3, ఆగస్టు 2012, శుక్రవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-9

పూర్వాభాద్రా 

  1. పూర్వాభాద్ర  నక్షత్ర మొదటి పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర మొదటి పాదం మేషరాసిలో ఉంటుంది.   మేషరాసి అధిపతి కుజుడు   పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు . వీరి మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధనులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.వీరికి భూ సంబంధిత, సైనిక పరమైన, సాహసాలు ప్రదర్శించ కలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకులిస్తాయి. వీరికి శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు ,  వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది. వీరికి 14 సంవత్సరాల వరకు గురుదశ  ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగ వచ్చు. సంపాదనకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ   కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ   కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  2. పూర్వాభాద్ర  నక్షత్ర రెండవ పాదం :- వృషభరాశి అధిపతి శుక్రుడు.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు .  కనుక వీరి మీద శుక్ర గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మతభోధకులు, మతగురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి 10 సంవత్సరాల వరకు గురుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వ్రుద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  3. పూర్వాభాద్ర  నక్షత్ర మూడవ పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర మూడవ పాదం  మిధునరాశిలో ఉంటుంది. మిధునరాశి అధిపతి బుధుడు.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు.వీరి మీద బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. భూ సంబంధిత,  విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి విధ్యా సంస్థలను స్థాపించి నిర్వహించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి 6 సంవత్సరాల వరకు మాత్రమే గురుదశ ఉంటుంది. 6 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రద్శ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది.  వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  4. పూర్వాభాద్ర  నక్షత్ర నాలుగవ పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో  ఉంటుంది.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు.  కటకరాశి అధిపతి చంద్రుడు.  ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.  పసుపు వర్ణ, శ్వేతవర్ణ  వస్తు సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. ఔషధ  సంబంధిత  వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి  అనుకూలిస్తాయి. వీరికి 2 సంవత్సరాల వరకు మాత్రమే గురుదశ ఉంటుంది. 2 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగ వచ్చు. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ   కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది   జివితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.

ఉత్తరాభాద్రా  

  1. ఉత్తరాభాద్ర నక్షత్ర మొదటి పాదం :-  ఉత్తరాభాద్ర నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.   సింహరాశి   అధిపతి సూర్యుడు.   ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని. వీరి మీద  సూర్య శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం. వీరికి తండ్రితో వ్యతిరేకత ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం  ఉంటుంది. శ్రమించి  పనిచేయగలరు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు,   కర్మాగారాలు  వ్రత్తి, ఉద్యోగ,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి  ఆత్మవిశ్వాసం , అతిశయం కలిసి ఉంటాయి.  వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.  వీరికి 17 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశి ఉద్యోగావకాశాలు,  విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  2. ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ  పాదం :-   ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ  పాదం కన్యా రాశిలో ఉంటుంది.  కన్యా రాశి అధిపతి బుధుడు.  ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని. వీరి మీద  బుధ  శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి  వ్యాపారం అంటే అత్యంత ఆసక్తి ఉంటుంది. వీరికి  వ్యాపారం బాగా అనుకులిస్తుంది.    వీరికి విద్యా  సంబంధిత , పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం  అనుకూలిస్తాయి.    వీరికి సాంకేతిక  విద్యలు,  వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.   వీరు బుద్ధికుశలత కలిగి ఉంటారు.  వీరికి 13 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే  7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.   కేతుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  3.   ఉత్తరాభాద్ర నక్షత్ర మూడవ  పాదం :-   ఉత్తరాభాద్ర నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.    తులారాశి అధిపతి శుక్రుడు .  ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి  శని . వీరి మీద  శుక్ర  శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి పరిశుభ్రమైన పరిసరాలలో నివసించడానికి ఆసక్తి ఉంటుంది. వీరికి   ప్రత్యెక ఆకర్షణ  ఉంటుంది .వీరికి నౌకలలో ఉద్యోగాలు వ్యాపారాలు  అనుకూలిస్తాయి.    వీరికి సాంకేతిక  విద్యలు,  వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి. వీరికి 9 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  4. ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగవ  పాదం  :-  ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది.   వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీరి మీద కుజ  శని గ్రహ ప్రభావం ఉంటుంది.  ఇది మానవగణ  నక్షత్రం.   వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. అయిన తమ మీద తమకు నియంత్రణ ఉంటుంది. వీరికి  విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం  ఉద్యోగం అనుకూలిస్తాయి.  వీరికి సాంకేతిక  విద్యలు,   వృత్తి   విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.   వీరికి 5 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే  7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ  అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత  వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల  వచ్చే18 సంవత్సరాల  రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.  రాహుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి.

రేవతి 

  1. రేవతి  నక్షత్ర మొదటి పాదం :-  రేవతి  నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు .  రేవతి  నక్షత్ర  అధిపతి బుధుడు .  వీరి మీద  గురు బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది  .అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి  విధ్యా   సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి  విద్యా సంబంధిత   వృత్తులు వ్యాపారం  ఉద్యోగం  అనుకూలిస్తాయి. వీరికి 16  సంవత్సరాల వరకు బుధదశ   ఉంటుంది. వీరు  విద్యారంభం  నుండి ప్రతిభ కనబరుస్తారు. 16  సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.  తరువాత 23  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 66   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 
  2. రేవతి నక్షత్ర  రెండవ  పాదం :-  రేవతి   నక్షత్ర  రెండవ  పాదం మకరరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి   శని.  రేవతి నక్షత్ర  అధిపతి బుధుడు.  వీరి మీద   శని  బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది.  అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి  భూ  సంబంధిత, వాయు సంబంధిత  ఉగ్యోగాలు, వృత్తులు,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య  అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకులిస్తుంది.   వీరికి 12  సంవత్సరాల వరకు బుధదశ   ఉంటుంది.  వీరు  విద్యారంభం  నుండి ప్రతిభ కనబరుస్తారు. 12  సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.19 సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్యకంటే విలాసాల మిద ఆసక్తి అధికం కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 62   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు, విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  3. రేవతి నక్షత్ర  మూడవ  పాదం  :-  రేవతి నక్షత్ర  మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి   అధిపతి   శని. రేవతి నక్షత్ర  అధిపతి బుధుడు.  వీరి మీద   శని  బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది.  అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత  ఉగ్యోగాలు, వృత్తులు,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య  అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకులిస్తుంది. వీరు  స్థిరమైన భిప్రాయాలు కలిగి ఉంటారు.   వీరికి 5  సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ   ఉంటుంది.  కనుక వీరికి   విద్యారంభంలో ఆటంకాలు ఎదురౌతాయి 5 సంవత్సరాల తరువాత 7 సంవత్సరాల కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.    ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.   12  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 55   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహుదశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు,   విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 73 సంవత్సరాలకు వచ్చే  16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  4. రేవతి నక్షత్ర  నాలుగవ పాదం :-   రేవతి నక్షత్ర  నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  రేవతి  నక్షత్ర  అధిపతి బుధుడు .  వీరి మీద  గురు బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది  .అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి  విద్య  సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి  విద్యా  సంబంధిత   వృత్తులు వ్యాపారం  ఉద్యోగం  అనుకూలిస్తాయి.  వీరికి 4  సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ   ఉంటుంది.  కనుక వీరికి   విద్యారంభంలో ఆటంకాలు ఎదురౌతాయి  4   సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.   కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు. 11  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 54   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18  సంవత్సరాల  రాహుదశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.  రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు, విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి