6, మే 2012, ఆదివారం

మాతృ గయ

ఇదే బిందు సరోవరం 

సిద్ధిపురు నుండి ఉదయం స్నానాదికాలు పూర్తీ చేసుకుని బయలు దేరి బిందు సరోవరం చేరుకున్నాము.  బిందు సరోవరం అంటే కపిల మహర్షి జన్మించిన ప్రదేశం. కపిల మహర్షి విష్ణుమూర్తి అంశ  అవతారాలలో ఒకడు. కర్ధర్మ ప్రజాపతి దేవభూతి తపసుకు మెచ్చి ప్రత్యక్షమైన విష్ణుమూర్తికి కర్దమ ప్రజాపతిని చూడగానే కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి ఆ ఆనంద భాష్పాలు పడిన ప్రదేశంలో సరోవరమగా ఏర్పడింది. అదే బిందు సరోవరం.  విష్ణుమూర్తిని ఆ దంపతులు విష్ణుమూర్తి వంటి కొడుకును ఇవ్వమని కోరగా విష్ణుమూర్తి  వంటి కొడుకు కావాలంటే నేనే మీకు కొడుకా జన్మించాలి  అని చెప్పి  విష్ణుమూర్తి వారికి కుమారుడిగా జన్మించాడు.  అతడే కపిల మహర్షి. అయన  పుట్టగానే కర్దమ ప్రజాపతి   తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. కపిల మహర్షి తన తల్లి దేవభుతికి సాంఖ్యజ్ఞానం ఉపదేశించి ఆమెకు జ్ఞానం కలిగించి ఆమె దేహత్యాగం చేసిన తరువాత ఆమెకు శ్రాద్ధ కర్మలు ఆచరించాడు. ఇక్కడ పరసుశు రాముడు తనతల్లికి  శ్రద్ధ కర్మలు ఆచరించాడు.  ఈ  కారణంగా  ఇక్కడ మాతృ మూర్తికి మాత్రం శ్రద్ధ కర్మలు ఆచరిస్తారు.  స్త్రీలు కూడా ఇక్కడ శ్రద్ధ కర్మలు ఆచరిచ వచ్చు.  ఇక్కడ ప్రత్యెక రుసుము తీసుకుని కావలసిన ద్రవ్యములు వారె సరఫరా చేసి శ్రద్ధ కర్మ నిర్వహించ చేస్తారు.
శ్రాద్ధ  కర్మ ఆచరిస్తున్న స్త్రీ పురుషులు 
  

బిందు సరోవరం  చెంత నీటిని  చల్లుకుని పవిత్రం చేసుకుని తరువాత శ్రాద్దకర్మ చేసే ప్రదేశానికి వెళతారు. బిందు సరోవరంలో స్నానం ఆచరించడానికి కావలసిన నీరు సరోవరంలో లేదు కనుక స్నానం చేయడానికి వీలుపడదు.  ముందుగా విష్ణుమూర్తిని పచ్చి వక్కలో ఆవాహన చేయించి. ఆయనకు షోడశోపచార పూజ నిర్వహించి తరువాత 27  పిండములు  చేయించి ఒక్కో విధమైన కృతజ్ఞత చెప్తూ ఒక్కో పిండము  సమర్పిస్తూ శ్రద్ధ కర్మ నిర్వహణ చేయిస్తారు. వారు వివరిచి చెప్పే విధం మనసును తల్లి పట్ల కృతజ్ఞతా భరితం చేసింది. పురోహితులు హిందిలో మాత్రమే వివరణ చేస్తారు. ఇలా తల్లికి శ్రాద్దకర్మ ఆచరించడం ఒక వింత అనుభూతిని అనందం కలిగించింది. పురోహితులకు వస్త్రలను కాని వాటికి బదులుగా ధనమును కానీ వారి ఇష్టాను సారం ఇవ్వ వచ్చు.  మాతృ శ్రాద్ధం కనుక చీరలను కూడా ఇవ్వ వచ్చు.  ముందుగా తెలిసిన వారు తమ వెంట తీసుకు వచ్చిన వస్త్రాలను దానం చేసారు. మిగిలిన వారు దానం ఇచ్చారు.  చివరగా పురోహితులకు దక్షిణగా అందరు ప్రత్యెక రుసుము చెల్లించాలి. దీనిలో మినహాయింపు లేదు. శ్రద్ధ కర్మ పూర్తీ చేసి పక్కనే ఉన్న దేవభూతి బొమ్మ ఉన్న వృక్షానికి నమస్కరించిన తరువాత శ్రద్ధ కర్మ పూర్తీ  అయినట్లే. తరువాత ఆలయ ప్రాంగణం లోని పరశురాముని దర్శించుకుని.  అలాగే లోపల ఉన్న కర్దమ ప్రజాపతి, దేవభూతి , కపిలమహర్షి ఆలయాలను దర్శించిన తరువాత ఆలయం వెలుపల నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఉపాహారం తీసుకున్నాము.  ఇలా మాతృగయ యాత్ర పూర్తీ చేసుకున్నాము. విష్ణుమూర్తి,  కర్దమ ప్రజాపతి,  దేవభూతి,  పరశు  రాముడు పాదములు పడిన ప్రదేశంలో మేము నడిచాం అన్నది మాకు పరవశం కలిగించింది.  ఇలా మాతృ గయ యాత్ర   పూర్తీ అయింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి