9, సెప్టెంబర్ 2012, ఆదివారం

గంగాదేవి మహిమ

File:GANGOTRI MORNING- photography by Debabrata Ghosh, Birati.jpg
గంగోత్రి వద్ద గంగానది 

గంగాదేవి మహిమ


హిందువులు గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. గంగా స్నానం చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. ఈగంస్నానం చెయ్యడం వలన గంగా జాలం పాణం చెయ్యడం వలన గంగా తీరంలో నివసించడం వలన అనేక ఫలితాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని గంగా స్నానం చెయ్యడం మరింత తృప్తిని కలిగిస్తుంది. కనుక గంగా నదికి వెళ్లాలనుకునే వారు  దీనిని చదివి తెలుసుకోండి.అలాగే గంగా స్నానానికి వెళ్లాలనుకునే మీ పెద్ద వారికీ వారికి  చెప్పి వారి  యాత్రను ఫలవంతం చెయ్యండి.























గంగాస్నాన ఫలితం

File:Morning Ganga Aarti, Varanasi.jpg
వారాణసిలో గంగాతీరంలో స్నానఘట్టం 

  1. మాఘమాసం గంగానదిలో స్నానం చేసిన 100 యాగములు చేసిన ఫలములు లభించును.
  2. గంగాజలం తలపైన చల్లుకునే వారికి  సూర్యరస్మి చీకట్లను తరిమి వేసినట్లు పాప రాశి దూరమగును. 
  3. గంగానదిలో ఒకసారి స్నానం  చేసిన వారికి ఆశ్వమేధ యాగఫలితం లభిస్తుంది.
  4. గంగానదిలో స్నానం చేసిన గత జన్మల సంచిత పాపములు కూడా నశించును.
  5. ఇతర ప్రదేశములలో చేసిన పాపములు  గంగానదిలో స్నానం చేసిన నశించును .
  6. పగలు కాని, రాత్రి కాని, సంధ్యా సమయమునకని  గంగానదిలో స్నానం చేసిన  నశించును.
  7. గంగాజలమును ఇంటికి తీసుకు వచ్చి స్నానం చేసినా కూడా  ఆశ్వమేధ యాగఫలితం లభిస్తుంది.
  8. గంగానదిలో స్నానం చేసిన సర్వ తిర్ధములను సేవించిన ఫలం, సర్వదేవాలయ దర్సన ఫలం లభిస్తుంది.
  9. మహాపాప యుక్తుడు లేక సర్వ  పాపయుక్తుడు  అయినా గంగానదిలో స్నానం చేసిన పాప విముక్తులు ఔతారు.
  10. మనో, వాక్కు , కర్మల చేత చేసిన పాపములు కూడా  గంగానదిలో స్నానం చేసిన నశించును.
  11.  ఒక సంవత్సర కాలం  గంగానదిలో స్నానం చేసిన ఒక కల్పకాలం విష్ణులోకమున నివసిస్తాడు.
  12. మరణ పర్యంతం  గంగానదిలో స్నానం చేసిన  సమస్త  కుల హితంగా భోగములను అనుభవించి విష్ణు లోకము చేరుకుంటాడు.
  13. ప్రాత:హకాల  స్నానం కంటే మద్యాహ్న కాల  గంగానదిలో స్నానం పదింతల ఫలితం ఇస్తుంది. సాయం కాల  గంగా స్నానం వందరెట్లు   ఫలితం ఇస్తుంది. 
  14. శివ సన్నిధిలో చేసిన  గంగా స్నానం అనంత ఫలము ఇచ్చి కోటి కపిల గోవులను దానం చేసిన ఫలితం ఇస్తుంది. 
  15. హరిద్వార, ప్రయాగ, సాగరసంగమంలో  చేసిన  గంగా స్నానం విశేష ఫలం లభించును.
  16. ఇంట్లో   స్నానం చేయునప్పుడు కూడా గంగను స్మరించిన స్వర్గలోకం లభిస్తుందని వరుణుడు చెప్పాడు.
  17.  గంగానదిలో స్నానం చేసిన  వారు సూర్యమండలాన్ని చేదించుకుని మొక్షపదవిని పొంద గలరని సూర్యుడు చెప్పాడు.
File:Ganges at Haridwar, Uttarakhand.jpg
హరిద్వార్ వద్ద గంగా నది
  1. మాఘమాసములో  గంగానదిలో స్నానం చేసిన తన గోత్రము వారితో కలిసి ఇంద్ర లోకమున నివసించును.
  2. యదా నిధిగా  నిరంతరం గంగానదిలో స్నానం చేసిన శత కోటి కల్పములు బ్రహ్మ లోకంలో నివసిస్తాడు.
  3. ఆరు మాసములు ఒంటి పుట భోజనం చేసి ఉత్తరాయణ కాలంలో ఒక సారి  గంగానదిలో స్నానం చేసిన 100 తరములను ఉద్ధరించి విష్ణులోకం చేరుకుంటాడు. 
  4. అన్ని సంక్రమణలలో గంగానదిలో స్నానం చేసిన ఆర్క వర్ణ విమానంలో విష్ణు లోకం చేరుకుంటాడు.
  5. విశువ అయన గంగా స్నానం మరింత ఫల ప్రదం. 
  6. కార్తిక మాసంలో  గంగానదిలో స్నానం చేసిన తపసు చేసిన ఫలితం లభిస్తుంది. 
  7. మేష సంక్రమణ ఉదయం   గంగానదిలో స్నానం చేసిన మాఘమాస  గంగానదిలో స్నానం కంటే అధిక ఫలితం   ఇస్తుంది.
  8. అక్షయతిధి, కార్తీకమాసం, వైశాఖమాసం చేసిన గంగా స్నానం  సంవత్సర కలం గంగానదిలో స్నానం చేసిన ఫలితం ఇస్తుంది.
  9.  యుగాది కాలములో  గంగానదిలో స్నానం చేసిన మూడు మాసముల  గంగానదిలో స్నానం చేసిన ఫలితం ఇస్తుంది

తిధులు నక్షత్రాలు పండుగలు


File:Shiva in rishikesh.jpg
ఋషీ కేస్ వద్ద గంగానది
  1. శ్రవణానక్షత్ర  యుక్త ద్వాదశి, పుష్యమీ   నక్షత్ర యుక్త అష్టమి, అర్ధానక్షత్ర యుక్తచతుర్ధసి రోజులలో గంగాస్నానం చేయడం  దుర్లభం.  
  2. మఘా  నక్షత్ర యుక్త పూర్ణిమ, కార్తిక మాఘ అమావాస్యలలో సు దులర్లభం.
  3. క్రష్ణాష్టమి  గంగాస్నానం చేయడం సహస్ర స్నాన ఫలం ఇస్తుంది.
  4. అన్ని పండుగలలో గంగాస్నానం చేయడం శత స్నాన ఫలం ఇస్తుంది.
  5. అమావాస్య, అష్టమి, మాఘ కృష్ణ పక్ష గంగా స్నానం  విశేష ఫలితం ఇస్తుంది.
  6.  మహోదయ   గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం   శత స్నాన ఫలితం ఇస్తుంది. 
  7. అర్కోదయ  గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం  లక్ష  స్నాన ఫలితం ఇస్తుంది. 
  8. సూర్య, చంద్ర గ్రహణ   గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం  ముడుమాసాల  స్నాన ఫలితం ఇస్తుంది.
  9. ఫాల్గుణ ఆషాఢ మాసాల   గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం  ముడుమాసాల  స్నాన ఫలితం  ఇస్తుంది.
  10. జన్మ నక్షత్ర గంగా స్నానం జన్మంతా చేసిన పాపాన్ని హరిస్తుంది.
  11. మాఘమాసము పూర్ణంగా గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం  పునర్జన్మ జ్ఞానం ప్రసాదిస్తుంది. సర్వ శాస్త్రార్ధ   జ్ఞానం, రోగ రహితం ఇస్తుంది.
  12. సంక్రాంతి, అమావాస్య, పూర్ణిమ, సూర్య చంద్ర గ్రహణ సమయంలో   గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం బ్రహ్మలోక ప్రాప్తి కలిగిస్తుంది.
  13. సాధారణంగా చంద్రుడికి లక్ష గుణములు సూర్యుడికి దశ గుణములు గంగా తీరమున చంద్రుడికి కోటి గుణములు సూర్యుడికి దశ  గుణములు ప్రాప్తిస్తాయి.
  14. గంగా నది భూమికి దిగివచ్చిన జ్యేష్ట శుద్ధ దశమి నాడు  గంగాస్నానం చేయడం 100 ఆశ్వ మేధా యాగముల  కంటే 100 రెట్లు అధిక ఫలం ఇస్తుంది.
  15. మాఘమాస పూర్ణిమ గురువుతో కలిసి యుండిన రోజు  గంగాస్నానం చేయడం గంగాస్నానం చేయడం నూరు సూర్యగ్రహణ జలితం ఇస్తుంది.

ప్రదేశం 

File:Dashashwamedha ghat on the Ganga, Varanasi.jpg
వారణాసి వద్ద గంగానది
  1. కురుక్షెత్రమున  గంగా స్నానం చేయడం దశ స్నాన ఫలం ఇస్తుంది. 
  2. విధ్యపర్వతంతో కూడిన  గంగా స్నానం చేయడం  కురుక్షెత్రమున  గంగా స్నానం చేయడం 100 రెట్ల గంగా స్నాన ఫలితం ఇస్తుంది.
  3. కాశిలో గంగా స్నానం వింధ్య  గంగా స్నానం చేయడం 100 రెట్ల గంగా  స్నాన ఫలితం ఇస్తుంది.
  4. గంగా ద్వారము, ప్రయాగ గంగా స్నానం స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది. ఇక్కడ మరణించిన వారికీ పునర్జన్మ లేదు.
  5. గంగాద్వారం కుశావర్తంలో  గంగా స్నానం చేయడం ఏడు రాజసూయముల, రెండు ఆశ్వమేధాముల  ఫలం లభిస్తుంది. ఇక్కడ ఒక పక్షము నివసించిన విశ్వజిత్ యాగా ఫలం, లక్ష గోదాన ఫలం లభిస్తుంది. ఇక్కడ స్నానం చేసి గోవిందుని దర్సనం చేసిన , కనఖల క్షేత్రంలో రుద్రుడిని దర్శించిన అక్షయ పుణ్యం  పొంద గలడు. 
  6. మహా విష్ణువు వరాహ అవతారం ఎత్తిన సౌకర తీర్ధంలో  గంగా స్నానం చేయడం వలన శతాగ్ని చతుపుణ్యం , రెండు జ్యోతిష్టోమ యాగ ఫలం,  వేయి అగ్నిష్టోమ  ఫలం, మూడు ఆశ్వ మేధ యాగఫలం పొంద గలడు. ఇక్కడున్న బ్రహ్మతిర్ధమున స్నానం చేసిన పదివేల  జ్యోతిష్టోమ యాగ ఫలం,   మూడు ఆశ్వ మేధ యాగఫలం  పొంద గలడు. 
  7. కుబ్జ తిర్ధమున  గంగా స్నానం చేయడం వలన సకల వ్యాధులు నశిస్తాయి. సకల జన్మల సంచిత పాపములు నశిస్తాయి. ఇక్కడ ఉన్న కపిల తీర్ధంలో  గంగా స్నానం చేయడం వలన 80 వేల కపిల గోవులను దానం ఇచ్చిన ఫలం లభిస్తుంది.
  8.  పవిత్ర తిర్ధమున  గంగా స్నానం చేయడం వలన రెండు విశ్వజిత్ యాగముల ఫలం కలుగుతుంది.
  9.  గంగానది సరయూ నది సంగమం అయిన వేణి తీర్ధం లో గంగా స్నానం చేసి రుద్రుని పూజించిన రుద్ర లోకం, విష్ణువును పూజించిన విష్ణు లోకం చేరుకుంటారు.  అలాగే  అయిదు ఆశ్వ మేధ  యాగఫలం  పొంద గలడు.
  10.  గాండవ తిర్ధమున   గంగా స్నానం చేయడం వలన వేయి గోవులను దానం చేసిన ఫలం పొందగలరు.
  11. సోమక తిర్ధమున స్నానం చేసిన వారణాసి స్నాన సమము. 
  12. కౌసికి నది గంగానదితో సంగమించే ప్రదేశంలో   గంగా స్నానం చేయడం వలన ఇంద్రుడికి ప్రియ అతిథి ఔతాడు.
  13. జహ్నుపదమున   గంగా స్నానం చేయడం వలన 21 తరముల వారిని తరింప చేయును.
  14. అతిథి మహావిష్ణువును పుత్రుడిగా పొందిన అతిథి తీర్థమున గంగా స్నానం చేయడం వలన మహా ఫలప్రదము ఔతుంది.
  15. శిలోచ్చయములో ఉన్న ఇంద్రాణి తిర్ధమున   గంగా స్నానం చేయడం వలన ప్రయాగ  సమన స్నాన ఫలం వస్తుంది. 
  16. దక్ష ప్రయాగ    గంగా స్నానం చేయడం వలన   ప్రయాగ స్నాన ఫలం, అక్షయ పుణ్యం  పొద వచ్చును.
  17. ప్రద్యుమ్న తిర్ధమున   గంగా స్నానం చేయడం వలన మహోదయ స్నాన ఫలం వస్తుంది.

గంగాదేవి మహిమ

File:Gangotri temple.jpg
గంగిత్రి వద్ద గంగాదేవి ఆలయం
  1. గంగాదేవి సమీప ప్రాంతములు మాత్రమే జానపదములు, పర్వతములు ఆశ్రమములు అంటారు.
  2. గంగను సేవించిన కలిగే సద్గతి తపసుచేత, బ్రహ్మచర్యముచేత, యజ్నములచేత, త్యాగముచేత కూడా లభించదు.
  3. యౌవనంలో పాపకర్మలు చేసిన వారు కూడా వృద్ధాప్యంలో గంగను సేవించిన ఉత్తమ గతిని పొందగలరు.
  4. వేయి యుగములు ఒంటి కాలు మిద తపము చేసిన వాడు కూడా ఒక మాసం గంగను సేవించిన వాడు పొందే ఫలముతో సమానమైన ఫలము మాత్రమే పొందగలడు.
  5. పదివేల  యుగములు తల కింద పెట్టి తపసు చేసిన వారు పొందే ఫలం  యదేచ్చగా గంగానదిలో  నిలిచిన వాణి కంటే  తక్కువగా భావించబడతాడు. 
  6. దుఃఖము చేత  కొట్టబడిన వారి మనసు కలవాడు ఉత్తమగతి కొరకు గంగను సేవించడం తప్ప మరొక మార్గం లేదు.
  7. ఘోరపాపములు చేసి నరకమునకు పోయే వారిని నిరోధించి తరింపజేసే శక్తి గంగాదేవికి ఉంది.
  8. సదా గంగను సేవించు వారు మునులతో దేవతలతో సమానులుగా భావించబడతారు.
  9. అంధులను, జడులను, విస్వాసహీనులను కూడా గంగాదేవి పావనము చేయగలదు.
  10. బహుళ పంచమి  నుండి అమావాస్య వరకు గంగాదేవి మానవులకు సన్నిహితముగా ఉంటుంది.  శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు గంగాదేవి పాతాళమునకు సన్నిహితముగా ఉంటుంది.  శుద్ధఏకాదశి నుండి బహుళ పంచమి వరకు స్వర్గమునకు సన్నిహితంగా  ఉంటుంది.
  11.  కృత యుగంలో సర్వక్షేత్రములు పావనములే, త్రేతా యుగంలో   పుష్కతీర్ధం పావనమైనది, ద్వాపర యుగంలో కురుక్షేత్రం పావనమైనది, కలియుగంలో గంగా తీర్ధం పావనమైనది.
  12. కలియుగములో సర్వ తీర్ధములు తమ తమ శక్తులను గంగలో నిక్షేపించాయి. అయినప్పటికీ గంగాదేవి మాత్రం తన శక్తిని ఎక్కడా నిక్షేపించదు.
  13. గగజలము ఒక బిందువును  అయినా తాకినా గంగా వాయువు చేత స్ప్రుసించబడినా కూడా పాపాత్ముడు ఉత్తమ గతిని పాడుతాడు.
  14. జ్ఞానస్వరుపుడైన జగన్నాధుడు గంగాజలం అందు నివాసం ఉంటాడు.
  15. గోహంతకుడు,  గురుహంతకుడు,  చోరుడు,  బ్రహ్మహత్యచేసిన వాడు, గురుతల్పపగతుడు కూడా గంగాజలం పానము చేసిన విముక్తుడు ఔతాడు.
  16. సాలగ్రామ సిలను గంగా జాలం చేత అభిషేకించినవాడు తీవ్రమైన అజ్ఞానం పోగొట్టుకుని ఉదయభానుడిలా ప్రకాశిస్తాడు.
  17. మేరుపర్వత గుణములు, సువర్ణ గుణములు,  సర్వరత్న గుణములు,  పాషాణ సమాఖ్య, ఉదక సమాఖ్య,  గంగాజల గుణ సంఖ్య చెప్పడానికి వీలు కానివి.
  18. విధిగా సకల తీర్ధములను సేవించని వాడు కూడా గంగను సేవించి తరించగలడు.
  19. చింతామణి  కంటే గంగాజల బిందువు వాంచితములను తీర్చగలదు.
  20. భక్తిచేతగంగాజలంసేవించిన వారు కామధేనువుఇవ్వగలిగిన భోగముల కంటే అధిక భోగములను పొందగలరు. 
  21. మనోవాక్కాయ కర్మల చేత చేసిన పాపములు కూడా గంగాజలం దర్శించిన పాపవిముక్తులు ఔతారు.
  22. గగజాల అభిషిక్తమగు భిక్షను స్వీకరించిన పాము కుబుసము విడిచినట్లు పాపముల నుండి విముక్తులు ఔతారు.
  23. విష్ణుభజన చేత ఆపదలు తొలగినట్లు గంగాజలం పానము చేసిన వారి హిమాలయపర్వత సమాన పాపముల నుండి విముక్తులు ఔతారు.
  24. గంగాజలంలో ప్రవేశించినంత బ్రహ్మహత్యాది పాతకములు పారిపోతాయి.

గంగాతీర వాసఫలం

File:Temples on the bank of Ganges, Varanasi.jpg
వారాణసిలో గంగాతీర నివాసాలు 
  1. నిత్యం గంగా తీరంలో నివసించి గంగాజలం పావనము చేసిన పూర్వజన్మ సంచిత పాపములు కూడా తొలగి పోతాయి.
  2. నిత్యం గంగను ఆశ్రయించిన వాడు దేవతల చేత, మహారుషుల చేత పూజింపబడతాడు.
  3. బహుముఖ యజ్ఞములు, అష్టాంగ యోగములు, యాగములు, తపముల కంటే నిత్యం గంగా తీరంలో నివసించిన అధిక ఫలం పొందగలరు.
  4. యజ్ఞం, యమ, నియమ, తపసులకు కూడా గంగను సేవించిన వారికి  కలుగు ఫలం కలుగదు.
  5. రాహుగ్రస్త సూర్య గ్రహణంలో సహస్ర గోదానం చేసిన కలిగే ఫలం  గంగను సేవించిన కలుగును.
  6. సదా కృచ్చ వ్రతం చేసిన కలిగే ఫలితం,  చంద్రయాణ వ్రతం  చేసిన కలిగే ఫలం గంగాతిర వాసం ఇస్తుంది.
  7. సత్యవచనము,  నైష్టిక బ్రహ్మచర్యము, నిత్యగ్ని హోత్రము చేసిన కలుగు ఫలం గంగాతిరవాసి పొంద గలడు.
  8. గంగా భక్తి మాతృ పితృ దారాలను కోటి కులముల వారిని కూడా సంసారసాగరం నుండి తరించగలదు.
  9. సంతోషము, పరమ ఐశ్వర్యం, తత్వజ్ఞానం, వినయం ఆచార శీలం గంగా భక్తుడికి సమకురుతుంది.
  10. భక్తి  చేత గంగాజలం పానం చేసినా, తాకినా మోక్షం తధ్యం.
  11. గంగాజలం చేత సకల కార్యములు చేసిన వాడు సర్వయజ్న దీక్షితునితొ సమానం.సోమపానం చేసిన వాడితో సమానుడు ఔతాడు.
  12. దేవతలు సూర్య చంద్రులు అమృత పానం చేసినట్లు గంగా పానం చేసిన వారు దేహం విడిచిన తరువాత శివుని సన్నిధికి చేరగలరు.
  13. కన్యాదానము, గోదానము,  భూదానము, రధ, ఆశ్వ, గజ  దానం చేసిన ఫలం కంటే చుక్క గంగా జలం త్రాగిన వారు నూరు రెట్లు అధికంగా పొందగలరు.
  14. సహస్రచాంద్రాయణ వ్రతం చేసిన ఫలం కంటే అధిక ఫలం గగజాలం పానము చేసిన వారికి  లభిస్తుంది.
  15. గండూష మాత్రం గంగాజల పానం అస్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుంది.
  16. ఇష్టపూర్వకంగా గంగా జాలం సేవించిన వారికి మోక్షం కరతలామలకం.
  17. శాస్త్ర విధితో తర్పణం చేసిన, అస్థులు గంగలో కలిపినా ఉత్తమ గతి లభిస్తుంది.
  18. గంగను దర్శించిన వాడు,  స్తుతించిన వాడు, స్నానం చేసిన వాడు, గంగా జాలం భక్తీ చేత పానం చేసిన వాడు స్వర్గం, పవిత్రజ్ఞానం,  ఉత్తమ యోగం, మోక్షం పొందుతాడు.
  19. గోమయం,  గోమూత్రం,గో క్షీరం పానం చేయడానికంటే సూర్యకిరణ పరితప్త గంగాజల పానం అధిక ఫలితం ఇస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి