18, అక్టోబర్ 2012, గురువారం

ధనుర్లగ్నం


 ధనుర్లగ్నం 

ధనుర్లగ్న జాతకులు మానవత కలిగి ఉంటారు. నిరాడంబరత, దయాగుఇణం కలిగి ఉంటారు. ఈశ్వరభక్తి కలిగిన భాగ్యవంతులుగా ఉంటారు. ధనుర్లగ్నానికి కుజుడు శుభగ్రహంగా ఉంటాడు.
* సూర్యుడు :- ధనుర్లగ్నానికి సూర్యుడు భాగ్యాధి పతిగా శుభ ఫలితాన్ని ఇస్తాడు.ధనుర్లగ్నంలో ఉన్న సూర్యుడు వ్యక్తికి అందం, ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం, ఆత్మబలం, జ్ఞానం ఇస్తాడు. ఆకర్షణీయమైన మాటలతో ఎదుటి వారిని ప్రభావితులను చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు రెండూ వీరికి అనుకూల ఫలితాన్ని ఇచ్చినా ఉద్యోగంలో అధిక సఫలత సాధిస్తారు. లేఖనం, పఠనం మూలంగా జనప్రియులౌతారు. చిత్రకళ, శిల్ప కళ అందు అభిరుచి కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో  బుధుడి స్థానమైన మిధునం మీద దృష్టి సారిస్తాడు కనుక ధనం, ప్రఖ్యాతి, మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.  భాగ్యాధి పతి సూర్యుడు లగ్నస్థుడవటం కారణంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి నుండి, సంతానం నుండి సుఖం లభిస్తుంది.
* చంద్రుడు :- ధనుర్లగ్నస్థ చంద్రుడు అష్టమాధిపతి అయినా అనూకల ఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న చంద్రుని వలన మనసు అస్థిరంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడి కారణంగా అరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు. ప్రాణాలు, జలక్షేత్రములు, ప్రకృతి దృశ్యముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అనుసంధానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
కళారంగం, లేఖనం పట్ల అభిరుచి కలిగి ఉంటారు. కళారంగంలో వీరికి సఫలత లభిస్తుంది. ధనుర్లగ్నస్థ  చంద్రుడి దృష్టి మిత్ర రాశి అయిన మిధునం మీద పడుతున్న కారణంగా జీవితభాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన సుఖం ఆలస్యంగా కలుగుతుంది.
* కుజుడు :- ధనుర్లగ్నానికి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉండి శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో కుజుడున్న కారణంగా చక్కగా పరిశ్రమించి ధనార్జన చేస్తాడు. ధునుస్సు రాశిలో ఉన్న కుజుడు చదువు కొనసాగించుటలో అవరోధాన్ని కలిగిస్తాడు. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ స్థానాల మీద దృష్టి సారించడం వలన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురౌతాయి. చిన్న చిన్న వివాదములు తలెత్తుతాయి.
* ధనుర్లగ్నానికి బుధుడు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. రెండు కేంద్రములకు ఆధిపత్యం వహించి బుధుడు ధనుర్లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. అయినా లగ్నస్థ బుధుడు వ్యక్తికి రోగములు లేని అందమైన శరీరాన్ని ఇస్తాడు. తల్లి తండ్రుల నుండి స్నేహ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం  నుండి లాభం, గౌరవం కలుగుతాయి. లగ్నం నుండి బుధుడు స్వస్థానమైన మిధున రాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక సహాయ సహకారాలు అందించే అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారలు కలుగుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్ధిక స్థితి బలంగా ఉంటుంది.
* గురువు :- ధనుర్లగ్నంలో లగ్నాధిపతిగా, చతుర్ధ స్థానాధిపతిగా గురువు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తాడు. పేరు, ప్రతిష్ట, సమాజంలో గౌరవం, బుద్ధి, జ్ఞానం కలిగి ఉంటారు. భూమి, భవనం, మరియు వాహన సౌఖ్యం పొందగలరు. లగ్నస్థ గురువు పంచమ రాశి మిత్ర రాశి అయిన మేషరాశి మీద, సప్తమ రాశి సమరాశి అయిన మిధునం మీద , నవమ భావం మిత్రరాశి అయిన సింహం మీద దృష్టి సారిస్తాడు కనుక సాహసము, దయాహృదయం కలిగి ఉంటాడు. జీవితభాగస్వామి నుండి సహాయ సహకారం ఉంటాయి. సంతానం నుండి సుఖం కలుగుతుంది. జీవితం ఐశ్వర్యం మరియు సుఖంతో కూడిన పరి పూర్ణ జీవితం అనుభవిస్తాడు. వ్యాపార ఉద్యోగాలు ఫలలతనిస్తాయి.  శత్రుభయం ఉన్నా వీరికి వారి నుండి ఆపద కలుగదు.
* శ్శుక్రుడు :- ధనుర్లగ్నానికి ఆరవ, పదకొండవ స్థానాధిపతి అయిన శుక్రుడు అకారక గ్రహంగా అశుభాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న శుక్రుడు అందమైన శరీరాన్ని ప్రసాదించినా శుక్రుడు రోగస్థానాధిపతి కనుక లగ్నంలో ఉండి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. ధనుర్లగ్నానికి ఏకాదశాధిపతి అయిన శుక్రుడు లాభమును  కూడా ప్రసాదిస్తాడు.
శుక్రుడి ప్రభావం వలన ప్రభుత్వోద్యోగావకాశాలు ఎక్కువ. సంగీతం, కళల అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు మిత్ర రాశియిన సప్తమ రాశి మీద సంపూర్ణ దృష్టిని ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయసకారాలు అందిస్తారు.  వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది.
* శని :- ధనుర్లగ్నానికి శని ద్వితీయ, తృతీయ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కనుక వ్యక్తి సన్నంగా ఉంటాడు. శని ప్రభావం వీరికి నేత్ర రోగం ఇస్తుంది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల సహకారం అధికంగా ఆశిస్తారు. ధనాన్ని భద్రపరిచే గుణం వీరికి అధికంగా ఉంటుది. షేర్లు, పందాలు, లాటరీలు వీరికి లాభిస్తాయి. లగ్నస్థ శని లగ్నం నుడీ తృతీయ రాశి అయిన కుంభం, సప్తమ రాశి మిత్ర రాశి అయిన మిదునం, దశమరాశి అయిన కన్య మీద శుభదృష్టిని ప్రసరిస్తాడు కనుక సోదరుల నుండి మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారాలు లభించవు.  వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురౌతాయి.
* రాహువు :- ధనుర్లగ్నస్థ రాహువు వలన పొడవైన ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. అన్ని పనులను చేపట్టు నైపుణ్యం కలిగి ఉంటారు. స్వహితము వీరి సిద్ధాంతం. రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన రాహువును చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభించడం కష్టం.
* ధనుర్లగ్నస్థ కేతువు కారణంగా వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగలవు. నడుము నొప్పి మొదలైన శరీర భాగాలు బాధింపుకు గురి ఔతాయి. ఆత్మ విశ్వాసం లేని కారణంగా మహత్వపూరిత నిర్ణయాలు సాధ్యం కాదు.

16, అక్టోబర్ 2012, మంగళవారం

వృశ్చిక లగ్నం


 వృశ్చిక లగ్నం 

జ్యోతిష పరంగా లగ్నాన్ని  శిశువు జన్మించిన కాలాన్ని అనుసరించి గణించబడుతుంది. లగ్నం అంటే జాతక చక్రంలో మొదటి స్థానం. లగ్నం అంటే జాతకుని శిరోస్థానాన్ని సూచిస్తుంది. గుణగణాలు రూపు రేఖలు లగ్నం అందు ఉన్న గ్రహాలను అనుసరించి పండితులు నిర్ణయిస్తారు. దశమ స్థానం మరియు కేంద్ర స్థానానమైన దశమాధిపతి సూర్యుడు, ధనస్థానమైన రెండవ మరియు పుత్ర స్థానం త్రికోణ స్థానం అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు మరియు త్రికోణ స్థానాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. సప్తమ స్థానాధిపతి మరియు వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు.శిశువు వృశ్చిక లగ్నంలో జన్మించినపుడు లగ్నంలో ఉపస్థితమైన గ్రహాలను అనుసరించి పండితులచేత చెప్పబడిన కొన్ని ఫలితాలను క్రింది జాబితాలో పరిశీలించ వచ్చు.
*  వృశ్చిక లగ్నంలో దశమాధిపతి కారకాధిపతి అయిన సూర్యుడు ఉన్న వ్యక్తి ఆత్మ బల సంపన్నుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మహత్వకాంక్ష కలిగిస్తుంది. దశమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగావకాశాలను కలిగిస్తాడు. తండ్రితో చక్కని ఆత్మీయమైన సంబంధాలు ఉంటాయి. కర్మాధిపతి సూర్యుని దృష్టి కారణంగా  వృశ్చిక లగ్నానికి సప్తమ భావం  అయిన వృషభ రాశి ప్రభావితమవడం వలన శృంగార, సౌందర్య రంగాలకు చెందిన వ్యాపారం వీరికి లాభిస్తుంది. అయినా జీవిత భాగస్వామితో కొంత అశాంతి ఉంటుంది కాని తల్లితో సత్సంబంధాలు ఉంటాయి.
* వృశ్చిక లగ్నంలో చంద్రుడు భాగ్యాధి పతి మరియు త్రికోణాధిపతి కనుక శుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు లగ్నంలోమిత్ర స్థానంలో ఉండి కొంత బలం కలిగి ఉంటాడు. ఇలాంటి స్థితి ఉన్న వ్యక్తి సౌందర్యవంతుడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడుగా ఉంటాడు. ఇతరులను ప్రభావితం చేయగలిగి ధార్మిక చింతన కలిగి ఉంటాడు. తీర్ధాటన అందు ఆసక్తి కలిగి ఉంటారు. దయ, కరుణ గుణములు కలిగి ఉంటారు. భాగ్యస్థానాధిపతి బలం కారణంగా వీరు కార్య సిద్ధి, గౌరవ మర్యాదలు లభించగలవు. సప్తమ భావం మీద చంద్రుని దృష్టి కారణంగా సౌందర్యమూ, సుగుణము కలిగి అనుకూలమైన జీవిత భాగస్వామి లభించ గలదు. ఆరోగ్య పరంగా నడుము నొప్పి, పిత్త సంబంధిత వ్యాధులు రావచ్చు.
* వృశ్చిక లగ్నంలో కుజుడు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతిగా శుభుడు కాని షష్టమ స్థానాధి పతి కనుక కొంత బలహీనుడు. అయినా శుభ ఫలితాలే అధికం. లగ్నంలో రాజ్యంలో ఉన్న గ్రహం దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. వీరికి శరీర మరియు మానసిక బలములు అధికం, తల్లి నుండి వీరికి సంపద లభిస్తుంది, లగ్నస్థ కుజుడు చతుర్ధ, అష్టమ, మరియు సప్తమ భాలను చూస్తాడు కనుక భూమి, భవనములు, వాహన సౌఖ్యము బలహీన పడుతుంది. తల్లితో అభిప్రాయ బేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి కష్టాలు  వైవాహిక జీవితంలో కష్టములు కలుగుతాయి.
*  వృశ్చిక లగ్నంలో గురువు శుభఫలితాలను ఇస్తాడు. రెండవ మరియు పుత్ర స్థానాలకు అధిపతి కనుక లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మ విశ్వాసం, సౌందర్యము ఇస్తాడు. ఉన్నత విద్యలను అభ్యసించుట, వాక్ప్రభావం, బుద్ధి కుశలత కలిగి ఉంటారు. పొదుపు చేసే గుణం కారణంగా సుఖమయ జీవితాన్ని పొందుతారు. గురువు యొక్క పంచమ, సప్తమ మరియు నవమ దృష్టి కారణంగా పుత్ర సంతానం కలిగి ధన సంపద కలిగి అనికూల జీవిత భాగస్వామిని పొంది యోగకారకమైన జీవితాన్ని అనుభవించగలడు.
* వృశ్చిక లగ్నంలో శుక్రుడు సప్తమ మరియు వ్యయాధిపతి అయిన కారణంగా లగ్నంలో ఉన్న ఎడల అశుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ఈ లగ్నానికి అకారక గ్రహం.
మానసిక అశాంతి, విలాస వంతుడు, కామప్రదుడు ఔతాడు. లగ్నం నుండి శుక్రుడు స్వరాశి అయిన వృషభమును చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో అభిప్రాయబేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆనారోగ్యం కలిగి జీవిత బాగస్వామి నుండి హాని కలిగే అవకాశం ఉంది.  వ్యవసాయము, శృంగార సంబంధిత వ్యాపారం, సుగంధ వ్యాపారం వీరికి లాభాన్ని ఇస్తుంది.
* వృశ్చిక లగ్నానికి శని తృతీయ మరియు చతుర్ధాతి పతిగా అకారక గ్రహం. శని లగ్నంలో ఉన్న అరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రభుత్వరంగం నుండి కష్టములు కలుగ గలవు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శని తృతీయ, దశమ, సప్తమ భావాలను పూర్ణ దృష్టితో చూస్తాడు కనుక స్త్రీలకు అన్నదమ్ముల నుండి, పురుషులకు అక్క చెల్లెళ్ళ నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి.  స్త్రీలకు సంతానానికి కష్టములు కలిగిస్తాడు.
* వృశ్చిక లగ్నంలో రాహువు శారీరక సమస్యలకు ఆరోగ్యహానికి కారకుడౌతాడు. రాహుదశలో ఆరోగ్య హాని కలిగిస్తాడు. ఆత్మవిశ్వాసం కొరవడును. రాహువుకు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుకవ్యాపార ఉద్యోగాలలో ఓడిదుడుకులు, జీవిత బాగస్వామితో అభిప్రాయ బేదాలు అకస్మాత్తుగా హాని కలుగ గలదు. వైవాహిక జీవితంలో కష్టాలు ప్రాప్తించ గలవు. సమాజం నుండి ప్రశంశలు పొంద గలడు.
* వృశ్చిక లగ్నంలో కేతువు శారీక బలం, మానసిక శక్తి, దృఢమైన శరీరం  కలిగి ఉంటాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. తల్లి అభిమానానికి పాత్రుడౌతాడు. తల్లి నుండి సహాయం ఆనుకూల్యం లభిస్తుంది. జీవిత బాగస్వామికి, సంతానముకు  కష్టములు కలుగ గలవు.


14, అక్టోబర్ 2012, ఆదివారం

తులా లగ్నం


 తులా లగ్నం 

తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక గ్రహంగా అశుభఫలితాన్ని ఇస్తాడు.
* సూర్యుడు :- శత్రురాశి అయిన తులా లగ్నంలో ఉన్న కారణంగా నేత్రవ్యాధికి కారకుడు ఔతాడు. సూర్యుడి లాభాధిపత్యం కారణంగా ఆర్ధిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉంటాయి. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ సంబంధం కాని , దృష్టి  కాని ఉన్న ఎడల వ్యక్తి ఊగ్ర స్వభావమును కలిగి ఉంటాడు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో తన ఉచ్ఛ స్థానమైన మేషం మీద దృష్టి సారిస్తున్న కారణంగా వ్యక్తి సాహసం పరాక్రమం కలిగి ఉంటాడు. వివాహంలో ఆటంకాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అనుకూలం లోపిస్తుంది.
* చంద్రుడు :- తులాలగ్నానికి చంద్రుడు దశమస్థానాధిపతి ఔతాడు. బాల్యం సంఘర్షణతో కూడినదిగా ఉంటుంది. యవ్వనం, వృద్ధాప్యం సుఖమయంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడు వీరిని సద్గుణ సంపన్నుడిగానూ, విద్వాంసుడిగానూ చేయును. కల్పనా శక్తితో కూడిన అస్థిర మనస్థత్వం కల వారుగా ఉంటారు. లగ్నస్థ చంద్రుని కారణంగా తల్లితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. తులాలగ్నానికి చంద్రూడు దశమాధిపతిగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు.  సప్తమ స్థానం మీద చంద్రుని పూర్ణ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఉద్రేక పూరిత స్వభావం  కలిగి, సాహసి అయి , మహత్వకాక్ష కలిగి ఉంటారు. లగ్నస్థ చంద్రుడు శుభ గ్రహ సంబంధం దృష్టి ఉన్న ఎడల ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు.
* కుజుడు :- తులాలగ్నానికి కుజుడు ద్వితీయ, సప్తమ స్థాలకు ఆధిపత్యం వహిస్తాడు. ధన స్థానమైన ద్వితీయాధిపత్యంలో ఉన్న కుజుడు లగ్నస్థుడైనందున ఆర్ధిక లాభమును కలిగిస్తాడు. వ్యాపార, వర్తకాలలో సాఫల్యత కలిగిస్తాడు. స్వతంత్రముగా పని చేయుట వలన వీరికి లాభము ప్రాప్తిస్తుంది. వీరికి భాగస్వామ్యము అధిక నష్టాలను కలిగిస్తుంది.
లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావాలను చూస్తున్నాడు కనుక సుఖ భావం మీద కుజుని దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయసహకారములు లభించవు.
వైవాహిక జీవితంలో కష్టములు ఉంటాయి. కుజుడి దశలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
* బుధుడు :- తులాలగ్నానికి బుధుడు నవమాధిపతి, ద్వాదశాధిపతిగా  ఔతాడు కనుక బుధుడు తులాలగ్నానికి శుభుడు ఔతాడు. కనుక వ్యక్తికి ధార్మికత, బుద్ధి కుశలత
కలిగిస్తాడు. ఉత్తమమైన వ్యక్తుల మీద గౌరవం కలిగి ఉంటాడు.  ప్రభుత్వ,  ప్రభుత్వ రంగం నుండి వీరికి సన్మానం సహకారం లభిస్తుంది. జన్మ స్థలానికి  దూరంగా సుఖజీవితాన్ని సాగిస్తారు. వీరికి తల్లి తండ్రుల నుండి  ప్రేమ సహకారం లభిస్తుంది. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సామాన్య సుఖం ఉంటుంది. సంతానం, జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పాపగ్రహ పీడితుడైనందువలన  ధనలాభం , కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది.
* గురువు :- తులాలగ్నానికి తృతీయ, ష్టమస్థానాధిపతిగా గురువు అకారక గ్రహమై అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ గురువు కారణంగా విద్వాంసుడు, సాహసిగా ఉంటాడు. బుద్ధికుశలత వలన ధనం, గౌరవం పొందగలరు. లగ్నంలో ఉన్న గురువు క్షమాగుణం, సంతాన ప్రాప్తి, ఉన్నత విద్యను ప్రసాదిస్తాడు. గురువు లగ్నం నుండి అయిదవ, ఏడవ, తొమ్మిదవ భావముల మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి, తల్లి, తండ్రి నుండి ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది.
* తులాలగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. కనుక శుక్రుడు తులాలగ్నానికి కారక గ్రహం ఔతాడు. లగ్నస్థ శుక్రుడు స్వస్థానంలో ఉండి శుభుడుగా ఉన్నందున చురుకుదనం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ శుకృడు శుభుడు అయినందున రోగ రహిత ఆరోగ్యం కలిగి ఉంటాడు. సంగీతం, సౌంద్యర్య  సాధన మీద , కళలయందు ఆసక్తి కలిగి ఉంటారు. లగ్నస్థ శుక్రుడు సప్తమ భావం మీద పూర్ణ దృష్టిని సారిస్తాడు కనుక  ప్రేమ వ్యహారాలు అధికంగా ఉంటాయి.  ఈకారణంగా కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. విలాసాలకు , భోగాలకు అధికంగా ఖర్చు చేస్తారు.
* శని :- తులాలగ్నానికి శని చతుర్ధ, పంచమ స్థానాలకు కారకత్వం వహిస్తూ ప్రముఖ కారక గ్రహం ఔతాడు.  తులా లగ్నంలో ఉన్న శని కారణంగా తల్లి తండ్రుల నుండి స్నేహపూరిత సహకారం అందుకుంటారు. విద్యావంతులు ఔతారు. వృత్తి విద్యలలో విశేష సాఫల్యం సాధిస్తారు. శని దృష్టి తృతీయ, సప్తమ, దశమ స్థానాల మీద ప్రసరిస్తుంది. కరుణ స్వభావం కలిగి ఉంటారు. భూమి, వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. బంధు మిత్రులతో వివాదములు అభిప్రాయ బేధాలు ఉంటాయి.
* రాహువు :- తు లాల గ్నంలో ఉన్న రాహువు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. రాహువు అంత్ముర్ఖముఖ స్వభావాన్ని ఇస్తాడు కనుక వీరు తమ  కార్యాలను రహస్యంగా ఉంచుతారు. లగ్నస్థ రాహువు వలన చదువులో ఆటంకాలు ఉంటాయి. రాహువు భాగ్యహీనం కలిగిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం అందదు.
* కేతువు :- తులా లగ్నంలో కేతువు వ్యక్తికి సాహసం, పరిశ్రమించే గుణం ఇస్తాడు. పరిశ్రమ, సాహసం కారణంగా కఠిన కార్యాలను కూడా సాధిస్తాడు. శిక్షణలో ఆటంకములు ఉంటాయి. కేతువు ధార్మిక భావనలు కలిగిస్తాడు. పరుల సొమ్ము మీద ఆసక్తి ఉంటుంది. మనసులో అనవసర భయములు ఉంటాయి. జూదం, పందెములలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు.



గంగోత్రి










గంగోత్రి 

File:Gangotri - Debabrata Ghosh, Birati.jpg
గంగోత్రి 

మేము బదరినాథ్  నుండి గంగోత్రి చూడడానికి ప్రయాణం అయ్యాము. అలా బయలుదేరి ప్రయాణం చేసి ఆ రాత్రికి  ఉత్తరకాశి చేరుకున్నాము. మార్గ మద్యంలో మాకు బసులను ఆపి కాఫీ బిస్కెట్లు అందించారు. తిరిగి బసు ఎక్కినా తరువాత బసులలో ఒకటి కదల లేదు. అంతే అందరం బసు దిగి బాసుకు రిపేరు చేయడానికి వదిలాము. మేము దిగిన ప్రదేశం ఒక టి దుకాణం కనుక మేము కూర్చోవడానికి బాగా స్థలం చిక్కింది. లేదంటే మేము చాలా అవస్థ పడేవాళ్ళం. అక్కడ ఆడవాళ్ళం అందరం బాగా బాతాఖాని వేసుకున్నాం. అప్పటికే ఒకరికి ఒకరం బాగా పరిచయం అయ్యాము. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక కుటుంబంలా అయ్యాము. ఎక్కడెక్కడి వరిమో ఇలా హిమాలయాలలో ఇలా ఒకటిగా కుర్చుని ఇలా ముచ్చట్లు చెప్పుకోవడం ఏమిటి ఎలా సంభవం? అంటు వేదాంత దోరిణిలో కూడా మా సంభాషణలు సాగాయి. ఇలాగే రాత్రి అయింది. మాలో కొంత అందోళన చెలరేగింది. ఇక నిర్వాహకులు హోటలు వారితో మాట్లాడి మాకు వారి వంట శాల లోనే వేడి వేడిగా పూరీలు  చేయించారు. అవి తాయారు చెయ్యడానికి వారికి  మాబృందం  వంట వారు సహాయకులు సహకరించడం కొస మెరుపు. అలా  రాత్రి ఫలహారం పూర్తీ కాగానే బసు ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక అక్కడ నుండి బయలు దేరి ఉత్తరాకసిలోని మా బసకు చేరుకున్నాము.

File:Gangotri.JPG
గంగోత్రికి వెళ్ళే కొండ మార్గం 
గంగోత్రి చడబోతున్నాము అన్న  ఊహ మనసుకు అత్యంత ఆనందాన్ని కలిగించింది. గంగానది పుట్టిన చోటు చూడాలంటే మాటలా మరి. ఉత్తరకాశిలో  ఉదయం కాలకృత్యాలు  తిర్చుకుని అందరం కాఫీ  ఫలహారాలు చేసి  బస నుండి  మా బస్సులలో బయలు దేరాము.  మేము ఋషికేస్ నుండి రెండు మినీ బసులలో ప్రయాణం చేస్తున్నాము. ఘాట్  రోడ్డులో మినీ బస్సులు మాత్రమె వెళ్ళగలవు. అలా వెళ్లి సాయత్రం మూడు గంటల సమయానికి గంగోత్రి చేరుకున్నాము. అయినప్పటికీ ఎప్పటిలా మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే మా బస్సులను  నిలపవలసి వచ్చింది. ఈ  ఘాట్ రోడ్డులో ఎక్కడా  బస్సులన్నీ నిలపడానికి కావలసిన ప్రదేశం లభించదు కనుక బసులను ఒక దాని వెంట ఒకటిగా నిలుప వలసి ఉంటుంది . అలా నిలబెట్టిన బసుల క్యూ మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుండి కాలి నడకన వెళ్ళడం మినహా వేరు మార్గం  లేదు.  ఇక మేము మా కాలికి పని చెప్పాము. అందరం చిన్న చిన్న బృందాలుగా నడుస్తూ గంగోత్రికి చేరుకున్నాము. అలాంటి సుదూర ప్రాంతాలలో కూడా మాకు గంగోత్రి వద్ద  పూజ ద్రవ్యాలు లభించాయి. అందరం పూజ ద్రవ్యాలు కొనుక్కుని మెట్లు దిగి నది వద్దకు చేరుకున్నాము.

గోముఖం 
File:Trek to Gaumukh.jpg
గోముఖం కొండ మార్గం 
File:Gomukh, The source of the river Ganga.JPG
గంగానదీ మూలం గోముఖం 
నిజానికి గంగానది పుట్టిన ప్రదేశం ఇంకా  18 కిలోమీటర్ల ఎగువన ఉటుంది. అక్కడ గోముఖ ఆకృతిలో ఉన్న హిమపర్వతామే గంగా నది అసలు పుట్టిన ప్రదేశము. కానీ అక్కడ నది హిమరుపంలో ఉంటుంది కనుక అక్కడ పూజాదికాలు చేయడం కుదరదు. అక్కడకు పోవడం కూడా సామాన్యులకు వీలు పడదు. ఈ గోముఖం అనే హిమ పర్వతం వెడల్పు 2-4 కిలోమీటర్లు. పొడవు 30 కిలూమిటర్లు. అక్కడకు కొందరు పర్వతారోహకులు,  హిందు సన్యాసులు శ్రమకు  ఓర్చి చేరుకుంటారని అక్కడి వారు చెప్పారు. గోముఖం నుండి మంచు  కరిగి నదిలా ప్రవహిస్తుంది. అక్కడి నుండి గంగా  నది రాళ్ళలో మట్టిలో ప్రవహిస్తూ గంగోత్రికి చేరుకునే సమయానికి కొంచెం గోధుమ రంగులో మట్టి కరిగిన జలాలతో  ప్రవహిస్తూ ఉటుంది. నది ఆకప్పటికే వేగంగా ప్రవహిస్తూ  ఉంటుంది.  ఈ నీటిలో ప్రవాహంతో కొట్టుకు వచ్చేరాళ్ళు పదునుగా ఉంటాయి. అక్కడ నది అంత లోతుగా ఉండదు. నీరు చాల చల్లగా ఉంటాయి. కనుక స్నానం చెయ్యడానికి అంతగా వీలు  కాదు.



File:Gomukha gangotri.jpg
గంగిత్రి వద్ద ప్రకృతి సౌందర్యం 

File:Bhagirathi River at Gangotri.JPG
గంగోత్రి వద్ద గంగానది 
.అందువలన అందరం అ నీటిలో కాళ్ళు మాత్రం కడుగుకున్నాము. అయినప్పటకి అక్కడ ఉత్తర భారత దేశానికీ చెందిన ఒక వయసైన  స్త్రీ   నదిలో  ఉన్న రాయి మిద కుర్చుని స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూసి మేము చాలా ఆశ్చర్య పోయాము. మేమెవ్వరము చేయ లేని పని ఆమె చేస్తున్నది కదా మరి. ఇంతలో మాలో ఒకామె నదిలో కాలు పెట్టగానే లోపల ఉన్న రాయి గుచ్చుకుని  కాలు బాగా కోసుకు పోయింది.  అక్కడి రాళ్ళూ అంత పదునుగా  ఉంటాయన్న మాట. ఆమెకు కాలు నుండి కొంత సమయము రక్తం కారుతూ  ఉండి  పోయింది. ఆమె భర్త జాగ్రత్త లేకుండా దిగినందుకు ఆమెకు చివాట్లు పెట్టడం కొస మెరుపు. ఆమెకు  కావలసిన ప్రధమ చికిత్స చేసిన తరువాత మేము మిగిలిన పూజ కార్యక్రమాలు చెయ్యడం మొదలు పెట్టాం.  అందరం సంకల్పం చెప్పించుకున్నాం. గంగోత్రి దగ్గర సంకల్పం చెప్పించుకున్నందుకు ఆనందపది పోయాము. అక్కడ దోప్పలలో పూవులను పెట్టి దానిలో నెయ్యి దీపం పెట్టి అమ్ముతుంటారు. స్త్రీలు  వాటిని తీసుకుని దీపం వెలిగించి నీటిలో వదలాలి. మేము అలా దీపాలు కొని వెలిగించి నీటిలో వదిలాము. ప్రవాహము లోటు లేని కారణంగా దీపాలు అంతగా దూరం పోలేదు. కొన్ని దీపాలు రాళ్ళకు తగిలి ఆగిపోయాయి.  అలా కొంతసేపు వాటిని చూసి ఇక గంగాదేవి ఆలయం చూడడానికి వెళ్ళాము.




దస్త్రం:గంగోత్రిలో భాగీరధుడు.JPG
భగీరధుడు 

File:Gangothri.jpg
గంగాదేవి ఆలయం 
గంగాదేవి ఆలయం లోపలకు వెళ్లి అక్కడ  అమ్మవారికి కానుకలు సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ అంతగా భక్తుల రద్దీ లేదు. పాలరాతితో చేసిన అమ్మవారి విగ్రహం కూర్చున్నట్లు ఉంది. తరువాత పక్కనే ఉన్న భాగిరదుడి ఆలయం చూసాం. అది చాల చిన్నదిగా ఉంది. లోపల పూజారి భాగిరదుడికి పూజలు చేస్తున్నాడు. గంగా నదిని స్వర్గ లోకం నుండి కిందికి తీసుకు వచ్చి అక్కడి నుండి పాతాళానికి తీసుకుని వెళ్ళి తన పితరులకు తర్పణం  విడిచి వారిని పైలోకాలకు పంపి తరింపజేసిన మహానుభావుడు కదా భగీరధుడు. పట్టువదలని ప్రయత్నానికి నిదర్సనమైన భాగిరదుడికి నమస్కరించాము. అంతటితో మా గంగోత్రి యాత్ర పూర్తీ అయింది. మేము తిరుగు ప్రయాణంలో తిరిగి ఉత్తర కాశిలో మా బసకు చేరుకున్నాము.

కన్యా లగ్నం


 కన్యా లగ్నం 

* సూరుడు :- కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి ఔతాడు. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యాలగ్నానికి అకరక గ్రహం ఔతాడు. కన్యాలగ్నస్థ సూర్యుడి కారణంగా వ్యక్తి  ప్రభావశాలిగా ఉంటాడు. అందమైన, లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ప్రాప్తించే అవకాశం ఉంది. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. వ్యవసాయం వీరికి అనుకూలిస్తుంది. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం మంచిది.
* చంద్రుడు :- కన్యాలగ్నానికి  చంద్రుడు ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. లగ్నం  నుండి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం చేత జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది. వీరికి అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశం ఉంది. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితము తక్కువగా ఉండును.
*  కుజుడు :- కన్యాగగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి ఔతాడు. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా
వీరికి  క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటారు. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లి తండ్రులతో అభిప్రాయబేధాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టములు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచనకు గురి కావచ్చు.
* బుధుడు :- బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్గాయుషు ఇస్తాడు. వీరి ఆత్మ బలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగతి సాధిస్తారు. వీరికి సమాజంలో గౌరవం, ఆదరం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత  గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయముగా, ఆనందమయముగా  ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.
* గురువు :- కన్యాలగ్నానికి గురువు కారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధములు కలుగుతాయి.  పుత్రుల నుండి ఆదరణ సహకారం లభిస్తుంది. పుత్ర సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుండి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్గాయువు, పుత్రసంతతి, ఖ్యాతి  కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న శుభ ఫలితాలు తగ్గుతాయి.
* శుక్రుడు :- కన్యాలగ్నానికి శుక్రుడు ధానాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకు వెడతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావములు అధికం. వీరికి వ్యవసాయ రంగంలో సాఫల్యం లభిస్తుంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ రంగం నుండి సహాయసహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది.
* శని :- కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షష్టమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య  గ్రహంగా కారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పరి వారిక జీవితం అశాంతికరం.  సంతానంతో సత్సంబంధాలు ఉండక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుక సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం , ఆధ్యాత్మికత కలిగి ఉంటారు.  కాని మొండి తనం, క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
* రాహువు :- కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్య వంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
* కేతువు :- కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాత రోగం, నడుము నొప్పి  కలిగే అవకాశం కలుగుతుంది.
లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వైవాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.



12, అక్టోబర్ 2012, శుక్రవారం

సింహ లగ్నం


 సింహ లగ్నం

* సూర్యుడు :- సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. సింహగ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉన్న కారణంగా వ్కక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడికా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణంగా సన్మానాలను అందుకుంటారు.వీరు ఏకార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. త్వరిత గతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదారస్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం, పరాక్రమం  కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం శాంతి మయం ఔతుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారం లభించదు.
* చంద్రుడు :- సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానాధిపతిగా అకారక గ్రహమై అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధైర్య  మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. స్వభావికంగా వీరు మంచి వారు. వీరికి తల్లి తండ్రుల నుండి సహాయ సహారాలు అందుతాయి. రాజాకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి. చంద్రుడికి పాపగ్రహ చేరిక, దృష్టి ఉన్న అశుభఫలితాలు తగ్గుతాయి.
* కుజుడు :- సింహలగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక కారక గ్రహమై శుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ కుజుడు పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు చతుర్ధ స్థానమైన మిద , సప్తమ అష్టమ స్థానముల
మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విబేధాలు, జీవితభ్గస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. మిత్రుల, భాస్వాముల సహాయసహకారాలు లోపిస్తాయి. శత్రు పీడ ఉంటుంది.
* సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు కనుక ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు. వీరికి కళారంగ సంబంధములు ఉంటాయి. వీరికి శత్రుభయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం వీరికి తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు. భాగస్వామ్యం వీరికి కలసి రాదు.
* సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణంగా గురువు కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. దయాస్వభావం కలిగి ఉంటారు. ధనం బధ్రపరచు గుణం కలిగి ఉంటారు. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింప చేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘములో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి, పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుంది.
* శుక్రుడు :- శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి ఔతాడు. సింహలగ్న శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్థ  శుక్రుడి కారణంగా అందమైన శరీరం కలిగి  ఉంటారు. వీరికి భౌతిక సుఖముల మీద ఆసక్తి అధికం. మెట్టింటి నుండి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా వ్యయం చేస్తారు. వివాహేతర సంబంధాలకు ధనవ్యయం చేస్తారు. సప్తమ  భావంలో ఉన్న శుభగ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్గి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు.
* శని :- సింహ లగ్నానికి శని అష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు.  సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని  కలిగిస్తుంది. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టములు ప్రాప్తిస్తాయి. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుండి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలు తగ్గవచ్చు.
* రాహువు :- సింహ లగ్నస్థ రాహువు అశుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు వీరికి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. ఆ కారణంగా స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడు కోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం. లగ్నస్థ రాహువు వలన వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుండి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు.
* కేతువు :- శత్రురాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు అశుభ ఫలితాలను ఇస్తాడు. లసింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్త గలవు. వీరికి తల్లి తండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి  కారణంగా వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. జీవిత భాస్వామి అనారోగ్యానికి గురి కాగలరు.

కటక లగ్నం

కటక లగ్నం

* సూర్యుడు: కట్క లగ్నానికి సూర్యుడు ధనస్థానాఢిపతి ఔతాడు. కటక  లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. రవి దశలో ఆరోగ్య సమస్య లు ఎదుర్కొంటారు.
వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వీరికి వ్యాపారం మీద ఆసక్తి , ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుండి సమస్యలు ఎదురౌతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వీరికి నిలకడ ఉండదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
* చంద్రుడు: కట్క లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై శుభఫలితం ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవత్భక్తి, పెద్దల ఎడ గౌరవ మర్యాదలు, పరోపకార గుణం కలిగిస్తాడు. వీరిలో మనోబలం ఎక్కువగా ఉంటుంది. స్వప్రయత్నంగా సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. సత్య వాక్కే అయినా కఠినంగా మాట్లాడటం వలన వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు  పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి  సౌందర్యం ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. 
* కుజుడు : కటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి ఔతాడు. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. అయినా లగ్నస్థ కుజుడు 
వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. వీరికి మహత్వకాంక్ష అధికం. వీరికి రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుండి కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్ధిక లాభం అలాగే అధిక వ్యయం కలిగిస్తాడు. ధనసంపాదన వీరికి కఠిన విషయం. తెలివి తేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహపూరితంగా ఉంటుంది.
* బుధుడు: కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారంలో ఆసక్తి తక్కువ, ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువ. కనుక జీవనోపాధికి ఉద్యోగాన్ని ఎన్నుకుంటారు. వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితం అశాంతి మయంగా ఉంటుంది,  భాగస్వాముల వలన హాని కలుగుతుంది. శత్రువుల వలన కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది.
* గురువు: కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిపతి ఔతాడు. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు పరి పూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం అయిన వృశ్చికాన్ని,  సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి ఔతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, దయాస్వభావం కలిగి ఉంటారు.
* శుక్రుడు: కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి ఔతాడు. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితతనం, భయం కలిగిస్తాడు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ వఆపారాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాములు అనుకూలురై శ్రమిస్తారు.
* రాహువు: కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి ష్ఖభోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన పరిశ్ర తరువాత వ్యాపారంలో సఫలత సాధిస్తారు. ఉద్యోగములో అతిత్వరితంగా సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామీ  వలన నష్టములు కలుగ వచ్చు.
* కేతువు: కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతుదశా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సమాజం నుండి గౌరవ, సన్మానాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గుప్తమైన శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలను ఎదుర్కొంటారు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ స్థానకారకత్వమును బాధిస్తుంది. వవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది.