28, జులై 2012, శనివారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-3

పునర్వసు 

* పునర్వసు మొదటి పాదం :- పునర్వసు మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. మేషరాసి అధిపతి కుజుడు. పునర్వసు నక్షత్రజాతకులది  దేవగణం.  కనుక వీరికి గురువు, కుజుడు గ్రహప్రభావం ఉంటుంది. సైనిక శిక్షణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. వీరు ధైర్యంగా  మధ్యవర్తిత్వం వహించగలరు. ధర్మాన్ని రక్షణ చేయడానికి  వీరు వెనుకాడరు. భూ సంబంధిత వ్యాపార వృత్తి ఉద్యోగాలు  కూడా  వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయ వృ త్తి వీరికి అనుకులిస్తుంది. వైద్యానికి సంబంధించిన వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరికి బాల్యం సౌఖ్యంగా జరిగి పోతుంది. 15 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. కాలేజ్ చదువులలో కొంత జాప్యం, కొంత మందకొడితనం  జరగవచ్చు. కనుక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరుగుతుంది. వివాహం కూడా కొంత  జప్యంగా జరుగు తుంది. వీరికి సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు వంటివి వీరికి జీవితకాలం వరకు మేలు చేస్తాయి.  51 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ వరకు సాఫీగా జరిగే జీవితంలో తరువాత కేతుదశ కాలం 7  సంవత్సరాలు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కానీ తరువాత 58 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితానికి అవకాశం ఇస్తుంది. వృద్ధాప్యం వీరికి సౌఖ్యవంతంగా జరుగుతుంది.
*  పునర్వసు నక్షత్ర రెండవ  పాదం:- పునర్వసు నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది. వృషభరాశి అధిపతి 
శుక్రుడు, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు వీరి మీద శుక్రు  గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు గురువులుగా లోక పుజితులు ఔతారు. వీరు ధర్మపక్షపాతులుగా ఉంటారు.  వీరు దేవగణానికి చెందిన వారు కనుక ఏ  పని అయినా సౌమ్యతతో సాధిస్తారు. ఉన్నత ఉపాధ్యాయులుగా ,  ఉన్నతోద్యోగులుగా వీరు రాణిస్తారు. బాల్యంలో వీరు సౌఖ్యాలను అనుభవిస్తారు. 10 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా  19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది. విద్య లో కొంత మందకొడి తనం నెలకొంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహంలో జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది.  46 సంవత్సరాల తరువాత వచ్చే కేతు దశలో  కొన్ని సమస్యలు  ఎదురైనా 7 సంవత్సరాల అనంతరం 53 సంవత్సరంలో శుక్రదశలో  సౌఖ్యవంతమైన జీవితం ఆరంభం  ఔతుంది. మిగిలిన జీవితం సౌఖ్యవంతంగా  జరిగుతుంది. 
*   పునర్వసు నక్షత్ర మూడవ పాదం:-  పునర్వసు నక్షత్ర మూడవ పాదం మిధున రాశిలో  ఉంటుంది. మిధున రాశి అధిపతి బుధుడు. పునర్వసు నక్షత్ర గురువు . వీరికి బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరు మేధో సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాధ్యాయులు , విద్యాసంస్థ అధిపతులుగా వీరు రాణిస్తారు. భూ సంబంధిత  వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బంగారు వస్తువుల మిద వీరికి ఆసక్తి ఉంటుంది. బాల్యం సౌఖ్యంగా ఆరంభం ఔతుంది.  6 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలం సౌఖ్యం కొంత వెనుక పడుతుంది సౌఖ్యం తగ్గు ముఖం పడుతుంది.  విద్య లో కొంత మందకొడితనం కొనసాగుతుంది. ప్రయత్నా పూర్వకంగా విజయం సాధించాలి. జీవితంలో సకాలంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వివాహం సకాలంలో జరుగుతుంది. 25 సంవత్సరాల అనంతరం వచ్చే బుధదశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. వీరికి బుధదశ  సాఫీ గా జరుగి పోతుంది. 42 సంవత్సరాల తరువాత ఆరంభం అయ్యే కేతు దశ వలన వచ్చే సమస్యలు 7 సంవత్సరాలు ఎదురైనా తరువాత వచ్చే 49 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో  వీరికి  తిరిగి సౌఖ్యవంతమైన జీవితం మొదలౌతుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.
*  పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం:- పునర్వసు నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది. కతకంలో చంద్రుడు వర్గోత్తమం పొందుతాడు కనుక వీరికి తల్లి అంటే ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. వీరికి  తల్లితో ఉన్న అనుభందం విడదీయలేనిది. ఔషధ రంగం వీరికి చాలా అనుకూలం. ఉపాద్యవృత్తి కూడా వీరికి అనుకూలమే. తెల్లని వస్తువులు, పసుపు వర్ణ వస్తువులతో సంబంధం ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు వీరికి అనుకూలం. బాల్యం సౌఖ్యంతో మొదలైనా 2 సంవత్సరాల తరువాత వచ్చే శనిదశ కారణంగా తరువాత 19 సంవత్సరాల కాలంలో  సౌఖ్యం కొంత వెనుక పడుతుంది విద్య మందకొడిగా సాగుతుంది. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. విద్యాభ్యాసం పూర్తి  అయిన తరువాత జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశం ఉంది. 38 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో ఎదురయ్యే సమస్యలు 7 సంవత్సరాల తరువాత తగ్గి 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యాలను అందిస్తుంది. తరువాత జీవితం సౌఖ్యంగా సాఫీగా జరుగుతుంది.

పుష్యమి  

* పుష్యమి నక్షత్ర  మొదటి పాదం :-  పుష్యమి నక్షత్ర  మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. వీరికి తండ్రి అంటే కొంత విముఖత కలుగ వచ్చు. సూర్యుడు, శని గ్రహ ప్రభావం వీరి మిద ఉంటుంది.  కొంత పట్టుదల  అతిశయం కూడా వీరికి ఉండవచ్చు. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకుచదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా కాలేజ్ చదువులు కొనసాగిస్తీ అతి చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 సంవత్సరాల అనంతరం వచ్చే కేతుదశలో  వీరికి సమస్యలు  ఉన్నా  కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే  విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం  కూడా ఇస్తుంది. కేతుదశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  ప్రభుత్వ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. శుక్ర దశ  నుండి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.
*  పుష్యమి నక్షత్ర  రెండవ పాదం:- పుష్యమి నక్షత్ర  రెండవ పాదం కన్యా రాశిలో ఉంటుంది . కన్యా రాశి అధిపతి బుధుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని.బుధ శని గ్రహ ప్రభావం వీరి మీద ఉన్నాయి. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి  ప్రాధమిక విద్య వరకు మందకొడిగా సాగినా తరువాత విద్యలో చక్కగా ప్రకాశిస్తారు. వీరికి విద్య విజయవంతంగా సాగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ఉన్నతి సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు . మేధా సంపన్నత కలిగిన ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నతోద్యాగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.  సకాలంలో జీవితంలో స్థిరపడతారు . సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు .  7 సంవత్సరాల అనంతరం వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
* పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం:- పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం తులారాశి లో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు . పుష్యమి నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు.  నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధదశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం అరభం ఔతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ  అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా జరిగిపోతుంది.
*  పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం:- పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది. వృశ్చికరాశి అధిపతి కుజుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు.  వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందు ఉంటారు. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగం వ్యాపారం వృత్తులు వీరికి అనుకూలం. 2 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది.  ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు .  కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే   జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగి పోతుంది.

ఆశ్లేష 

* ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం:- ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు,            
ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో 7 సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు. కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య పూర్తి  కాగానే జీవితంలో స్థిరపడతారు.  వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ  సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 
* ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం:-  ఆశ్లేష నక్షత్ర రెండవ  పాదం మకరరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి శని . ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే  వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.  18 సంవత్సరాల వయసులో శుక్రదశ వస్తుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్ళుతుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి .విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే  విదేశీవాసం,  విదేశీయాత్ర  చేయడానికి అవకాశం ఉంది . వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
* ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం:- ఆశ్లేష నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది. కుంభరాశి అధిపతి శని .  ఆశ్లేష నక్షత్ర  బుధుడు . కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. 7 సంవత్సరాల వయసులో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కాలేజ్ చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 
 * ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం:- ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర  బుధుడు . వీరి మీద  గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు . వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే 3 సంవత్సరాల నుండి వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తీ చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం  జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది.  53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహుదశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి