8, మే 2012, మంగళవారం

అబూ పర్వతం


  

 అబూ  పర్వతం


1898 లో అబూ పర్వతం





మేము బస చేసిన హోటల్ ఇదే 


అబూ పర్వతంలో  బ్రహ్మకుమారిల ప్రధాన కార్య లయం ఉంది.  గుజరాతీయులకు రాజస్తాన్ ప్రజలకు ఇది వేసవి విడిది. ఇక్కడి ప్రజలు కేవలం పర్యాటకుల మీదనే ఆధారపడి జీవిస్తారు. వీరికి మరో జీవనోపాధి లేదని ఇక్కడి గైడు చెప్పాడు. ఇక్కడికి అత్యధికంగా గుజరాతీయులు వస్తారని గుడు చెప్పాడు.  విదేశా ల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.  అరవాలి పర్వతాలలో ఉన్న  ఈ ప్రదేశం వేసవి విడిదిగా పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. 


అంబాజీ నుండి బయలుదేరి సాయం సమయానికి ముందే అబూ పర్వతానికి చేరుకున్నాము.  బసకు చేరిన వెంటనే  సేదతీర్చుకుని ఉత్సాహంగా సూర్యాస్తమయ దృశ్యం చూడడానికి బసులో ప్రయాణం అయ్యాము.  సూర్యోదయ దృశ్యం చూసే ప్రదేశానికి చేరాలంటే బసుదిగి  రెండు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది.   అక్కడ నుండి వెళ్ళడానికి ప్రత్యేకమైన చిన్న బండ్లు ఉన్నాయి. ఆ బండ్లలో వారు నలుగురిని ఎక్కించుకుని తీసుకు వెళ్లి తిరిగి తీసుకు వచ్చి వదిలి వెడతారు. దానికి కొంత రుసుము చెల్లించాలి.  వారి వద్ద కొంత జాగ్రత్తగా బేరం మాట్లాడి ఒక్కో బండిలో ఇద్దరం మాత్రమే వెళ్ళాం. ఆ బండ్లను ఇద్దరు నెట్టుకు తీసుకు వెడతారు.  మానవ ప్రయత్నంతో మానవ శక్తితో మాత్రమే వాటిని నడుపుతారు. అ బండ్లలో మా ప్రయాణం ఆసక్తి కరమైనది. ఆ బండ్ల మిద ఉన్న నంబరును గుర్తు పెట్టుకుని తిరిగి అదే బండిలో ఎక్కాలి.  మనుషులు నడిపే బండిలో ఎక్కాలంటే కొంత బాధ అనిపించింది. అక్కడకు వెళ్ళడానికి అది ఒక్కటే మార్గం కనుక ఎక్కక తప్పలేదు .
సూర్యాస్తమయ దృశ్యానికి మమ్ము చేరవేసిన బండి ఇదే 

 ఇలాంటి అ బండి ఎక్కి సుర్యాస్తమయ దృశ్యం చూసే ప్రదేశం చేరాం. అప్పటికే అక్కడ కాల మంది చేరారు. అబూ పర్వతంలో  సూర్యా స్తమయం  ఒక ప్రత్యెక ఆకర్షణ. వీక్షణం  చేయడానికి ఉన్న కేంద్ర స్థానానికి చేరం.  మేము మర్గమద్యంలో కొన్న తినుబండారాలను తింటూ ముచ్చట్లు చెప్పు కుంటూ సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసి ఆనందించాము.
అబూ పర్వతం వద్ద  సూర్యాస్తమయ దృశ్యం విక్షిస్తున్న ప్రేక్షకులు

ఇలా సూర్యాస్తమయ దృశ్యం చూసి ఆనందంగా మా మా బండ్లలో వేనుతిరిగాము.  ఆరోజుకు బసకు చేరుకుని యధా విధిగా రాత్రి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నాము.  మరుసటి రోజు అబూ పర్వతంలో ఉన్న బ్రహ్మకుమరిల ఆశ్రమం చూడడానికి వెళ్ళాము. ఆశ్రమ ప్రాంగణం ప్రశాంతంగా  ఉంది. విశాలమైన మెట్లు ఎక్కి లోపలకు చేరగానే మమ్మల్ని మా భాష గురించి  విచారించి లోనికి పంపి అసీనులను చేసారు.  అప్పుడు తెలుగులో మాట్లాడే ఒక బ్రహ్మకుమారి వచ్చి తనను పరిచయం చేసుకుని తెలుగులో ప్రసంగం చేసింది. ఆమె ప్రసంగం చాలా బాగుంది. విన్నంత సేపు మమ్ము మంత్రముగ్ధులను చేసింది. ప్రసంగం విని వెలుపలికి వచ్చి అంతా తిరిగి చూసి పుస్తక విక్రయశాలలో పుస్తకాలను కొనుగోలు చేసి వెలుపలికి వచ్చాము.
బ్రహ్మకుమారి మందిరం ఇదే


బ్రహ్మకుమారి మందిరం చుసిన తరువాత మేము బసులో వెళ్లి  అర్భుతాదేవి మందిరం వద్దకు చేరుకున్నాము.
File:Hanuman Statue, near Arbuda Devi Temple, Mount Abu, Rajasthan.jpg


 అర్భుతదేవి మందిరానికి వెళ్ళాలంటే 400 మెట్లు ఎక్కాలి అని చెప్పారు. మాలో కొందరు మాత్రమే ఆ ఆలయానికి వెళ్లారు. అర్భుతాదేవి మందిరం కారణంగా ఈ పర్వతానికి ఈ పేరు వచ్చింది.
ఇది అర్భుతదేవి ఆలయానికి పోయే ప్రవేశ ద్వారం ఇక్కడి నుండి 400 మెట్లు ఎక్కాలి

ఆలయ దర్సనం చేసుకుని వచ్చిన వారు వచ్చే వరకు అక్కడ ఎదురుచూసి తిరిగి మిగిలిన ప్రదేశాలు చూడడానికి వెళ్లాం.
File:Mount Abu Jain-Temple ca1898.jpeg
ఇదే అద్భుతమైన శిల్ప వైభవం కలిగిన జైన మందిరం 
అక్కడ నుండి మేము ఒక జైన మందిరాన్ని చూడడానికి వెళ్ళాము.  ఆ ఆలయాన్ని ముస్లిం పాలకులచేత  కొంత ధ్వంశం చేయబడింది.  ఆలయ శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. కానీ కొన్ని శిల్పాలకు ముక్కు మొదలైన అవయవాలు విరగకొట్టారు. వాటిని ప్లాస్టర్ ఆఫ్  పారిస్ తో  సరి దిద్దారు.  ఆలయంలో మహావిరుడి విగ్రహాలు చాల బాగున్నాయి. మధ్యాహ్న సమయం అయింది కనుక తిరిగి బస చేరాము.  భోజనాలు అయిన తరువాత కొంత విశ్రాంతి తీసుకుని అలా నడుస్తూ అబూ సరసు చూడడానికి వెళ్ళాము.  సరసులో పడవ లలో ఎక్కి సందర్సన చేసాం.
అబూ సరసులో సుందరమైన పడవలు ఇవిగో

పడవలలో ప్రయాణం చేసే సమయంలో మమ్మలిని పడవ వారు సరసులోని చిన్న ఆలయం వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ చిన్న వినాయకుని విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.  అక్కడ స్వామి వారికీ కొన్ని కానుకలు ఇచ్చుకుని తిరిగి పడవల ముందుకు కదిలాము.  ఇది పడవలలో  కుర్చుని చేసాము.
సరసు మద్యలో వినాయకుడి గుడి ఇదే  పక్కన ఉన్న బండల పైన  పక్షులు  కూడి సందడి చేస్తుంటాయి.
                
సరసు నుండి వెలుపలికి వచ్చి మేమంతా అబూలో లభించే వస్తువులను కొనుగోలు చేసాం. ఇక్కడి ఎంపోరియం చాలా అందంగా ఉన్నది.  అక్కడ మా వాళ్ళు చాలా వస్తువులు కొనుగోలు చేసారు.  ఇలా అబూ యాత్ర ఆహ్లాదంగా ముగించి బసకు చేరి విశ్రాంతి తీసుకున్నాము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి