22, ఏప్రిల్ 2012, ఆదివారం

రుక్మిణీదేవి మందిరం

రుక్మిణీదేవి మందిరం 

ఇదే రుక్మిణీదేవి మందిరం 
మరిసటి రోజు ఉదయం బెట్ ద్వారక చూడడానికి  బసులో బయలుదేరాం. మార్గమద్యంలో రుక్మిణి మందిరం చూసాము.  రుక్మిణి మందిరంలో కుడ్య శిల్పంగా  కృష్ణుడు , రుక్మిణీదేవి దుర్వాసుడి రధం లాగుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. మాతో వచ్చిన గైడు ఇక్కడకు చుట్టుపక్కల 5  కిలో మీటర్ల  దూరం  వరకు మంచి నిరు లభించదని అది దుర్వాసుడు రుక్మిణి దేవికి ఇచ్చిన శాపమని వివరించాడు. రుక్మిణీదేవి దుర్వాసుడి ఆదేశం మీరి దాహార్తి తీర్చుకోవడానికి కొంత జాలం సేవించిన కారణంగా ఇటువంటి శాపానికి గురి అయిందని. కానీ ఇక్కడ ఉన్న ఒక బావిలో మాత్రమె మంచి నిరు దొరికేలా శాపవిమోచనం చెప్పాడని తెలుసుకున్నాము .

రుక్మినిదేవిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చాము. వెలుపల స్త్రీపురుషులు ఆనందంగా నృత్యం  చేయడం చూసి ఆనందించాం. మేము కూడా నృత్యంలో పాల్గొని ఆనందించాం



 

 చూసారా ఇదిగో ఇలా నృత్యం చేతుంటారు
ఆలయం వెలుపల భక్తులు 
ఆలయం వెలుపలి దృశ్యాలు 

ఆలయం దర్శించి నృత్యాలు చుసిన ఆనందంతో వెలుపలికి వచ్చి ఆలయానికి ఎదురుగా కొంత దూరంగా   కూర్చున్న బిక్షువులని చూసాం. వారు చక్కని శుభ్రమైన దుస్తులు ధరించి క్రమ శిక్షణగా కూర్చున్నారు వారిని భిక్షువులు అంటే నమ్మబుద్ధి కాలేదు. వేషధారణ అలా ఉంది మరి. గైడు వారిని గురించి ఇలా చెప్పాడు. ఆలయ నిర్వాహకులు వారిని ఇలా కూర్చోమని చెప్పారని భక్తులు తమంతట తాము ఏదైనా ఇస్తే మాత్రమే పుచ్చుకుంటారని. ఏది ఇచ్చినా సమానంగా పుచ్చుకుంటారని చెప్పారు.  మాలో కొందరు వారికి కొంత ధనం దానం చేసారు. వారి క్రమ శిక్షణ చుస్తే ముచ్చట  వేసింది.
ఇదిగో విరే ఆ భిక్షువులు 
ఆ తరువాత మా ప్రయాణం కొనసాగించి బెట్ ద్వారక చేరుకున్నాము.

1 కామెంట్‌: