26, జులై 2012, గురువారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-1

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు 

అశ్విని 

* అశ్విని నక్షత్ర మొదటి పాదం :-  అశ్విని నక్షత్ర మొదటిపాదం మేషరాశిలో ఉంటుంది. నక్షత్ర అధిపతి కేతువు. రాశి అధిపతి కుజుడు.  నక్షత్ర అధి  దేవతలు అశ్వినీ  దేవతలు.  అశ్వినీ  దేవతలు దేవవైద్యులు.  అశ్వినీ దేవతలు సూర్యుడు సంజ్ఞా దేవి అశ్వరుపాలలో ఉన్నప్పుడు కలిగిన సంతానం. ఈ కారణంగా అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఉత్సాహవంతులుగా ఉంటారు. కనుక క్రీడా స్పూర్తి, వైద్యంలో నైపుణ్యం వీరికి సహజ గుణం. మొదటి పాదంలో జన్మించినవారు శస్త్రచికిత్స తత్సంబంధిత వృత్తులలో చక్కగా రాణించగలరు.  ఉత్సాహవంతులైన వీరికి కుజాధి పత్యం తోడు  ఔతుంది కనుక వీరవిద్యలు  నేర్చుకోవడానికి  వీరు ఆసక్తి కలిగి ఉంటారు. సైనికపరమైన వ్రత్తి ఉద్యోగాలలో  వీరు రాణించగలరు. ధైర్యవంతులై ఉంటారు. అవసరసమయాలలో దైర్యసహసాలు ప్రదర్శి స్తారు. వీరికి కేతు దశా శేషం దాదాపు అయిదు సంవత్సరాలు ఉంటుంది జన్మించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా తరువాత ఆరంభం అయ్యే శుక్ర దశ  కారణంగా విలాసవంతమైన సుఖవంతమైన జీవితం  మొదలుతుంది. ఇరవై అయిదు సంవత్సరాల కాలం సుఖవంతమైన జీవితం గడుపుతారు. తరువాత కొంత సౌక్యం తగ్గినా దాదాపు 51 సంవత్సరాల వరకు సమస్యా రహితంగా జరిగి పోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 69 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందివిద్యార్ధి దశలో విద్యకంటే  అలంకరణ వైపు, విలాసాల వైపు  మనసు మొగ్గే  ప్రమాదం ఉన్నది  కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్యవైపు మళ్ళించి విద్యలో విజయం సాధించి ముందుకు  సాగవలసి ఉంటుంది. తగిన సమయంలో వీరు జీవితంలో స్థిరపడతారు.  అశ్వినీ నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  ప్రభుత్వరంగ ఉద్యోగాలలో స్థిరపడే అవకాశాలు వీరికి  అధికంగా ఉంటాయి. సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.
* అశ్వినీ నక్షత్ర రెండవపాదం :- అశ్విని నక్షత్ర రెండవపాదం వృషభ రాశి లో ఉంటుంది. కనుక అశ్వినినక్షత్ర  రెండవ  పాదంలో జన్మించిన వారి మీద వృషభ రాశి అధిపతి  శుక్రుడు, నక్షత్ర అధిపతి కేతువు. నక్షత్ర అధి  దేవతలు అశ్వినీ  దేవతలు కలిసిన ప్రభావం ఉంటుంది. వీరికి బాల్యం నుండి విలాసవంతమైన, సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం ఔతుంది. వీరికి అందమైన వస్త్రాలు, ఆభరణాలు,  అలంకరణ వస్తువుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీ యమైన క్రీడలయందు ఆసక్తి కలిగి ఉంటారు. ఈత వంటి జల సంబంధిత క్రీడలు, ఉత్సాహవంతమైన ఆకర్షణ కలిగిన వ్రుత్తి ఉద్యోగాలలో వీరు రాణించగలరు. సముద్ర సంబంధిత వృత్తులలో స్థిరపడే అవకాశాలు వీరికి అధికం. ఇతర జల సంబంధియా వ్రుత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. వీరు ప్రయత్నపూర్వకంగా మనసును విద్యవైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది.  23 సంవత్సరాల కాలం సౌఖ్యంగా సాగిన జీవితం తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం దాదాపు 49 సంవత్సరాలకాలం సాఫీగాసాగుతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 67 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందిఅశ్వినీ నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  వీరికి పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడం పట్ల అధికంగా ఆసక్తి చూపుతారు. సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది. 
* అశ్విని నక్షత్ర మూడవ పాదం :-   అశ్విని నక్షత్ర ముడవపాదం మిధునరాశిలో ఉంటుంది. మిధునరాసి అధిపతి  బుధుడు. బుధుడు వైశ్యులకు అధిపతి. కనుక వీరు క్రీడలకు, వైద్యానికి సంబంధించిన వ్యాపారాలలో కూడా చక్కగా రాణిస్తారు. వీరు తమ వ్యవహారాలను మేధస్సును ఉపయోగించి పనులను చక్కబెట్టుకుంటారు.వీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా రాణించగలరు. వీరు బాల్యం నుండి సుఖసౌఖ్యాలను అనుభవిస్తారు. 22 సంవత్సరాల అనంతరం కొంత సౌఖ్యం కోరవడినా జీవితం 47 సంవత్సరాల కాలం సాఫీగా సాగి పోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 65 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుందివీరు క్రికెట్, టెన్నిస్, పరుగు పందాలు  వంటి క్రీడలలో రాణిస్తారు. వైద్యపమైన వ్యాపారం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. క్రీడ , వైద్య సంబంధిత వృత్తులలో అభివృద్ధిని సాధిస్తారు. మేధావంతులైన వీరు ప్రయత్న పూర్వకంగా విద్యయందు విజయం సాధించ వలసిన అవసరం ఎంతో ఉన్నది. అశ్వినీ నక్షత్ర  అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.
* అశ్విని నక్షత్ర నాలుగవ పాదం :-  అశ్విని నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది. కనుక వీరి మీద అశ్వినీ నక్షత్ర గుణమైన క్రీడా స్పూర్తి , మరియు వైద్యంలో ఆసక్తి నైపుణ్యంతో  చేరి కటకరాశి అధిపతి చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఔషధీ సంబంధిత వృత్తి ఉద్యోగాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది. రసాయనశాస్త్రం సంబంధిత విద్య ఉద్యోగాలంటే ఆసక్తి చూపుతారు. తామున్న రంగాలలో అందరికంటే ముందుండాలన్న పోటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఉత్సాహం నిరుత్సాహం కూడా వీరికి ఒక దాని వెంట ఒకటి ఉంటుంది. క్రీడా రంగంలో  కూడా వీరికి ఆసక్తి ఉండడం సహజం. బాల్యం నుండి సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. చిన్న వయసులో జీవితంలో స్థిరపడగలరు. విద్యకంటే వీరు సౌందర్య పోషణ పట్ల శ్రద్ధ వహిస్తారు కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి జీవితంలో ముందుకు సాగవలసిన  అవసరం ఏంటో ఉంది. 22 సంవత్సరాల వరకు సౌఖ్యవంతంగా సాగిన జీవితం తరువాత కొంత సౌఖ్యం కోరవడినా  45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. తరువాత రాహుదశ  కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 18 సంవత్సరాల అనంతరం 63 సంవత్సరాల వయసులో వచ్చే గురుదశ కాలంలో తిరిగి సౌఖ్యాలను అనుభవిస్తారు . వృద్ధాప్యం సుఖంగా జరిగి పోతుంది.అశ్వినీ  నక్షత్ర అధిపతి  కేతుగ్రహ ప్రభావం కారణంగా వీరికి దైవభక్తి వైరాగ్యం ఉంటుంది.  సాధారణంగా ఈ నక్షత్రజాతకులు దత్తుపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహంలో అత్యంత ఆదరం అభిమానం పొందే అవకాశాలు కుడా ఉంటాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుంది.

భరణి 

* భరణి నక్షత్ర మొదటి పాదం :- భరణి నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు.
నక్షత్ర అధిపతి శుక్రుడు. అధిదేవత యముడు. వీరికి ఆత్మవిశ్వాసం, అధిఖ్యభావన, అతిశయం కలిసి ఉంటాయి. వీరు జన్మించినది మొదలు సౌఖ్యంగానే జీవిస్తారు.  ప్రయత్నపూర్వకంగా వీరికి  విద్య పట్ల ఆసక్తి కలిగించాలి. విద్య ఆటంకం లేకుండా సాగిపోతుంది. ప్రభుత్వోద్యాగాలలో స్థిరపడే అవకాశాలు వీరికి అధికంగా ఉంటాయి. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వెండి వస్తువులు,  సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందమైన వస్త్రాలను  ధరించడం పట్ల వీరు జీవితమంతా ఆసక్తి కలిగి ఉంటారు. జల సంబంధ వృత్తులు , ఉద్యోగాలు,  వ్యాపారలపట్ల ఆసక్తులై ఉంటారు. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది.బాల్యంలో సౌఖ్యం తరువాత కాలంలో తగ్గు ముఖం పడుతుంది. 40 సంవత్సరాల వరకు సాఫీగా సాగిన జీవితంలో అ తరువాత రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని ఒడిదుడుకులకు ఎదురుతాయి .  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది . అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనంతర జీవితం సౌఖ్యంగా సాగుతుంది. అంటే వృద్ధాప్యం సౌఖ్యంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ధర్మం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది.  అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వెండి వస్తువులు, జలం సంబంధించిన వృత్తులు ఉద్యోగం వ్యాపారం వీరికి అనుకులిస్తుంది.
*  భరణీ నక్షత్ర రెండవ పాదం :-  భరణీ నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంతుంది. కన్యా రాసి అధిపతి బుధుడు. బుధుడు భుమికి అధిపతి. బుధుడు మేధస్సుకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడు వైశ్యులకు అధిపతి. కనుక వీరికి విలాస ప్రదేశాల నిర్వహణ, అలంకరణ సంబంధించిన వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగావ్యాపారాలు రెండూ వీరికి అనుకూలమే. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అధికం. అలంకరణ సామగ్రి, ఆభరణాలు సేకరించడం పట్ల శ్రద్ధ వహిస్తారు. బాల్యం కొంత కాలం సౌఖ్యంగా సాగినా తరువాత సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది. ప్రధమికానంతర విద్య లో అభివృద్ధి ఉంటుంది. బాల్యంలో విద్యపట్ల ఆసక్తి  కలిగించవలసిన అవసరం ఉంది. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది. తగిన వయసులో జీవితంలో స్థిరపడతారు. 35 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .అయినప్పటికీ 53 తరువాత జీవితంలో తిరిగి సౌఖ్యం కలిసి వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది.
*   భరణీ నక్షత్ర మూడవ  పాదం :- భరణి నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు. వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి అనివార్యం. నక్షత్రాధిపతి శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు కనుక విరు ఏపని అయినా అందంగా చేయడానికి ఆసక్తి చూపుతారు. సముద్ర సంబంధిత వృత్తి వ్యాపారం వీరికి అత్యంత అనుకూలం. సముద్రయానం వీరికి అనుకులిస్తుంది. వీరు బాలకళా కారులుగా రాణించడానికి అవకాసం ఉంది. విద్య నిరాటంకంగా సాగుతుంది. బాల్యంలో కొంత మందకొడిగా సాగిన విద్య మాధ్యమిక విద్యకు ముందుగానే  అభివృద్ధి ఉంటుంది. విద్యానంతరం జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి  ఉంటుంది.  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .అయినప్పటికీ 48 సంవత్సరాల తరువాత జీవితంలో చక్కని అభివృద్ధి కని పిస్తుంది. మధ్య వయసు దాటినప్పటి నుండి జీవితం సౌఖ్యవంతంగా సాగే అవకాశం అధికం.
* భరణి నక్షత్ర నాలుగవ పాదం :- భరణి నక్షత్ర నాలుగవ పాదం వృశ్చికరాశిలో ఉంటుంది. కనుక వీరి స్వభావం మీద కుజుని ప్రభావం ఉంటుంది. ధైర్యసాహసాలతో కూడిన వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. నౌకాదళ ఉద్యోగాలు వీరికి అత్యంత అనుకూలం. అలంకరణ సామగ్రి సేకరణ సౌందర్య పోషణ పట్ల వీరికి ఆసక్తి అధికం. విద్య నిరాటంకంగా సాగుతుంది. ఉన్నత విద్య విదేశాలలో సాగే అవకాసం కూడా ఉంది. విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. పుట్టిన ఊరికి దూరంగానే ఉద్యోగ వ్యాపారాలు సాగే అవకాశం అధికం. 25 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .43 సంవత్సరాల అనంతరం జీవితం తిరిగి అభివృద్ధి పదంలో సాగి తరువాతి సౌఖ్యంగా సాగుతుంది.

కృత్తిక 

* కృత్తికా నక్షత్ర మొదటిపాదం :- కృత్తికా నక్షత్ర మొదటిపాదం ధనుస్సు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. కనుక వీరిపై గురుగ్రహప్రభావం ఉంటుంది. కృత్తికా నక్షత్ర అధిదేవత కూడా సూర్యుడే కనుక వీరు అత్యంత ఆధిఖ్యభావంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. గురుగ్రహప్రభావం కారణగా నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. కనుక ఏ రంగంలో ఉన్నా వీరు అవసర సమయాలలో తోటి వారికి నాయకత్వం వహించి ప్రతిభావంతంగా పనులు నిర్వహించగలరు. రాజకీయాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. ఉన్నత విద్య లో ఆటంకం వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఉన్నత విద్యలు విదేశాలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. విదేశి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వివాహంలో కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉంది. 21 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .40 సంవత్సరాల నుండి చక్కని అభివృద్ది సాధించి పురోగతిలో ఉంటారు. తరువాత జీవితం సౌఖ్యవంతంగా జరుగుతుంది. అగ్నిసంబందిత వృత్తి ఉద్యోగాలు వీరికి చక్కగా అనుకూలిస్తాయి. బంగారంతో  సంబంధం ఉన్న వృత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు  , సమాచార రంగం వ్యాపారాలు , విద్యుత్ పరికరాల  సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలం.
* కృత్తికానక్షత్ర రెండవ పాదం :- కృత్తికానక్షత్ర రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది. కృత్తికా నక్షత్ర సహజగుణా లకు మకరరాశి అధిపతి శనిగ్రహ ప్రభావం కూడా తోడుగా ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి సహజంగా అన్నింటా ఆధిక్య గుణానికి శనిగ్రహ ప్రభావం చేత పట్టుదల మొండితనం తోడుతాయి. కనుక వీరు అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు. ఇనుము సంబంధించిన వృత్తి  ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.  ఇనుపపరికరాల తయారి, మెకానిక్ షెడ్ , వెల్డింగ్ వృత్తి వీరికి అనుకూలం. అలాగే పరిశ్రమలు స్థాపించడం, కర్మాగారాలు స్థాపించడం వీరికి చక్కగా అనుకూలిస్తాయి. ఇనుము అగ్ని సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. పరిశ్రమలు స్థాపించి నిర్వహణ చేయగల సమర్ధత వీరికి ప్రత్యేకం. పట్టభద్రులయ్యే వరకు చదువు నిరాటంకంగా సాగుతుంది. ఉన్నత విద్యలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. విదేశాలలో చదువుకునే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి.
విదేశాలలో ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు . 20 సంవత్సరాల  అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదురైనా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది . 38 సంవత్సరాల అనంతరం విరున్న రంగంలో అభివృద్ధి సాధించి ధన సంపాదన  చేస్తారు. 38 సంవత్సరాల అనంతరం వీరి జీవితం సౌఖ్యంగా సాగిపోతుంది. పాలిటెక్నిక్ వంటి  విద్యలు వీరికి అనుకూలిస్తాయి. 
* కృత్తికానక్షత్ర మూడవ  పాదం :- కృత్తికానక్షత్ర మూడవ  పాదం కుంభరాశిలో ఉంటుంది. కనుక కృత్తికా నక్షత్ర సహజగుణా లకు శనిగ్రహ ప్రభావం తోడుగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. మంచి కాని చేదు కాని అభిప్రాయాలను త్వరగా మార్చుకోరు. అనుకున్నది సాధించే పట్టుదల వీరికి సహజం. నిర్వహణ సామర్ధ్యం కూడా వీరికి అధికం .  ఇనుము సంబంధించిన వృత్తి  ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.  ఇనుపపరికరాల తయారి, మెకానిక్ షెడ్ , వెల్డింగ్ వృత్తి వీరికి అనుకూలం. అలాగే పరిశ్రమలు స్థాపించడం, కర్మాగారాలు స్థాపించడం వీరికి చక్కగా అనుకూలిస్తాయి. ఇనుము అగ్ని సంబంధిత వృత్తులు ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. పాలిటెక్నిక్ , ఐ టి ఐ వంటి  విద్యలు వీరికి అనుకూలిస్తాయి. పరిశ్రమలు స్థాపించి నిర్వహణ చేయగల సమర్ధత వీరికి ప్రత్యేకం. ఆటంకాలను అధిగమించి కాలేజ్ విద్య కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. వివాహంలో కొంత జాప్యం జరగా వచ్చు. 20 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా  రాహుదశ అనుకూలిస్తే విదేశనివాస అవకాశాలు రావడానికి అవకాశం ఉంది .37 సంవత్సరాల అనంతరం జీవితంలో ఆధిఖ్యత సాధిస్తారు. ఉన్న ఊరుకు దూరంగా కాలేజ్ విద్యలను అభ్యసిస్తారు. విదేశివిద్య  విదేశీ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉన్న ఉరుకు దూరంగా వృత్తి  వ్యాపారాలు సాగించే అవకాశాలు అధికంగా ఉంటాయి.
* కృత్తికానక్షత్ర నాలుగవ పాదం :- కృత్తికానక్షత్ర నాలుగవ పాదం  మీన రాశిలో ఉంటుంది. కనుక వీరిపై కృత్తికా నక్షత్ర గుణాలతో మీనరాశి అధిపతి అయిన గురుగ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి సముద్ర సంబధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిర్వహణా సామర్ధ్యం నాయకత్వ లక్షణం వీరికి సహజంగానే ఉంటుంది. బంగారు సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఆర్ధిక లావాదేవీలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. కాలేజిచదువులో కొన్ని ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. ఉన్నఊరుకు దూరంగా కాలేజి విద్య కొనసాగిస్తారు. వివాహంలో కొంత జాప్యం కలిగే అవకాశం  ఉంది. విదేశాలలో విద్యను  కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. 18 సంవత్సరాల అనంతరం రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా 35 సంవత్సరాల తరువాత ధనసంపాదనలో అభివృద్ధి కొనసాగుతుంది. తరువాత జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి