14, అక్టోబర్ 2012, ఆదివారం

గంగోత్రి










గంగోత్రి 

File:Gangotri - Debabrata Ghosh, Birati.jpg
గంగోత్రి 

మేము బదరినాథ్  నుండి గంగోత్రి చూడడానికి ప్రయాణం అయ్యాము. అలా బయలుదేరి ప్రయాణం చేసి ఆ రాత్రికి  ఉత్తరకాశి చేరుకున్నాము. మార్గ మద్యంలో మాకు బసులను ఆపి కాఫీ బిస్కెట్లు అందించారు. తిరిగి బసు ఎక్కినా తరువాత బసులలో ఒకటి కదల లేదు. అంతే అందరం బసు దిగి బాసుకు రిపేరు చేయడానికి వదిలాము. మేము దిగిన ప్రదేశం ఒక టి దుకాణం కనుక మేము కూర్చోవడానికి బాగా స్థలం చిక్కింది. లేదంటే మేము చాలా అవస్థ పడేవాళ్ళం. అక్కడ ఆడవాళ్ళం అందరం బాగా బాతాఖాని వేసుకున్నాం. అప్పటికే ఒకరికి ఒకరం బాగా పరిచయం అయ్యాము. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక కుటుంబంలా అయ్యాము. ఎక్కడెక్కడి వరిమో ఇలా హిమాలయాలలో ఇలా ఒకటిగా కుర్చుని ఇలా ముచ్చట్లు చెప్పుకోవడం ఏమిటి ఎలా సంభవం? అంటు వేదాంత దోరిణిలో కూడా మా సంభాషణలు సాగాయి. ఇలాగే రాత్రి అయింది. మాలో కొంత అందోళన చెలరేగింది. ఇక నిర్వాహకులు హోటలు వారితో మాట్లాడి మాకు వారి వంట శాల లోనే వేడి వేడిగా పూరీలు  చేయించారు. అవి తాయారు చెయ్యడానికి వారికి  మాబృందం  వంట వారు సహాయకులు సహకరించడం కొస మెరుపు. అలా  రాత్రి ఫలహారం పూర్తీ కాగానే బసు ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక అక్కడ నుండి బయలు దేరి ఉత్తరాకసిలోని మా బసకు చేరుకున్నాము.

File:Gangotri.JPG
గంగోత్రికి వెళ్ళే కొండ మార్గం 
గంగోత్రి చడబోతున్నాము అన్న  ఊహ మనసుకు అత్యంత ఆనందాన్ని కలిగించింది. గంగానది పుట్టిన చోటు చూడాలంటే మాటలా మరి. ఉత్తరకాశిలో  ఉదయం కాలకృత్యాలు  తిర్చుకుని అందరం కాఫీ  ఫలహారాలు చేసి  బస నుండి  మా బస్సులలో బయలు దేరాము.  మేము ఋషికేస్ నుండి రెండు మినీ బసులలో ప్రయాణం చేస్తున్నాము. ఘాట్  రోడ్డులో మినీ బస్సులు మాత్రమె వెళ్ళగలవు. అలా వెళ్లి సాయత్రం మూడు గంటల సమయానికి గంగోత్రి చేరుకున్నాము. అయినప్పటికీ ఎప్పటిలా మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే మా బస్సులను  నిలపవలసి వచ్చింది. ఈ  ఘాట్ రోడ్డులో ఎక్కడా  బస్సులన్నీ నిలపడానికి కావలసిన ప్రదేశం లభించదు కనుక బసులను ఒక దాని వెంట ఒకటిగా నిలుప వలసి ఉంటుంది . అలా నిలబెట్టిన బసుల క్యూ మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుండి కాలి నడకన వెళ్ళడం మినహా వేరు మార్గం  లేదు.  ఇక మేము మా కాలికి పని చెప్పాము. అందరం చిన్న చిన్న బృందాలుగా నడుస్తూ గంగోత్రికి చేరుకున్నాము. అలాంటి సుదూర ప్రాంతాలలో కూడా మాకు గంగోత్రి వద్ద  పూజ ద్రవ్యాలు లభించాయి. అందరం పూజ ద్రవ్యాలు కొనుక్కుని మెట్లు దిగి నది వద్దకు చేరుకున్నాము.

గోముఖం 
File:Trek to Gaumukh.jpg
గోముఖం కొండ మార్గం 
File:Gomukh, The source of the river Ganga.JPG
గంగానదీ మూలం గోముఖం 
నిజానికి గంగానది పుట్టిన ప్రదేశం ఇంకా  18 కిలోమీటర్ల ఎగువన ఉటుంది. అక్కడ గోముఖ ఆకృతిలో ఉన్న హిమపర్వతామే గంగా నది అసలు పుట్టిన ప్రదేశము. కానీ అక్కడ నది హిమరుపంలో ఉంటుంది కనుక అక్కడ పూజాదికాలు చేయడం కుదరదు. అక్కడకు పోవడం కూడా సామాన్యులకు వీలు పడదు. ఈ గోముఖం అనే హిమ పర్వతం వెడల్పు 2-4 కిలోమీటర్లు. పొడవు 30 కిలూమిటర్లు. అక్కడకు కొందరు పర్వతారోహకులు,  హిందు సన్యాసులు శ్రమకు  ఓర్చి చేరుకుంటారని అక్కడి వారు చెప్పారు. గోముఖం నుండి మంచు  కరిగి నదిలా ప్రవహిస్తుంది. అక్కడి నుండి గంగా  నది రాళ్ళలో మట్టిలో ప్రవహిస్తూ గంగోత్రికి చేరుకునే సమయానికి కొంచెం గోధుమ రంగులో మట్టి కరిగిన జలాలతో  ప్రవహిస్తూ ఉటుంది. నది ఆకప్పటికే వేగంగా ప్రవహిస్తూ  ఉంటుంది.  ఈ నీటిలో ప్రవాహంతో కొట్టుకు వచ్చేరాళ్ళు పదునుగా ఉంటాయి. అక్కడ నది అంత లోతుగా ఉండదు. నీరు చాల చల్లగా ఉంటాయి. కనుక స్నానం చెయ్యడానికి అంతగా వీలు  కాదు.



File:Gomukha gangotri.jpg
గంగిత్రి వద్ద ప్రకృతి సౌందర్యం 

File:Bhagirathi River at Gangotri.JPG
గంగోత్రి వద్ద గంగానది 
.అందువలన అందరం అ నీటిలో కాళ్ళు మాత్రం కడుగుకున్నాము. అయినప్పటకి అక్కడ ఉత్తర భారత దేశానికీ చెందిన ఒక వయసైన  స్త్రీ   నదిలో  ఉన్న రాయి మిద కుర్చుని స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూసి మేము చాలా ఆశ్చర్య పోయాము. మేమెవ్వరము చేయ లేని పని ఆమె చేస్తున్నది కదా మరి. ఇంతలో మాలో ఒకామె నదిలో కాలు పెట్టగానే లోపల ఉన్న రాయి గుచ్చుకుని  కాలు బాగా కోసుకు పోయింది.  అక్కడి రాళ్ళూ అంత పదునుగా  ఉంటాయన్న మాట. ఆమెకు కాలు నుండి కొంత సమయము రక్తం కారుతూ  ఉండి  పోయింది. ఆమె భర్త జాగ్రత్త లేకుండా దిగినందుకు ఆమెకు చివాట్లు పెట్టడం కొస మెరుపు. ఆమెకు  కావలసిన ప్రధమ చికిత్స చేసిన తరువాత మేము మిగిలిన పూజ కార్యక్రమాలు చెయ్యడం మొదలు పెట్టాం.  అందరం సంకల్పం చెప్పించుకున్నాం. గంగోత్రి దగ్గర సంకల్పం చెప్పించుకున్నందుకు ఆనందపది పోయాము. అక్కడ దోప్పలలో పూవులను పెట్టి దానిలో నెయ్యి దీపం పెట్టి అమ్ముతుంటారు. స్త్రీలు  వాటిని తీసుకుని దీపం వెలిగించి నీటిలో వదలాలి. మేము అలా దీపాలు కొని వెలిగించి నీటిలో వదిలాము. ప్రవాహము లోటు లేని కారణంగా దీపాలు అంతగా దూరం పోలేదు. కొన్ని దీపాలు రాళ్ళకు తగిలి ఆగిపోయాయి.  అలా కొంతసేపు వాటిని చూసి ఇక గంగాదేవి ఆలయం చూడడానికి వెళ్ళాము.




దస్త్రం:గంగోత్రిలో భాగీరధుడు.JPG
భగీరధుడు 

File:Gangothri.jpg
గంగాదేవి ఆలయం 
గంగాదేవి ఆలయం లోపలకు వెళ్లి అక్కడ  అమ్మవారికి కానుకలు సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ అంతగా భక్తుల రద్దీ లేదు. పాలరాతితో చేసిన అమ్మవారి విగ్రహం కూర్చున్నట్లు ఉంది. తరువాత పక్కనే ఉన్న భాగిరదుడి ఆలయం చూసాం. అది చాల చిన్నదిగా ఉంది. లోపల పూజారి భాగిరదుడికి పూజలు చేస్తున్నాడు. గంగా నదిని స్వర్గ లోకం నుండి కిందికి తీసుకు వచ్చి అక్కడి నుండి పాతాళానికి తీసుకుని వెళ్ళి తన పితరులకు తర్పణం  విడిచి వారిని పైలోకాలకు పంపి తరింపజేసిన మహానుభావుడు కదా భగీరధుడు. పట్టువదలని ప్రయత్నానికి నిదర్సనమైన భాగిరదుడికి నమస్కరించాము. అంతటితో మా గంగోత్రి యాత్ర పూర్తీ అయింది. మేము తిరుగు ప్రయాణంలో తిరిగి ఉత్తర కాశిలో మా బసకు చేరుకున్నాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి