1, ఆగస్టు 2012, బుధవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-6

విశాఖ 

  1. విశాఖ నక్షత్ర మొదటి పాదం :-  విశాఖ నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు .  విశాఖ నక్షత్ర  అధిపతి గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం . అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది.   విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కాలేజ్ చదువులలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం   జీవితకాలం సహకరిస్తుంది. 33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.
  2. విశాఖ నక్షత్ర రెండవ పాదం :-   విశాఖ నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది.  వృషభరాశి అధిపతి  విశాఖ నక్షత్ర  శుక్రుడు .  విశాఖ నక్షత్ర  గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.   వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అత్యంత అనుకూలం . ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపువర్ణ వస్తువులు, శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు,  వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యారంభం బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది .  10 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం   జీవితకాలం సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. 
  3. విశాఖ నక్షత్ర మూడవ పాదం :-  విశాఖ నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు .  విశాఖ నక్షత్ర గురువు.  విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.  నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.   వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు.  విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువ. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం,  వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.  విద్యలో  ఆరంభం నుండి  మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది .   6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. వివాహం సకాలంలో జరుగుతుంది. 42 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. 
  4. విశాఖ నక్షత్ర నాలుగవ పాదం :-  విశాఖ నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది.  విశాఖ నక్షత్ర అధిపతి గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.   ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.   ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం . పుట్టిన కొంత  కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సౌక్యం తగ్గుతుంది. ఔషధ సంబంధిత ,  శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.   తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.   6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. విద్యాభ్యాసంలో మందకొడితనం ఉంటుంది.  21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.  38  సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. 

అనురాధ 


  1. అనురాధ నక్షత్ర మొదటి పాదం :-  అనురాధ నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది .  సింహరాశి అధిపతి సూర్యుడు.  అనురాధ నక్షత్ర అధిపతి శని . ఇది దేవగణ నక్షత్రం. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను తీవ్రంగా తెలియజేస్తారు. తండ్రితో అభిప్రాయభేదాలు కలుగ వచ్చు. తల్లితో ఎకీభవిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయ భావం ఉంటాయి. ప్రభుత్వపరమైన కర్మాగారాలు , పరిశ్రమలలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అగ్ని సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 17 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కాలేజ్ చదువులలో  అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
  2. అనురాధ నక్షత్ర రెండవ పాదం :-  అనురాధ నక్షత్ర రెండవ పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  అనురాధ నక్షత్ర  అధిపతి శని.   కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయిన చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. వీరికి మేధో సంబంధమైన వృ త్తి ఉద్యోగాలు అనుకులోస్తాయి. వీరికి బుధదశ అనుకూలిస్తుంది కనుక విద్యలో ఉన్నతిని సాధించగలరు.  13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా మాధ్యమిక తరగతి నుండి చదువులలో  అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది
  3. అనురాధ నక్షత్ర  మూడవ పాదం :-  అనురాధ నక్షత్ర  మూడవ పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.  అనురాధ నక్షత్ర శని.  వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు.   తమ అభిప్రాయాలను ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు,హార్బర్లలో  వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.  వీరికి బుధదశ  బాగా అనుకులిస్తుంది కనుక విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు.  8 వరకు మందకొడి తనంగా సాగే విద్యాభ్యాసం  తరువాత వచ్చే సంవత్సరాల  17 సంవత్సరాల బుధదశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. 25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 75 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  4. ఇది దేవగణ నక్షత్రం. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. బద్ధకం ఉంటుంది అయినా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. వీరు తమ అభిప్రాయాలను మంచివే అయినా తీవ్రంగా, ఆవేశంగా  తెలుయజేస్తారు. వీరు యూనియన్ల కార్యకలాపాలలో ఉత్సాహంగా పాటుపడతారు.  సంప్రదాయేతరమైన వాయు సంబంధిత విద్యుత్ రంగంలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వాయు సంబంధిత, అగ్ని సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి ఆరంభం నుండి విద్య అనుకూలంగా ఉంటుంది.  4 సంవత్సరాల  తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో బాగా రాణిస్తుంది.  21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. కేతుదశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరిగి పోతుంది.

జ్యేష్ఠ 

  1. జ్యేష్ఠ నక్షత్ర మొదటిపాదం :-  జ్యేష్ఠ నక్షత్ర మొదటిపాదం ధనసురాశిలో ఉంటుంది.  జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు.  వీరి  మిద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది.  ఇది రాక్షసగణ నక్షత్రం. వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేదోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికారపదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు ఉంటాయి. 14 సంవత్సరాల వరకు బుధదశ ఉంటుంది. వీరు విద్యారంభం నుండి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి.కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద  మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోన వలసిన అవసరం ఉంది.తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 64 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీపర్యటనలు సాధ్యమౌతాయి. 
  2. జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదం :-   జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శని ,  జ్యేష్ఠ నక్షత్ర బుధుడు .  వీరిపై శని బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం. వీరికి పట్టుదల అధికం. వీరు  శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వ్రుత్తి వీరికి అనుకులిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు వీరికి ఉంటాయి. 10 సంవత్సరాల వరకు బుధదశ ఉంటుంది కనుక విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి.   ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిం మచి విద్యలో విజయం సాధించాలి.కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. కాలేజ్ విద్య సుగమంగా సాగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద  మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది.  సంపాదించినది జాగ్రత్త చేసుకోన వలసిన అవసరం ఉంది .తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 60 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీపర్యటనలు సాధ్యమౌతాయి.
  3. జ్యేష్ఠ నక్షత్ర మూడవ పాదం :-  జ్యేష్ఠ నక్షత్ర మూడవ పాదం కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశి అధిపతి శని.  జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. వీరిపై శని బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను సులువుగా మార్చుకోరు.  వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి.  న్యాయవాద వ్రుత్తి వీరికి అనుకులిస్తుంది.   6 సంవత్సరాల వరకు బుధదశ ఉంటుంది కనుక విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే  7 సంవత్సరాల కేతుదశ కారణగా  విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి.  ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. మాధ్యమిక  విద్య నుండి సుగమంగా సాగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద  మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది.  సంపాదించినది జాగ్రత్త చేసుకోన వలసిన అవసరం ఉంది .తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీపర్యటనలు సాధ్యమౌతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురుదశ కారణంగా తిరిగి సౌఖ్యం మొదలుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  4. జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదం:-  జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.   మీనరాశి అధిపతి గురువు.  జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. వీరి  మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది.  ఇది రాక్షసగణ నక్షత్రం. వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేదోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికారపదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.  2 సంవత్సరాల వరకు బుధదశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి . 4వ తరగతి నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోన వలసిన అవసరం చాల చాల ఉంది.తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీపర్యటనలు సాధ్యమౌతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి