కేదార్నాథ్
కేదారీశ్వరాలయం |
ఇలా ఉంటాయి ఆ గుడారాలు |
మంచుతెరల మద్య కేదారీశ్వరుడు |
గౌరీ కుండ్ |
గౌరికుండ్ రద్దీ |
గౌరికుండ్ బస్ స్టాండ్ |
కేదార్నాథ్ ఆలయానికి తీసుకుపోయే గుర్రాలు ఇలా ఉంటాయి |
వంపులు తిరిగిన ఘాట్ మార్గం |
14 కిలోమీటర్ల కేదార్నాథ్ మార్గంలో ప్రవేశం |
ప్రయాణానికి సిద్ధంగా ఉన్న గుర్రాలు |
చీకటి పడేవేళకి రానూ పోనూ 28 కిలో మీటర్లదూరాన్ని ప్రయాణించి బసకుచేరాలి కనుక మా గదిలో నే స్నానాలు ముగించి ఫలహారం తిని ప్రయాణనికి సిద్ధం అయ్యాము. గౌరీ కుండ్ నుండి కేదార్నాథ్ కొండ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. కేదార్నాథ్ మర్గం ఎగుడు దిగుడుగా వంపులు తిరిగి ఉంటుంది. సాధారణంగా యాత్రికులు ఆ మార్గంలోనడిచి వెళ్లి ఒక రోజులో స్వామిని దర్శించి తిరిగి కిందకు చేరుకోవడం సాధ్యం కాని పని. కనుక డొలీలు, చిన్నసైజు గుర్రాలు వంటి వాటిలో ప్రయాణించాలి.
మేము బయలుదేరడనికి ముందు అక్కడ ఉన్న ఆలయాలను దర్శించడానికి వెళ్ళాము. ఆలయాలు బసకు సమీపంలోనే ఉన్నాయి కనుక కాలినడకన వెళ్లము. అక్కడాకు వెళ్లిన తరువాత అక్కడే ఉస్హ్ణ గుండం ఉందని తెలుసుకుని అక్కడ స్నానం చెయ్యలేక పొయ్యామని అనుకున్నాము. పరవాలేదనుకుని అక్కడి ఆలయాలు దర్శించుకున్నాము. ఆలయాలు అన్నీ సాధారణంగా ఉన్నా అవి మహర్షుల పాదస్పర్శ కలిగినవన్న స్పృహ కలిగి మనసులో ఆనందానుభూతి కలిగించింది. ఆలయదర్శనం తరువాత అంతా చూసి బసకు వచ్చి చేరాము.
గౌరీకుండ్ దృశ్యం |
గౌరీకుండ్ |
గౌరీమందిర్ |
గురాలపై యాత్రకు |
డోలీ వాళ్ళు వచ్చి పైకి తీసుకు వెళతామని మా వెంట తిరుగుతూ అడుగుతూనే ఉన్నారు. నిర్వాహకులు అందరికీ డోలీలను మాట్లాడి ఏర్పాటు చేసారు. కొంతమంది మాత్రం గుర్రాలను మాట్లాడుకున్నారు. మా బృందంలో స్త్రీలలో చాలామంది ప్రయాణానికి అనువుగా చుడిదార్లు వేసుకున్నారు.
యాత్ర ఆరంభం |
గుర్తింపు కార్డుతో నేపాలీ డోలీవాలా |
కేదార్ మార్గం |
కేదార్ మార్గం ఇలా ఉంటుంది |
కేదార్ మార్గం |
నలుగురు మోసుకుపోయే డోలీ |
కాలినడకలో యాత్రికులు |
తాత్కాలిక రెయిన్ కోట్లలో యాత్రికులు |
కొండ చరియలలో యాత్రికులు |
మార్గంలో మలుపు తిరుగుతూ |
విశ్రాంతి తీసుకునేది ఇక్కడే |
మార్గ మద్యంలో ఫలహార శాల |
పచ్చని సెలయేళ్ళు కొండచరియలు |
ఏటవాలు భూములలో వ్యవసాయక్షేత్రాలు |
ఆహ్లాదకరమైన జలపాతాలు |
మార్గమద్యంలో |
ఒక్కోసారి రాత్రిలోగా పైకి చేరే అవకాశం లేకుంటే అల్కడ ఉన్న హోటళ్ళలో రాత్రికి విశ్రమించి మరునాడు ప్రయాణం కొనసాగించవచ్చు. కొందరు అలాచేస్తుంటారని డోలి వారిని అడిగి తెలుసుకున్నాను. మార్గ మద్యంలో ఉన్న దుకాణలకు కావలసిన అన్ని వస్తువులూ దాదాపు ఇలా నడక ద్వారానే చేరవేయాలి. ఇక్కడి వారిది అత్యంత శ్రమైక జీవితం. శ్రమించనిదే ఎవరికీ జీవితం గడవదు. మార్గంలో ఉన్న దుకాణాలన్నీ తాత్కాలిక మైనవే. ఆరుమాసాల అనంతరం ఖాళీ చేయబడతాయి. వాటి నిర్మాణానికి సామాను పైకి చేర్చడం ఎంత కష్టమో ఆలోచించండి. వీరితో పోల్చుకుంటే ఎంతో వసతులతో జీవితాన్ని గడిపే మనలో కొంతమంది ఇంకా కావాని ఆరాటపడడం ఉన్నదానితో తృప్తి చెందక పోవడం ఎంత విచిత్రమైనదోకదా.
ఒకే మనిషి మోసే దోలి ఇలా ఉంటుంది |
కాలినడకలో యాత్రికులు |
ఇంకా ముందుకు పోయిన తరువాత మా బృందం వారు వెనక్కి రావడం గమనించాను. వారు ఈ ప్రయాణం కొనసాగించ లేక వెనుతిరిగారని తరువాత తెలిసింది. ఇలా మా బృందం వారు 11 మంది వెనుతిరిగారు. అయినప్పటికీ నేను మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆఖరి వరకూ ప్రయాణం కొనసాగించాలని నిర్ణ యించుకున్నాను.
రెయిన్ కోటు వేసుకున్న తరువాత వాన నుండి తప్పించున్నా విసురుగా వీస్తున్న గాలి ఇబ్బంది పెట్టసాగింది. గాలికి రెయిన్ కోటు తలమీద నిలవడం కష్టమైంది. వాన చినుకులు ఏటవాలుగా కురుస్తూ సూదులులా గుచ్చుతున్నాయి. ఇంతవరకూ ఇలాంటి వాన చూడ లేదు. వేగంగా ఏటవాలుగా కురవడం వలన ఇలా ఉందేమో . ఒకచేత్తో రెయిన్ కోటు సరిచేసుకుంటూ ఒక చేయి ముఖం మీద పెట్టుకుని వాన నుండి కాపాడుకోవలసి వచ్చింది. క్రమంగా వాన మంచుగా మారింది. ఇప్పుడు ముఖం మీద మంచు ముద్దలు ముద్దలుగా పడుతూ కరిగిపోతూ ఉంది. చలి వానలకు శరీరం కొద్దిగా అలవాటు పడింది. ఇప్పుడు అంతగా ఇబ్బంది అనిపించ లేదు. ఇక్కడే నివసిస్తే ఈ వాతావరనానికి అలవాటు పడడం సులువులా ఉంది. డోలి వారు ఇక ఆలయానికి చేరువ ఔతున్నామని మహాదేవుడిని స్మరిస్తూ ఉండమని చెప్పారు. నాకు తట్టని విషయం వారు చెప్పినందుకు వారి మీద సదభిప్రాయం మరింత ఎక్కువైనది. మహేశ్వరుని స్మరిస్తూ కేదార్నాథ్ చేరడం మరింత అనందానుభుతి కలిగించింది. ఇలా చిన్నగా శిఖరానికి చేరుకున్నాము.
శిఖరానికి చేరువ ఔతూ |
ఆలయానికి షుమారు రెండు కిలోమీటర్ల దూరంలో డోలి ఆపి వెళ్ళాలి కనుక డోలిలను ఆపి ఇక నడవాలని చెప్పారు. మా బృందం వారు ఎవరూ కనిపించ లేదు. ఇంత కొత్త ప్రదేశంలో ఇలా ఒంటరిగా ఉండడం ఇదే మొదటి సారి. ఏమి చేయాలో పాలు పోలేదు. డోలి వారిలో ఒకరు నాతో అందోళన అవసరం లేదని తను వెంట వస్తానని చెప్పాడు. పరిచయం లేని వారితో ఇలా ప్రయాణం చేయవలసి రావడం వింతగా ఉన్నా వారు చూపిన ఆప్యాయత మాత్రం కొత్తదనాన్ని పారదోలింది. ఇలా వారు యాత్రికులు అందరికీ దర్శనం చేసే వరకు వెంట ఉండి సాయం చెస్తుంటారు.
ఆలయంలో ప్రవేశిస్తున్న భక్తులు |
కేదారీశ్వరాలయం ముందు |
కేదారీశ్వరుడు |
నివాస గృహాల మద్యలో కేదార్నాథ్ ఆలయం |
అక్కడ యాత్రికులకు మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉంది. అందరం మామా అవసరాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశంలో మంచు దిబ్బలు మరింత పెద్దవిగా ఉన్నాయి. అవి మట్టితో కలిసి కొంచెం ఎర్రగా ఉన్నాయి. అంత మంచును ఒక్కసారిగా చూడడం అదే మొదటిసారి. అదరం కలిసి నడుచుకుంటూ డోలీ నిలిపిన ప్రదేశానికి చేరుకుని తిరుగు ప్రయాణం సాగించాము. తిరిగి ఎవరికి వారుగా విడిపోయి తిరుగు ప్రయాణంలో అక్కడక్కడా హోటళ్ళలో ఫలహారాలు తిని కాఫీ, టీలు త్రాగాము. ఈ హోటలులో అధికంగా పూరీ చపాతీలతో నూడిల్స్ ఆహారంగా తింటున్నారు. తిరుగు ప్రయాణంలో డొలీ వారితో మాట్లాడుతూ ప్రయాణం సాగించాను. వారు వారి పిల్లల చదువుకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరని పనిపాటలకే అధికంగా ప్రధాన్యత ఇస్తారని తెలుసుకున్నాను. వారి స్త్రీలు వీరు వెళ్ళే వరకు కుటుంబ పోషణ చూసుకుంటారని చెపారు. . తిరుగు ప్రయాణంలో వాన కాని మంచుగాని లేదు. వాన, ఎండ, మంచు మారి మారి ఉండడం ఇక్కడ సహజంలా ఉంది. ఈ వాతావరణం కొంత అలవాటు కావడంతో తిరుగురయాణం అంతగా ఇబ్బంది కరంగా లేదు. ఇలా ప్రయాణాం చేస్తూ కిందకు చేరడానికి సాయంత్రం ఆరు గంటలు దాటింది.
కేదార్ ఆలయ పరిసరాలు |
కిందికి రాగానే నన్ను మారి వద్దకు చేర్చి నిర్వాహకుల వద్ద వారికి రావలసిన ధనం తీసుకుని వారు వెళ్ళారు. ఇంత వరకూ ఆత్మీయతగా మాతాజీ అని మెలిగిన వారు నిశ్శబ్ధంగా వెనుతిరిగారు. వారి వృత్తి ధర్మం వారిది. మా యాత్రా ధర్మం మాది. ఆ రాత్రి భోజన సమయంలో అందరూ వారి వారి అనుభవాలు చెప్పుకున్నారు. అందరూ డోలీ వారి సేవలను శ్లాఘించిన వారే. ఎవరూ వారికి అదనంగా పెట్టిన ఖర్చు కొరకు ఎవరూ బాధపడక పోవడం విచిత్రం. సాధారణంగా అదనపు ఖర్చుఅ విషయంలో ఇలా ఏకాభిప్రాయం కుదరదు.
గురాలమీద యాత్ర |
గురాల మీద స్త్రీయాత్రికులు |
కేదార్ కొండ ప్రాంతం |
మాయాత్రలో కేదార్ యాత్ర మకుటాయ మయమని చెప్పవచ్చు. కేదార్నాథుని దర్శనం అంతటి విచిత్రమైన అనుభూతిని ఇచ్చింది. ఎందరికో జీవిత కాలంలో లభించని ఆలయ దర్శనం ఈశ్వరుడు మాకు ప్రసాదించినందుకు మనసులోనే కృతఙత తెలిపుకున్నాను. మరునాడూ ఉదయం మేము యమునోత్రికి మా యాత్ర కొనసాగించాం.
కేదార్ యాత్రకు హెలికాఫ్టర్లు లభ్యం ఔతాయి. వాటిని ముందుగా కొన్ని మాసాల ముందు బుక్ చేయాలి . మాయాత్రలో ఆ ప్రణాళిక లేదు కనుక మా కవి లభ్యం కాలేదు. హెలికాఫ్టర్లలో వెళ్ళినా మూడు కిలోమీటర్ల దూరమైనా దోలి ప్రయాణం ఉంటుందని తెలిసింది. హెలికాఫ్టర్లు గౌరీ కుండ్ నుండి లభ్యం ఔతాయి. మార్గంలో హెలికాఫ్టర్లు పోవడం గమనించాము. అయినప్పటికీ ఈ మార్గంలో పోవడం ఈ అనుభవం మేము చక్కగా ఆశ్వాదించాము.
కేదార్ యాత్రలో హెలికాఫ్టర్లు |
కేదార్ యాత్రకు హెలికాఫ్టర్లు లభ్యం ఔతాయి. వాటిని ముందుగా కొన్ని మాసాల ముందు బుక్ చేయాలి . మాయాత్రలో ఆ ప్రణాళిక లేదు కనుక మా కవి లభ్యం కాలేదు. హెలికాఫ్టర్లలో వెళ్ళినా మూడు కిలోమీటర్ల దూరమైనా దోలి ప్రయాణం ఉంటుందని తెలిసింది. హెలికాఫ్టర్లు గౌరీ కుండ్ నుండి లభ్యం ఔతాయి. మార్గంలో హెలికాఫ్టర్లు పోవడం గమనించాము. అయినప్పటికీ ఈ మార్గంలో పోవడం ఈ అనుభవం మేము చక్కగా ఆశ్వాదించాము.