మఖనక్షత్రము గుణగణాలు
మఖ కేతుగ్రహ నక్షత్రం కనుక ఈ నక్షత్రజాతకులకు మంత్రోపాసన, వైరాగ్యం , భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికం. కేతువు ఆధిపత్యం, రాక్షస గణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికం. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బ్యాంల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాదాన్యత ఇస్తారు. తన పరిసరాలను పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికీ తలవంచని మనస్తతత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కాని నిద్ర లేమిని సహించరు. సహన గుణం తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి బాధపదతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం , గృహ యోగం, ఆర్ధిక యోగం, విదేశీయాన యోగం కలసి వస్తాయి. నక్షత్ర అధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవీక కార్య నిర్వహణ, రాజకీయ ఆధిపత్యం , వృ త్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకు వస్తాయి.
పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు
ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు
హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు
చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు
స్వాతి నక్షత్రం గుణగణాలు
దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.
విశాఖనక్షత్రము గుణగణాలు
విశాఖ గురుగ్రహ నక్షత్రం, రాక్షస గణం, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితం ప్రారంభం ఔతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలౌతుంది. వీరికి మొండితనం ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్ధం. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబధం ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టం ప్రయోజనం సమంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీపౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.
కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయం పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జివితంలో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరం జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది.
అనూరాధనక్షత్రము గుణగణాలు
అనూరాధా నక్షత్రం అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం . అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షతరంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మం , పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రే యస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మకద్రోహం ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం , దూరప్రాంత ఉద్యోగం , దూరప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది.
జ్యేష్టానక్షత్రము గుణగణాలు
జ్యేష్టా నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం , అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంను కలిగిఉస్తుంది. సంతానం నష్టం కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నెహం ఉండదు. సాంకేతిక రంగం లో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రం లో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి