అక్షరధాం
|
అక్షరధాం |
నిజానికి అక్షరధాం సందర్శన అపురూప మైన అనుభూతిని ఇచ్చింది. అక్షరధాం ఒక అధ్యాత్మిక అద్భుతం. లోపలకు వెళ్ళా లంటే చాలా నిబంధనలు ఉన్నాయి. లోపల కెమారాలు కాని విద్యుత్ పరిక్స్రాలు ఏవైనా కాని నిషిద్ధం. కనుక అన్నింటినీ గదులలో వదిలి వచ్చాము. అయినప్పటికీ మేము చివరి వరకు కెమేరాలు వదలం కదా. వాటిని బసులో నిర్వాహకులు బధ్రపరచి తిరిగి వచ్చిన తరువాత తీసుకున్నారు. కనుక మాకు వెనుతిరగవలసిన అగత్యం తప్పింది. మాలో కొందరు అది గమనించక కెమారాలతో దిగారు. వాటిని అనుమతించక పోవడంతో అక్షరధాం వద్దని మొత్తంగా తిరిగి వెళ్ళడం కొసమెరుపు. కొందరి కోపం అలా ఉంటుంది. కోపం చివరికి వారిని వారే శిక్షించుకునే వరకు పోవడమే విచిత్రం.
|
రాత్రివేళలో అక్షరధాం |
అక్షరధాం రుసుము చెల్లించి నిబంధనలు అన్ని చూసుకుని లోపలకు వెళ్ళాము. అక్షరధాం చాలా అందంగా ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం అని చెప్పక తప్పదు. అవకాశం ఉన్నవారు తప్పక చూడవలసిన ప్రదేశాం ఇది అని చెప్పక తప్పదు. లోపలకు వెళ్ళిన తరువాత దాదాపు రెండు గంటలకంటే అదనంగా క్యూలో నిలిచాము. అయినప్పటికీ లోపల సందర్శించిన ప్రదర్శనల కొరకు ఇంత సమయం శ్రమపడినా పరవాలేదని పించింది. ఎదురు చూపులు అయిన తరువాత క్యూ నుండి లోపలకు ప్రవేశించాము. లోపలకు పోయే వరకే మా పని తరువాత అనుకోకుండానే పరుగులు తీస్తూ ఒక ప్రదర్శన నుండి మరొక ప్రదర్శన చూస్తూ పోవడమే. ఒక ప్రదఋశాన పూర్తికాగానే మరొక ప్రదర్శన ద్వారం తెరుచుకుంటుంది. కూర్చుని చూడడానికి స్థానం సంపాదించడానికి అందరూ త్వరత్వరగా పరుగులు తీస్తుంటారు.
|
అక్షరధాం పైకప్పు |
లోపల స్వామినారాయణ చరిత్ర విధవిధాలుగా ప్రదర్శిస్తున్నారు. ఒక్కో ప్రదృసన ఒక్కో వైవిధ్యంతో కనిపిస్తుంది. ఒక్చోట భక్తులకు ఉపదేశం చేస్తున్న స్వామి నారాయణ అంతా సహజసిద్ధంగా ఏర్పాటు చేచిన శిల్పాలు కలిగిన దేశ్యం. విద్యుద్దీపాలు వెలుగును వేస్తూ తీస్తూ ప్రదశన ఆసక్తి కలిగేలా ఉంటుంది. ఒక ప్రదర్శనలో పర్యాటకులను ఆసక్తి కరమైన వాహనాలలో ప్రయాణం చేయిస్తూ లోపల అటూ ఇటూ ఉన్న రామాయణ కావ్యంలోని దృశ్యాలను శిల్పాలతో కడు రమ్యంగా చూడవచ్చు. లోపల మందమైన వెలుగులో ఆదృశ్యాలు మనోహరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అది ఒక మనోహరమైన ఆధ్యాత్మిక అనుభూతి. మరొక ప్రదర్శనలో స్వామినారయణా జీవిత చరిత్ర వర్ణించే దృశ్యాలు.
|
మోన్యుమెంటు వెలుపలి స్థంబాలు |
|
మోన్యుమెంటులో సుందర శిల్పాలు |
ఆ ప్రదర్శనలో భవనాంతర్గత (ఇండోర్) దృశ్యాలలో చివరిగా చలన చిత్రం. స్వామినారయణ జీవిత చిత్రం 70 ఎమ్.ఎమ్ తెరమీద ప్రదర్శించబడింది. తుల్యమైన చిత్రీకరణ. ఒక్కో దృశ్యం సహజ వాతావరణంలో సహజ శబ్ధాలతో ఆ చిత్రం రమ్యంగా ఉన్నది. స్వామి నారయణ జీవిత చరిత్ర అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో చలన చిత్రాలను చూసినా స్వామినారాయణ చిత్రం కలిగించిన దివ్యానుభూతి మాత్రం నాలో ఇంకా చెదిరి పోలేదు. ఆ దృశ్యీకరణ అంత సహజ సిద్ధంగా హృద్యంగా చిత్రీకరించబడింది.
|
అక్షరధాం వద్ద జనసందోహం |
ఆ ప్రదర్శన తరువాత వెలుపలికి వచ్చి స్వామినారాయణ ఆలయం చూసాము. లోపల బృహత్తరమైన స్వామినారాయణ స్వర్ణ విగ్రహం చాక్కఘ జీవకళ ఉట్టి పడ్తూ ఉంది. ఆలయం లోని రాతి శిల్పాలు బహుసౌందరంగా ఉన్నాయి. ఆ శిల్పకళాఅ నైపుణ్యం అద్భుతం. ఆలయం చాలా విశలమైనది. వెలుపలికి వచ్చిన తరువాత మేము వెలుపలి మ్యూజికల్ ఫౌంటెన్ చూడడానికి కూర్చున్నాము.
|
వ్యాఖ్యను జోడించు |
సాధారణంగా చిత్రాలలో చూపించే పెద్ద తామర పుష్పం వంటి నిర్మాణమే మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శించే ప్రదేశం. ఆ ప్రదేశం చూడడానికి ఆహ్లాదంగా ఉన్నది. మేము అక్కడ కూర్చుని ప్రదర్శన చూడడానికి సిద్ధం అయ్యాము. ప్రదర్శన ఆరంభం అయింది. మ్యూజికల్ ఫౌంటెన్ దృశ్యాలు అనేక సార్లు చూసినా ఆధ్యాత్మిక శ్లోకాలతో అందించిన ఆ ప్రదర్శన నిజంగా ఆత్మానుభూతి కలిగించింది. ఇలా అక్స్హరధాం యాత్ర మాలో ఆత్మానుభూతి మిగిల్చింది. ఆ అనుభూతులతో మేము వెనుతిరిగి బసకు చేరాము. ఇన్తటితో మా బద్రీ కెఎదార్నాథ్ యాత్ర శుభప్రదంగా ముగిసింది. మరునాడు మిగిలిన షాపింగ్ పూర్తి చేసుకుని సాను సర్ధుకుని రైలు ఎక్కడమే తరువాయి.