మథుర
మథురలో కృష్ణాలయం
|
శ్రీ కృష్ణ జన్మస్థానం |
|
మథుర ప్రవేశ ద్వారం |
హరిద్వార్ నుండి ఉదయానికి డిల్లీ చేరుకున్నాము. మా వస్తువులు కొన్ని డిల్లీ లోని హోటలులో ఉంచాము. మాసామానులు తిరిగి తీసుకుని మాకు కేటాయించిన గదులుకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాము. మరునాడు ఉదయం డిల్లీ నుండి అందరం ఒకే బసులో అందరం మధురకు బయలుదేరాము. మధురలో చేరుతూనే శ్రీకృష్ణ జన్మస్థానం చూసాము. చుట్టూ ముస్లిం భవనాల మద్యలో కొంత ప్రదేశంలో శ్రీ కృష్ణుడు జన్మించిన చెరసాల ప్రదేశం ఉంది.
మేము అందరం టిక్కెట్లు కొనుక్కుని భవనాల మధ్యలో ఉన్న దారిలో ప్రయాణించి లోతట్టుగా ఉన్న చెరశాలలోని శ్రీకృష్ణుని జన్మస్థానం దర్శించుకున్నాము. శ్రీకౄషుని జన్మస్థానం ఒక విశలమైన అరుగు. అందరం ఆ దివ్య ప్రదేశన్ని పరవశంతో తాకి చూసాము. భగవంతుడు అవతరించిన ఆ ప్రదేశం దర్శించడం ఎంతో దివ్యానుభూతిని కలిగించింది.
|
గోవింద పూజ |
|
కృష్ణ మందిరం లోపలి భాగం |
|
మథురలో రాధా కృష్ణ మందిరం |
తరువాత మేము మధురలోని వీధులలో అలా తిరుగుతూ అక్కడ ఉన్న శ్రీకృష్ణ ఆలయం చూడడనికి వెళ్ళాం. అక్కడ కోతుల సందడి అధికం. ప్రత్యేకంగా ఆ లయంలో కోతులు యాత్రీకుల కళ్ళ అద్దాలు తీసుకు వెడతాయని అన్నారు. కనుక ఆలయంలో ప్రవేశించడనికి ముందుగా మేము మామా కళ్ళ అద్దాలు జాగ్రత్త చేసుకున్నాము. కానీ మాలో ఒకరు అది గమనించక కళ్ళకు అద్దాలతో లోనికి ప్రవేశించింది. ఆవిడ నాకు పక్కగా నడుస్తూ ఉంది. ఆ లయంలోకి ప్రవేశించిన కొంచం సమయానికి ఒక పెద్ద కోతి ఆమె భుజం మీద ఒక చేయి వేసి రెండవ చేతితీ కళ్ళ అద్దాలు తీసుకున్నది. అయినప్పటికీ మేమడి గమనించే లోపల అది లాఘవంగా పై గోడలు ఎక్కి అందనంత ఎత్తుకు పోయింది. అందరూ కేకలు పెట్టి అరచిన తరువాత కోతి దానిని కిందకు వేసింది. అప్పటికే దానిని బాగా వంచి వేసింది. ఒక అద్దం పగిలి పోయింది కూడా. ఇక అది పనికిరాదు. తరువాత అందరూ ఆ విషయం గురించి చర్చిస్తూనే ఆలయం అంతా తిరిగి చూసాము. ఆలయం చాలా విశాలమైనది. రాతితో నిర్మించిన ఆ ఆలయం పురాతనత్వం అలాగే సంరక్షించబడుతుంది. ఆలయం పవిత్రంగానూ ఆకర్షణీయంగానూ ఉంది.
మధురలో లస్సి, పెరుగు, మజ్జిగలు ప్రసిద్ధం. శ్రీకృష్ణుని జన్మస్థలం కదా అక్కడ ఆవులకు వెన్న మీగడలకు ఏమి కొరత. అక్కడ లస్సి మట్టి గ్లాసులలో విక్రయిస్తున్నారు. అది అందరికి బాగా ఆసక్తిగా ఉంది. అందరం మజ్జిగ, లస్సీల వంటివి తాగాము. కొంత షాపింగ్ చేసాము. నేను కలే పండ్లు కొనగా దారిలో ఒక కోతి అడ్డగించింది. కలేకాయలను వానరానికి భయంతో సమర్పించాను.
అక్కడి నుండ్ నుండి మద్యాహ్న బసులో భోజనాలు చేసుకుని రేపల్లెకు చేరాము. రేపల్లే ఎగుడు దిగుడుగా మిట్టా పల్లాలుగా ఉంది. అంతా నివాసిత గృహలు ఉన్నాయి. ఇప్పటికీ అంతా ఎక్కడ చూసినా శ్రీకృష్ణ నామం మారుమోగుతూ అంతా కృష్ణ మయంగా ఉంది. అక్కడ ఉన్న వారందరూ శ్రీకృష్ణుడు తమ ఇంటి బిడ్డగానే భావిస్తున్నట్లు భావిస్తుంటారు. ఎక్కడ చూసినా కృష్ణనామమే. అడుగడుగునా ఆలయాలే. ఒక మాసకాలం మధురలో ఉన్నా ఆ ఆలయాలను పూర్తిగా చూడలేము అన్నారు. అక్కడ ఆకర్షణీయమైన ఆలయాలు ఉన్నాయి. నిర్వాహకులు మతో ప్రత్యేకంగా ఎవరికీ వారు ఎక్కడికీ వెళ్ళద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆలయాలు చూస్తుంటే కాలం గడిచేది తెలియదు.
|
రేపల్లెలో ఒక దృశ్యం |
రేపల్లెలో ఇళ్లు ఎగుదిగుడుగా ఉన్నాయి. నివాసగృహాలు ఇప్పటికీ సాధారణంగా పురాతన శైలిలో ఉన్నాయి. అదంతా చూస్తూ అక్కడ నడుస్తూ ఉంటే శ్రీ కృష్ణుడు బాల్యంలో గోపబాలకులతో ఈ ప్రదేశమంతా తిరిగాడుకదా అన్న అనుభూతి ఏర్పడింది. మేము అక్కడ ఉన్న మరికొన్ని ఆలయాలు చూసిన తరువాత నందగోపుని ఇల్లు చూడడానికి వెళ్ళాము. ముందుగా అక్కడ ఉన్న కొందరు మమ్ము ఒక ఇంటికి తీసుకువెళ్ళి ఇదే నందగోపుని ఇళ్ళు అనిచెప్పాడు. అక్కడ స్వామికి అడ్డంగా తేరా కట్టి ఉంది. స్వామిని చూడడాలంటే తేర తొలగిస్తామని అందుకు ముందుగా మేము రుసుము చెల్లించాలని నిబంధన విధించారు. నిర్వాహకులు తర్జనభర్జన పడి చివరకు అందరి తరఫున కొంత మూల్యం చెల్లించి దేవుని దర్శనం చేసుకున్నాము. మేము ఎవ్వరం వారితో స్వయంగా బేరసారాలు చేయడానికి నిర్వాహకులు అంగీకరించలేదు. అక్కడ అన్నింటికీ డబ్బుల్లు అడుగుతూ యాత్రికులను కొంత వేదనకు గురి చేస్తూ ఉంటారు కనుక కొంత జాగరూకత అవసరమే అనిపించింది. తరువాత అక్కడ ఉన్న ఉయ్యాలలో కృష్ణ భగవానుని ఉంచి ఆ ఉయ్యాల ఊపడానికి అదనంగా మరి కొంత మూల్యం చెల్లించాలని చెప్పారు. నిర్వాహకులు అందుకు ససేమిరా అన్నారు. అందరం వెలుపలికి వచ్చము. వెలుపలికి వచ్చిన తరువాత విచారిస్తే అది నందగోపుని అసలైన గృహం కాదని అది వేరే ప్రదేశంలో ఉందని చెప్పారు. మేము పరవాలేదనుకుని ఆ గృహం చూడడానికి బయలుదేరాం.
|
రేపల్లెలో గోవిందుడు |
ఈ సారి తీసుకు వెళ్ళింది నిజమైన ఇల్లు అనిపించింది. కొంచం మిట్ట అయిన ప్రాంతంలో ఆ ఇల్లు కొంచం
ప్రత్యేకతగా ఉంది. అధికంగా రాతితో నిర్మితమై ఉన్నది. గృహానికి ముందు విశాలమైన పెద్ద రాతి అరుగులు ఉన్నాయి. ఆ అరుగుల మద్యలో ఏర్పరిచిన దారి గృహం లోపలకు తీసుకు వెళుతుంది. లోపలకు పోగానే పూజారులు స్వామికి ఉన్న తెర తొలగించి పూజ నిర్వహించారు. తరువాత మేమంతా మాకు తోచిన దక్షిణ ఇచ్చాము. ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. శ్రీకృష్ణుని నివాసం మరియు బాల్య లీలలు చుపించిన గృహం చూడడం ఆత్మానుభూతిని కలిగించింది.
|
రెపల్లెలో గ్రుహాలు |
రేపల్లెలోని గృహాలు అన్నీ ఆలయలే అన్న అనుభూతిని కలిగించేవిగా ఉన్నాయి. అంతటా శ్రీకృష్ణుని పాదం స్పృ జించిన ప్రదేశమే కనుక అన్ని ఆలయాలే మరి. అక్కడ ఉన్న కొన్ని విశాలమైన గృహాలలో ఇప్పటికీ కొందరు గోపికలలా నివసిస్తున్నారు. నిత్యమూ గోవిందుని స్మరించడమూ పూజలు చేయడమూ భజనలు చేస్తూ కాలం గడపడమే వారి దైనిందిక కార్యక్రమం. వారు తెల్లని చీరలు ధరించి ఉన్నారు. నుదుటన పొడవైన ఎర్రని తిరునామం. వారికి మరేమి అలంకరణలు లేవు. మేము సమయం లేనందున ఆ గృహాలలోకి వెళ్ళలేదు. వెలుపలి నుండి మాత్రమే చూసాము.
|
బృందావనం స్నానఘట్టం
|
|
బృందావనంలో మొక్కలు |
|
బృందావనం |
అక్కడి నుండి మేము బసులో బృందావనికి వెళ్ళాము. అక్కడ యమునా తీరానికి వెళ్ళాము. అక్కడ ఉన్న పొన్న చెట్టును చూపి అది శ్రీకృష్ణుడు వస్త్రాపహరణ చేసిన చెట్టు అని చెప్పారు. యమునా నదిలో నీరు మాత్రం తక్కువగానే ప్రవహిస్తుంది. తరువాత మేము శ్రీకృశ్ణుడు గోపికలతో రాసలీల చేసిన బృందావనం ఉన్న చోటు చూసాము. అది శీ కృష్ణుడు రాసలీలగావించిన ప్రదేశం. అక్కడ ఉద్యానవనంలా కొంత కట్టడం ఉంది అక్కడ ఒక ద్వారం చేరిన తరువాత లోపల మొక్కలు ఉన్నాయి. అవి ఒక క్రమంలో లేవు. ప్రస్థుతం ప్రహరీ కూడా లేదు కొంత పాడు పడిన స్థితిలో ఉంది. సరిగా నిర్వహణ లేదు. అయినప్పటికీ అది రాసలీలగావించిన పవిత్ర ప్రదేశం కదా. రాత్రి వేళలో ఆ మొక్కలుగా గోపికలుగా మారుతారని ఇప్పటికీ అక్కడ గోపికలు శ్రీకృష్ణునితో రాసలీలగావిస్తుంటారని విశ్వసిస్తున్నారు. అప్పటికి సాయంకాలం అయింది కనుక అంతటితో మధుర యాత్ర ముగిసినట్లే. అయినప్పటికీ ఏము తిరిగి మధురవెళ్ళి అక్కడ శ్రీకృష్ణ జన్మ స్థానం పక్కన ప్రస్తుతం నిర్మించబడిన బృహత్తరమైన కృష్ణ మందిరం చూడడానికి వెళ్ళాము. అది చూసిన తరువాత మేము తాజ్ మహల్ చూడడానికి ఆ రాత్రి ఆగ్రా వెళ్ళాము. ఆ రాత్రికి మా బస అక్కడే.