ఋషికేశ్ |
ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
గంగాతీరంలో ధ్యానంలో శివుడు |
తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు.
శివానందాశ్రమం |
మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని. కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే వినాయకుడు తొండం పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి. ఆశ్రమంలో మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు. గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.
కైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది. ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.
రామ్ ఝులా |
త్రయంబకేశ్వరాలయం
రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా చూసి తీరాలని
అనుకున్నాము.
అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి లక్ష్మణ ఝులా ఉండే ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత వంతెన నిర్మాణం 1939లో జరిగింది. తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే.
లక్ష్మణ ఝులా |