2, ఆగస్టు 2012, గురువారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-8

శ్రవణం 

  1. శ్రవణా నక్షత్ర మొదటి పాదం :-  శ్రవణా నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు. శ్రవణా నక్షత్ర  అధిపతి చంద్రుడు. వీరి మీద  కుజ చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు  దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు.  ఆవేశపూరిత  స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ తమ భావాల మీద  నియంత్రత కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలను, కోపతపాలను మార్చిమార్చి ప్రదర్శిస్తారు. వీరు ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.  శ్వేతవర్ణ, రక్తవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక, ఔషధ సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలమే. విద్యుత్, అగ్ని సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 8 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 15 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో  కాలేజ్ విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది.  అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా రహితంగా సాగిపోతుంది.
  2.   శ్రవణా నక్షత్ర రెండవ  పాదం :-   శ్రవణా నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది.  వృషభరాశి అధిపతి శుక్రుడు. శ్రవణా నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరి మీద శుక్ర చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. వీరు దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరికి కొంత స్థిర స్వభావం ఉంటుంది. వీరు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. కళాత్మక  వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపుతారు. విలాసజీవితం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది. వీరికి శ్వేతవర్ణ సంబంధిత వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జలసంబందిత, పర్యాటక సంబంధిత, ఔషధ సంబంధిత  వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.  6 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 13 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో మాధ్యమిక విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో ఉంది. 47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది.  అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా  సాగిపోతుంది. 
  3.   శ్రవణా నక్షత్ర మూడవ  పాదం :-  శ్రవణా నక్షత్ర మూడవ  పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు. శ్రవణా నక్షత్ర  చంద్రుడు. వీరి మీద బుధ చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. వీరు దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరు బుధ్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి ఉంటుంది. వీరు  ఔషధ తయారీ సంస్థను స్థాపించి నిర్వహించగలరు. వీరికి  విద్యాసంబంధిత, భూ సంబంధిత, ఔషధ సంబంధిత వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు అనుకూలిస్తాయి.  4 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 11 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో   విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా సాగిపోతుంది. 
  4.   శ్రవణా నక్షత్ర నాలుగవ  పాదం :-  శ్రవణా నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది.  కటకరాశి అధిపతి చంద్రుడు,    శ్రవణా నక్షత్ర అధిపతి చంద్రుడు. కనుక వీరి మీద పరిపూర్ణంగా చంద్రుడి ప్రభావం ఉంటుంది. వీరు  దేవగణ  ప్రధానులు.   కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు వీరికి తల్లితో  అనుబంధం అధికంగా ఉంటుంది. వీరు  తరచూ భావోద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉంది. వీరి భావాలు తరచూ మారుతూ ఉంటాయి. వీరు ప్రేమ, అభిమానం, కోపతాపాలు కూడా మార్చి మార్చి ప్రదర్శిస్తారు.  శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారం , ఉద్యోగం వీరికి అనుకూలం. ఔషధ రంగానికి సంబంధించిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  2 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 9 సంవత్సాలకు వచ్చే18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 27 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 43 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 62 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా సాగిపోతుంది.

ధనిష్ఠ 

  1.  ధనిష్ఠ  నక్షత్ర మొదటి పాదం :-    ధనిష్ఠ   నక్షత్ర మొదటి పాదం  సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి అధిపతి సూర్యుడు,   ధనిష్ఠ   నక్షత్ర అధిపతి కుజుడు. వీరి మీద సూర్య కుజ  గ్రహప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాసం ఉంది. వీరికి ధైర్యసాహసాలు, అతిశయం, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కొంచం అధికంగా ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు ఉద్యోగం వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 6 సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 59 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  2.  ధనిష్ఠ  నక్షత్ర రెండవ  పాదం :-  ధనిష్ఠ   నక్షత్ర రెండవ  పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు.  వీరి మీద బుధ  చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి   పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి.   వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి బుద్ధికుశలత అధికంగా ఉంటుంది.వీరికి వ్యాపారం అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. సైనిక పరమైన  వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా  ఉంటాయి.  వీరికి 4  సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 57 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  3. ధనిష్ఠ  నక్షత్ర మూడవ  పాదం :-   ధనిష్ఠ  నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.   ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు.   వీరి మీద శుక్ర  కుజ  గ్రహప్రభావం ఉంటుంది.  ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి   పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరు  పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. వీరు  కళాత్మకమైన వస్తుసేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్ , జల, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం , వ్యాపారం అనుకులిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి నౌకా దళంలో ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 2 సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 55 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు  కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన, తీర్ధయాత్రలు  అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  4. ధనిష్ఠ  నక్షత్ర నాలుగవ  పాదం:-  ధనిష్ఠ  నక్షత్ర నాలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటాయి.  వృశ్చికరాశి అధిపతి కుజుడు,  ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు. వీరి మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. వీరికి ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి. ఉద్యమాలలో వీరు  ముందు ఉంటారు.  వీరికి సైనిక సంబంధమైన  ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి1  సంవత్సరమువరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది. 19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 35తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.

శతభిష 

  1. శతభిషా నక్షత్ర మొదటి పాదం :-  శతభిషా నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు,   శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం  ఉంటుంది.  వీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది.  పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి 16 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లి తండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో కాలేజ్ చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవడం వీరికి చాలా చాలా అవసరం. లేకుంటే  32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులు కలుగుతాయి. 51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు అవకాశం  ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  2.  శతభిషా నక్షత్ర రెండవ  పాదం :-  శతభిషా నక్షత్ర రెండవ  పాదం  మకరరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శని.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరికి రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది.   ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు  శ్రమించి పని చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వరుత్తులు, వ్యాపారాలు  అనుకూలిస్తాయి.  వీరికి 12 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లి తండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో మాధ్యమిక  చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవడం వీరికి చాలా చాలా అవసరం. లేకుంటే  28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులు కలుగుతాయి. 47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు  అవకాశం  ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  3.  శతభిషా నక్షత్ర మూడవ  పాదం :-  శతభిషా నక్షత్ర మూడవ  పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి మీద శని రాహు గ్రహప్రభావం ఉంటుంది.   ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు  శ్రమించి పని చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వరుత్తులు, వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.  వీరికి 8 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లితండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశ వస్తుంది కనుక  సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు   అవకాశం  ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  4.  శతభిషా నక్షత్ర నాలుగవ  పాదం :-  శతభిషా నక్షత్ర నాలుగవ  పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి  మీద గురు రాహు ప్రభావం ఉంటుంది.  వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం  ఉంటుంది.  వీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది.  పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి 4 సంవత్సరాల కాలం మాత్రమే రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్య నిరాటంకంగా సాగుతుంది.  4 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా చదువు చక్కగా సాగుతుంది.  ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నిస్తే వీటిని అధిగమించి విజయం సాధించా వచ్చు. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు   అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి