9, జనవరి 2013, బుధవారం

ఋషికేశ్

File:Rishikesh view across bridge.jpg
ఋషికేశ్ 

ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
File:Shiva in rishikesh.jpg
గంగాతీరంలో ధ్యానంలో శివుడు 

తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే  వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. 
File:Sivananda Temple, Divine Life Society, Muni Ki Reti, Rishikesh.jpg
 శివానందాశ్రమం
File:Kailash Ashram, Muni Ki Reti, Rishikesh.jpgFile:Shiva statue at Parmarth Niketan, Muni ki Reti, Rishikesh.jpg మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని.  కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే  వినాయకుడు తొండం  పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి.  ఆశ్రమంలో  మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు.  గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.

File:Ram Jhula bridge on the Ganges, Muni Ki Reti, Rishikesh.jpg
రామ్ ఝులా
File:Close up of Pilgrims on Ram Jhula bridge, Rishikesh.jpgFile:Ram Julah Hanging Bridge, Rishikesh, India.jpgకైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా  జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది.  ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం
File:Trayambakeshwar.JPG

రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా  చూసి తీరాలని 
అనుకున్నాము.
File:A monkey crossing the Laxman Jhula bridge, Uttarakhand.jpg
లక్ష్మణ ఝులా 

అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి  లక్ష్మణ ఝులా ఉండే  ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత  వంతెన నిర్మాణం 1939లో జరిగింది.  తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే. 

నాభాస యోగాల

నాభాస యోగాల

నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.
  • నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
  • ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
  • ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
  • ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
  • కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
  • ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
  • కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
  • ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
  • యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
  • ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
  • శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
  • ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
  • శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
  • ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
  • దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
  • ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
  • అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
  • గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
  • ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
  • వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
  • ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
  • యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
  • ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
  • పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
  • ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
  • వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
  • ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
  • శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
  • ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
  • విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
  • ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
  • వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
  • ఫలితం :-
  • శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
  • ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
  • చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
  • సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
  • సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
  • ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
  • ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
  • ఫలితం :-
  • రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
  • ఫలితం :-
  • గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
  • ఫలితం :-
  • యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
  • ఫలితం :-
  • శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
  • ఫలితం :-
  • కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
  • ఫలితం :-
  • పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
  • ఫలితం :-
  • దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
  • ఫలితం :-
  • వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.

2, జనవరి 2013, బుధవారం

జ్యోతిర్మార్గం

జ్యోతిర్మార్గం 

జ్యోతి అంటే వెలుగు. జ్యోతిషం వెలుగును ఆధారంగా చేసుకున్న పరచిన శాస్త్రం. అనేకులు విశ్వసించేది కొందరు విమర్శించేది. ఏది ఏమైనా దీనికీ విశ్వాసం మాత్రమే ఆధారం. ఇందులో గోచారం   ఒక పధ్ధతి. గోళాల సంచారం ఆధారం చేసుకుని నిర్ణయించేది.  దీనిని సంత్సర, మాస,  వార, దిన ఫలితాలు చూడడానికి ఉపయోగిస్తారు. గోచార ఫలితాలు చూడదానికి రాశీ నుడి గణించాలి.  జీవితకాల ఫలితాలు చూడడానికి లగ్నం నుండి లెక్కించాలి.  జ్యోతిషం చూడాలంటే ప్రధానంగా అనే క విషయాలను గణించాలి.
ముందుగా రాశులు. ఇవి పన్నెండు.
సూర్యుని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం చేస్తారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశిలో ప్రవేసించే సమయం సంక్రమణగా వ్యవరిస్తారు. సూర్యుని చుట్టు భూమి చేసే భ్రమణాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే వచ్చినవే పన్నెండు రాసులు. ఒక్కక్క రాశిలో ప్రవేశించే సమయయంలో ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహాలలో ఉండే మార్పులను బట్టి అవి వేరు వేరు నక్షత్రాలని మన ఋషులు పరిశీలింవి గుర్తించారు. అ నక్షత్ర సముహ ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయించారు. 

వాటిలో మొదటిది మేషం., రెండవది వృషభం, మూడవది మిధునం, నాల్గవది కటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, ధనుస్సు, పదవది మకరం, పదకొండవది కుంభం, పన్నెండు మీనం.

1 మేషం రాశిలో అశ్విని నక్షత్ర నాలుగు పదాలు, భరణి నక్షత్రలో నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రలో మొదటి పాదం కలసి తొమ్మిది పాదాలు.
2 వృషభ రాశిలో మిగిలిన మూడు పదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు ఉంటాయి.
3 మిదునరాశిలో మృగశిరలోని రెండు పాదాలు, ఆరుద్రలోని నాలుగు పాదాలు, పునర్వసులోని మూడు పాదాలు ఉంటాయి.
4 కటకరాశిలో పునర్వసు నక్షత్రంలోని నాల్గవ పాదం, పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి.
5 సింహరాశిలో మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని నాలుగు పాదాలు , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని ఒక పాదం ఉంటాయి. 
6 కన్యారాశిలో ఉత్తరఫల్గుణి నక్షత్రంలోని మిగిలిన మూడు పాదాలు, హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు, చిత్త నక్ష త్రంలోని రెండు పాదాలు ఉంటాయి.
7 తులారాశిలో చిత్తానక్ష త్రంలోని మిగిలిన రెండు పాదాలు, స్వాతి నక్ష త్రం లోని నాలుగు పాదాలు, విశాఖనక్ష త్రం లోని మూడు పాదం ఉంటాయి.
8 వృశ్చికరాశిలో  విశాఖ నక్ష త్రం లోనిమిగిలిన ఒక్క పాదం , అనురాధ నక్ష త్రం లోనినాలుగు పాదాలు, జ్యేష్ట నక్ష త్రం లొనినాలుగు పాదాలు ఉంటాయి.
9 ధనుసు రాశిలో మూలా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్ష త్రం లోని ఒక్క పాదం ఉంటాయి.
10 మకరరాశిలో ఉత్తరాషాడలోని మిగిలిన మూడు పాదాలు, శ్రవణా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ధనిష్ఠ నక్ష త్రం లోని రెండు పాదాలు ఉంటాయి. 
11 కుంభ రాశిలో ధనిష్ఠ నక్ష త్రం లోని మిగిలిన రెండు పాదాలు, శతభిష నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్ష త్రం లోని మూడు పాదాలు ఉంటాయి.
12 మినరాశిలో పుర్వభద్ర నక్ష త్రం లోని ఒక్క పాదం, ఉత్తరాభద్ర నక్ష త్రం లోని నాలుగు పాదాలు, రేవతి నక్ష తరం లోని నాలుగు పాదాలు ఉంటాయి.
ఇలా పన్నెండు రాశులలో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి.