రాణివాస స్త్రీలు ఉత్సవాలను తిలకించే హవా మహల్ |
పింక్ సిటీ
రాజగంభీరంగా ఉన్న రాజ్ మందిర్ |
రాజ్ మందిర్ లోపలి దృశ్యం |
నగర సందర్సనం చేసే సమయంలో బసులో గైడ్ మాకు జైపూర్ లో చూడదగిన వాటిలో రాజ్ మందిర్ సినిమా దియేటర్ ఒకటి అని చెప్పాడు. నిర్వాహకులు సినిమా చూడాలని అనుకున్నవారికి టిక్కెట్ తీసిపెడతామని చెప్పారు. దాదాపు అందరూ అంగీకారం చెప్పారు. అందరిలోనూ సినిమా చూడాలన్న ఆసక్తి కంటే దియేటర్ చూడాలన్న ఆసక్తి అధికంగా ఉంది. అమర్ కోట చూసి హోటల్ చేరుకున్న తరువాత మేము కొంత విశ్రాంతి తీసుకుని రాత్రి అల్పాహారం తీసుకుని ఆరోజు గైడు చెప్పిన రాజ్ మందిర్ చూడడానికి బయలుదేరాము. అయితే హోటల్ వాళ్ళు మేము అనుకున్నట్లు టిక్కెట్టు ఏర్పాటు చేయలేదు అయిన మేము అనుకున్నట్లు వెళ్ళాలని అందరం ఆటోలు మాట్లాడుకుని దియేటర్ దగ్గరకు చేరుకున్నాము. హిందీ సినిమాకు టిక్కెట్టు కొనుక్కుని లోపలకు ప్రవేశించాగానే లోపలి దృశ్యం మా అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. దియేటర్ నిజంగానే రాజగంభిరంగా ఉంది. సినిమా చూసి
వెలుపలికి వచ్చి అ రాత్రి సమయంలో హిందిలో మాకు మేమే ఆటోలు మాట్లాడుకోవడానికి శ్రమ పడ్డాం. అలాగే సరిగ్గా రాత్రి సమయంలో దారి కనుక్కుని కొత్త ఊరిలో హోటలుకు చేరడం కూడా మాకు సమస్య అయింది. వచ్చిరని హిందిలో మాట్లాడి ఎలాగో హోటలుకు చేరాము.
సహాయ బృందంలో కొందరు |
సహాయ బృందానికి కానుకలు |
మర్నాటి ఉదయం మాకు ఫ్రీ డే. మేము అనుకున్న చోటకు పోవచ్చు. చివరి రోజు కనుక మాకు కావలసిన వస్తువులు కొనవచ్చు. అందుకే ఈ వెసులుబాటు. ఉదయం అల్పాహారం అయిన తరువాత చివరి రోజు కనుక నిర్వాహకులు మాకు సహకరించిన యాత్ర సిబ్బందికి బహుమతి ప్రదానం ఏర్పాటు చేసారు. అందరికి కృతజ్ఞతలు చెప్పి వారి శాలువలు కప్పి చిన్న చిన్న కానుకలను ఇచ్చారు. అలాగే మా బృందంలో ఒకరికి పుట్టిన రోజును కూడా జరిపారు.
పింక్ సితిలో ఒక దృశ్యం |
నగరంలో ప్రవేశించే ద్వారాలలో ఇది ఒకటి |
తరువాత మేము బృందాలుగా విడిపోయి ఆటోలు మాట్లాడుకుని పింకు సిటీకి వెళ్ళాము. జైపూరు షాపింగ్ కేంద్రం పింక్ సిటియే. అన్ని రకాల దుకాణాలు ఉన్న వ్యాపార కూడలి ఇదే. ఇక్కడ భవనాలు వెలుపలి భాగం ముదురు రోజారంగు మాత్రమే వేయాలని ఇక్కడి చట్టం ఉందని గైడు నిన్న చెప్పాడు. అతిక్రమించిన వారికి 25 వేల నుండి జరిమానా విధిస్తారని చెప్పాడు. సాధారణంగా నగర ప్రజలు కూడా తమ నగర ప్రతిష్ట కాపాడు కోవడానికి ముదురు రోజారంగు మాత్రమే వేస్తారట. లోపలకు ప్రవేశించడానికి అనేక ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇలా చూస్తూ మేము ఒక ద్వారం ద్వారా నగరంలోకి వెళ్లి మా షాపుంగ్ మొదలు పెట్టాం. జయపూర్ లో అందరం తప్పక కొనాలని అనుకున్నది దేవుడి పాలరాతి శిల్పం. అందరం వారి వారి ప్రత్యెక అభిరుచి ప్రకారం వారు శిల్పాలను వెతకడం మొదలు పెట్టారు.
జైపూర్ నగరాన్ని దేవతా నగరం అని కూడా అంటారట. ఇక్కడ చెక్కిన శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేవాలయాలలో ప్రతిష్టించి పూజలు చేస్తారట. అందుకే ఈ నగారాన్ని ఇలా పీలుస్తారట. ఇలా మేము శిల్పాలను చూస్తూ ఉన్న సమయంలో నిర్వాహకులు మాకు ఫోన్ చేసి శిల్పాలను కొనడానికి వారి సహకారం అందిస్తామని చెప్పారు.
సరస్వతి గణపతి లక్ష్మీ |
గోపాల కృష్ణుడు |
మేము వారిని కలుసుకుని అక్కడ వారి సహాయంతోశిల్పాలను కొన్నాము. వారు మాకు కొన్ని ప్రత్యెక శిల్పాలను కూడా చూపారు. ఆ శిల్పాల సౌందర్యం మ్మము ముగ్ధులను చేసింది. మచ్చుకి పైన రెండు చిత్రాలు ఉన్నాయి చూడండి. మూడు అడుగుల పైగా ఉన్న ఈ శిల్పాలు మూడు నుండి ఐదు లక్షల వరకు విలువ చేస్తాయట. ఎంత అందంగా ఉన్నాయో. అందరం కొనుగోలు చేసి ముగించే సరికి మద్యాహ్న భోజన సమయం అసన్నం అయింది. జైపూర్ లో మంచి పేరున్న ఎల్ ఎమ్ బి హోటల్ కు వెళ్లి భోజనాలు చేసి వెలుపలి షాపులలో తిరిగి అక్కడ దుప్పట్లు, చీరలు , చుడిదార్ మొదలైనవి
కొనుక్కుని అలసటతో హోటల్ కు చేరాం . మిగిలిన సమయం అలా అలా అందరం కలుసుకుని సరదాగా మాట్లాడుకున్నాం. ఆరోజు అలా గడిచి పోయింది.
జైపూర్ స్టేషన్ వెలుపలి భాగం |
మరునాటి ఉదయం మాకు యాత్రలో చివరి రోజు సాయంత్రం 6.30 రైల్వే స్టేషన్లో ఉండాలి . అయినా అప్పటి వరకు ఉరకే ఉండాలి కదా ! అందుకని తిరిగి పింక్ సిటి షాపింగ్ చూడడానికి వెళ్ళాము. ఈ రోజు కొంతమంది హోటల్ లో ఉన్నారు. కొంత మందిమి మాత్రమే బయలు దేరాం . ఈ రోజు కొంత కవరింగ్ నగలు బెడ్ షీట్స్ వంటివి ఇంకా ఇతర వస్తువులు కొనుగోలు చేసి మద్యాహ్న సమయం వరకు తిరిగి హోటల్ కు చేరి భోజనాలు చేసి సమానులు సర్దేపని మొదలు పెట్టాం. సమానులు అన్ని గదుల వెలుపల పెట్టగానే హోటల్ గదులు కలి చేయవలసిన సమయం ఆసన్నం అయింది. హోటల్ వాళ్ళు మాకు ఇంకా సమయం ఉంది కనుక మాకో రెండు గదులు మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారు. మళ్లీ ఆడవాళ్ళంతా మాటల్లో దిగాం . ఇలా నాలుగున్నర వరకు సమయం గడిపి ఆ గదులు కూడా ఖాళీచేసి కిందకు దిగాం . మాలో కొంత మంది ఇక స్టేషన్ కి వెళ్ళాలని నిర్ణయం చేసాం . మేము ఎవరికీ వాళ్ళం ఆటోలు మాట్లాడుకుని స్టేషన్ చేరాం . స్టేషన్ వెలుపల చక్కగా అలంకరించబడి ఉంది . ఇది దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం కనుక ఇలా అందంగా తిర్సిదిద్దినట్లు ఉంది .
స్టేషన్ చేరిన తరువాత అనేకంగా బృందం వాళ్ళం విడిపోయాం . మా బెర్త్ లు వేరు వేరు కంపార్ట్ మెంట్లలో రావడమే అందుకు కారణం. సామాన్లకు కావలి ఉండవలసి రావడం మరో కారణం. సామాన్లన్నీ మద్యలో పెట్టుకుని చుట్టూ కూర్చుని కాఫీ, టీలు సేవిస్తూ తిరిగి మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ఇంటికి రమ్మని ఆహ్వానాలు చెప్పుకుంటూ రెండు మూడు గంటలు గడిపిన తరువాత మేము ఎక్కవలసిన రైలు వచ్చింది . ఇక ఎవరి దారి వారిదే మరి. ఇంతటితో మా పంచ ద్వారకల యాత్ర ముగిసింది .