బెట్ ద్వారక
మేము రుక్మిణి మందిరం నుండి బెట్ ద్వారక బసులో చేరాము. సముద్రంలో కొంచెం దూరం ప్రయాణించి బెట్ ద్వారక చేరాలి. కనుక అక్కడ ఉన్న రేవు వద్ద పడవ వారితో మాట్లాడి బేరం కుదుర్చుకుని ఒక్కో పడవలో 13 మందిమి కుర్చుని బెట్ ద్వారకకు బయలుదేరాం. ముందుగా అక్కడ పక్షులకొరకు ఆహారం కొనమని నిర్వాహకులు సలహా ఇచ్చారు. అలాగే కొనుక్కుని పడవెక్కాం. ఈ పడవ ఎక్కడానికి బాగా శ్రమ పడ్డాం. ఒక పడవ దాటి మరొక పడవ చేరాం అందుకే అంత శ్రమ.
ఎలాగో పడవెక్కి వసతిగా అందరం కూర్చున్నాం. సముద్రపు నీటిని చుస్తే మనసుకు ఉత్సాహం కలిగింది.
జలాశయాలు మనసుకు ఆహ్లాదం ఇవ్వడం సహజం కదా.
|
వీరు మాకు బెట్ ద్వారక చూపించిన పురోహితుడు ఈయన వేషధారణ విచిత్రంగా ఉంది కదా |
|
ఇదే బెట్ ద్వారక రేవు |
|
బెట్ ద్వారా సముద్రతీరం ఇదే |
పంచ ద్వారకలలో బెట్ ద్వారక ఒకటి. శ్రీ కృష్ణుడు నివసించిన భవనం ఇక్కడే ఉంది. శ్రీకృష్ణుడు గోమతి ద్వారకలో రాజ్య కార్యాలు నిర్వహించి రాత్రి సమయానికి ఇక్కడకు చేరుకుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణ వసుదేవులకు బలరాముడికి ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. బెట్ ద్వారక అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది కదా ! బెట్ ద్వారక అని ఎందుకు అంటారంటే ఇక్కడ శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన సుధామునితో బేటి అయాడు కనుక ఈ ప్రదేశం బెట్ ద్వారక అని పిలువబడుతుంది. . సుధాముడే కుచేలుడు అతడు శ్రీకృష్ణుడిని చూసి అటుకులను కానుకగా సమర్పించి తన దారిద్యం తనకే తెలియకుండా పోగొట్టుకున్నాడు.
|
ప్రయాణీకులను బెట్ ద్వారకకు చేరవేసే పడవలు ఇవే
అలా పడవేక్కామో లేదో ఇలా పక్షులకు ఆహారం వెయ్యడం మొదలు పెట్టాం. పక్షుల గుంపులతో మేము సముద్ర జలాల్లో ముదుకు సాగాం. సముద్రపు పక్షులు అందంగా లాఘవంగా మేమిచ్చిన ఆహారం అందుకున్నాయి. ఆహారం తినే వరకు మమ్ము వెన్నంటి వచ్చాయి. తరువాత వేరొక పడవ వద్దకు చేరాయి.ఆ పక్షులను చూసి అందరూ ఉత్సాహ పడ్డారు. ఇలా అందరం ఆనందంగా సముద్రాన్ని తిలకిస్తూ ఆనందిస్తూ అవతలి ఒడ్డుకు చేరాం. అక్కడ పడవలను దిగి వంతెన మిద నుడి అవతలి తీరం చేరాం. ఇసారి సులువుగానే పడవ దిగాం. మేము తిరిగి వచ్చే వరకు ఆ పడవలు అక్కడే ఉంటాయి. మేము వచ్చి మా మా పడవలలోనే ఎక్కాలి.
శ్రీ కృష్ణుడి నివాస మందిరం చిన్న కొండ మిద కొంచెం ఎత్తులో ఉంది. మేము కొంత దూరం నడిచి మందిరం చేరుకున్నాము. అక్కడ గైడు వివరిస్తుండగా ఆలయం అంతా చూసి శ్రీకృష్ణుడిని దర్సనం ముగించాం. కృష్ణుడు నివసించిన మందిరం చూసామన్న తృప్తితో వెలుపలకు వచ్చాం. తిరిగి పడవలు ఎక్కి ప్రయాణించి రేవుకు చేరాం. మేము కొంత దూరం నడిచి బసు వద్దకు చేరి తిరిగి గోమతి ద్వారకకు ప్రయాణం అయ్యాము.
నాగే ఈశ్వరం
మేము అలా తిరిగి గోమతి ద్వారక చేరుకొని భోజనాలు చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకుని సాయం సమయానికి నాగేస్వరం జ్యోతిర్లింగ దర్శనానికి బయలు దేరాం. అలా ఆలయం చేరుకొని నాగేస్వరుడిని దర్సనం చేసుకున్నాము. నాగేస్వరాలయం ప్రసంతంగా ఉంది. ముందుగా ధ్యానంలో ఉన్న పెద్ద ఈశ్వర విగ్రహం ఆకర్షనీయంగా ఉంది. ఆలయ లోనికి వెళ్లి స్వామిని దర్సనం చేసుకున్నాం. ఇక్కడ ఈశ్వరుడు తన భక్తుడి కాపాడడానికి స్వయంగా ప్రక్ష్యమై తన భకత పరాధీనత చాటుకున్నాడు. స్వామిని దర్శించి తిరిగి గోమతి ద్వారక చేరుకున్నాం. నిర్వాహకులు ద్వారకనాధుడి ఆలయంలో పూజ చాలా బాగుందని అక్కడ స్వామికి వివిధ నైవేయాలు సమర్పించి అమోఘంగా పూజ చేస్తున్నారని వచ్చి చూడమని చెప్పి పంపారు. మాలో కొందరు తిరిగి దర్సనం చేసుకుని వచ్చి పూజ చాలా బాగుందని చెప్పారు.
మరునాడు మేము గోమతి ద్వారకను విడిచి సిద్ధిపూరు ప్రయాణం అయ్యాము.
.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి