గయలో విష్ణాలయం |
విష్ణాలయ గోపురం |
ఫల్గుణీ నది |
వాంచ. ఎలాగో నా కోరిక తీరే
సమయం భగవంతుని కృప వలన
ఆసన్నమైంది. మొత్తం యాత్రా మార్గదర్శితో కలిసి 13 మందిమి బయలుదేరాము. మాకు మేమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. రైలు ప్రయాణంతో మొత్తం 13 రోజుకు. అంటే తిరిగి రెండవసారి ఢిల్లీ, ఆగ్రా, మథుర, గోకులం, బృందావనం చూసాము. రెండవసారి అయినప్పటికీ సరికొత్త ప్రదేశాల సందర్శన సరికొత్త అనుభవాలు కనుక అయా ఊర్లను నాతో తిరిగి సందర్శించబోతున్నారన్న మాట. ఎప్పటిలా చెన్నైలో రైలు ఎక్కి రెండు రోజులు ప్రయాణం చేసి రెండరోజు రాత్రికి గయ చేరుకున్నాము. గయ బుద్ధ గయ ఒక్కటే. గయలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పరమ ఉత్తమమని హిందూ ధర్మం భోదిస్తుంది. మూడు తరాలకు చెందిన పితరులు
తమ వంశములో ఎవరైనా గయాశ్రాద్ధం పెడతారని ఎదురుచూసిన తరువాత భగవంతుని ఆజ్ఞతో తిరిగి జన్మిస్తారని పురాణాలలో ప్రస్తావించబడింది. మేము అకాలానికి చెందిన వారం కనుక మాకా విశ్వాసం ఉంది కనుక మాయాత్రలో ప్రధానాంశం శ్రాద్ధ కర్మలు ఆచరించడమే.
ముందుగా మీకు గయాసుర వృత్తాంతం గురించి వివరింకాలి కదా ! గయాసురుని వృత్తాతంతం ఇదే. పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని
యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి
పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు
పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి
విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
విష్ణుపాదం |
పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి
గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు,
గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు,
“దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై
వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను
చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని
ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.
ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.
మర్గలో ఒక ఆలయం |
గయలో కోనేరు |
విశ్రమించడానికి గదులను ఏర్పాటు చేసారు. మామా గదులలో విశ్రాంతి తీసుకుని ఉదయం అక్కడే స్నానాదులు పూర్తి చేసుకున్నము. గయలో ఉన్న ఫల్గుణీ నదిలో తగినన్ని నీరు ఉండదు కనుక స్నానాదులు పురోహితుని
పురోహితుని ఇంతో గణేశపూజ |
పిలుపు కొరకు ఎదురుచూస్తూ కూర్చుని ఉన్న సమయంలో మాకు పురోహితుని పిలుపు వచ్చింది. అమదరం కిందకు దిగి పురోహితుడు ఉన్న చిన్నపాటి హాలులో ప్రవేశించాము. లోపల పురోహితుడు చిన్నపాటి దర్భారులా ఉంది. అయన ఒకవేదిక మీద ఆసీనుడయ్యాడు.
ఎదురుగా కూర్చోవడానికి చాపలాంటివి పరిచి ఉన్నాయి. ఒక వైపుగా గోడవారగా కొన్ని పరుపులు దిండ్లు వేసి
ఉన్నాయి. మేము పురోహితుని ముందు కూర్చోగానే అయన గయప్రాశస్థం గురించి అక్కడ శ్రాద్ధకర్మలను
ఆచరించడం వలన కలిగే ప్రయోజనం గురించి చెప్పి మాతో ఒక సహాయకుడిని జతచేసి ఆలయానికి పన్పాడు. ఆ హాలులో ఒక మూలగా ఉన్న పూజా మందిరంలో పురోహితుని సతీమణి వినాయకుని పూజ నిర్వహిస్తున్నారు. వినాయక చవితి తరువాత నిర్వహిస్తున్న పూజలవి. మేము వినాయకునికి నమస్కరించి సహాయకునితో
ఆలయానికి బయలుదేరాము. అక్కడి నుండి ఆటోలలో ఆలయప్రాంగణానికి చేరుకున్నాము
ఆలయం నుండి ఫల్గుని నదికి పోయేదారి |
పిండప్రదానం |
ఫల్గుని నదిలో మందిరం |
ఉన్న ఫల్గుణి నదికి తీసుకు వెళ్ళారు. ఫల్గుణీ నదిలో జలాలు తక్కువగా ఉంటాయి. సీతాదేవి శాపం కారణంగా ఆ నదిలో ఎప్పుడూ జలం తక్కువగా ఉంటుందని క్షేత్ర పురాణ కథనాలు వివరిస్తున్నాయి. అందరం ఆ నదీజలాల్లో
కాళ్ళుకడుగుకుని చెంబులతో నీరు తీసుకుని పురోహితుడి వద్దకు వచ్చాము. పురోహితుని సహాయకులు
పురుషులకు శ్రాద్ధకర్మలకు అవసరమైన సామాను అందిచాడు. తరువాత పురోహితుడు మగవారిని వరుసగా కూర్చోమని చెప్పాడు. మగవారు అందరూ పురోహితుడి సలహా మీద యవలపిండితో మూడు శ్రాద్ధకర్మలకు అవసరమైన పిండాలను చేసారు. ఆ తరువాత పురోహితుడు గయగురించి గయాసురుడి వృత్తాతం పూర్తిగా
వివరించాడు. అక్కడ శ్రాద్ధకర్మలు ఆచరిస్తే పితరులకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని వివరించాడు.
రెండవ మండపంలో పిండప్రదానం |
అక్షయ వటం |
విష్ణుపాదం వద్ద భక్తులు |
ఆలయప్రాంగణంలో ఉన్న చిన్నపాటి దుకాణంలో విష్ణుపాదాలు కొన్నాము. ఆ పాదాలకుఇంట్లో పూజలు నిర్వహించవచ్చు. అయినప్పటికీ ఆ విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి రాలేదు కనుక ఇంటి పురోహితుని సంప్రదించి చేయాలని అనుకున్నాము. తిరిగి అందరం పురోహితుని ఇంటికి చేరుకున్నాము. అందం ఆంద్రా భోజనం చేసాము. భోజనం ఇంటి భోజనంలా ఉంది. తరువాత పురోహితునికి దక్షిణలు ఇచ్చి. పురోహితుని సతీమణికి వస్త్రములు ఇచ్చి వారి ఆశీర్వాదాలు వారి అందుకున్నాము. అంతటితో మా గయ యాత్ర పూర్తి అయింది.