21, ఏప్రిల్ 2012, శనివారం

గోమతీ ద్వారక

గోమతీ ద్వారక 
File:Dwarkadheesh temple.jpg

మరుసటి రోజు ఉదయానికి  గోమతీ ద్వారక  చేరుకున్నాము. ఇక్కడ గోమతి నది సముద్రంలో సంగమిస్తుంది. గోమతి ద్వారకలో కృష్ణుడు రాజ్యకార్యకలాపాలు నిర్వహించిన ప్రదేశం. ఇక్కడ కృష్ణుడి మనుమడైన వజ్రనాభుడు ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.  ౧౦వ దశాబ్దంలో ఐ ఆలయ పునర్న్ర్మానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్నాదికాలు చేసి  ఆలయ దర్సనానికి బయలుదేరం. గోకుల్ హోటల్ నుండి అటో లలో  ఆలయానికి వెళ్ళాం. ఆలయంలో కెమెరా సెల్ ఫోన్లను అనుమతించరు కనుక చాయాచిత్రాలు తీసే అవకాశం లేదుమరి.  లోపలకు వెళ్లి కృష్ణుడి చిత్రాన్ని కొనుక్కుని ఆలయ దర్శనం చేసుకోవడానికి  వెళ్ళాం.  ఆలయ ప్రదిక్షణ  చేసి స్వామి సన్నిధిలో క్యూలో నిలబడి  దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేయడానికి వత్తిడి లేదు కనుక సులువుగా దర్సనం అయింది. ఈ ఆలయానికి  గోపురం మీద జండా ఒక రోజుకు ఐదు సార్లు ఎగుర వేస్తారు. భక్తులు ఈ జండా ఎగురవేయడానికి అనుమతి తీసుకుని జండా సమర్పిస్తారు. సమర్పించే భక్తులను కూడా పై వరకు  తీసుకు వెళ్లి ఆక్కడ పూజ చేయించి ఆలయ కార్యకర్తలు జండా ఎగురవేస్తారు. ఈ జండాను భక్తులు  అత్యంత శ్రద్ధతో తాకి నమస్కరిస్తారు.  ఈ జండా ఎగురవేయడానికి కొన్ని సంవత్సరాల ముందే నమోదు చేసుకుంటారు కనుక ఈ అవకాశం లభించడం అపురూపంగా భావిస్తారు. ఇలా ద్వారకలో కృష్ణుడి జండా ఇప్పటికీ ఇలా నిరంతరంగా  ఎగురుతూనే ఉంది.  ఇలా దర్శనం  చేసుకుని వెలుపలికి వచ్చి అలా కూర్చున్నాము. అప్పుడు అక్కడ ఆలయం చూపడానికి గైడ్ వచ్చాడు. గైడ్ వెంట పోయి తిరిగి ఆలయనం అంతా తిరిగి వివరంగా చూసాము. ఇక్కడ కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడికి తనకుమారుడైన అనిరుద్ధిడితో ప్రత్యేక ఆలయం ఉంది. బలరాముడికి,  రేవతికి, దేవకీ, వసుదేవులకు, వాసుదేవుడికి, రుక్మిణి, సత్యభామ, జాంబవతికి, సుభాద్రలకు లకు విడి విడిగా సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయములో దర్శనం  అయిన తరువాత స్త్రీలు  గుంపులు గుంపులుగా కూర్చుని ఆలయ ఆవరణలో కూర్చుని కృష్ణుడి  చిత్రం ముందు పెట్టుకుని కృష్ణుడి గీతాలు పాడుకుని వెడుతూ ఉంటారు. ఇది చూడడానికి వినడానికి కూడా ఆసక్తిగా ఉంది.  

ఆలయం నుండి వెలుపలికి రాగానే పక్కనే గోమతి నది సాగరసంగమం చేసే ప్రదేశం చేరుకున్నాము. అక్కడ మరి కొన్ని ప్రదేశాలు చూసి తిరుగు ముఖం పట్టాము. సాయంత్రానికి తిరిగి సమీపంలో రుక్మిణి మాట ఆలయం , శివుడి గుడి  అలాగే అక్కడే ఉన్న చిన్న చిన్న ఆలయాలను చూసాము.  తిరిగి రాగానే మళ్లీ కృష్ణుడి దర్శనానికి వెళ్ళాము. ఇలా మరొక రోజు యాత్ర ముగిసింది.
గోమతి ద్వారకలో ఒక వీధి 
గోకుల్ హోటల్  ఇదే ఇక్కడే మేము బస చేసాము  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి