5, సెప్టెంబర్ 2012, బుధవారం

బదరీ నాద్

 బదరీ నాద్ 



ఎలాగైతేనేం చిన్నగా బదరీ నాద్  చేరుకున్నాము. అప్పటికి బాగా చీకటి పడింది. బదిరీ చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమద్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.

File:INDO-TIBETAN.JPG
భారత్ టిబెట్ సరిహద్దు 
File:Badrinath Valley, along the Alaknanda River, Uttarakhand.jpg
అలకంద తీరంలో బదిరీ క్షేత్రం 
బదిరీ  చేరగానే  మేము  చిన్న జీయర్  మఠంలో బస చేసాము. మాకు మఠంలో గదులు ఇచ్చారు. మా గదిలో చేరి చూస్తే పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు అర్ధమైంది. దాదాపు అన్ని గదులు అలానే ఉన్నట్లు మాకు తరువాత తెలిసింది. గదిలో అక్కడక్కడా నీరు చిన్న చిన్న మడుగులుగా ఉంది. గోడల వెంట నీరు స్రవిస్తూ గోడల వెంట తడిగా ఉంది. పైకప్పు నుండి కూడా అక్కడక్కడ నీటి బొట్లు పడుతూ ఉన్నాయి. బెడ్ మీద మాత్రం నీరు పడడం లేదు. అది చూసి కొంత ఊరట కలిగినది. బెడ్ మీద కప్పుకోవడానికి పరుపుల వంటి దుప్పట్లు ఉన్నాయి. అంటే పాతకాలపు బొంతల వంటివి ఇప్పటి కంఫర్ట్ వంటివి అన్న మాట. చేతులు కాళ్ళు స్వాధీనంలో  లేవు.  మేము తీసుకు వెళ్ళిన స్వెట్టర్లు ఏమాత్రం అచలిని ఆపలేక పోయాయి. అంటే అక్కడి చలికి జర్కిన్ సరి పోవచ్చు. కాని మాలో చాల మందికి జర్కిన్ తీసుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. చేతులకు గ్లౌజులు తోడుక్కున్నాము. కాళ్ళకు సాక్స్ వేసుకోవడానికి మాత్రం వీలు కాలేదు. గదిలో తడి కారణంగా కాళ్ళకు సాక్స్ వేసుకోవడానికి వీలు కాలేదు.  బాత్  రూం ముందు నీరు మడుగుగా ఉంది. బాత్   రూం వెళ్ళడానికి కూడా మనస్కరించ లేదు. కప్పుకునే కంఫర్ట్ పట్టుకుని చూసాను అవి  కూడా తడిగా ఉన్నాయి. అది చూసి చాల నిరాశ  కలిగింది. అయినప్పటికీ పరవాలేదనుకుని అవి తీసుకుని కప్పుకున్నాను. 
File:Badrinath landscape.JPG
శితా కాలంలో బదిరీ 
ఇక అంతే అరగంట లోపల చలి నుండి కొంత తగ్గి ఉపశమనం కలిగింది.  ఇక లేవాలని అనిపించలేదు. ఇక భోజననినికి కూడా లేవనని చెప్పాను.
File:Badrinath.JPG
బదిరీ సమీపంలో హిమాలయ శిఖరాలు 
కానీ అప్పుడే తలుపు తట్టి సహాయకులు యాత్రా లోపలకు వచ్చి మాకు వేడి వేడి బజ్జీలు కాఫీలు అందించారు. మా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వారు ఇలా వంట చేసి గది వరకు తీసుకు రావడం చూసి వారి సామర్ధ్యానికి మనసులోనే మెచ్చుకోకుండా ఉండ లేక పోయాను. ముందు ఏమి తిననని చెప్పినా మావారు  తిరిగి తిరిగి  చెప్పడంతో కాదని చెప్పలేక అవి తీసుకుని   అలా దుప్పటి  పైకి   లేవకుండా  తీసుకుని చేతులు  మాత్రమే బయట పెట్టి వాటిని తిని కాఫీ త్రాగాను. బజ్జీలు చాల రుచిగా అనిపించాయి.  బహుశా ఆ చలిలో లభించినవి కునుక అంత  రుచిగా ఉన్నాయేమో మరి. ఇప్పటికి కూడా నిర్వాహకుల, పని వారి ప్రతిభకు జోహార్లు చెప్పకుండా ఉండలేక పోతున్నాను.  అక్కడ చలి వివరించడానికి ఇంతగా వర్ణించవలసి వచ్చింది. ఇంతకీ  అది మే మాసమే ఇప్పుడే ఇలా ఉంటే అక్టోబర్ మాసం సంగతి ఏమిటి. అందుకే  అక్టోబర్ తరువాత బదిరిలో ఎవరు ఉండరు. ఊరంతా  ఖాళిచేసి వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారు.  అనేకంగా ఇక్కడ ఉండేవి తాత్కాలిక నివాసాలు మాత్రమే.

File:Badrinathji temple.JPG
బదరీ  నాధుడి ఆలయం 
badrinath003.htm
దూరం నుండి బదిరీ 
అలా మేము కొంత సమయం జరిపిన తరువాత మమ్మలిని భోజనానికి రమ్మని చెప్పారు. నేను కొంత విశ్రాంతి తీసుకున్నాను కనుక తిరిగి ఓపిక వచ్చింది. అందుకే భోజనానికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాము. భోజనం జీయర్ ఆశ్రమంలో చేయాలి. అందరం కలిసి భోజనానికి వెళ్ళాం. ఆశ్రమానికి వెళ్ళే దారిలో గడ్డకట్టిన మంచును చూసాం. మంచును అటు ఇటు నెట్టి దారి చేసారు. అలా గడ్డ కట్టిన మంచును చూడడం మాలో చాల మందికి ఇదే మొదటి సారి కనుక మేము ఆశ్చర్యంగా దానిని చూసాం. మంచు మాత్రం మట్టితో కలిసి కొంచం ఎర్రగా ఉంది. ఆశ్రమ నిర్వాహకులు మాకు రొట్టెలు డాల్ ఉప్మా పెట్టారు. తరువాత పాలు మజ్జిగ వంటివి కూడా ఇచ్చారు.   వారి సేవా తత్పరతను మెచ్చుకోకుండా ఉనడలేక పోయాను. ఆశ్రమంలో భోజనం చేసిన తరువాత మా ప్లేట్లను మేము కడిగి పెట్టాము . ఆశ్రమంలో ఇలాంటి పధ్ధతి అమలులో ఉన్నట్లు ఉంది. అందరం కొంత సేపు మాట్లాడుకున్నాం. మేము ఇప్పుడు అక్కడి చలికి కొంత అలవాటు పడ్డాం మరి.



Rishikesh
అలకనదా నది పై వంతెన 
badrinath001.htm
మర్గామద్యంలో ఒక దృశ్యం 
గదులకు తిరిగి వచ్చి పడుకున్నాం. మద్యలో బాత్ రూం పోక తప్ప లేదు. పోయే దారిలో నీటిలో కాలు పెట్టగానే కాళ్ళు కొంగర్లు పోయాయి. చేతులు కడగడానికి మాత్రం బాగా ఇబ్బంది పడ్డాం. చేతులు కడిగినప్పుడు బాగా కొంగర్లు పోయాయి.  కళ్ళు చేతులు బాగా నొప్పులు పుట్టాయి. అయినప్పటికీ నిద్ర మాత్రం బాగా పట్టింది. అలాగే తెల్ల వారింది. ఇక తిరిగి మరో ప్రమాదం ఎదురైంది. పళ్ళు తోముకోవడం పెద్ద సమస్య అయింది. నీళ్ళు వస్తున్నాయి కానీ చేతులు పెట్ట లేక పోతున్నాం. పళ్ళు తోముకోవడానికి మినరల్ వాటర్ భద్ర పరిచాము కానీ  అవి కూడా బాగా చల్లబడ్డాయి. ఇక వేరే దరి లేక వాటితోనే పళ్ళు తోముకున్నాం. ఇక స్నానాల సంగతి చూడాలి కదా అందరం ఆశ్రమానికి వెళ్ళాం. మేము అక్కడ వేడి నీరు దొరుకుతుందని భావించాము. అప్పుడు అశ్రమంలోని వారు చెప్పిన విషయం నన్నుఆశ్చర్య పరచింది.  బదరిలో చాలా మంది  బస వద్ద స్నానాలు చేయరట. అందరు ఉష్ణగుండంలోనే  స్నానాలు చేయాలట. ఇక అందరం కలిసి స్నానానికి బయలుదేరాము.


Hotwater Springs( Tuptkund) near Temple
ఉష్ణ కుండం 
Steam from the Hot Spring near the Temple
దూరం నుండి ఉష్ణ కుండం 
బదిరిలో ఉష్ణ గుండం ఆలయం సమీపంలో ఉన్నది. అక్కడ స్త్రీలకు పురుషులకు ప్రత్యేక  విభాగాలు ఉన్నాయి. అక్కడ సన్యాసులు యాత్రికులు ఇతరులు ఎవరైనా కానీ అక్కడ ఆరుమాసాలు  మాత్రమే ఉమ్తారట. అక్కడ  ఉండి  పని చేసుకుంటున్న వారు కూడా  స్నానాలు  చేస్తారు కనుక రద్దీ చాల అధికంగా ఉంది. ఉశాన గుందాలలో నీరు చాల వేడిగా ఉంది. మోకాలు లోతులో మాత్రమే ఉంది. చేతిలో మగ్గు పట్టుకుని ముంచుకుని స్నానాలు చేయాలి. స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యెక ప్రదేశాలు ఉన్నాయి. ఉష్ణ గుండలలో స్థల చాలని వారు పక్కన ఉన్న పైపుల వద్ద స్నానాలు చేయవచ్చు. ఇలా కొందరు ఇబ్బందులు పడుతూనే స్నానాలు ముగించి దుస్తులు మార్చుకుని తిరిగి గదులకు చేరాము.

ఆరోజుకు ఆశ్రమంలో ఫలహారం ఉండదు. వారంతా దర్శనం  చేసుకోవడానికి ఆలయానికి పోతారు. మేము కూడా ఆలయానికి వెళ్ళాలని అనుకున్నాము. ఇంతలో మావారికి బాగా అస్వస్థత చేసింది. పైకి లేచే ఓపిక లేదు. నాకు చాల దిగులు అనిపించింది. ఇంత దూరం ఇంత శ్రమపడి వచ్చినా  దర్శ నం చేసుకునే భాగ్యం  లేదా అని వేదన కలిగింది. అయినప్పటికీ దేవుడి మీద భారం వేసాను. అయన అనుగ్రహిస్తేనే దర్శన భాగ్యం లభిస్తుందని మనసు దిటవు చేసుకున్నాను. మా వద్ద అన్నింటికీ మాత్రలు ఉన్నాయి. కానీ మాత్ర వేసుకోవడానికి నీరు లేదు. ఏమి చేయాలో  పాలుపోలేదు. అప్పటికే అందరూ ఆలయానికి బయలు దేరారు. నాకు ఏమి తోచక  ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఎవరు లేరు ఒకరిద్దరు ఉన్నా వేడి నీరు లభ్యం కావని చెప్పారు. ఆశ్రమంలో పొయ్యి కూడా ముట్టించ లేదు.  ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయ సమీపంలోనే వేడి నీరు లభించే అవకాశం ఉంది. మా వారితో చెప్పి తిరిగి ఆలయ సమీపానికి బయలు దేరాను. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. స్వెట్టర్ వేసుకోవడానికి వీలులేదు. అయినప్పటికీ వేడి నిటి వర్షంలో తడుస్తూనే వెళ్ళాను. నా  వద్ద గొడుగు కూడా లేదు. అక్కడ ఫలహరశాలలో వేడి నీరు లభిస్తుందని అనుకున్నాను. కాని వారు వేడి నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. నాతో  ఒక గ్లాసు తీసుకు వెళ్ళాను కనుక టీ తీసుకు వెళ్లి మాత్ర వెయ్యచ్చు అని నిర్ణయించుకుని టీ  కొనుకున్నాను.  ఇంకా సన్నగా వర్షం పడుతూ ఉంది. ఉదయం నుండి స్వెట్టరు ఉపయోగించకుండానే తిరుగుతున్నాను. వర్షానికి  స్వెట్టర్ తడుస్తుంది కదా. నేను కూడా అడ్డం పడతానని సందేహం వచ్చింది. అయినప్పటికీ ఏదైనా పరవాలేదని ధైర్యంగానే ఉన్నాను. అదృష్టవశాత్తు యాత్ర మొత్తం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పటికి నాకు చలి బాగా అలవాటు అయింది. అవసరం అలా మారుస్తుంది అనుకున్నాను. వర్షంలో బాగా తడుస్తూ టీ తడవకుండా కాపాడుకుంటూ దాదాపు ఒక కిలోమిటర్ దూరం నడిచి గదికి చేరుకుని మావారికి ఇచ్చి మాత్ర వేయించాను.  వారితో చెప్పి దర్శ నానికి పోతానని మెల్లిగా అడిగాను. వారు కూడా దర్శనం  చేసుకోవడానికి వస్తానని చెప్పారు. ఓపిక చేసుకుని నడుస్తానని చెప్పారు. అప్పటికే తడిసిన దుస్తులు మార్చుకుని దర్శనం చేయడానికి ఇద్దరం బయలుదేరాం. 
ఆలయ ప్రమ్గానంలో భక్తులు 
బడిరి నాధుడు 
మెల్లిగా నడిచి ఆలయ ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ ఉన్న చిన్న చిన్న హోటళ్ళలో కాఫీ త్రాగి దుకాణాలలో పూజ సామాగ్రి కొనుక్కుని దర్శనం చేయడానికి ఆలయం వద్దకు చేరుకున్నాం. అప్పుడే ఆలయం తెరిచారు. అందరిలో  ఆనంద ఉత్సాహాలు ఉప్పోగాయి. భక్తుల మీద పూలతో చేర్చిన పవిత్రోదకం చల్లారు. అసమయలో అక్కడ ఉన్నందుకు అనందం కలిగింది. అక్కడ సైనిక  బృందం వారు మాత్రమే  భక్తులను క్రమపరిచే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రదేశం అంతా వారి అధధీనంలో మాత్రమే ఉన్నట్లు కనిపించింది. వారు మాతో క్యూలో వెళ్లి దర్శనం చేయాలని చెప్పారు.


Badrinath street scene
ఆలయ ప్రమ్గానంలో దుకాణాలు 
Himalayan Village Mana,near Badrinath,trekking attraction
దూరం నుండి సుందర ప్రక్రుతి ఒడిలో బదరీ 
మేము క్యు వెతుక్కుతూ వెళ్ళాము. అప్పటికే భక్తుల క్యూ పెద్దదిగా అయింది. ఎంత దూరం పోతున్న పోతూనే ఉంది. ఇంతలో అక్కడ ముందుగా వెళ్ళిన మా బృదం వారు మమ్ము చూసి తమ పక్కన మమ్మల్ని వారిమద్య  నిలబడమని చెప్పారు. మేము క్యూ లో నిలబడి  మెల్లగా కదులుతూ ఉన్నాము.  మా వారికీ నిలబడే శక్తి లేదు. అందరి సహకారంతో అక్కడక్కడా కూర్చుంటూ లేస్తూ వస్తున్నారు. కొండ చరియల పక్కన క్యూ లైన్ ఉన్నందున బండల మీద కుడా కూర్చునే వీలు ఉన్నది.  అల ముందుకు సాగుతూ అక్కడక్కడా   ముందుకు కదులుతూ ఉన్నాము. ఒక వైపు రొట్టెలు పూరీలు  చేసి  భక్తులకు అంద  చేస్తున్నారు.    తింటూ ఉన్నారు. మాలో కొంత మంది  తీసుకుని తిన్నారు.  పూర్తిగా   ఉత్తర భారతీయ శైలిలో ఉంది. 3-4  గంటల సమయం క్యూలో నిలిచిన తరువాత ఆలయాన్ని సమీపానికి చేరుకున్నాము.


A view of the Temple
ఆలయంలో భక్తుల రద్దీ 
Himalayan Peak "Neelkanth" at backside of temple
బడిరి నుండి హిమాలయ శిఖర దృశ్యం 
ఆరోజు ఆలయం తెరుస్తారు కనుక భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఎంతటి  వారికైనా ప్రత్యేక  దర్శనాలు ఉన్న జాడ కనిపించ లేదు. అయినప్పటికీ భక్తులు క్యూ క్రమంగా లేదు. విపరీతమైన తోపిడికి  గురి  ఔతూ  ఉంది. సాధారణంగా ఉత్తర భారత దేశంలో ఇలాగే ఉండేలా ఉంది.  వారి తోపిడికి పలుమార్లు కిందకు  పడే అంత పని అయింది. ఆ ప్రదేశం ఎగుడు దిగుడుగా ఉంది. పడకూడ సైనికాధికారులు మాకు సహకరించారు. ఆ వత్తిడికి తట్టుకోలేక మా బృదం మాత్రం వారిని బాగా విమర్శిస్తున్నారు. వీరికి నిర్వహణ చేత కాదని తెలుసుకోవాలంటే తిరుమలకు రమ్మని అక్కడ రోజు కొన్ని వేల మందికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నారని అంటూ ముందుకు పోతున్నారు.


badrinath257.jpg
ఆలయం లోని దృశ్యం 
badrinath023.jpg
దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు 
చివరకు ఎలాగైతేనేం ద్వారాలన్నీ దాటి ఆలయ ముఖద్వారం చేరుకున్నాం. అప్పుడు మా బృందంలో ఒకరికి గోడ తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. అయన కోపంతో భార్యను తీసుకుని దర్శనం  చేయకుండా వెను  తిరగడం కొస మెరుపు. అంత సమీపానికి వెళ్ళినా దర్సనం చేయాలంటే బదరీ నాధుడు అనుగ్రహం కావాలని నాకు అనిపించింది. మావారికి అస్వస్థతగా  ఉన్నా మేము దర్శనం చేయగలిగినందుకు బదరీ నాధుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. భగవతుడి దర్శనం దంపత్సమేతంగా చేయడమే ఫలితమిస్తుంది. లోనికి సమీపించి బదరీ నాధుడిని దర్శనం చేసాము. మా బృదంలో  కొందరు చిల్లర డబ్బులు ముతా కట్టుకుని తీసుకు వచ్చి అక్కడ బదరీ నాధుడి పక్కన ఉండే కుబేరుడి ముందు ఉంచి ఇవ్వమని అడిగి అలా చేయించి తీసుకున్నారు. అక్కడ అలా చేయడం ఆనవాయితీ అని అలా చేస్తే సంపద అభివృద్ధి చెందుతుందని మాకు చెప్పారు. విజయవంతగా దర్శనం పూర్తీ చేసుకుని అలా  వెలుపలికి రాగానే వర్షం తిరిగి ప్రారంభం అయింది. గర్భాలయం చుట్టూ పై కప్పు లేదు. అయినా ప్రదక్షినమ్ చేయకునాడ ఎలా వెళ్ళగలం. కనుక వర్షంలోనే ప్రదక్షిణం చేస్తూ పరివర దేవతలను చూసాం. లక్ష్మి దేవి, వినాయకుడు కూడా పరివార దేవతలలో ఒకరు. 
File:Brahma Kabal Spot.JPG
బ్రహ్మ కపాలం 
File:Bhadrinath Temple and Nar Narayan.JPG
నారా నారాయణ శిఖరాల మధ్య బదరీ నాధుడి ఆలయం 
ఇలా బదరీ నాధుడి దర్శనం పూర్తి  చేసుకుని ఆలయాని దాటి బయటకు రాగానే మా బృందంలో  వారు అక్కడ తద్దినం  పెట్టడానికి బయలు దేరారు.   బ్రహ్మ కపాలం పడిన చోటు అని అక్కడ పిండ ప్రధానం చేయడం ఉత్తమమని నిర్వాహకులు చెప్పారు. పెద్ద వారు లేని వారు పిండ ప్రధానం చేయడానికి వెళ్ళారు. అంతటి వానలో కూడా అలా శ్రద్ధగా వెళ్ళడం చుస్తే వీరికి మన ధర్మం మీద ఉన్న గురవం చూసి ముచ్చట కలిగింది. బ్రహ్మ కపాలం చూడాలంటే కొంత దిగువకు వెళ్లి చూడాలి. పిండ ప్రధానం చేవారు మాత్రమే అక్కడకు వెళ్లారు. మేము మాత్రం ఆశ్రమానికి తిరిగి వెళ్లి నిర్వాహకులు ఏర్పాటు చేసిన భోజనాలు చేసి మా గదికి చేరుకొని సామాను సర్దడం మొదలు పెట్టం. మాలో కొనదరికి బదిరీ అంట త్వరగా  వెళ్ళడానికి మనస్కరిచ లేదు.  ఇంకో రోజు  ఉంటామని అడిగారు. కానీ అల చేస్తే మిగిలిన యాత్ర సజావుగా జరగదు. అన్ని చోట్ల హోటల్ గదులు ముందుగా రిజర్వ్ చేసుకుంటారు కదా ! ఏమాత్రం ఆలస్యం జరిగిన యాత్ర మొత్తం అస్తవ్యస్థం ఔతుంది కదా !  విషయం అలోచించి మిగిలిన వారు వచ్చి చేరగానే అర్ధ మనసుతోనే బదిరీ  వదిలి బయలు దేరాము.  
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి