6, మే 2012, ఆదివారం

పోరుబందరు

పోరుబందరు 

 పోరుబందరు  ప్రయాణంలో ముందుగా హర్షద్ మాతా ఆలయం వద్ద ఆగాం. హర్షద్ మాట చాలా శక్తి కలిగినదని అప్పటి రాజులు ఆమె వద్ద అనుమతి తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారని అక్కడి పూజారులు చెప్పారు. ఆలయ చూడాలంటే ౩౦౦ మెట్లు ఎక్కాలి.  మాలో కొందరు పైకి ఎక్కి దర్సనం చేసుకున్నారు. కానీ మమ్మల్ని మావాళ్ళు  ఎక్కడానికి అనుమతి ఇవ్వ లేదు. అన్ని మెట్లు ఎక్కడం శ్రమతో కూడుకున్న పని వారు అభిప్రాయపడి మమ్ము అలా  బస్సు వద్ద  వారు ఆలయ దర్సనానికి వెళ్లారు. నిర్వాహకులు మా వద్దకు వచ్చి పైన ఉన్న ఆల్;అయం వంటిదే క్రింద కూడా ఉన్నదని దానిని చూడవచ్చని సలహా ఇచ్చి మమ్ము తిరిగి పంపారు. మేము వెళ్లి క్రింద ఉన్న హర్షద్ మాతా ఆలయం చూసి అమ్మవారిని దర్శించి వచ్చాం. ఇంతలో పై ఆలయానికి వెళ్ళిన వారు కూడా వచ్చి చేరుకున్నారు.

 అక్కడ నుండి బయలు దేరి పోరుబందర్ చేరుకున్నాం. అక్కడ ఒక రామభక్తుని  మఠం చూసాం. అక్కడ కాలా పెద్ద తిరగలి చూసి ఆశ్చర్య పోయాం.  అక్కడ ఆలయంలో రాముడిని దర్శిన చేసాం.  అక్కడ ఉచిత భోజనం చేయమని చెప్పారు.  వారి భోజనం తినడం మనకు కష్టమే.  కోసం గట్టిగా ఉండే గోధుమ రొట్టెలు డాలు  కూరలు  పెరుగన్నం వడ్డిస్తున్నారు. మాకు నిర్వాహకులు సిద్ధం చేసిన దక్షిణ భారతదేశ భోజనం సిద్ధంగా ఉన్నందున మేము తినకుండా బయటకు వచ్చాం. 
స్థంభం మిద ఉన్న భాగిరదుడి చిత్రం


  తరువాత పోరుబందరులో భారత్ మందిరం చేరుకుని భారత్ మందిరం చూసాం. అక్కడ స్తంభాల మిద భారతీయ పురాణ పాత్రల చిత్తరువులను  చూసాం. 


అర్యముడు 

భారత్ మదిరం చూసి ఎదురుగా ఉన్న తారా మందిరం (ప్లానిటోరియం) చూసాం. ఆ తరువాత భారత్ మందిర వెలుపల ఉన్న విశాలమైన అరుగుల మీద కుర్చుని మధ్యాహ్న భోజనాలు చేసి ఉరు లోపలకు చేరాం. అక్కడ బసును నిలిపి కలి నడకన గాంధిజీ ఇల్లు చేరాం.  లోపలకు వెళ్లి గాంధిజీ పుట్టి పెరిగిన  ఇల్లు అంతా తిరిగి చూసాం. లోపల మెట్లు ఎక్కడానికి ఒక తాడు ఆధారంతో చెక్క మెట్లను ఎక్కి మొదటి అంతస్తు ఎక్కి పై భాగం ఇల్లు చూసాం. అలా మెట్లు ఎక్కడం కొత్త అనుభూతి. ఆ మెట్లు ఎక్కే విధానం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  అల ఇల్లంతా చూసి   క్రిందకు చేరి చివరగా అక్కడ ఉన్న ఒక చిత్రాన్ని చూసాం. ఆచిత్రంలో ఉన్న బొమ్మ ఒక్కో వైపు  నుండి ఒక్కోలా కనిపిసుంది. ఇలా రెండు రకాలుగా కనిపిస్తున్న ఆ చిత్రం కూడా మాకు ఆశ్చర్యం  కలిగించింది.  అక్కడ నుడి తిరిగి బసు నిలిపిన ప్రదేశం చేరాం. అక్కడ నుండి  ఆటోలో ఎక్కి సుధాముడి మందిరం చూసాం.  ఆరాత్రికి సోమనాద్ చేరాం.

సోమనాద్ 

 అక్కడి నుండి రిగి వచ్చి ఆరాత్రికి బసులో సోమనాద్ చేరాం. ఆరాత్రికే సోమనాధుని దర్శనానికి వెళ్లాం. సోమనాధుని ఆలయ ద్వారం ముందు సర్దార్ వల్లభాయ్ పఠేల్ విగ్రహం ఉన్నది.  ఆలయ పునరుద్ధరణ చేసినందుకు కృతజ్ఞత చూపడానికి అల విగ్రహ ప్రతిష్థ జరిగింది. ఆరోజుకు సోమనాధుడి ఆలయ దర్శనం చేసుకున్నాం. సోమనాధుని ఆలయం చాలా సుందరంగా  ఉన్నది. శిల్పకళ అద్బుతం. మేము వెళ్ళే సమయానికి అక్కడ జరిగే లేజర్ ప్రదర్సన అయిపొయింది. కొంత  నిరుత్సాహ  పడ్డాం అయినా ఆలయ ప్రాంగణంలో  ఉన్న కొన్ని శిల్పాలను చూసాం.  అవి చాలా బాగా ఉన్నాయి. అక్కడ నుండి హోటల్ రూముకి చేరి రాత్రి అల్పాహారం తిని విశ్రాంతి తీసుకున్నాం.


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి