2, ఏప్రిల్ 2012, సోమవారం

పంచద్వారకాయాత్ర అహమ్మదాబాదు

పంచద్వారకాయాత్ర
అహమ్మదాబాదు 

పంచద్వారకలు చూడడానికి మేమంతా దాదాపు 50 మంది బయలు దేరాం. అందరం చెన్నై రైలు స్టేషన్ వద్దకు చేరి మా మా స్థానాలలో ఆసీనులంయ్యాము.  మేము ముందుగా అహమ్మదాబాదు చేరుకున్నాము.  అక్కడ హోటలు బస ఏర్పాటు చేసారు. మరునాడు ఉదయం అందరం కలసి బసులో నగరదర్సానానికి బయలుదేరాం. ముందుగా ఇస్కాన్ టెంపుల్ చూసాం .
ఇదే అహమ్మదాబాదు ఇస్కాన్ టెంపుల్ 
ఆ తరువాత మేము వైష్ణవి దేవి ఆలయ నమూనా చూడడానికి వెళ్ళాము. అది ఒక  మంచి అనుభవం. నమూనా అయినా లోపలకు వెళ్లి అమ్మవారిని దర్సనం చేసుకుని వెలుపలకు రావడానికి గంట సమయం పట్టింది. లోపల కొన్ని మార్గాలలో ప్రాకి వెళ్ళవలసి ఉంటుంది.  మాలో కొందరు అలా వెళ్లి ఆ అనుభవం చవి  చూసారు. కొందరు నేరుగా వెళ్లారు. అలా వెళ్ళడానికి వేరే మార్గం ఉంది. ఇలా వైష్ణవి మందిరం చూసి బయటకు వచ్చాం. 
ఇదిగో అహమ్మదాబాదు వైష్ణవి ఆలయం

ఆ తరువాత మేము అహమ్మదాబాదు లోని బాలాజీ ఆలయానికి వెళ్ళాం . అక్కడ పూజారులు దక్షిణ భారతదేశం  లోని వారు. ఈ ఆలయాన్ని  తెలుగువారు నిర్మించుకున్నారని  తెలుసుకుని ఆనందించాం. ఆలయం బాగా ఉంది.
చక్కగా నిర్వహించబడుతుంది. ఆలయ ముందుభాగంలో ఉన్న గరుత్మంతుడు , హనుమంతుడు మరింత ఆకర్షించిన  విషయం మాత్రం నిజం. గాలిగోపురం కూడా బాగుంది.
ఇదిగో గుజరాత్ లోఉన్న బాలాజీ ఆలయం 
తరువాత మేమంతా గాంధి ఆశ్రమం చేరుకున్నాము.  మనసులో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. జాతిపిత ఆశ్రమం చూడబోతున్నందుకు మనసు పులకించింది  మరి. ఆశ్రమంలో ప్రవేశించి చక్కగా అంతా కలయ తిరిగి చూసాం. తృప్తిగా  చాయాచిత్రాలు తీసుకున్నాం. ఆశ్రమం నుండి వెనుక భాగంలో ఉన్న సబర్మతి నదిని చూసాం .  ముందు ఉన్న మూడు కోతులను చూసాం. మాకప్పటికి మధ్యాహ్న భోజన సమయం అయింది. అందరం కలిసి ఆశ్రమప్రాంగణంలో  భోజనాలు చేసాం. భోజనమంటే తీసుకువచ్చిన సాంబార్ సాదం, పెరుగన్నం. మిగిలినది అతిథులకు ఇచ్చి సత్కరించాం. 

 ఆశ్రమం వెనుక ఉన్న సబర్మతీ నది 
భారతీయభాషలలో గాంధిజీ సంతకం 

ఆశ్రమ ద్వారంలో బాపూజీ 
ఆశ్రమంలో మూడు  కోతులు 
 తరువాత మాప్రయాణం అహమ్మదాబాదు లో ఉన్న అక్షరధామ్ సందర్సం. అక్షరధామ ప్రవేశం చేసాం. అందరికీ నిర్వాహకులు టిక్కెట్లు కొని తెచ్చారు. లోపలి వెళ్లి ఒక్కో తిగా చూసి ఆనందించాం. ఆ తరువాత నాలుగు ప్రదర్సనలు చూసి ఆనందించాం. స్వామినారాయణ చలన చిత్రం చూడడం అపురూపమైన అనుభూతి. చివరగా అందరినీ ఆశ్చర్య ఆనందంలో ముంచిన విషయం అక్కడ నిర్వహించిన లేజర్ షో. ముచికుందుడి కదా లేజర్ కిరణాల ప్రదర్శనలో చూడడం చూసి అలుకిక ఆనందానికి గురయ్యాం. అక్షరధామలో కెమెరా,  సెల్ ఫోన్ లను అనుమతించరు కనుక చాయాఛిత్రాలను చూపడం కుదరదు మరి. 
ఇది ధారావాహిక మాదిరి మిగిలిన భాగం తరువాతి తపాలాలో చూడాలి మరి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి