఎప్పుడూ జలం తక్కువగా ఉంటుందని క్షేత్ర పురాణ కథనాలు వివరిస్తున్నాయి. అందరం ఆ నదీజలాల్లో
కాళ్ళుకడుగుకుని చెంబులతో నీరు తీసుకుని పురోహితుడి వద్దకు వచ్చాము. పురోహితుని సహాయకులు
పురుషులకు శ్రాద్ధకర్మలకు అవసరమైన సామాను అందిచాడు. తరువాత పురోహితుడు మగవారిని వరుసగా కూర్చోమని చెప్పాడు. మగవారు అందరూ పురోహితుడి సలహా మీద యవలపిండితో మూడు శ్రాద్ధకర్మలకు అవసరమైన పిండాలను చేసారు. ఆ తరువాత పురోహితుడు గయగురించి గయాసురుడి వృత్తాతం పూర్తిగా
వివరించాడు. అక్కడ శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పితరులకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని వివరించాడు.

రెండవ మండపంలో పిండప్రదానం 
అక్షయ వటం 
ఆలయ ప్రాంగణంలో ఉన్న మరొక మందిరానికి చేరుకున్న తరువాత తిరిగి శ్రాద్ధకర్మలు కొనసాగాయి. ఇప్పుడూ రెండవ సారి పిండప్రధానం చేసారు. ఈ సారి పిండప్రధానంపూర్తి అయినతరువాత వాటిని అక్షయ వటవృక్షం వద్ద ఉంచి నమస్కరించమని చెప్పారు. అలాగే చేసి అందరం తిరిగి వచ్చాము. తిరిగి మూడవ విడత పిండప్రధానంచేయించారు. ఆ తరువాత పురోహితుడు మమ్ము విస్తరాకు, కూరగాయ, పండు వదలమని చెప్పాడు. ఆ మూడింటికి సశస్త్రీయంగా తిలోదకాలు ఇస్తాము కనుక ఇక వాటిని జీవితకాలంలో వాడకూడదు భుజించకూడదు. భార్యభర్తలు ఇద్దరూ ఒకే కూరగాయ,  పండు
File:Vishnupada.jpg
విష్ణుపాదం వద్ద భక్తులు 
వదలమని పురోహితుడు సూచించాడు కనుక మనసులో వదలవలసినవి అనుకుని భార్యాభర్తలు ఒకటిగా సమంత్రకంగా విస్తరాకు, కూరగాయ, పండును వదిలాము. తరువాత పురోహితుని సూచనను అనుసరించి మూడవ విడత పిణడప్రధానం చేసిన పిండాలను  ఆలయంలో ఉన్న విష్ణుపాదాల మీద ఉంచి నమస్కరించాము. అక్కడ ప్రధన పూజలు విష్ణుపాదాలకు  మాత్రమే నిర్వహిస్తారు. పక్కన విష్ణు ఉన్నమూర్తికి నమస్కరించి వెలుపలికి వచ్చాము. తరువాత అందరూ కాళ్ళు కడుగుకొని వెనుకకు తిరిగాము.

ఆలయప్రాంగణంలో ఉన్న చిన్నపాటి దుకాణంలో విష్ణుపాదాలు కొన్నాము. ఆ పాదాలకుఇంట్లో  పూజలు నిర్వహించవచ్చు. అయినప్పటికీ ఆ విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి రాలేదు కనుక ఇంటి పురోహితుని  సంప్రదించి చేయాలని అనుకున్నాము. తిరిగి అందరం పురోహితుని ఇంటికి చేరుకున్నాము. అందం ఆంద్రా భోజనం చేసాము. భోజనం ఇంటి  భోజనంలా ఉంది. తరువాత పురోహితునికి దక్షిణలు ఇచ్చి. పురోహితుని సతీమణికి వస్త్రములు ఇచ్చి వారి ఆశీర్వాదాలు వారి అందుకున్నాము. అంతటితో మా గయ యాత్ర పూర్తి అయింది.








23, అక్టోబర్ 2013, బుధవారం

తాజ్ మహల్

File:Taj Mahal 2012.jpg
తాజ్ మహల్ 

మధుర నుండి ఆగ్రా వెళ్ళిన మరునాడు ఉదయం అందరూ అక్బర్ కోట చూడడానికి వెళ్ళారు. మావారికి జ్వరం ఉన్న కారణంగా మేము మాత్రం వెళ్లలేదు. ఆరొఒజు మద్యాహ్నం మాకు నిర్వాహకులు బఫే డిన్నర్ ఏర్పాటు చేసారు. భోజనంలో చాలారకాలు అందించారు. ఇలా యాత్ర సమయంలో వారు తీసుకున్న శ్రద్ధను మెచ్చుకోకుండా ఉండ లేక వారి శ్రమకు చేసిన సేవలకు కృతఙత చెప్పకుండా ఉండలేక భోజనం గురించి చెప్పడమే కాని. యాత్రలో భోజనానికి ముఖ్యత్వం లేదు. మహిమాన్విత క్షేత్ర దర్శనాలకు మాత్రమే ముఖ్యత్వం.
File:El Taj Mahal-Agra India0023.JPG
మసీదు నుండి తాజ్ మహాల్ 

మద్యాహ్న భోజనం తరువాత కొంత విశ్రాంతి తీసుకుని తాజ్ మహల్ చూడడానికి బయలుదేరాము. మా వారికి కొంత ఓపిక వచ్చింది కనుక మేము కూడా తాజ్ మహల్ చూడడానికి వారితో బయలుదేరాం. బసులో ఆజ్ మహలుకు చేరగానే బసు నిలిపి రుసుము చెల్లించి లోపలకు వెళ్ళాము. లోపల అందంగా అలంకరించబడిన ఒంటెల బండ్లు మమ్ము ఆహ్వానించాయి. అవి చూసి అందరం ఆనందించాంఉ. గేటు నుండి లోపలకు వెళ్ళ్డానికి కొంచం దూరం ఉన్నందున పర్యాటకులు ఆ బండ్లలో లోపలకు పోవచ్చు. మేము ఆ బండ్లు ఎక్కి లోపలకు పోయాము.
File:TajEntryArch.jpg
వ్యాఖ్యను జోడించు


File:TajFlowerCloseUp.jpgFile:Taj Mahal 8.jpg తాజ్ మహల్ సౌందర్యం మనసును మైమరపింపజేసింది. అలా పరవశిస్తూ లోపలకు వెళ్ళి ముంతాజ్ సమాధి చూసాము. లోపల నుండి తాజ్ మహల్ చూసి ఆనందించాము. తరువాత వెలుపలికి వచ్చి తాజ్ మహల్ చుట్టూ తిరిగిచూసి తరువాత చాయా చిత్రాలు చూసే పనిలో నిమఙం  అయ్యాము. తనివి తీరా చాయాచిత్రాలు తీసిన తరువాత ఇక వెనుకకు తిరిగాము. 








వెలుపలికి వచ్చిన తరువాత అక్కడ అమ్ముతున్న రాతి శిల్పాలను కొన్నాము. అక్కడ పాలరాతితో చేసిన శిపాలు అందుబాటు ధరలో లభ్యం ఔతుంటాయి. శిల్పాలే కాక కళాఖండాలు కూడా లభ్యమౌతాయి.  అన్నీ చాలా బాగున్నాయి. తాజ్ మహల్ సందర్శన తరువాత తిరిగి బసులో ప్రయాణించి బసకు చేరుకున్నాము. ఆ రాత్రి ప్రయాణించి ఉదయానికి డిళ్ళీ చేరుకున్నాము. రాత్రి ఆహారం పంజాబీ దబాలో చేసాము. అంతటితో మ తాజ్ మహల్ సందర్శన పూర్తి చేసుకున్నాము. 

అక్షరధాం






అక్షరధాం

అక్షరధాం 


File:Akshardham Delhi Ricky W.jpgFile:Akshardham Airpano wide view.pngడిల్లీ చేరిన మరునాడు ఉదయం మావారికి తిరిగి జ్వరం. అసలు మా వారికి బద్రీనాథ్ వెళ్ళిన రాత్రి నుండి ఆరోగ్యం బాగాలేదు. అయినప్పటికీ యాత్ర అంతా చూడడానికి ఓపిక తెచ్చుకుని యాత్రకు సహకరించారు. ఫతేపూర్ సిక్రీ తప్ప మిగిలినవన్నీ వారి నీరసంతో కూడిన సహకారంతోనే చూడగలిగాము.  అందరూ ఉదయం డిల్లీలో స్హాపింగ్ చేయడానికి బయలు దేరారు. నేను వారిని హోటల్ వారు పంపిన సహాయకుని సాయంతో ఆసుపత్రికి తీసుకు వెళ్ళను. డిల్లీలో ఆరోజు మంచి వాన. వీధులలో వాన నీరు ప్రవహిస్తున్నది. వాన నీటిలో నదుస్తూనే ఆసుపత్రికి వెళ్ళి వారిని డక్టరుకు చూపించి మందులు కొనుక్కుని హోటల్కు వచ్చి మిగిలిన సమయం విశ్రాంతి తీసుకున్నాము. మధ్యాహ్న భోజనాలు తరువాత వారు తిరిగి కొంత కోలుకున్నారు.  మూడు గంటల తరువాత వసులో అక్షరధాం చూడడానికి అందరితో మేము కూడా వెళ్ళాము.
File:Akshardham Lotus.jpg
సుందరమైన అక్షరధామం తామరపుష్పం
నిజానికి అక్షరధాం సందర్శన అపురూప మైన అనుభూతిని ఇచ్చింది. అక్షరధాం ఒక అధ్యాత్మిక అద్భుతం. లోపలకు వెళ్ళా లంటే చాలా  నిబంధనలు ఉన్నాయి. లోపల కెమారాలు కాని విద్యుత్ పరిక్స్రాలు ఏవైనా కాని నిషిద్ధం. కనుక అన్నింటినీ గదులలో వదిలి వచ్చాము. అయినప్పటికీ మేము చివరి వరకు కెమేరాలు వదలం కదా. వాటిని బసులో నిర్వాహకులు బధ్రపరచి తిరిగి వచ్చిన తరువాత తీసుకున్నారు. కనుక మాకు వెనుతిరగవలసిన అగత్యం తప్పింది. మాలో కొందరు అది గమనించక కెమారాలతో దిగారు. వాటిని అనుమతించక పోవడంతో అక్షరధాం వద్దని మొత్తంగా తిరిగి వెళ్ళడం కొసమెరుపు. కొందరి కోపం అలా ఉంటుంది. కోపం చివరికి వారిని వారే శిక్షించుకునే వరకు పోవడమే విచిత్రం.
File:Akshardham in Delhi at night.JPG
రాత్రివేళలో అక్షరధాం 
అక్షరధాం రుసుము చెల్లించి నిబంధనలు అన్ని చూసుకుని లోపలకు వెళ్ళాము. అక్షరధాం చాలా అందంగా ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం అని చెప్పక తప్పదు. అవకాశం ఉన్నవారు తప్పక చూడవలసిన ప్రదేశాం ఇది అని చెప్పక తప్పదు. లోపలకు వెళ్ళిన తరువాత దాదాపు రెండు గంటలకంటే అదనంగా క్యూలో నిలిచాము. అయినప్పటికీ లోపల సందర్శించిన ప్రదర్శనల కొరకు ఇంత సమయం శ్రమపడినా పరవాలేదని పించింది. ఎదురు చూపులు అయిన తరువాత క్యూ నుండి లోపలకు ప్రవేశించాము. లోపలకు పోయే వరకే మా పని తరువాత అనుకోకుండానే పరుగులు తీస్తూ ఒక ప్రదర్శన నుండి మరొక ప్రదర్శన చూస్తూ పోవడమే. ఒక ప్రదఋశాన పూర్తికాగానే మరొక ప్రదర్శన ద్వారం తెరుచుకుంటుంది. కూర్చుని చూడడానికి స్థానం సంపాదించడానికి అందరూ త్వరత్వరగా పరుగులు తీస్తుంటారు. 
File:Akshardham Dome.jpg
అక్షరధాం పైకప్పు 
లోపల స్వామినారాయణ చరిత్ర విధవిధాలుగా ప్రదర్శిస్తున్నారు. ఒక్కో ప్రదృసన ఒక్కో వైవిధ్యంతో కనిపిస్తుంది.  ఒక్చోట భక్తులకు  ఉపదేశం చేస్తున్న స్వామి నారాయణ అంతా సహజసిద్ధంగా ఏర్పాటు చేచిన శిల్పాలు కలిగిన దేశ్యం. విద్యుద్దీపాలు వెలుగును వేస్తూ తీస్తూ ప్రదశన ఆసక్తి కలిగేలా ఉంటుంది. ఒక ప్రదర్శనలో పర్యాటకులను ఆసక్తి కరమైన వాహనాలలో ప్రయాణం చేయిస్తూ లోపల అటూ ఇటూ ఉన్న రామాయణ కావ్యంలోని దృశ్యాలను శిల్పాలతో కడు రమ్యంగా చూడవచ్చు. లోపల మందమైన వెలుగులో ఆదృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అది ఒక మనోహరమైన ఆధ్యాత్మిక అనుభూతి.  మరొక ప్రదర్శనలో స్వామినారయణా జీవిత చరిత్ర వర్ణించే దృశ్యాలు. 
Pillars
మోన్యుమెంటు వెలుపలి స్థంబాలు 
Elephants
మోన్యుమెంటులో సుందర శిల్పాలు 
ఆ ప్రదర్శనలో భవనాంతర్గత  (ఇండోర్) దృశ్యాలలో చివరిగా చలన చిత్రం. స్వామినారయణ జీవిత చిత్రం 70 ఎమ్.ఎమ్ తెరమీద ప్రదర్శించబడింది. తుల్యమైన చిత్రీకరణ. ఒక్కో దృశ్యం సహజ వాతావరణంలో సహజ శబ్ధాలతో ఆ చిత్రం రమ్యంగా ఉన్నది. స్వామి నారయణ జీవిత చరిత్ర అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో చలన చిత్రాలను చూసినా స్వామినారాయణ చిత్రం కలిగించిన దివ్యానుభూతి మాత్రం నాలో ఇంకా చెదిరి పోలేదు. ఆ దృశ్యీకరణ అంత సహజ సిద్ధంగా హృద్యంగా చిత్రీకరించబడింది.

Arkshardham at night
అక్షరధాం వద్ద జనసందోహం 

ఆ ప్రదర్శన తరువాత వెలుపలికి వచ్చి స్వామినారాయణ ఆలయం చూసాము. లోపల బృహత్తరమైన స్వామినారాయణ స్వర్ణ విగ్రహం చాక్కఘ జీవకళ ఉట్టి పడ్తూ ఉంది. ఆలయం లోని రాతి శిల్పాలు బహుసౌందరంగా ఉన్నాయి. ఆ శిల్పకళాఅ నైపుణ్యం అద్భుతం. ఆలయం చాలా విశలమైనది. వెలుపలికి వచ్చిన తరువాత మేము వెలుపలి మ్యూజికల్ ఫౌంటెన్ చూడడానికి కూర్చున్నాము. 
File:Akshardham fountain.jpg
వ్యాఖ్యను జోడించు
సాధారణంగా చిత్రాలలో చూపించే పెద్ద తామర పుష్పం వంటి నిర్మాణమే మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శించే ప్రదేశం. ఆ ప్రదేశం చూడడానికి ఆహ్లాదంగా ఉన్నది. మేము అక్కడ కూర్చుని ప్రదర్శన చూడడానికి సిద్ధం అయ్యాము. ప్రదర్శన ఆరంభం అయింది. మ్యూజికల్ ఫౌంటెన్ దృశ్యాలు అనేక సార్లు చూసినా ఆధ్యాత్మిక శ్లోకాలతో అందించిన ఆ ప్రదర్శన నిజంగా ఆత్మానుభూతి కలిగించింది.  ఇలా అక్స్హరధాం యాత్ర మాలో ఆత్మానుభూతి మిగిల్చింది. ఆ అనుభూతులతో మేము వెనుతిరిగి బసకు చేరాము. ఇన్తటితో మా బద్రీ కెఎదార్నాథ్ యాత్ర శుభప్రదంగా ముగిసింది. మరునాడు మిగిలిన షాపింగ్ పూర్తి చేసుకుని సాను సర్ధుకుని రైలు ఎక్కడమే తరువాయి. 

15, ఆగస్టు 2013, గురువారం

మధుర

మథుర 

File:Mathura Temple-Mathura-India0002.JPG
మథురలో కృష్ణాలయం 




File:Krishnajanmabhoomi 1988A.jpg
శ్రీ కృష్ణ జన్మస్థానం 
File:100 1350 bargarh dhanuyatra 2013.jpg
మథుర ప్రవేశ ద్వారం 
హరిద్వార్ నుండి ఉదయానికి డిల్లీ చేరుకున్నాము. మా వస్తువులు కొన్ని డిల్లీ లోని హోటలులో ఉంచాము. మాసామానులు తిరిగి తీసుకుని మాకు కేటాయించిన గదులుకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాము. మరునాడు ఉదయం డిల్లీ నుండి అందరం ఒకే బసులో అందరం మధురకు బయలుదేరాము. మధురలో చేరుతూనే శ్రీకృష్ణ జన్మస్థానం చూసాము. చుట్టూ ముస్లిం భవనాల  మద్యలో  కొంత ప్రదేశంలో శ్రీ కృష్ణుడు జన్మించిన చెరసాల ప్రదేశం ఉంది. 
మేము అందరం టిక్కెట్లు కొనుక్కుని భవనాల మధ్యలో ఉన్న దారిలో ప్రయాణించి లోతట్టుగా ఉన్న చెరశాలలోని శ్రీకృష్ణుని జన్మస్థానం దర్శించుకున్నాము. శ్రీకౄషుని జన్మస్థానం ఒక విశలమైన అరుగు. అందరం ఆ దివ్య ప్రదేశన్ని పరవశంతో తాకి చూసాము. భగవంతుడు అవతరించిన ఆ ప్రదేశం దర్శించడం ఎంతో దివ్యానుభూతిని కలిగించింది. 
File:Govardhana puja.jpg
గోవింద పూజ 

File:Ancient Temple at Mathura, Uttar Pradesh.JPG
కృష్ణ మందిరం లోపలి భాగం 
File:Varsana.jpg
మథురలో రాధా కృష్ణ మందిరం 
తరువాత మేము మధురలోని వీధులలో  అలా తిరుగుతూ అక్కడ ఉన్న శ్రీకృష్ణ ఆలయం చూడడనికి వెళ్ళాం. అక్కడ కోతుల సందడి అధికం. ప్రత్యేకంగా ఆ లయంలో కోతులు యాత్రీకుల కళ్ళ అద్దాలు తీసుకు వెడతాయని అన్నారు. కనుక ఆలయంలో ప్రవేశించడనికి ముందుగా మేము మామా కళ్ళ అద్దాలు జాగ్రత్త చేసుకున్నాము. కానీ మాలో ఒకరు అది గమనించక కళ్ళకు అద్దాలతో లోనికి ప్రవేశించింది. ఆవిడ నాకు పక్కగా నడుస్తూ ఉంది. ఆ లయంలోకి ప్రవేశించిన కొంచం సమయానికి ఒక పెద్ద కోతి ఆమె భుజం మీద ఒక చేయి వేసి రెండవ చేతితీ కళ్ళ అద్దాలు తీసుకున్నది. అయినప్పటికీ మేమడి గమనించే లోపల అది లాఘవంగా పై గోడలు ఎక్కి  అందనంత ఎత్తుకు  పోయింది. అందరూ కేకలు పెట్టి అరచిన తరువాత కోతి దానిని కిందకు వేసింది. అప్పటికే దానిని బాగా వంచి వేసింది. ఒక అద్దం పగిలి పోయింది కూడా. ఇక అది పనికిరాదు. తరువాత అందరూ ఆ విషయం  గురించి చర్చిస్తూనే  ఆలయం అంతా తిరిగి చూసాము. ఆలయం చాలా విశాలమైనది. రాతితో నిర్మించిన ఆ ఆలయం పురాతనత్వం  అలాగే సంరక్షించబడుతుంది. ఆలయం పవిత్రంగానూ ఆకర్షణీయంగానూ ఉంది.

మధురలో లస్సి, పెరుగు, మజ్జిగలు ప్రసిద్ధం. శ్రీకృష్ణుని జన్మస్థలం కదా అక్కడ ఆవులకు వెన్న మీగడలకు ఏమి కొరత. అక్కడ లస్సి మట్టి గ్లాసులలో విక్రయిస్తున్నారు. అది అందరికి బాగా ఆసక్తిగా ఉంది. అందరం మజ్జిగ, లస్సీల వంటివి తాగాము. కొంత షాపింగ్ చేసాము. నేను కలే పండ్లు కొనగా  దారిలో ఒక కోతి అడ్డగించింది.  కలేకాయలను వానరానికి  భయంతో సమర్పించాను. 

అక్కడి నుండ్  నుండి మద్యాహ్న బసులో  భోజనాలు  చేసుకుని రేపల్లెకు చేరాము. రేపల్లే ఎగుడు దిగుడుగా మిట్టా పల్లాలుగా ఉంది. అంతా నివాసిత గృహలు ఉన్నాయి. ఇప్పటికీ అంతా ఎక్కడ చూసినా శ్రీకృష్ణ నామం మారుమోగుతూ అంతా కృష్ణ మయంగా ఉంది. అక్కడ ఉన్న వారందరూ శ్రీకృష్ణుడు తమ ఇంటి బిడ్డగానే భావిస్తున్నట్లు భావిస్తుంటారు.  ఎక్కడ చూసినా కృష్ణనామమే. అడుగడుగునా ఆలయాలే. ఒక మాసకాలం మధురలో ఉన్నా  ఆ ఆలయాలను పూర్తిగా చూడలేము అన్నారు. అక్కడ ఆకర్షణీయమైన ఆలయాలు  ఉన్నాయి. నిర్వాహకులు మతో  ప్రత్యేకంగా ఎవరికీ వారు ఎక్కడికీ వెళ్ళద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆలయాలు చూస్తుంటే కాలం గడిచేది తెలియదు.
రేపల్లెలో ఒక దృశ్యం 

రేపల్లెలో ఇళ్లు ఎగుదిగుడుగా ఉన్నాయి.  నివాసగృహాలు ఇప్పటికీ సాధారణంగా పురాతన శైలిలో ఉన్నాయి. అదంతా చూస్తూ అక్కడ నడుస్తూ ఉంటే  శ్రీ కృష్ణుడు బాల్యంలో గోపబాలకులతో ఈ ప్రదేశమంతా తిరిగాడుకదా అన్న అనుభూతి ఏర్పడింది. మేము అక్కడ ఉన్న మరికొన్ని ఆలయాలు చూసిన తరువాత నందగోపుని ఇల్లు చూడడానికి వెళ్ళాము. ముందుగా అక్కడ ఉన్న కొందరు మమ్ము ఒక ఇంటికి తీసుకువెళ్ళి ఇదే నందగోపుని ఇళ్ళు అనిచెప్పాడు. అక్కడ స్వామికి అడ్డంగా తేరా కట్టి ఉంది. స్వామిని చూడడాలంటే  తేర తొలగిస్తామని అందుకు  ముందుగా మేము రుసుము చెల్లించాలని నిబంధన విధించారు. నిర్వాహకులు తర్జనభర్జన పడి చివరకు అందరి తరఫున కొంత మూల్యం చెల్లించి దేవుని దర్శనం చేసుకున్నాము. మేము ఎవ్వరం వారితో స్వయంగా బేరసారాలు చేయడానికి నిర్వాహకులు  అంగీకరించలేదు. అక్కడ అన్నింటికీ డబ్బుల్లు అడుగుతూ యాత్రికులను కొంత వేదనకు గురి చేస్తూ ఉంటారు కనుక కొంత జాగరూకత అవసరమే అనిపించింది. తరువాత అక్కడ ఉన్న ఉయ్యాలలో కృష్ణ భగవానుని ఉంచి ఆ ఉయ్యాల  ఊపడానికి అదనంగా మరి కొంత మూల్యం చెల్లించాలని చెప్పారు. నిర్వాహకులు అందుకు ససేమిరా అన్నారు. అందరం వెలుపలికి వచ్చము. వెలుపలికి వచ్చిన తరువాత విచారిస్తే అది నందగోపుని అసలైన గృహం కాదని అది వేరే ప్రదేశంలో ఉందని చెప్పారు. మేము పరవాలేదనుకుని ఆ గృహం చూడడానికి బయలుదేరాం. 
రేపల్లెలో గోవిందుడు 
ఈ సారి తీసుకు వెళ్ళింది నిజమైన ఇల్లు  అనిపించింది. కొంచం మిట్ట అయిన  ప్రాంతంలో ఆ ఇల్లు  కొంచం 
ప్రత్యేకతగా ఉంది. అధికంగా రాతితో నిర్మితమై ఉన్నది. గృహానికి ముందు  విశాలమైన పెద్ద రాతి అరుగులు ఉన్నాయి. ఆ అరుగుల మద్యలో ఏర్పరిచిన  దారి గృహం లోపలకు తీసుకు వెళుతుంది. లోపలకు పోగానే పూజారులు స్వామికి ఉన్న తెర తొలగించి పూజ నిర్వహించారు. తరువాత మేమంతా మాకు తోచిన దక్షిణ ఇచ్చాము. ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. శ్రీకృష్ణుని నివాసం మరియు బాల్య లీలలు చుపించిన గృహం చూడడం ఆత్మానుభూతిని కలిగించింది.
రెపల్లెలో గ్రుహాలు 
రేపల్లెలోని గృహాలు అన్నీ ఆలయలే  అన్న అనుభూతిని కలిగించేవిగా ఉన్నాయి. అంతటా శ్రీకృష్ణుని పాదం స్పృ జించిన  ప్రదేశమే కనుక అన్ని ఆలయాలే మరి. అక్కడ ఉన్న కొన్ని విశాలమైన గృహాలలో ఇప్పటికీ కొందరు గోపికలలా నివసిస్తున్నారు. నిత్యమూ గోవిందుని స్మరించడమూ పూజలు చేయడమూ భజనలు చేస్తూ కాలం గడపడమే వారి దైనిందిక కార్యక్రమం. వారు తెల్లని చీరలు ధరించి ఉన్నారు. నుదుటన పొడవైన ఎర్రని తిరునామం. వారికి మరేమి అలంకరణలు లేవు. మేము సమయం లేనందున ఆ గృహాలలోకి వెళ్ళలేదు. వెలుపలి నుండి మాత్రమే చూసాము. 
File:Along the Ghats of Mathura.jpg
బృందావనం స్నానఘట్టం

File:Sevakunja Vrindavan.JPG
బృందావనంలో మొక్కలు 
File:Shahji Temple Vrindavan.JPG
బృందావనం 
  అక్కడి నుండి మేము బసులో  బృందావనికి వెళ్ళాము. అక్కడ యమునా తీరానికి వెళ్ళాము. అక్కడ ఉన్న పొన్న చెట్టును చూపి అది శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ చేసిన చెట్టు అని చెప్పారు. యమునా నదిలో నీరు మాత్రం తక్కువగానే ప్రవహిస్తుంది. తరువాత మేము శ్రీకృశ్ణుడు గోపికలతో  రాసలీల చేసిన బృందావనం ఉన్న చోటు చూసాము. అది శీ కృష్ణుడు రాసలీలగావించిన ప్రదేశం. అక్కడ ఉద్యానవనంలా కొంత కట్టడం ఉంది అక్కడ ఒక ద్వారం చేరిన తరువాత లోపల మొక్కలు ఉన్నాయి. అవి ఒక క్రమంలో లేవు. ప్రస్థుతం ప్రహరీ కూడా  లేదు కొంత పాడు పడిన స్థితిలో ఉంది. సరిగా నిర్వహణ లేదు. అయినప్పటికీ అది రాసలీలగావించిన పవిత్ర ప్రదేశం కదా. రాత్రి వేళలో ఆ మొక్కలుగా గోపికలుగా మారుతారని ఇప్పటికీ అక్కడ గోపికలు శ్రీకృష్ణునితో రాసలీలగావిస్తుంటారని విశ్వసిస్తున్నారు. అప్పటికి సాయంకాలం అయింది కనుక  అంతటితో మధుర యాత్ర ముగిసినట్లే. అయినప్పటికీ ఏము తిరిగి మధురవెళ్ళి అక్కడ శ్రీకృష్ణ జన్మ స్థానం పక్కన ప్రస్తుతం నిర్మించబడిన బృహత్తరమైన కృష్ణ  మందిరం చూడడానికి వెళ్ళాము. అది చూసిన తరువాత మేము తాజ్ మహల్  చూడడానికి ఆ రాత్రి ఆగ్రా వెళ్ళాము. ఆ రాత్రికి మా బస అక్కడే. 

4, ఆగస్టు 2013, ఆదివారం

హరిద్వార్

File:Bholanath Sevashram temple by the Ganges, Haridwar.jpg
హరిద్వార్ 


రుషికేశ్ వదిలి నేరుగా హరిద్వార్ చేరుకున్నాము. అక్కడి నుండి రాత్రికి డిల్లీ చేరాలి కనుక అక్కడ మేము బస ఏర్పాటు చేసుకోలేదు. నేరుగా స్నాన ఘాట్ చేరాము. అక్కడ స్నానాధికాలు ముగించి అక్కడే బసులో ఫలహారం ముగించాము. బసు అక్కడ వదిలి మేము హరిద్వార్ ఆలయాలు చూడడానికి బయలుదేరాము.
File:India - Haridwar - 002 - cows wandering aimlessly among the pilgrims (2086490984).jpg
హరిద్వార్ లో గోవుల సంచారం


File:Ganga arti at Haridwar.JPG
File:Chandi Devi Udankhtola, Haridwar.JPG
File:Ropeway to Chandi Devi Temple, Haridwar.jpg
ముందుగా ఆధునిక హనుమంతుని ఆలయ సమూహాలను దర్శించాము. ఈ ఆలయలలు అద్దం ముక్కలను ఉపయోగించి అత్యాధునికంగా నిర్మించబడ్దాయి. అక్కడ భక్తులకు ప్రత్యేక పూజలవంటివి లేవు. కేవలం సందర్శన మాత్రమే. హరిద్వార్ వెళ్లిన వారు తప్పక చూదవలసినంతగా ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడే అదే శైలిలో నిర్మించబడిన భారతమందిర్ ఉంది. అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. తరువాత తిరిగి బసు వద్దకు చేరుకున్నాము.


మధ్యాహ్నభోజనాలు ముగించాము
అక్కడి నుండి మేము తిరిగి చండీదేవి ఆలయం మరియు మానసాదేవి ఆలయం చూడడానికి బయలుదేరాం.  ఈ ఆలయాలు చూడడానికి ఒకే ప్రదేసంలో టిక్కెట్లు విక్రయించబడుతుంటాయి. మేము రెండు ఆలయాలను దర్శించడానికి టిక్కెట్లు తీసుకున్నాము. మాలో కొందరు ఒకే ఆలయం దర్శించడానికి టిక్కెట్లు కొనుక్కున్నారు. అందుకు ఒక కారణం ఉంది. హరిద్వార్ గంగానది హారతి చాలా ప్రసిద్ధి చెందినది. వారికి అది చూడాలని ఉంది. మాకు కూడా హారతి చూడాలని ఉన్నా మనసాదేవి ఆలయ దర్శనం కోసం అది వదులుకున్నాము. రెండింటిలో ఏదో ఒకటే సాధ్యం మరి.
File:Mansa Devi Temple, Haridwar.JPG
మానసాదేవి ఆలయం 

File:Mansa Devi Temple, Haridwar 11.jpg
File:Mansa Devi Temple, Haridwar 06.jpgటిక్కెట్లు కొని ముందుగా  ఛండీదేవి ఆలయానికి వెళ్ళాము. ఆలయదర్శనానికి కేబుల్ కారులో ప్రయాణించాము. అందరూ చాలా ఆసక్తిగా ప్రయాణించారు. అక్కడ దేవిని దర్శించుకునాము. అప్పటికే సాయం కాలం అయింది. కొందరు గంగా హారతి చూడడానికి ఘాటుకు తిరిగి వెళ్ళారు. మేము అక్కడి నుండి నడిచి మానసాదేవి ఆలయానికి వెళ్ళ్డానికి ఉద్యుక్తులమయ్యాము. మాకు సరి అయిన దారి తెలియదు. అయినప్పటికీ దారిలో వాటిని అడుగుతూ చిన్నగా దారి తెలుసుకుని కేబుల్ కారు ఉండే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ ఆలయదర్శనానికి ఎదురుచూస్తున్న  చాలామంది చేరి ఉన్నారు. దాదాపు మూడు గంటల సమయం ఎదురుచూసి మానసాదేవిని దర్శించుకున్నాము. తరువాత మేము బసు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ రాత్రి భోజనాలు పూర్తి చేసుకుని డిల్లీకి ప్రయాణం కొనసాగించాము. హరిద్వార్ చేరుకున్నాము కనుక ఇక రాత్రి ప్రయాణం చేయవచ్చు. హిమాలయాల ఘాటురోడ్డులో రాత్రి ప్రయాణాలు నిషిద్ధం. ఇలా మా హిమాలయాల యాత్ర కేదార్నాథ్ మరియు బద్రీనాథుల కరుణా కటాక్షాలతో క్షేమంగా ముసింది. హిమాలయ యాత్ర రోమాంచితమైనది. అయినప్పటికీ ఈ యాత్ర మాకు జన్మసాఫల్యత లభించిన తీరుగా  ఉంది. 
  

20, జులై 2013, శనివారం

ఋషికేశ్

File:Rishikesh view across bridge.jpg
ఋషికేశ్ 


ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
File:Shiva in rishikesh.jpg
గంగాతీరంలో ధ్యానంలో శివుడు 

తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే  వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. 
File:Sivananda Temple, Divine Life Society, Muni Ki Reti, Rishikesh.jpg
 శివానందాశ్రమం
File:Kailash Ashram, Muni Ki Reti, Rishikesh.jpgFile:Shiva statue at Parmarth Niketan, Muni ki Reti, Rishikesh.jpg మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని.  కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే  వినాయకుడు తొండం  పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి.  ఆశ్రమంలో  మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు.  గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.



File:Ram Jhula bridge on the Ganges, Muni Ki Reti, Rishikesh.jpg
రామ్ ఝులా
File:Close up of Pilgrims on Ram Jhula bridge, Rishikesh.jpgFile:Ram Julah Hanging Bridge, Rishikesh, India.jpgకైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా  జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది.  ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం
File:Trayambakeshwar.JPG


రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా  చూసి తీరాలని 
అనుకున్నాము.
File:A monkey crossing the Laxman Jhula bridge, Uttarakhand.jpg
లక్ష్మణ ఝులా 

అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి  లక్ష్మణ ఝులా ఉండే  ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత  వంతెన నిర్మాణం 1939లో జరిగింది.  తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే.