2, ఆగస్టు 2012, గురువారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-7

మూలా 

  1. మూలా నక్షత్ర మొదటి పాదం :-  మూలా నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు.   మూలా నక్షత్ర అధిపతి కేతువు. కనుక వీరి  మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక  ఉద్యమాలలో వీరు  ముందు ఉంటారు.   వీరికి ఆత్మవిశ్వాసం , ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. వీరు సైనిక పరమైన ఉద్యోగాలంటే  ఆసక్తి కలిగి ఉంటారు. పోలిస్ శాఖ కూడా వీరికి అనుకూలమే.  అగ్ని, విద్యుత్, భూ సంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. 6 సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్రదశ  వస్తుంది. కనుక విద్యారంభం బాగా ఉంటుంది. విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం  ఉంది కనుక ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఏంతో  ఉంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది.  సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.  49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గు ముఖం పట్టి సౌఖ్యం ఆరంభం ఔతుంది. మిగిలిన జీవితం బాగుంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  2. మూలా నక్షత్ర  రెండవ పాదం :-  మూలా నక్షత్ర  రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శుక్రుడు.  మూలా నక్షత్ర  అధిపతి కేతువు. వీరిమీద శుక్రుడు  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  అకర్షణీయంగా మాట్లాడగలరు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తు పోగల అవకాశాలు ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు  ఔతారు . 4 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుండి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  3. మూలా నక్షత్ర మూడవ పాదం :-  మూలా నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు .  మూలా నక్షత్ర అధిపతి కేతువు.  వీరిమీద బుధ  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.   వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధికుశలతతో ప్రదర్శిస్తారు .  వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకులిస్తాయి.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు , వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు  ఔతారు . 3 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుండి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 3 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  4. మూలా నక్షత్ర నాలుగవ పాదం:-  మూలా నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది.    కటకరాశి అధిపతి చంద్రుడు. మూలా నక్షత్ర అధిపతి కేతువు.వీరి మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను . వీరు కోపతాపాలను, అభిమానాన్ని  మర్చి మర్చి ప్రదర్శిస్తారు. వీరు అధిక భక్తి  పరవశతకలిగి ఉంటారు. వీరికి శ్వేతవర్ణ వసువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాసించగలరు. వీరు దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. వీరికి విద్య నిరాటంకంగా సాగుతుంది. 2 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు.  సకాలంలో వివాహం జరుగుతుంది. 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.

పూర్వాషాఢ 

  1. పూర్వాషాఢ నక్షత్ర  మొదటి పాదం :-  పూర్వాషాఢ మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి సూర్యుడు .  పూర్వాషాఢ  నక్షత్ర  అధిపతి శుక్రుడు . వీరి మీద సూర్య , శుక్ర  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది. వీరికి అతిశయభావం, ఆధిఖ్యభావం, నిర్వహణ సామర్ధ్యం ఉంటుంది.  విలాసాల మీద ఆసక్తి,  సౌందర్యపోషణ మీద ఆసక్తి ఉంటుంది. కళాత్మకమైన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు  బాల్యం నుండి కళారంగంలో రాణించగలరు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాలు  సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 18 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 41 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  2. పూర్వాషాఢ నక్షత్ర  రెండవ  పాదం:-  పూర్వాషాఢ నక్షత్ర  రెండవ  పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. వీరి మీద శుక్ర , బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు  బుద్ధికుశలత కలిగి ప్రవర్తిస్తారు.  వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది సౌదర్య పిపాస కూడా ఎక్కుగా ఉంటుంది. కళాత్మక వస్తువుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు  బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించ కలుగుతారు.  పర్యాటక ప్రదేశాలలో వీరికి ఉద్యోగావకాశాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత , కళా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.   విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి  14 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 37 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  3. పూర్వాషాఢ నక్షత్ర మూడవ  పాదం :-  పూర్వాషాఢ నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.  పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు.  వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది కనుక వీరిమీద పరిపూర్ణంగా శుక్రుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు  కళారంగంలో విశేషంగా ప్రకాశిస్తారు. వీరికి కళాపిపాస అత్యధికంగా ఉంటుంది. కళాత్మక వస్తుసేకరణ అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది . పరిశుభ్రమైన వాతావరణంలో నివసిస్తారు. పరిశుభ్రంగా ఉంటారు. పర్యాటక ప్రదేశాలలో, విహార ప్రదేశాలలో, విలాస ప్రదేశాలలో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. బాల్యం నుండి కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి  9 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 32 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 50 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 66 సంవత్సరాల కాలంలో 19  సంవత్సరాల శనిదశ కాలంలో వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.  
  4. పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ పాదం :-  పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది.   వృశ్చికరాశి అధిపతి కుజుడు,   పూర్వాషాఢ నక్షత్ర  అధిపతి.  వీరి మీద కుజ శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది . వీరు భావతీవ్రత కలిగి ఉంటారు. అయిన తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. వీరు భూ సంబంధిత , కళా సంబంధిత, పర్యాటక సంబంధిత ,  జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బాల్యం నుండి కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది.  మనసును ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 5 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 28 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 61 సంవత్సరాల కాలంలో 19 సంవత్సరాల శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగిలిన జీవితం బాగా జరుగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది. 

ఉత్తరాషాఢ 

  1. ఉత్తరాషాఢ నక్షత్ర  మొదటి పాదం :-   ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.   ధనసురాశి అధిపతి గురువు.  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం , అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాద్యాయులు పని చేయడం వీరికి అనుకులిస్తుంది. ప్రజానయకులుగా,  ప్రజా అధికారులుగా వీరు  సమర్ధతో పనిచేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత,  పసుపు  వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 5 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  2. ఉత్తరాషాఢ నక్షత్ర  రెండవ పాదం :-  ఉత్తరాషాఢ నక్షత్ర  రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది.  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు .   మకరరాశి అధిపతి శని కనుక వీరి మీద శని సూర్య గ్రహప్రభావం ఉంటుంది.  వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరు  తండ్రి పట్ల  కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం  ఉంటుంది. వీరికి  ప్రభుత్వ పరిశ్రమలు , కర్మాగాలలో   ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. విరుశ్రమించి పనిచేయగలరు. వీరు నిర్వహకులుగా  చక్కగా పని చేయగలరు. వీరు  పరిశ్రమలను స్థాపించి నిర్వహించగలరు.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగ వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  3. ఉత్తరాషాఢ నక్షత్ర  మూడవ పాదం :-   ఉత్తరాషాఢ నక్షత్ర  మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని .  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.  కనుక వీరి మీద శని సూర్య గ్రహప్రభావం ఉంటుంది.   వీరు  తండ్రి పట్ల  కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం  ఉంటుంది. వీరికి  ప్రభుత్వ పరిశ్రమలు , కర్మాగాలలో   ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. విరుశ్రమించి పనిచేయగలరు. వీరు నిర్వహకులుగా  చక్కగా పని చేయగలరు. విరు పరిశ్రమలను స్థాపించి నిర్వహించగలరు. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 2 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటె ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  4. ఉత్తరాషాఢ నక్షత్ర  నాలుగవ పాదం :-  ఉత్తరాషాఢ నక్షత్ర  నాలుగవ పాదం మీనరాశిలో  ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు .  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.   వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం , అతిశయం కలగలుపుగా ఉంటాయి.  ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాద్యాయులు పని చేయడం వీరికి అనుకులిస్తుంది. ప్రజానయకులుగా,  ప్రజా అధికారులుగా వీరు  సమర్ధతో పనిచేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత,  పసుపు  వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 1 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 11 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 18 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 36 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 52 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 71 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి