20, జులై 2013, శనివారం

ఋషికేశ్

File:Rishikesh view across bridge.jpg
ఋషికేశ్ 


ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
File:Shiva in rishikesh.jpg
గంగాతీరంలో ధ్యానంలో శివుడు 

తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే  వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. 
File:Sivananda Temple, Divine Life Society, Muni Ki Reti, Rishikesh.jpg
 శివానందాశ్రమం
File:Kailash Ashram, Muni Ki Reti, Rishikesh.jpgFile:Shiva statue at Parmarth Niketan, Muni ki Reti, Rishikesh.jpg మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని.  కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే  వినాయకుడు తొండం  పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి.  ఆశ్రమంలో  మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు.  గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.



File:Ram Jhula bridge on the Ganges, Muni Ki Reti, Rishikesh.jpg
రామ్ ఝులా
File:Close up of Pilgrims on Ram Jhula bridge, Rishikesh.jpgFile:Ram Julah Hanging Bridge, Rishikesh, India.jpgకైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా  జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది.  ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం
File:Trayambakeshwar.JPG


రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా  చూసి తీరాలని 
అనుకున్నాము.
File:A monkey crossing the Laxman Jhula bridge, Uttarakhand.jpg
లక్ష్మణ ఝులా 

అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి  లక్ష్మణ ఝులా ఉండే  ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత  వంతెన నిర్మాణం 1939లో జరిగింది.  తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే. 

12, జులై 2013, శుక్రవారం

డెహరాడూన్

డెహరాడూన్

File:Uttrakhand 108 First Aid.jpg
డెహ్రాదూన్ 

యమునోత్రి నుండి మేము బయలు దేరి డెహరాడూన్ వైపు ప్రయాణం సాగించాం. కాని ఈ ప్రయాణంలో మాకు మధ్యలో మజిలీ లేదు. ఇక్కడ నుండి బయలు దేరి డెహరాడూన్ మీదుగా ప్రయాణించి నేరుగా ౠషికేశ్ చేరుకుంటాం. ఋషికేశ్ చేరామంటే హిమాలయాలను వదిలివేసినట్లే. ఎంత శ్రమతో కూడిన ప్రయాణమైనా దేవభూమి అయిన హిమాలయాలను వదలడానికి మనసు కొంత భారంగా తోచింది. పది రోజులకే ఇంత అనుబంధం ఏర్పడింది మరి.  కిందకు  దిగుతున్నప్పుడు ప్రయాణం సులువుగా చేస్తున్నట్లు అనిపించింది. అదే ఘాట్  రోడ్లే అయినా పోయే సమయంలో ఇంకా ఎంతసేపులో చేరుకుంటామో అన్న ఆందోళన ఉంటుంది. వచ్చేటప్పుడు అది ఉండదు అందుకేనేమో. తిరుగు ప్రయాణంలో అంతగా కాలం జరిగినట్లుగాని శ్రమ కాని తెలియలేదు  .

మార్గ మధ్యంలో మధ్యాహ్న భొజనాలు ముగించుకున్నాము. హిమాలయాల్లో ఈ పర్వతవాతావరణంలో ఇలా అందరితో చేరి భోజనాలు చేయడం చాలా సరదాగా ఉంది. సాయంకాలం అయ్యే సమయానికి డెహరాడూన్ చేరుకున్నాము. హిమాలయాలులో ప్రవేశిన్చిన తరువాత మొదటి సారిగా అధికంగా భవనాలను చూసాము. మార్గానికి ఇరువైపులా కొన్డలూ వాటిమీద ఇళ్ళూ ఊరు చాలా అందంగా ఉంది. పర్వత ప్రాంతంలో  ఇలాంటి ఊరు చూడడం ఇదే మొదటిసారి కనుక మరింత అందంగా ఉంది. కొండ చరియల చివరి భాగం అంతా భవనాల వరుసలు. ఈ భవనాల వరుసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా ఊరు చూస్తూ ముందుకు సాగాము. మా యాత్రలో డెహ్రాడూన్ సందర్శన లేదు. కనుక ప్రయాణిస్తూనే ఊరు చూడలి.

File:Bsgate.jpg
డెహ్రాడూన్ పాఠశాల 
ఇలా కొంత దూరం చేరగానే వడగళ్ళ వాన మొదలైంది. బస్సు మీద వడగళ్ళు పడడం వలన పెద్దగా శబ్దాలు మొదలయ్యాయి.  బసును ఆపి వాన కొంచం తగ్గాక అందరం కిందికి దిగాం. కిందికి దిగి చూసి రోడ్డంతా మల్లెపూలలా పడి ఉన్న వడగళ్ళను చూసి ఆనందించాం. వడగళ్ళు కొంచం పెద్ద సైజులో అధిక సంఖ్యలో పడ్డాయి కనుక ఒక్క సారిగా అన్ని వడగళ్లను చూసే అవకాశం లభించింది. అవి కరగడానికి చలాసమయం పట్టింది. మేము అలా నిలిచి చూస్తుండగానే వాన మొదలు కావడమేగాక చాలా త్వరగా జోరందుకుంది.  ఇక మేము వాన నుండి తప్పించుకునే ప్రయత్నం చేయక తప్పలేదు. మెల్లగా అందరం సమీపంలోని శివాలయంలోకి ప్రవేశించాం. అది పెద్ద శివాలయమే. లోపలకు ప్రవేశించి ఆలయం అంతటా తిరిగి  చూసి స్వామిని దర్శించుకున్నాము. వాన తగ్గిందని  అనుకున్నాక అక్కడ నుండి నడిచి బసు వద్దకు చేరుకుని తిరిగి ప్రయాణం సాగించాం. దెహ్రాడూన్ నగరంలో చూడకపోయినా ఈలా డెహ్రాడూన్ సందర్శించడం కూడా చక్కని అనుభూతిని ఇచ్చింది. అక్కడి నుండి రాత్రికి ౠషికేశ్  చేరుకున్నాము.  అక్కడ చిన్నజీయర్ మఠంలో బస చేసాం. 

9, జులై 2013, మంగళవారం

యమునోత్రి

 యమునోత్రి 

File:Yamunotri temple and ashram.jpg
యమునోత్రి దృశ్యం



యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.

సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.

యమునోత్రి వర్ణచిత్రం
కేదార్నాథుని దర్శనం చేసుకుని మరునాడు ఉదయం బయలుదేరి రాత్రి అయ్యేసరికి జానకిచట్టి చేరుకున్నాము.  ఉదయం జానకి చట్టీ నుండి హనుమాన్ చట్టికి వేను మాట్లాడుకుని జట్లు  జట్లుగా చేరుకున్నాము. అక్కడ డోలీ వాలాలు భారతీయులు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కౌంటర్ నుండి డోలీ టోకెన్లు కొనుక్కున్నాము. ఆ టోకెన్లు చూపి డోలీలు మాట్లాడుకుని మా మా డోలీలలో యమునోత్రి చూడడానికి ప్రయాణం సాగించాము. డోలీ వాలాలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము అంగీకారం కానట్లుంది వారు మా నుండి అధికంగా తీసుకోవడనికి ప్రయత్నించారు. అయినప్పటికీ మా బృందంలోని వారు అందుకు అంగీకారం తెలుపక ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే చెల్లించారు. ఎలాగో డోలీలలో ముందుకు సాగాము. మార్గ మద్యంలో అప్పుడప్పుడు డోలీ వాలలు డోలీ దిగి నడవమన్నారు. వారు కూడ మనుషులే కదా అనిపించింది అదీ కాక ఇలా శ్రమపడి యాత్రచేయడం కూడా మంచిదే కదా అనిపించింది. అందువలన దిగి అక్కడక్కడా  నడక సాగింది.  డోలీ ఎక్కిన తరువాత ఎవరికి వారే కదా. కాబట్టి మార్గమద్యంలో ఎవరి నిర్ణయం వారిదే కదా.






దస్త్రం:యమునోత్రిలో డోలీ.JPG
 యమునోత్రి వద్ద డోలిలు 
ఎలాగో మద్యాహ్న సమయానికి ఆలయం సమీపానికి చేరుకున్నాము. మావారు వచ్చే వరకు ఆగి వారిని కలుసుకుని నడక సాగిస్తూ అటుఇటు ఉన్న లోయలు చూస్తూ ప్రయాణం సాగించాం. అయినా ఇంకా రావలసినవారు అందరూ ఇంకా వచ్చి చేరలేదు.డోలీలు దిగి మార్గ మద్యంలో ఆ పర్వత మార్గంలో పక్కన ఉన్న లోయలలో ప్రవహిస్తున్నయమునా నదిని చూస్తూ ప్రయాణం సాగించాం. జన్మస్థలంలోయమునా  నది చిన్న ప్రవాహంలా ప్రవహిస్తున్నది.  అయినప్పటికీ నది కొంచంలో లోతుగా ప్రవహిస్తున్నందున కారణంగా నదిని చేరడం మాకు కస్టమనిపించింది.  అందరూ ఏమి చేస్తే అదే చ్స్తామని అనుకున్నాము. కొంతమంది నది దగ్గరకు నడిచి పోతూనే ఉన్నారు.
దస్త్రం:యమునోత్రిలో స్నానఘట్టం.JPG
యమునోత్రి వద్ద స్నానఘట్టం 


File:Yamuna at Yamunotri.JPG
యమునోత్రి వద్ద యమునా నది 
అలా ఆలయసమీపానికి పోయే సమయానికి పుజా ద్రవ్యాలను విక్రయిస్తున్న చిన్న దుకాణాలను చేరుకున్నాము. అక్కడ నర్మదా దేవి పూజా ద్రవ్యాలతో ఒక చిన్న బియ్యం మూట తెల్లని వస్త్రంలో చుట్టి విక్రయిస్తున్నారు. అది ఆలయం పక్కనే ఉన్న చిన్న ఉష్న గుండంలో  వండి ఇస్తారు. అందుకు కొంత మూల్యం ఇవ్వాలి. సరే అనదరూ ఏమి చేస్తే అదే చేయాలని నిర్ణయించుకున్నాం. పూజా ద్రవ్యాలను కొని తిరిగి నడకతో ఆలయసమీపానికి చేరుకున్నాము. అక్కడ మాకంటే ముందు చేరుకున్న మా బృందం వారిని  కలుసుకున్నాము. వారి కుటున్బ సభ్యులు ఇంకా చేరని కారణంగా వారిలో కొంతమంది ఒంటరిగా ఉన్నారు. వారు కుటుంబంలో చేరేవరకు వారు ఇలా అశాంతిగానే ఉంటారు. 
యమునాదేవి ఆలయ సమీపంలో 
ఆలయం సమీపంలో పెద్ద ఉష్ణగుండం ఉంది. అక్కడ యాత్రీకులు స్నానం చేస్తున్నారు. మాకది ముందుగా తెలియదు కనుక మేము మావెంట వేరే జత దుస్తులు తీసుకు వెళ్ల లేదు. అందువలన స్నానం చేసే ప్రయత్నం మానుకుని చిన్న ఉష్ణ గుండం వద్దకు చేరుకునాము. అక్కడ ఉన్నవారుకి మూల్యం చెల్లించి బియ్యం మూటను వండించాము. ఉష్ణగుండం మీద ఒక బలమైన  ఇనుప జల్లెడ వేసి ఉంది.  ఆ ఇనుపజల్లెడకు చిన్న పురికొసలు కట్టి ఉన్నాయి. ఆ త్రాళ్ళతో బియ్యం మూటలు కట్టి వాటిని కింద సలసలా  కాగుతున్న  నీటిలోకి విడుస్తారు. కొంత సమయం మాత్రం ఉంచి వాటిని పైకి తీసి త్రాళ్ళ నుండి వాటిని విడదీది యాత్రీకులకు ఇస్తారు. మేము అలా ఆ బియ్యాన్ని వండించి తీసి చూసాము. సగం సగంగా ఉడికింది. మేము వాటిని అలా వదిలి వేసాము.
యమునోత్రి వద్ద ఉష్ణ కుండం 

తరువాత మేము ఆలయానికి చేరుకున్నాము. ఆలయం చాలా చిన్నది. అయినప్పటికీ ఈ ఆలయాలు ఋషి స్థాపితాలు అనుక మహిమాన్వితమైనవి. వెలుపల మా పూజా ద్రవ్యాలను తీసుకుని అక్కడ ఉన్న పూజారి పూజ విదులను సాగించాడు.  పూజ ముగిసిన తరువాత ప్రసాదం స్వీకరించి వెలుపలకు వచ్చాము. యాత్ర నిర్వాహకులు మా కోసం మద్యాహ్న భోజనం తీసుకు వస్తామని చెప్పారు. అయినా వారెవరూ వచ్చి చేరలేదు. అందరూ రావాలంటే ఇంకా ఆలస్యం కావచ్చు. అందుకని మేము ఆహారం కొరకు ఎదురుచూడకుండా వెనుతిరగాలని నిశ్చయించుకున్నాము. మిగిలిన వారు మధ్యాహ్న భోజనం తీసుకుని  వస్తామని చెప్పారు కనుక భోజనం చేసి వస్తామని చెప్పడంతో మేము మాత్రం వెనుతిరిగాము. తిరిగి డోలీలు ఎక్కి తిరుగు ప్రయాణం సాగించాం. కిందకు దిగి డోలీల నుండి వెలుపలకు వచ్చి విడుదల లభించినట్లు అనుభూతి చెందాం.  ఔను మరి మోసేవాళ్ళు మోస్తున్నప్పటికీ ఇరుకైన డోలీలో అంతసేపు ముడుచుకు కూర్చోవడం కష్టమే.
యమునోత్రి సమగ్ర దృశ్యం 

అక్కడి నుండి బసచేరాలంటే మాజట్టు వారి కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే మేము అక్కడి నుండి వ్యానులలో వెళ్ళాలి. ఒక్కో వ్యానుకు 7 మంది ఎక్కాలి. అదీ కాక ఈ యాత్ర ఆరంభం నుండి ఇలాంటి వ్యాను ప్రయాణాలకు మాలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాం. కనుక మా బృందం వారు వచ్చే వరకు ఆగి చూసి వ్యానులో బసకు చేరుకున్నాము. అంటితో మా యమునోత్రి యాత్ర పూrtiఋతి అయినట్లే. మరునాటి ఉదయం బయలుదేరి ఇక హిమాలయాలు వదిలి పెడతాము .