కేదార్ బదరీ యాత్ర
మేము కేదార్ యాత్ర చేసి అయిదు సంవత్సాలు పూర్తీ చేసుకున్నాయి. అయినప్పటకి ఆ గుర్తులు మాత్రం ఇంకా మనసులో పదిలంగానే ఉన్నాయి. నాజీవితంలో కేదార్నాద్ బదరినాద్ చూస్తానని అనుకోలేదు. కానీ ఇలాంటి అవకాశం రావడం అదృష్టం అని భావించాను. అది కూడా బదిరిలో ఆలయం సరిగా తెరిచే రోజుకు చేరుకొని ఆలయ దీపం చూడాలని మాప్లాను. ఆ దీపం ఆరు మాసాల ముందు వెలిగించింది. అది ఆరుమాసాల తరువాత కుడా ఆరకుండా అలాగే వెలగడం అక్కడి ప్రత్యేకత. యాత్ర బుక్ చేయగానే ముందుగా గెట్ టుగెదర్ విందు చేసారు. అప్పుడు ఎవరికీ వారు కొత్తగా అనిపించారు. కానీ తరువాత వారే ఒక కుటుంబంగా మారి పోతారని ఎవరూ ఉహించ లేనిది కదా ! విందు పూర్తి అయిన తరువాత చిన్నగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యాత్ర గురించి వివరించి యాత్రకు కావలసిన అత్యవసర సామాగ్రి గురించి చెప్పి అవి ఎక్కడ లభ్యం ఔతాయో వివరించారు. తరువాత ఒక యాత్ర వివరాల గురించిన పుస్తకం ఇచ్చారు. అందులో యాత్రకు వెళ్ళే వారి అడ్రసులు ఫోన్ నంబర్లు ఉన్నాయి. అందరూ ఆ పుస్తకం యాత్రకు వచ్చే సమయంలో తీసుకు రావాలని చెప్పారు. అందులో కొన్ని ఖాళీ పేజీలు ఉన్నాయి వాటిలో యాత్రలో చుసిన వివరాలు వ్రాసుకో వచ్చని చెప్పారు. తరువాత నిర్వాహకులను ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. ఇలా మా గెట్ టుగెదర్ ముగిసింది. తరువాత మేము యాత్రకు కావలసిన సరంజామా తయారు చేసుకుని యాత్రకు సిద్ధం అయ్యాము.
ముందుగా మేము చెన్నై రాల్వే స్టేషన్ చేరుకున్నాము. అక్కడ అప్పటికే నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. వారు అందరిని ఆహ్వానించి మా మా సీట్లలో మమ్మలిని అసీనులను చేసారు. ఎక్కగానే మాకు అల్పాహారం సరఫరా చేసారు. నెల్లూరు నుండి కొందరు మాతో కలిసారు. వారు వచ్చిన తరువాత మా ఎదురు సీట్లు భర్తీ అయ్యాయి. మా విభాగంలో ఆరుగురం ఉన్నాము. ఎక్కిన కొన్ని గంటల సమయానికే మేము ఒకరితో ఒకరం చక్కగా పరిచయం అయ్యాము. నిర్వాహకులు కొందరు గ్రూప్ లీ డర్లను ఎంచుకుని వారిని మాకు పరిచయం చేసారు. అలా ఒకరికి ఒకరం మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు గడిపాము. సాయంత్రానికి ఒకరొకరుగా వచ్చి పరిచయం చేసుకున్నారు. ఇలా రెండవ రోజు ప్రయాణం కూడా సాఫీగానే జరిగింది. ఎలాగైతేనేం డిల్లీ చేరుకున్నాం.
మా సామాను అంతా దించుకుని అందరూ ఒకే చోట చేరి కూర్చున్నాము. సామాను అంతా బండ్ల మీద ఎక్కించి స్టేషన్ బయటకు చేర్చారు. అక్కడ నుండి అందరూ ముందుగా బుక్ చేసిన హోటల్ చేరుకున్నాము. డిల్లీ ఎందుకో అంత ఆకర్షనీయం గా కనిపించ లేదు. అంతటా దుమ్ము రేగినట్లు ఉంది. వాతావరణంలోదుమ్ము స్పష్టంగా కనిపిస్తూ పరిసరాలు కొంత అస్పష్టంగా కనిపించాయి. చా ఎత్తు భవనాలు కూడా అలా అస్పష్టంగా కనిపించడం వింతగా ఉంది. ఒకే దేశంలో ఇంట వైవిధ్యమైన వాతావరణం ఆశ్చర్యాన్ని కలిగించింది. మా కందరికీ రూములు చూపించగానే అందరం ఫ్రెషప్ అయి నిర్వాహకులు చెప్పిన స్థలానికి చేరుకుని ఉదపు అల్పాహారం తీసుకున్నాము. హోటల్ లోనే మా వంట వారికి వంట చేసుకోవడానికి కొంత ప్రదేశాన్ని ఇచ్చారు. మా వంట వారు ఎలాంటి ప్రదేశంలో కూడా వంట చేయగలిగిన నేర్పరులు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కి ముందుగా రాజ్ ఘాట్ చేరుకున్నాము. అక్కడ గాంధీ సమాధి, నెహ్రు సమాధి, రాజీవ్ గాంధీ సమాధి , ఇందిరా గాంధీ సమాధి నాయకుల సమాధులు ఉన్నాయి. డిల్లీలో చూడవలసిన వాటిలో అది ముఖ్యమైనది కదా ! ముందుగా గాంధీ సమాధి చూడడానికి వెళ్ళాము. ఇదిగో ఇదే గాంధీ సమాధి.
|
ఇదే ఇండియా గేట్ |
|
గాంధీ సమాధి దీనినే రాజ్ ఘాట్ అంటారు |
అలాగే తరువాత మేము రాజీవ్ గాంధీ , ఇందిరా గాంధీ, నెహ్రు సమాధులను చూసిన తరువాత అక్కడి నుండి బయలు దేరి ఇండియాగేట్ చేరుకున్నాము. అక్కడ అందరమూ తిరిగి చూసాము. అలా కుర్చుని ఉండగానే కొందరు ఆడపిల్లలు వచ్చి మాకు మెహంది పెడతామని వచ్చారు. మాలో కొంతమంది చక్కగా మెహంది పెట్టించుకుని ఆనందించారు. అంతా తీరికగా కుర్చుని భోజనాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఇండియా గెట్ సందర్సన మాకు చాల ఆనందాన్ని కలిగించింది. ఇంతలో నిర్వాహకులు భోజనాలు తాయారు చేసుకుని వ్యానులో పెట్టుకుని మా వద్దకు వచ్చారు. అందరం భోజనాలు చేసి అక్కడ నుండి బయలు దేరి ఇస్కాన్ చూడడానికి వెళ్ళాము.
అలాగే ఇస్కాన్ లోనికి వెళ్ళగానే లోపల అంతా తిరిగి చూసాము. తరువాత ఇస్కాన్ లో
షో చూడడానికి
వెళ్ళాము. షో
ఆర్షణీయంగా
ఉంది.షోలో భాగంగా
ఒక్కో షో చూ పించి అలాగే వేరొక షో చూడడానికి పంపిచారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ చూడడం ఒక కొత్త అనుభూతి. ఇలా అశోలో మేము ఐదారు రకాల షోలు చూసాం. ఇస్కాన్ ఆలయం ఇంతకు ముందు చూసినా ఇలాంటి షో చూడడం ఇది మొదటి సారి.ఒక్కో షో ఒక్కో మాదిరిగా ఉంది. ఇలా షో పూర్తికాగానే అందరం బస్సు చేరుకుని హోటల్ రూంకు చేరుకొని భోజనాలు చేయడానికి హోటల్ రూఫ్ గార్డెన్ చేరుకున్నాం. అక్కడి నుండి డిల్లీ అందంగా కనిపించింది. పూర్తి చేసుకు తరువాత నిర్వాహకులు మాతో తరువాత మా ప్రయాణానికి చాలినన్ని దుస్తులు తీసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. మిగిలిన సామానులు హోటల్ లోనే బధ్రపరిచారు. మేము ఇక మినీ బసులలో ప్రయాణం చేయాలి. అంటే రెండు బసులలో ప్రయాణించాలి. ఘాట్ రోడ్ లో ప్రయాణించడానికి మినీ బసులు మాత్రమే ఉపకరిస్తాయి. అందరం హోటల్ నుండి సదరన్ ట్రావెల్ కార్యాలయానికి చేరుకొని మా మా బసులను అధిరోహించి ప్రయాణం కొనసాగించాము. మా ప్రయాణం రాత్రి సమయంలో జరిగింది. బసు ఎక్కగానే అందరం నిద్రలోకి జారుకున్నాం.
|
హరిద్వార్ |
|
ఋషికేస్ |
అలా రాత్రి ప్రయాణించి తెల్లవారే సమయానికిహరిద్వార్ చేరుకున్నాము. కానీ ఇప్పుడు మేము హరిద్వార్ వద్ద ఆగలేదు. తిరుగు ప్రయాణంలో మాత్రమే హరిద్వార్ చూడాలని నిర్వాహకులు చెప్పారు. హరిద్వార్ దాటి ఋషీ కేస్ చేరుకున్నాము. అక్కడ మేము చిన్న జీయర్ ఆశ్రమంలో బస చేసాము. జీయర్ ఆశ్రమంలో మాకు రూములు కేటాయించారు. కొందరు గంగానది స్నానానికి వెళ్లి వచ్చారు. మేము రూ ములలో స్నానాలు ముగించి ఆశ్రమంలో అల్పాహారం తీసుకుని తరువాత మేము తిరిగి ప్రయాణం కొనసాగించాము.
ఇలా మేము హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహించడం మొదలు పెట్టాము. అలా వెళుతూ కొండచరియలు చూసుకుంటూ ఘాట్ రోడ్లలో ప్రయాణిస్తున్నాము. హిమాలయాల అందాలు మనసును దోచుకుంటుంది. హిమాలయాలు చూస్తున్నామన్న అనుభూతి చాల ఆనందంగా ఉంది. మధ్యాహ్న సమయానికి ఒక పెట్రోలు బంకు వద్ద భోజనం కొరకు ఆగాము. బసు నిలిపి భోజనం చేయడానికి అలంటి ప్రదేశాలలో మాత్రమే అవకాశం ఉంటుంది.
|
హిమాలయ లోయలు |
అక్కడ నుండి హిమాలయ లోయలు చాల అందంగా కనిపించాయి. మచ్చుకి ఈ చిత్రం చుడండి. ఇలా కొండ చరియలను ఇలా పంట భూములుగా మార్చుకుంటారు. ఇలాంటి పంట భూములు మనదేశంలో ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. అక్కడ మేము మా మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసుకుని కొంత దూరం ప్రయాణం చేసాము. మధ్యాహ్నం దాటి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతలో బసును తిరిగి నిలిపారు. మాతో వచ్చిన వంట వారు మాకు అక్కడ రోడ్డు మీదే కాఫీ టీ లు పెట్టి కాఫీ టీ లు బిస్కట్లతో అందించారు. మా వంట వారికీ అలాంటి సామర్ధ్యం అధికం. వేడిగా పానీయాలు సేవించి తిరిగి బసు ఎక్కి ప్రయాణం కొనసాగించాము. రోడ్డు పక్కన బృందగా భోజనాలు చేయడం కాఫీ టీలు త్రాగడం చాల సరదాగా ఉంది.
|
దేవ ప్రయాగ |
|
రుద్ర ప్రయాగలో శివాలయం |
శివాలిక్ పర్వతాల గుండా ప్రయాణించి మద్యలో దేవప్రయగ ద్వారా మా ప్రయాణం కొనసాగించాము. దేవప్రయాగ వద్ద అలకనందనది గంగానదిలో సంగమిస్తుంది. అలా వెళుతూనే రుద్రప్రయాగ చేరుకునే సమయానికి రాత్రయింది రాత్రి సమయంలో హిమాలయ ఘాట్ రోడ్లలో ప్రయాణం ప్రమాదకరం కనుక ప్రయాణానికి అనుమతించరు. రుద్రప్రయాగ వద్ద రూములలో విశ్రాంతి తీసుకున్నాము. మరుసటి రోజు తిరిగి ప్రయాణం కొనసాగించి బదరినాద్ చేరుకోవడానికి బయలు దేరాము.
|
జోషి మఠంలో రోప్ వే |
|
జోషీ మతంలో ఆలయం |
మార్గ మాధ్యమంలో జోషీ మఠం చేరుకున్నాము. అక్కడతో భారతదేశ సరిహద్దులు మొదలుతాయి. కనుక ఇక మిగిలిన ప్రాంతం మిలిటరీ అధినంలో ఉంటుంది. జోషీ మఠం మరొక ప్రత్యేకత కలిగి ఉంది. అది భవిష్యత్ బడరినాద్ గా పిలువబడుతుంది. బదరీ నాధుడు అక్కడ అరు మాసాల కాలం నిత్యపూజలు అందుకుంటాడు. అంటే శితాకాలంలో బదరీ దర్శనం ఆపివేసిన ఆరుమాసాల కాలం బదరీ నాధుడు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటాడు. అలాగే ఇక్కడ శంకరాచార్యుడు నివసించిన మఠం కూడా ఉంది. మా బసు ఆ మఠం ఉన్న ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆగింది. మమ్ము అక్కడ నుండి నడిచి వెళ్ళమని చెప్పారు. మేము ఉత్సాహంగా బయలు దేరినా అక్కడకు ప్రయాసతో మాత్రమే చేరుకున్నాము. అక్కడ ఉన్న నరసింహ స్వామిని దర్శించుకుని శంకర మఠం చూసి వెలుపలకు రాగానే నిర్వాహకులు బసు వద్దకు చేరుకోవడానికి మా కోసం వ్యానులను ఏర్పాటు చేసారు. అవి చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పి మేము వ్యానులలో బసు చేరుకొని తిరిగి బదరీ ప్రయాణం కొనసాగించాము.
|
జిషి మతం నుండి ఘాట్ రోడ్డు దృశ్యం |
|
దూరంగా కనిపిచే చిన్న చిన్న ఉర్లు |
చీకటి పడే లోపు బదరి చేరుకోవాలి. మార్గమధ్యలో ఎక్కడ ఘాట్ రోడ్ వద్ద బసు ఆపడానికి కుదరదు. ఆపిన బసు దిగి కిందకు దిగడానికి వీలు కాదు. అటు ఇటు పెద్ద లోయలు ఉంటాయి. ఎదురు వచ్చే బసులు కూడా టర్నింగ్ వద్ద మాత్రమే ఒకదానిని ఒకటి దాట వలసిన అవసరం ఉంది. అక్కడ మాత్రమే రెండు బసులు తిరగడానికి కావలసిన ప్రదేశం ఉంటుంది. రెండు బసులు దాటే సమయంలో ఒళ్ళు గగర్పోడుస్తూ ఉంటుంది. మార్గాలు అంత ఇరుకుగా ఉంటాయి. మరొక ప్రమాదం వర్షం. ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో వర్షం వస్తే కొండ చరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది. అలాగే నీరు రోడ్లను ఉచకోత కోస్తూ ప్రవహిస్తుంది కనుక మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నిరంతరంగా మర్గాలసు సరి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మార్గాలు నిరతరంగా రిపేరుకు గురి ఔతునే ఉంటాయి. కొన్ని మార్గాలలో అటు ఇటు అదాలు ఏమి ఉండవు. మార్గం వృక్ష రహితంగా ఉంటుంది కనుక తప్పితే నేరుగా లోయ అడుగు భాగానికి చేరవలసిందే. కనుక ఘాట్ రోడ్డు ప్రయాణం బహు జగారుకతతో చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతలో అనుకోకుండా మా బసులలో ఒకటి రిపేర్ అయింది. చీకటి పడే సమయం దగ్గర పడింది. చీకటి పడే లోపు బదిరీ చేరుకోక పొతే బసును లోనికి రానివ్వరు. నిర్వాహకులు చాల ఆందోళనకు గురి అయ్యారు. ఒకరి కొకరు ఒకరు తోడు అన్నట్లుగా రెండు బసులు ఆపి చిన్నగా బస్సు బాగు చేసుకుని బదిరీ చేరుకున్నాము. బసు దిగగానే మాకు చలి బాధ బాగా తెలిసింది. భరించలేనంత చలి వేసింది. బసు నేరుగా చిన్న జియారు మఠం వద్ద ఆపారు. మేము బిలబిలమంటూ లోనికి పరుగులు తీసాం అంతగా చలిగా ఉంది మరి.