27, జులై 2012, శుక్రవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-2


రోహిణి 

* రోహిణి నక్షత్ర మొదటిపాదం :- రోహిణి నక్షత్ర మొదటిపాదం మేషరాశిలో ఉంటుంది. నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరు సమయస్పూర్తి కలిగి సమయానుకూలంగా వ్యవహరిస్తారు. తరచుగా  ఉద్రేకానికి కూడా లోనౌతుంటారు.  సైనికపరమైన ఉద్యోగాలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . రక్షణదళ ఉద్యోగాలలోరాణించగలరు. ఔషధి రంగానికి సంబంధించిన వ్రుత్తి ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి  అనుకూలిస్తాయి. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి  పట్ల ఆసక్తి ఉంటుంది. ఉన్నది. 14 సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు.అవకాశాలు ఉన్నాయి.  జీవితంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 32 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
* రోహిణి నక్షత్ర రెండవ పాదం :- రోహిణి నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది. కనుక సహజమైన నక్షత్ర గుణాలతో వృషభరాశి అధిపతి అయిన శుక్రుగ్రహ ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . సుందరమైన కళాత్మకమైన వస్తువులంటే వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. కళా సంబందిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విహారప్రదేశాల  నిర్వహణ, ఉద్యానవనాల నిర్వహణ , పర్యాటకరంగం , వెండి, ముత్యాల వంటి వ్యాపారాలు , సముద్ర సంబంధిత లేక జల సంబంధిత , వినోదాత్మక వ్రుత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సౌందర్య పోషణ , కళాత్మక వస్తు  సేకరణ అంటే వీరికి మక్కువ ఎక్కువ. విహరప్రదేశ  సందర్సన పట్ల ఆసక్తి అధికం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. 12 సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు .  జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలుగవచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 30 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
*  రోహిణి నక్షత్ర మూడవ పాదం :- రోహిణి నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో ఉంటుంది.  వీరి పై రోహిణి నక్షత్ర గుణాలతో చేరి మిధునరాశి అధిపతి బుధగ్రహ ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి .కనుక వీరు ఔషధ సంబంధ బ్రుట్టి వ్యాపారాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్ర అధ్యయనం , ఔషధ తయారీ వంటివి వీరికి అనుకూలిస్తాయి. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు రెండు వీరికి అనుకూలమే. 1 0 సంవత్సరాల వయసు నుండి  రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు.  జీవితంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  వివాహంలో కొంత జాప్యం కలుగ వచ్చు.  రా హుదశ  అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 28 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. 
* రోహిణి నక్షత్ర నాలుగవ  పాదం :-  రోహిణి నక్షత్ర నాలుగవ  పాదం కటక రాశిలో ఉంటుంది. నక్షత్రాధిపతి చంద్రుడు కటకరాశి అధిపతి చంద్రుడు కనుక వీరికి తల్లి పట్ల అనురాగం అనుభందం అధికంగా ఉంటాయి . బాల్యంలో చంద్రదశ  కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి . మాతృ వర్గ బంధువులతో అనుబంధం వీరికి అధికమే. వీరికి శ్వేతవర్ణం కలిగిన వస్తువుల ఉత్పత్తి తయారీ రంగంలో ఉద్యోగావ్యాపారాలు అనుకూలిస్తాయి. పాలు, బియ్యం, ముత్యం, కాగితం వంటివి అన్నమాట. ఔషధ రంగంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలమే. 8 సంవత్సరాల వయసు నుండి  రాహుదశ కారణంగా విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించ వచ్చు .  జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలుగవచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలుగవచ్చు. 26 సంవత్సరాల తరువాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. తరువాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది.  

మృగశిర 

* మృగశిర నక్షత్ర మొదటి పాదం:- మృగశిర నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. కనుక నక్షత్రధిపతి కుజగ్రహ  ప్రభావంతో సింహరాశి అధిపతి అయిన సూర్యుని ప్రభావం వీరిపై ఉంటుంది. వీరికి ఆధిఖ్యభావం అధికంగా ఉంటుంది. వీరికి విద్యుత్ సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అవేశ పూరిత స్వభావం ఉంటుంది. అగ్ని సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు కూడా అనుకూలమే. ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం నివసించడం వంటివి కొనసాగవచ్చు.  విద్యాభ్యాసం సాధారణంగా సాగినా ఉన్నత విద్యా సమయంలో చురుకుగా సాగుతుంది. సరి అయిన సమయంలో వివాహం జరిగే అవకాశాలు అధికం. వివాహానంతరం జీవితం సౌఖ్యంగా సాగుతుంది. సకాలంలో ఉద్యోగ వ్యాపారాలు అనుకులించి జీవితంలో త్వరగా స్థిరపడతారు. జీవితం దాదాపు సాఫీగా జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. 
* మృగశిర నక్షత్ర రెండవ పాదం:- మృగశిర నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంటుంది. మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు , కన్యా రాసి అధిపతి కుజుడు కనుక వీరికి భూమి సంబంధిత వృత్తులు వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో అభివృద్ధి కొనసాగించాలి.రియల్ ఎస్టేట్ రంగంలో వీరు చక్కగా రాణించగలరు. భూములు, ఆస్తులు సంపాదిస్తారు. చిన్న వయస్సులోనే సంపాదన మొదలుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.
* మృగశిర నక్షత్ర మూడవ పాదం:- మృగశిర నక్షత్ర మూడవ పాదం తులారాశిలో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు . కనుక వీరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. అలంకరణ వస్తువులను సేకరిస్తారు విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఉద్యానవనాల నిర్మాణం నిర్వహణ వంటివి కూడా వీరికి అనుకూలిస్తాయి. ఆకర్షణీయమైన నిర్మాణ రంగంలో అభివృద్ధి సాధిస్తారు. వీరికి కల సంబంధిత వ్యాపారం, వృత్తి , ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యాభ్యాసం పుర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. ప్రయత్నపూర్వకంగా విద్యలో అభివృద్ధి కొనసాగించాలి. వివాహం సకాలంలో జరుగుతుంది. చిన్న వయస్సులోనే సంపాదన మొదలుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.
* మృగశిర నక్షత్ర నాలుగవ పాదం :- మృగశిర నక్షత్ర నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. వీరు మనో ధైర్యం కలిగి ఉంటారు. ధైర్యసాహసాలకు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలం. అగ్నిమాపకదళం, సైనిక రంగం, రక్షణ దళం, సెక్యూరిటి వంటి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత ఉద్యోగం, వృత్తి , వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. విద్యలో అడ్డంకులు ఎదురైనా విద్య పూర్తికాగానే జీవితంలో త్వరగా స్థిరపడతారు. ఉన్నత విద్య లో అభివృద్ధి ఉంటుంది.సకాలంలో  వివాహం జరుగుతుంది. చిన్న వయసులో ధన సంపాదన చేస్తారు. సంపాదించినది జాగ్రత్త చేసుకుంటే జీవితం సాఫీగా జరిగి పోతుంది.

ఆరుద్ర 

* ఆరుద్ర నక్షత్ర మొదటి పాదం :- ఆరుద్ర నక్షత్ర మొదటి పాదం ధనుస్సు రాశిలో ఉంటుంది. ధనుస్సు రాశి అధిపతి గురువు . నక్షత్రాధిపతి రాహువు. కనుక వీరు రాజకీయ రంగంలో బాగా రాణించగలరు. అత్యంత సమస్పుర్తితో వ్యవహరించి ప్రజా నాయకత్వం వహించి అభివృద్ధి సాధిస్తారు. విరు రచయితలుగా రాణించగలరు. బంగారు ఆభరణ తయారీ ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. కళారంగంలో శిక్షణ  వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఎరంగలో నైనా చాకచక్యంతో వీ రు ముందుకు పోగలరు.  వరకు మందకొడిగా సాగినవిద్య తరువాత అభివృద్ధి పదంలో సాగుతుంది. చిన్న వయసులో వివాహం జరిగే అవకాశాలు అధికం. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహానంతర జీవితం సాఫీగానే జరుగుతుంది. ధనసంపాదన చేస్తారు. సంపాదించిన  ధనం జాగ్రత్త చేసుకోనవలసిన అవసరం వీరికి ఉంది. 
* ఆరుద్ర నక్షత్ర రెండవ పాదం:- ఆరుద్ర నక్షత్ర రెండవ పాదం మకరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి శని. కనుక నక్షత్ర అధిపతి రాహువు,  మకరరాశి అధిపతి శనిగ్రహ ప్రభావం వీరికి అధికంగా ఉంటుంది. వీరు శ్రమకు ఓర్చుకుని పని చేయగలరు. పట్టుదలతో పని చేస్తారు . ఇనుము సంబంధిత వస్తువుల తయారి రంగంలో వీరికి ఉద్యోగాలు ,  వృత్తులు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మెకానిక్ రంగానికి సంబంధించిన విద్య అంటే ఆసక్తి కలిగి ఉంటారు. హైస్కులు నుండి విద్యలో అభివృద్ధి కొనసాగుతుంది. విద్యాభ్యాసం చక్కగా కొనసాగుతుంది. విద్యాభ్యాసం పూర్తీ కాగానే జీవితంలో స్థిరపడతారు. ధనసంపాదన చేస్తారు. సంపాదించిన ధనం జాగ్రత్త చేసుకోనవలసిన అవసరం వీరికి ఉంది. 66 సంవత్సరాల తరువాత కేతు దశ కారణంగా 7 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 73 నుండి సమస్యలు తిరి మిగిలిన జీవితం సౌఖ్యంగా జరిగి పోతుంది.
*  ఆరుద్ర నక్షత్ర మూడవ పాదం:- ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం కుంభ రాశిలో ఉంటుంది.  కుంభ రాశి అధిపతి శని .నక్షత్ర అధిపతి రాహువు . కనుక వీరి మీద రాహు మరియు శని  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కర్మాగారాలు, పరిశ్రమలు మొదలైన వాటిలో వృత్తి, ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చుకుని పని చేయగలరు. పట్టుదలతో పని చేస్తారు . మెకానిక్ షెడ్ వంటివి వీరికి అనుకూలమైనవి. నూనె , చమురు సంబంధిత ఉద్యోగావ్యాపారాలు వీరికి అనుకూలం. బాల్యంలో మందంగా సాగిన విద్యాభ్యాసం హైస్కులు తరువాత అభివృద్ధి కనపడుతుంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాసం ఉంది. చిన్న వయసులో సంపాదించినది జాగ్రత్త చేసుకుని జీవితం సాగిస్తే ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్ధికపరమైన పొడుపు అవసరం. వివాహానికి ముందు సౌఖ్యంగా జరిగి పోతుంది. తరువాత కొంత వరకు సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 60 సంవత్సరముల తరువాత కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా  కొన్ని సంవత్సరాల తరువాత సమస్యలు తీరి సౌఖ్యంగా ఉంటారు. వృద్ధాప్యం వీరికి సౌఖ్యంగా జరిగి పోతుంది.
*  ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం:-ఆరుద్ర నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు.నక్షత్ర అధిపతి రాహువు . కనుక వీరి మీద రాహు మరియు గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కళా రంగంలో గుర్తించ తగిన స్థితికి చేరుకోవడానికి అవకాశాలు ఉనాయి,  బంగారు సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  రచయితలుగా కూడా వీరు రాణించగలరు. వీరు నిరటంకగా విద్యాభ్యాసం పూర్తి  చేస్తారు. వివాహానికి పూర్వం ఉన్న సౌఖ్యంలో వివాహానంతరం తగ్గు ముఖం పడుతుంది. అయినప్పటికీ జీవితం సాఫీగా జరిగి పోతుంది. సంపాదిమ్చిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.ఉన్నత విద్యాభ్యాసంలో కొంచెం జాప్యం జరిగినా ప్రయత్నిస్తే సాధించగలరు. రాజకీయాలలో వీరు అభివృద్ధి సాధిస్తారు. ప్రజానాయకులుగా ఉన్నతి సాధించగలరు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కొంచం జాప్యం కలగవచ్చు. 56 కేతు దశ కారణంగా సంవత్సరాల అనంతరం కొన్ని సమస్యలు ఎదురైనా కొన్ని సంవత్సరాల తరువాత సమస్యలు తొలగి వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి