థాకురు ద్వారక
ముందరి పోస్ట్ వ్రాసినప్పుడు అహమ్మదాబాదులో చూసినవి వ్రాసాను కదా. మరుసటి రోజు అహమ్మదాబాదు ఉదయమే బయలుదేరి అక్కడికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాకురుద్వారకకు యాత్రా నిర్వాహకులు ఏర్పాటు చేసిన బసులో వెళ్ళాము. ఉరి వెలుపల బస్సును ఆపి అక్కడ నుండి ఆటోలను ఏర్పాటు చేసుకుని ఉరిలోపలకు వెళ్ళాము. ఎందుకు అంటే పురాతనమైన ఉరు కనుక వీధులు బస్సులు వెళ్ళడానికి అనుకూలముగా ఉండవని ఇలా ఆటోలలో వెళ్ళాలి. బస్సు స్టాండు నుండి ఆటోలు సులువుగా లభ్యం ఔతాయి. ఆటోలో దాకురు కృ ష్ణుడి ఆలయం వెళ్ళాము. అక్కడ స్వామిని
రణచోడ్ రాయ్ జీ అంటారు. ఇక్కడ స్వామికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ బోధనా అనే ఒక భక్తుడు ప్రతి పున్నమికి ద్వారకకు కాలినడకన వెళ్లి దర్శించుకుని వచ్చేవాడు. అలా అతడికి వయసు మళ్ళింది. అతడు ద్వారకకు వెళ్ళ లేక శ్రమ పడే వాడు. అతడి శ్రమను చూసి కృష్ణుడు ఇక నువ్వు ద్వారకకు రావలసిన పని లేదు నేనే నీవద్దకు వస్తాను నన్ను నే వెంట తీసుకు పోవచ్చును అను అనుమతి ఇచ్చాడు. అతడు కృష్ణుడిని తీసుకురాగానే ద్వారకా వాసులు అతడిని ఎదుర్కొన్నారు. అప్పుడు కృష్ణుడు తనను నీటిలో దాచమని చెప్పాడు. బోధనా అలాగే చేసాడు. ద్వారకా వాసులు కృష్ణుడి వెదుకుతూ కొరకు కర్రలతో నీటిలో పొడిచారు. తరువాత కృష్ణుడిని నిటి నుండి వెలికి తీసినప్పుడు కర్రలతో పొడిచిన గుర్తులు కృష్ణుడి మిద కనిపించాయి. అప్పుడు ద్వారకావాసులు కృష్ణుడి ఎత్తు బంగారం ఇస్తే తాము తిరిగి వెళ్ళగలమని చెప్పారు. బోధనా అందుకు అంగీకరించాడు కాని అతడి వద్ద అతడి భార్య ధరించిన ముక్కు పుడక తప్ప వేరు బంగారం లేదు. అప్పుడు కృష్ణుడు ఆ ముక్కెరతో తనను తూచమని మని చెప్పాడు . బోధనా అలా చేయగానీ ఆశ్చర్యంగా కృష్ణుడు ఆ ముక్కెరతో సమానంగా తూగాడు. ఇదీ ఈ ఆలయ చరిత్ర.. ఇక్కడకు లక్షల మంది భక్తులు వస్తారు. పౌర్ణమి ఇక్కడ విశేషంగా చేస్తారు. ఇక్కడ స్వామికి పలు దర్శనాలు ఉంటాయి.
1 . మంగళ భోగ :- కృష్ణుడిని ఉదయము నిద్రలేపుతారు. ఉదయము స్వామి దర్సనం మంగళ కరం కనుక దీనిని మంగళ్ భోగ్ అంటారు.
2 . స్నాన్ :- స్వామికి స్నానం చేయిస్తారు.
3 . బాల్ భోగ్ :- స్వామికి ఉదయపు పాలు నివేదన చేస్తారు.
4 . శృంగార భోగ్ :- స్వామికి అలంకారం చేస్తారు. స్వామికి ఖర్జూరము , ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడి పప్పు వంటి బలవర్ధక ఆహారం నివేదన చేస్తారు. తిదివారాలను అనుసరించి అలంకరణలో మార్పులు ఉంటాయి.
5 గ్వాల్ భోగ్ :- స్వామికి అల్పాహారం, చిరుతిండి పెరుగు నివేదన చేస్తారు. అలాగే స్వామి చేతిలో వేణువును కాని పూల మాలను కాని ఉంచుతారు. స్వామిని అప్పుడు గోపబాలలతో గోవులను కాయడానికి పంపుతారన్న మాట. తరువాత దర్సనం మూడు గంటల సమయం ఆపివేస్తారు.
6 . రాజ్ భోగ్ :- స్వామి మూడు గంటల సమయం పచ్సిక బయళ్ళలో గోపబాలురతో గోవులతో ఆనందంగా గడిపి తిరిగి వచ్చిన సమయం అన్నమాట. అప్పుడు స్వామికి భాజాభాజంత్రిలతో మేళతాళాలతో స్వాగతం పలికి ఆనందంగా చక్కగా అలంకరిచి తామరపూవు, వేణువులను ఇచ్చి ఆహ్లాదకరమైన దుస్తులను అలంకరించి సెంటు చల్లి ఆనందగా హారుతులు నివేదన సమర్పిస్తారు.
7 . ఉత్తాపన్ :- ఇది సాయంకాల దర్సనం. ఈ సమయంలో స్వామిని స్వల్పకాల నిద్ర నుండి ప్రేమగా లేపి కెక్కగా అలంకరిచి నివేదనా హారతులు సమర్పిస్తారు.
8 . ష్యాన్ :- స్వామికి అల్పాహార నివేదన చేసి హారతులుచ్చి స్వామికి నెమలి ఈకలతో చేసిన విసనకర్రతో విసిరి ప్రేమతో నిద్రపుచ్చుతారు. ఇది రోజులో ఆఖరి దర్సనం .
రణ చోడ్ రాయ్ జీ దర్సనం గొప్పగా ఉంటుంది. ఆకోలాహలము చూడవలసినదే కాని వర్ణించేది కాదు. దర్బారు వంటి ఆలయం లోపల స్వామి, వేళ వేళలా విధవిధమైన అలంకరణలు, ఒక్కో అలకరణ 45 నిముషాల సమయం ఉంటుంది. భక్తులు ముందుగానే గుమికుడుతారు. క్యు అంటూ ఏమీ ఉండదు. తలుపు తెరేరవగానీ ఆనంద పరవశంతో భక్తులు రకరకాల నామాలతో స్వామిని స్మరిస్తూ దర్శిస్తారు. భక్తులు ఒకరిని ఒకరు విపరీతంగా తోసివేస్తారు. తోపిడి తోనే దర్శించి వెలుపలికి రావాలి. మన ప్రయత్నం లేకుండానే వెలుపలికి వస్తామన్నది నిజం అతిశయోక్తి కాదు. ఇక్కడ దొంగల భయం ఉంటుదని కూడా అంటారు. కనుక భక్తులు దర్సన సమయంలో తమ ఆభరణాలను జాగ్రత్త పరచుకోవాలి మరి. కొంత మంది ఒకరోజులో అన్ని దర్శనాలు చేసుకుంటారు. దర్సనాలకు ఇక్కడ అంత ముఖ్యత్వం ఉంది మరి. వీలు ఉంటె ఇక్కడ ఒక రోజు ఉండి అన్ని చూసుకో వచ్చు. మళ్లీ మళ్లీ రాలేము కదా. ఆలయంలో ఫోటోలకు అనుమతి లేదు కనుక చిత్రాలను తీయలేదు. మచ్చుకి ఒకటి మాత్రం తీయకలిగాను . వీక్షించండి .
|
రణ చోడ్ రాయ్ జీ ఆలయం |
స్వామిని దర్శించి తిరిగి వచ్చి నిర్వాహకులు ఏర్పాటు చేసిన భోజనం చేసి.విశ్రాంతి తీసుకుని సాయత్రం అల్పాహారం తిని తయారై బస్సులో గోమతి ద్వారకకు ప్రయాణం అయ్యాము. రాత్రి ప్రయాణంలో గోమతి ద్వారకు చేరుకున్నాము. గోమతి ద్వారకు చేరే సమయానికి తెల్ల వారింది.