29, ఏప్రిల్ 2012, ఆదివారం

బెట్ ద్వారక

బెట్ ద్వారక


మేము రుక్మిణి మందిరం నుండి బెట్ ద్వారక బసులో చేరాము. సముద్రంలో కొంచెం దూరం ప్రయాణించి బెట్ ద్వారక చేరాలి. కనుక అక్కడ ఉన్న రేవు వద్ద పడవ వారితో మాట్లాడి బేరం కుదుర్చుకుని ఒక్కో  పడవలో 13  మందిమి కుర్చుని బెట్ ద్వారకకు బయలుదేరాం. ముందుగా అక్కడ పక్షులకొరకు ఆహారం కొనమని నిర్వాహకులు సలహా ఇచ్చారు. అలాగే కొనుక్కుని పడవెక్కాం.  ఈ   పడవ  ఎక్కడానికి బాగా శ్రమ పడ్డాం. ఒక పడవ దాటి మరొక పడవ చేరాం అందుకే అంత శ్రమ.
ఎలాగో పడవెక్కి వసతిగా అందరం కూర్చున్నాం.  సముద్రపు నీటిని చుస్తే మనసుకు ఉత్సాహం కలిగింది.
జలాశయాలు  మనసుకు ఆహ్లాదం ఇవ్వడం సహజం కదా. 

వీరు  మాకు బెట్ ద్వారక చూపించిన పురోహితుడు  ఈయన   వేషధారణ  విచిత్రంగా ఉంది కదా 
ఇదే బెట్ ద్వారక రేవు 
బెట్ ద్వారా సముద్రతీరం ఇదే 

పంచ ద్వారకలలో  బెట్ ద్వారక ఒకటి. శ్రీ కృష్ణుడు నివసించిన భవనం ఇక్కడే ఉంది. శ్రీకృష్ణుడు గోమతి ద్వారకలో రాజ్య కార్యాలు నిర్వహించి రాత్రి సమయానికి ఇక్కడకు చేరుకుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణ వసుదేవులకు బలరాముడికి ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. బెట్ ద్వారక అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది కదా ! బెట్ ద్వారక అని ఎందుకు అంటారంటే ఇక్కడ  శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన సుధామునితో బేటి అయాడు కనుక ఈ  ప్రదేశం బెట్ ద్వారక అని పిలువబడుతుంది. . సుధాముడే కుచేలుడు అతడు శ్రీకృష్ణుడిని చూసి అటుకులను కానుకగా సమర్పించి తన దారిద్యం తనకే తెలియకుండా పోగొట్టుకున్నాడు.






ప్రయాణీకులను బెట్ ద్వారకకు చేరవేసే పడవలు ఇవే

అలా  పడవేక్కామో లేదో ఇలా పక్షులకు ఆహారం వెయ్యడం మొదలు పెట్టాం.  పక్షుల గుంపులతో  మేము సముద్ర జలాల్లో ముదుకు సాగాం. సముద్రపు పక్షులు అందంగా లాఘవంగా మేమిచ్చిన ఆహారం అందుకున్నాయి. ఆహారం తినే   వరకు మమ్ము వెన్నంటి వచ్చాయి. తరువాత వేరొక పడవ వద్దకు చేరాయి.ఆ పక్షులను చూసి అందరూ ఉత్సాహ పడ్డారు.  ఇలా అందరం ఆనందంగా సముద్రాన్ని తిలకిస్తూ ఆనందిస్తూ అవతలి ఒడ్డుకు చేరాం.  అక్కడ పడవలను దిగి వంతెన మిద నుడి అవతలి తీరం చేరాం. ఇసారి సులువుగానే పడవ దిగాం. మేము తిరిగి వచ్చే వరకు ఆ పడవలు అక్కడే ఉంటాయి.  మేము వచ్చి మా మా పడవలలోనే ఎక్కాలి. 

శ్రీ కృష్ణుడి  నివాస మందిరం చిన్న కొండ మిద కొంచెం ఎత్తులో ఉంది.  మేము కొంత దూరం నడిచి మందిరం చేరుకున్నాము. అక్కడ గైడు  వివరిస్తుండగా ఆలయం అంతా చూసి శ్రీకృష్ణుడిని దర్సనం ముగించాం.  కృష్ణుడు నివసించిన మందిరం చూసామన్న తృప్తితో వెలుపలకు వచ్చాం.  తిరిగి పడవలు ఎక్కి ప్రయాణించి రేవుకు చేరాం. మేము కొంత దూరం నడిచి బసు వద్దకు చేరి తిరిగి గోమతి ద్వారకకు ప్రయాణం అయ్యాము.

నాగే ఈశ్వరం 

మేము  అలా తిరిగి గోమతి ద్వారక చేరుకొని భోజనాలు చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకుని సాయం సమయానికి నాగేస్వరం జ్యోతిర్లింగ దర్శనానికి బయలు దేరాం.  అలా ఆలయం చేరుకొని నాగేస్వరుడిని దర్సనం చేసుకున్నాము. నాగేస్వరాలయం ప్రసంతంగా ఉంది.  ముందుగా ధ్యానంలో ఉన్న పెద్ద  ఈశ్వర విగ్రహం ఆకర్షనీయంగా ఉంది.  ఆలయ లోనికి వెళ్లి స్వామిని దర్సనం చేసుకున్నాం. ఇక్కడ ఈశ్వరుడు తన భక్తుడి  కాపాడడానికి స్వయంగా ప్రక్ష్యమై తన భకత పరాధీనత చాటుకున్నాడు.  స్వామిని దర్శించి తిరిగి గోమతి ద్వారక చేరుకున్నాం.  నిర్వాహకులు  ద్వారకనాధుడి  ఆలయంలో పూజ చాలా బాగుందని అక్కడ స్వామికి వివిధ నైవేయాలు సమర్పించి అమోఘంగా పూజ చేస్తున్నారని వచ్చి చూడమని  చెప్పి పంపారు. మాలో కొందరు తిరిగి  దర్సనం చేసుకుని వచ్చి  పూజ చాలా బాగుందని చెప్పారు.
మరునాడు మేము గోమతి ద్వారకను విడిచి సిద్ధిపూరు ప్రయాణం అయ్యాము.

.




































22, ఏప్రిల్ 2012, ఆదివారం

రుక్మిణీదేవి మందిరం

రుక్మిణీదేవి మందిరం 

ఇదే రుక్మిణీదేవి మందిరం 
మరిసటి రోజు ఉదయం బెట్ ద్వారక చూడడానికి  బసులో బయలుదేరాం. మార్గమద్యంలో రుక్మిణి మందిరం చూసాము.  రుక్మిణి మందిరంలో కుడ్య శిల్పంగా  కృష్ణుడు , రుక్మిణీదేవి దుర్వాసుడి రధం లాగుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. మాతో వచ్చిన గైడు ఇక్కడకు చుట్టుపక్కల 5  కిలో మీటర్ల  దూరం  వరకు మంచి నిరు లభించదని అది దుర్వాసుడు రుక్మిణి దేవికి ఇచ్చిన శాపమని వివరించాడు. రుక్మిణీదేవి దుర్వాసుడి ఆదేశం మీరి దాహార్తి తీర్చుకోవడానికి కొంత జాలం సేవించిన కారణంగా ఇటువంటి శాపానికి గురి అయిందని. కానీ ఇక్కడ ఉన్న ఒక బావిలో మాత్రమె మంచి నిరు దొరికేలా శాపవిమోచనం చెప్పాడని తెలుసుకున్నాము .

రుక్మినిదేవిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చాము. వెలుపల స్త్రీపురుషులు ఆనందంగా నృత్యం  చేయడం చూసి ఆనందించాం. మేము కూడా నృత్యంలో పాల్గొని ఆనందించాం



 

 చూసారా ఇదిగో ఇలా నృత్యం చేతుంటారు
ఆలయం వెలుపల భక్తులు 
ఆలయం వెలుపలి దృశ్యాలు 

ఆలయం దర్శించి నృత్యాలు చుసిన ఆనందంతో వెలుపలికి వచ్చి ఆలయానికి ఎదురుగా కొంత దూరంగా   కూర్చున్న బిక్షువులని చూసాం. వారు చక్కని శుభ్రమైన దుస్తులు ధరించి క్రమ శిక్షణగా కూర్చున్నారు వారిని భిక్షువులు అంటే నమ్మబుద్ధి కాలేదు. వేషధారణ అలా ఉంది మరి. గైడు వారిని గురించి ఇలా చెప్పాడు. ఆలయ నిర్వాహకులు వారిని ఇలా కూర్చోమని చెప్పారని భక్తులు తమంతట తాము ఏదైనా ఇస్తే మాత్రమే పుచ్చుకుంటారని. ఏది ఇచ్చినా సమానంగా పుచ్చుకుంటారని చెప్పారు.  మాలో కొందరు వారికి కొంత ధనం దానం చేసారు. వారి క్రమ శిక్షణ చుస్తే ముచ్చట  వేసింది.
ఇదిగో విరే ఆ భిక్షువులు 
ఆ తరువాత మా ప్రయాణం కొనసాగించి బెట్ ద్వారక చేరుకున్నాము.

21, ఏప్రిల్ 2012, శనివారం

గోమతీ ద్వారక

గోమతీ ద్వారక 
File:Dwarkadheesh temple.jpg

మరుసటి రోజు ఉదయానికి  గోమతీ ద్వారక  చేరుకున్నాము. ఇక్కడ గోమతి నది సముద్రంలో సంగమిస్తుంది. గోమతి ద్వారకలో కృష్ణుడు రాజ్యకార్యకలాపాలు నిర్వహించిన ప్రదేశం. ఇక్కడ కృష్ణుడి మనుమడైన వజ్రనాభుడు ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.  ౧౦వ దశాబ్దంలో ఐ ఆలయ పునర్న్ర్మానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్నాదికాలు చేసి  ఆలయ దర్సనానికి బయలుదేరం. గోకుల్ హోటల్ నుండి అటో లలో  ఆలయానికి వెళ్ళాం. ఆలయంలో కెమెరా సెల్ ఫోన్లను అనుమతించరు కనుక చాయాచిత్రాలు తీసే అవకాశం లేదుమరి.  లోపలకు వెళ్లి కృష్ణుడి చిత్రాన్ని కొనుక్కుని ఆలయ దర్శనం చేసుకోవడానికి  వెళ్ళాం.  ఆలయ ప్రదిక్షణ  చేసి స్వామి సన్నిధిలో క్యూలో నిలబడి  దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేయడానికి వత్తిడి లేదు కనుక సులువుగా దర్సనం అయింది. ఈ ఆలయానికి  గోపురం మీద జండా ఒక రోజుకు ఐదు సార్లు ఎగుర వేస్తారు. భక్తులు ఈ జండా ఎగురవేయడానికి అనుమతి తీసుకుని జండా సమర్పిస్తారు. సమర్పించే భక్తులను కూడా పై వరకు  తీసుకు వెళ్లి ఆక్కడ పూజ చేయించి ఆలయ కార్యకర్తలు జండా ఎగురవేస్తారు. ఈ జండాను భక్తులు  అత్యంత శ్రద్ధతో తాకి నమస్కరిస్తారు.  ఈ జండా ఎగురవేయడానికి కొన్ని సంవత్సరాల ముందే నమోదు చేసుకుంటారు కనుక ఈ అవకాశం లభించడం అపురూపంగా భావిస్తారు. ఇలా ద్వారకలో కృష్ణుడి జండా ఇప్పటికీ ఇలా నిరంతరంగా  ఎగురుతూనే ఉంది.  ఇలా దర్శనం  చేసుకుని వెలుపలికి వచ్చి అలా కూర్చున్నాము. అప్పుడు అక్కడ ఆలయం చూపడానికి గైడ్ వచ్చాడు. గైడ్ వెంట పోయి తిరిగి ఆలయనం అంతా తిరిగి వివరంగా చూసాము. ఇక్కడ కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడికి తనకుమారుడైన అనిరుద్ధిడితో ప్రత్యేక ఆలయం ఉంది. బలరాముడికి,  రేవతికి, దేవకీ, వసుదేవులకు, వాసుదేవుడికి, రుక్మిణి, సత్యభామ, జాంబవతికి, సుభాద్రలకు లకు విడి విడిగా సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయములో దర్శనం  అయిన తరువాత స్త్రీలు  గుంపులు గుంపులుగా కూర్చుని ఆలయ ఆవరణలో కూర్చుని కృష్ణుడి  చిత్రం ముందు పెట్టుకుని కృష్ణుడి గీతాలు పాడుకుని వెడుతూ ఉంటారు. ఇది చూడడానికి వినడానికి కూడా ఆసక్తిగా ఉంది.  

ఆలయం నుండి వెలుపలికి రాగానే పక్కనే గోమతి నది సాగరసంగమం చేసే ప్రదేశం చేరుకున్నాము. అక్కడ మరి కొన్ని ప్రదేశాలు చూసి తిరుగు ముఖం పట్టాము. సాయంత్రానికి తిరిగి సమీపంలో రుక్మిణి మాట ఆలయం , శివుడి గుడి  అలాగే అక్కడే ఉన్న చిన్న చిన్న ఆలయాలను చూసాము.  తిరిగి రాగానే మళ్లీ కృష్ణుడి దర్శనానికి వెళ్ళాము. ఇలా మరొక రోజు యాత్ర ముగిసింది.
గోమతి ద్వారకలో ఒక వీధి 
గోకుల్ హోటల్  ఇదే ఇక్కడే మేము బస చేసాము  
  

15, ఏప్రిల్ 2012, ఆదివారం

థాకురు ద్వారక

థాకురు ద్వారక
ముందరి పోస్ట్ వ్రాసినప్పుడు అహమ్మదాబాదులో చూసినవి వ్రాసాను కదా. మరుసటి రోజు అహమ్మదాబాదు ఉదయమే బయలుదేరి  అక్కడికి దాదాపు 90  కిలోమీటర్ల దూరంలో  ఉన్న దాకురుద్వారకకు యాత్రా నిర్వాహకులు ఏర్పాటు చేసిన బసులో వెళ్ళాము.  ఉరి వెలుపల బస్సును ఆపి అక్కడ నుండి ఆటోలను ఏర్పాటు చేసుకుని ఉరిలోపలకు వెళ్ళాము. ఎందుకు అంటే పురాతనమైన ఉరు కనుక వీధులు బస్సులు వెళ్ళడానికి అనుకూలముగా ఉండవని ఇలా ఆటోలలో వెళ్ళాలి. బస్సు స్టాండు నుండి ఆటోలు సులువుగా లభ్యం ఔతాయి. ఆటోలో దాకురు కృ ష్ణుడి ఆలయం వెళ్ళాము. అక్కడ స్వామిని రణచోడ్ రాయ్ జీ అంటారు. ఇక్కడ స్వామికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ బోధనా అనే ఒక భక్తుడు ప్రతి పున్నమికి  ద్వారకకు కాలినడకన వెళ్లి దర్శించుకుని వచ్చేవాడు. అలా అతడికి వయసు మళ్ళింది. అతడు ద్వారకకు వెళ్ళ లేక శ్రమ  పడే వాడు. అతడి శ్రమను చూసి కృష్ణుడు ఇక నువ్వు ద్వారకకు రావలసిన పని లేదు నేనే నీవద్దకు వస్తాను నన్ను నే వెంట తీసుకు పోవచ్చును అను అనుమతి ఇచ్చాడు. అతడు కృష్ణుడిని తీసుకురాగానే ద్వారకా వాసులు అతడిని ఎదుర్కొన్నారు. అప్పుడు కృష్ణుడు తనను నీటిలో దాచమని చెప్పాడు. బోధనా అలాగే చేసాడు. ద్వారకా వాసులు కృష్ణుడి  వెదుకుతూ కొరకు కర్రలతో నీటిలో పొడిచారు. తరువాత కృష్ణుడిని  నిటి నుండి వెలికి తీసినప్పుడు కర్రలతో పొడిచిన గుర్తులు కృష్ణుడి మిద కనిపించాయి. అప్పుడు ద్వారకావాసులు కృష్ణుడి ఎత్తు బంగారం ఇస్తే తాము తిరిగి వెళ్ళగలమని చెప్పారు. బోధనా అందుకు అంగీకరించాడు కాని అతడి వద్ద అతడి భార్య ధరించిన ముక్కు పుడక తప్ప వేరు బంగారం లేదు. అప్పుడు కృష్ణుడు ఆ ముక్కెరతో  తనను తూచమని  మని చెప్పాడు .  బోధనా అలా చేయగానీ ఆశ్చర్యంగా కృష్ణుడు ఆ ముక్కెరతో   సమానంగా తూగాడు. ఇదీ ఈ ఆలయ చరిత్ర.. ఇక్కడకు లక్షల మంది భక్తులు వస్తారు. పౌర్ణమి ఇక్కడ విశేషంగా చేస్తారు. ఇక్కడ స్వామికి పలు  దర్శనాలు ఉంటాయి.
1 . మంగళ భోగ :- కృష్ణుడిని ఉదయము నిద్రలేపుతారు. ఉదయము స్వామి దర్సనం మంగళ కరం కనుక దీనిని మంగళ్ భోగ్ అంటారు.
2 . స్నాన్ :- స్వామికి స్నానం చేయిస్తారు.
3 . బాల్ భోగ్ :- స్వామికి ఉదయపు పాలు  నివేదన చేస్తారు.
4 .  శృంగార భోగ్ :- స్వామికి అలంకారం చేస్తారు.  స్వామికి ఖర్జూరము , ఎండు ద్రాక్ష,  బాదం పప్పు,  జీడి పప్పు వంటి బలవర్ధక ఆహారం నివేదన చేస్తారు. తిదివారాలను అనుసరించి అలంకరణలో మార్పులు ఉంటాయి.
5  గ్వాల్ భోగ్ :-  స్వామికి అల్పాహారం,  చిరుతిండి పెరుగు నివేదన చేస్తారు. అలాగే స్వామి చేతిలో వేణువును కాని పూల మాలను కాని ఉంచుతారు. స్వామిని అప్పుడు గోపబాలలతో గోవులను కాయడానికి పంపుతారన్న మాట. తరువాత దర్సనం మూడు గంటల సమయం ఆపివేస్తారు.
6 . రాజ్ భోగ్ :- స్వామి మూడు గంటల సమయం పచ్సిక బయళ్ళలో  గోపబాలురతో గోవులతో ఆనందంగా గడిపి తిరిగి వచ్చిన సమయం అన్నమాట. అప్పుడు స్వామికి భాజాభాజంత్రిలతో మేళతాళాలతో  స్వాగతం పలికి ఆనందంగా చక్కగా అలంకరిచి తామరపూవు, వేణువులను ఇచ్చి ఆహ్లాదకరమైన దుస్తులను అలంకరించి సెంటు చల్లి ఆనందగా హారుతులు నివేదన సమర్పిస్తారు.
7 .  ఉత్తాపన్ :- ఇది సాయంకాల దర్సనం. ఈ సమయంలో స్వామిని స్వల్పకాల నిద్ర నుండి ప్రేమగా లేపి  కెక్కగా అలంకరిచి నివేదనా హారతులు సమర్పిస్తారు.
8 . ష్యాన్ :- స్వామికి అల్పాహార నివేదన చేసి హారతులుచ్చి స్వామికి నెమలి ఈకలతో చేసిన విసనకర్రతో విసిరి ప్రేమతో నిద్రపుచ్చుతారు. ఇది రోజులో ఆఖరి దర్సనం  .

రణ చోడ్ రాయ్ జీ దర్సనం గొప్పగా ఉంటుంది. ఆకోలాహలము చూడవలసినదే కాని వర్ణించేది కాదు.  దర్బారు వంటి ఆలయం లోపల స్వామి, వేళ వేళలా విధవిధమైన అలంకరణలు, ఒక్కో అలకరణ 45 నిముషాల సమయం ఉంటుంది. భక్తులు ముందుగానే గుమికుడుతారు. క్యు అంటూ ఏమీ ఉండదు.  తలుపు తెరేరవగానీ ఆనంద పరవశంతో   భక్తులు రకరకాల నామాలతో స్వామిని స్మరిస్తూ  దర్శిస్తారు. భక్తులు ఒకరిని ఒకరు విపరీతంగా తోసివేస్తారు. తోపిడి తోనే దర్శించి వెలుపలికి రావాలి. మన ప్రయత్నం లేకుండానే వెలుపలికి వస్తామన్నది నిజం అతిశయోక్తి కాదు. ఇక్కడ దొంగల భయం ఉంటుదని కూడా అంటారు. కనుక భక్తులు దర్సన సమయంలో తమ ఆభరణాలను జాగ్రత్త పరచుకోవాలి మరి.  కొంత మంది ఒకరోజులో అన్ని దర్శనాలు చేసుకుంటారు.  దర్సనాలకు ఇక్కడ అంత ముఖ్యత్వం ఉంది మరి. వీలు ఉంటె ఇక్కడ ఒక రోజు ఉండి అన్ని చూసుకో వచ్చు. మళ్లీ మళ్లీ రాలేము కదా.  ఆలయంలో ఫోటోలకు అనుమతి లేదు కనుక చిత్రాలను తీయలేదు. మచ్చుకి ఒకటి మాత్రం తీయకలిగాను .    వీక్షించండి .
రణ చోడ్ రాయ్ జీ ఆలయం 


స్వామిని దర్శించి తిరిగి వచ్చి నిర్వాహకులు ఏర్పాటు చేసిన భోజనం చేసి.విశ్రాంతి తీసుకుని సాయత్రం అల్పాహారం తిని తయారై బస్సులో గోమతి ద్వారకకు ప్రయాణం అయ్యాము. రాత్రి ప్రయాణంలో గోమతి ద్వారకు చేరుకున్నాము. గోమతి ద్వారకు చేరే సమయానికి తెల్ల వారింది.


2, ఏప్రిల్ 2012, సోమవారం

పంచద్వారకాయాత్ర అహమ్మదాబాదు

పంచద్వారకాయాత్ర
అహమ్మదాబాదు 

పంచద్వారకలు చూడడానికి మేమంతా దాదాపు 50 మంది బయలు దేరాం. అందరం చెన్నై రైలు స్టేషన్ వద్దకు చేరి మా మా స్థానాలలో ఆసీనులంయ్యాము.  మేము ముందుగా అహమ్మదాబాదు చేరుకున్నాము.  అక్కడ హోటలు బస ఏర్పాటు చేసారు. మరునాడు ఉదయం అందరం కలసి బసులో నగరదర్సానానికి బయలుదేరాం. ముందుగా ఇస్కాన్ టెంపుల్ చూసాం .
ఇదే అహమ్మదాబాదు ఇస్కాన్ టెంపుల్ 
ఆ తరువాత మేము వైష్ణవి దేవి ఆలయ నమూనా చూడడానికి వెళ్ళాము. అది ఒక  మంచి అనుభవం. నమూనా అయినా లోపలకు వెళ్లి అమ్మవారిని దర్సనం చేసుకుని వెలుపలకు రావడానికి గంట సమయం పట్టింది. లోపల కొన్ని మార్గాలలో ప్రాకి వెళ్ళవలసి ఉంటుంది.  మాలో కొందరు అలా వెళ్లి ఆ అనుభవం చవి  చూసారు. కొందరు నేరుగా వెళ్లారు. అలా వెళ్ళడానికి వేరే మార్గం ఉంది. ఇలా వైష్ణవి మందిరం చూసి బయటకు వచ్చాం. 
ఇదిగో అహమ్మదాబాదు వైష్ణవి ఆలయం

ఆ తరువాత మేము అహమ్మదాబాదు లోని బాలాజీ ఆలయానికి వెళ్ళాం . అక్కడ పూజారులు దక్షిణ భారతదేశం  లోని వారు. ఈ ఆలయాన్ని  తెలుగువారు నిర్మించుకున్నారని  తెలుసుకుని ఆనందించాం. ఆలయం బాగా ఉంది.
చక్కగా నిర్వహించబడుతుంది. ఆలయ ముందుభాగంలో ఉన్న గరుత్మంతుడు , హనుమంతుడు మరింత ఆకర్షించిన  విషయం మాత్రం నిజం. గాలిగోపురం కూడా బాగుంది.
ఇదిగో గుజరాత్ లోఉన్న బాలాజీ ఆలయం 
తరువాత మేమంతా గాంధి ఆశ్రమం చేరుకున్నాము.  మనసులో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. జాతిపిత ఆశ్రమం చూడబోతున్నందుకు మనసు పులకించింది  మరి. ఆశ్రమంలో ప్రవేశించి చక్కగా అంతా కలయ తిరిగి చూసాం. తృప్తిగా  చాయాచిత్రాలు తీసుకున్నాం. ఆశ్రమం నుండి వెనుక భాగంలో ఉన్న సబర్మతి నదిని చూసాం .  ముందు ఉన్న మూడు కోతులను చూసాం. మాకప్పటికి మధ్యాహ్న భోజన సమయం అయింది. అందరం కలిసి ఆశ్రమప్రాంగణంలో  భోజనాలు చేసాం. భోజనమంటే తీసుకువచ్చిన సాంబార్ సాదం, పెరుగన్నం. మిగిలినది అతిథులకు ఇచ్చి సత్కరించాం. 

 ఆశ్రమం వెనుక ఉన్న సబర్మతీ నది 
భారతీయభాషలలో గాంధిజీ సంతకం 

ఆశ్రమ ద్వారంలో బాపూజీ 
ఆశ్రమంలో మూడు  కోతులు 
 తరువాత మాప్రయాణం అహమ్మదాబాదు లో ఉన్న అక్షరధామ్ సందర్సం. అక్షరధామ ప్రవేశం చేసాం. అందరికీ నిర్వాహకులు టిక్కెట్లు కొని తెచ్చారు. లోపలి వెళ్లి ఒక్కో తిగా చూసి ఆనందించాం. ఆ తరువాత నాలుగు ప్రదర్సనలు చూసి ఆనందించాం. స్వామినారాయణ చలన చిత్రం చూడడం అపురూపమైన అనుభూతి. చివరగా అందరినీ ఆశ్చర్య ఆనందంలో ముంచిన విషయం అక్కడ నిర్వహించిన లేజర్ షో. ముచికుందుడి కదా లేజర్ కిరణాల ప్రదర్శనలో చూడడం చూసి అలుకిక ఆనందానికి గురయ్యాం. అక్షరధామలో కెమెరా,  సెల్ ఫోన్ లను అనుమతించరు కనుక చాయాఛిత్రాలను చూపడం కుదరదు మరి. 
ఇది ధారావాహిక మాదిరి మిగిలిన భాగం తరువాతి తపాలాలో చూడాలి మరి.