29, మే 2012, మంగళవారం

శ్రీనాద్ ద్వారక

శ్రీనాద్  ద్వారక 

ఉదయపురు నుండి బయలుదేరి రాత్రికి శ్రీనాద్ ద్వారక చేరుకున్నాము. మా  అందరిని హోటల్ రూములకు  చేర్చి బసును  దూరంగా పార్క్ చేసారు.   హోటల్ వారు మాకు కుంకుమ చందనము ఇచ్చి సత్కరించారు. మా యాత్రలో మమ్మిలా సత్కరించింది వీరే.   ఇది మాకందరికి అనందం కలిగించింది. అక్కడ మరొక ఆసక్తి కరమైన అనుభవం ఎదురైనది. అదేమిటంటే మా రుములకు వెలుపల ఇప్పటి మోడెం వంటి మంచాలు పరుపులు ఏర్పాటు చేసారు. అప్పటికే మా మద్య పరిచయాలు పెరిగిన కారణంగా అలా అందరం మంచాల మీద కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి అల్పాహారం ఘనంగా ఆరోజుకు తిని విశ్రాంతి తీసుకున్నాము. నిర్వాహకులు మాతో మరునాడు నాలుగున్నరకు సిద్ధంగా ఉండమని చెప్పారు. వారు చెప్పిన విధంగానే మేము సిద్దం  అయ్యాము. ఈ  ఆలయ విశేషాలు చెప్పాలి కదా.

ఆలయ విశేషాలు  

 ఈ ఆలయము బృందావనములోని నందమహారాజ ఆలయా శైలిలో నిర్మించబడింది. అందువలన దీనిని నందాభవన్ లేక నందాలయం అని కూడా పిలువబడుతుంది. ఆలయగోపురం మీద ఉన్న కలశంలో సుదర్శనచక్రంతో ఏడు జెండాలు కూడా ఎగురుతుంటాయి. ఈ ఏడు జెండాలు శ్రీకృష్ణుని ఏడుగురు సఖులకు గుర్తుగా ఉంది. ఈ ఆలయం ప్రబలంగా శ్రీనాధ్‌జీ కి హవేలి (శ్రీనాధుని భవనము) ఎందుకంటే సాధారణ ఇల్లులాగా ఈ ఆలయములో ప్రయాణించడానికి అనువుగా ఒక రధము ఉంటుంది. (ఒకవేళ శ్రీనాధ్‌జీ సింఘర్‌కు తీసుకు వచ్చిన రధము వంటిది), పాలకొరకు ఒక సామాను గది(దూద్ ఘర్), తంబూలము కొరకు ఒక సామానుగది(పాన్ ఘర్), తీపిపదార్ధాలకొరకు మరియు పంచదార కొరకు ఒక సామానుగది (మిష్రింఘర్ లేక పెదఘర్), పూలకొరకు ఒక సామానుగది(ఫూల్ ఘర్), ఒక వంటగది(ఇక్కడ వంట చేయబడుతుంది )దీనిని రసోయీ ఘర్ అంటారు, ఒక ఆభరణ శాల (ఘనాఘర్), ఒక ఖజానా (ఖర్చా భండార్), అశ్వశాల, ఒక హాలు(బైటక్), ఒక స్వర్ణ మరియు రజిత తిరగలి (చక్కి), ఈ ఆలయానికి ప్రాకారంలో మదన్ మోహన్ మరియు నవనీత్‌జీ ఉపాలయం ఉంది.

ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఏడమ చేతి చిటికెన వేలు తో గోవర్ధన గిరిని ఎత్తుతూ కుండి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆలయంలో ఉన్నది నల్లని మార్బుల్ రాతి మీద చెక్కబడిన శిల్పము. ఈ శిల్పములో శ్రీకృష్ణుడితో రెండు ఆవులు, ఒక సింహము, రెండు నెమళ్ళు, ఒక పాము మరియు ఒక చిలుక ఉంటాయి.


ఈ ఆలయానికి జన్మాష్టమికి భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి మరియు హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనము (ప్రసాదము) లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లకుల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారులు వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తీసుకు వచ్చిప్రతిష్ఠించాడు.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి మరియు అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచ, జరీ ఖండువా, రత్నఖచిత ఆభరణాలు వడుతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.

మతవిశ్వాసాలను అనుసరించి నాధ్‌ద్వరా ఆలయ నిర్మాణము శ్రీనాధ్‌జీ నిర్ణయించిన ప్రదేశంలో జరిందని భావించబడుతుంది. శ్రీనాధ్‌జీ విగ్రహాన్ని మొగలు సామ్రాజ్యా మతవ్యరేకత నుండి రక్షించి సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి బృందావనం నుండి తీసుకు వస్తూ  ఎద్దులబండిలో వస్తున్న తరుణంలో ఒక ఎద్దు కిందకు వాలింది. అలా వాలడం గమనించి వెంట వస్తున్నపూజారులు అది భగవానుడి ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణం చేయమని సూచించారు. ఈ ఆలయనిర్మిత ప్రదేశం అప్పుడు మేవార్ రాజైన రాజ్ సింగ్ పాలనలో ఉండేది. ఈ ఆలయము శ్రీనాధ్‌జీ హవేలి అని పిలువబడుతుంది.

ఆలయ దర్సనం 

 శ్రీనాద్ ద్వారక ఆలయంలో శ్రీకృష్ణుడికి విశేషమైన పూజలు ఆరాధనలు జరుగుతుంటాయి. శ్రికృష్ణుడి వైభవం అల ఉంటుంది మరి. శ్రీకృష్ణుడు నందగోపుడి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను ఎలా చూసారో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటారు. ఈ ఆలయంలో కృష్ణుడికి ఎనిమిది మార్లు పూజలు చేసి ఎనిమిది మార్లు ఎనిమిది అలంకరణలు చేసి ఎనిమిది మార్లు భక్తులు దర్శించడానికి అనుమతి లభిస్తుంది. చివరగా హారతి ఇచ్చిన తరువాత ఆలయాన్ని మూసి వేస్తారు. భక్తులు ఎనిమిది మార్లు దర్సనం చేసుకోవడానికి ఉత్సుకత చూపుతుంటారు.  అయితే మేము మాత్రం నలుగు మార్లు మాత్రమే దర్సనం చేసుకున్నాము. 

* మొదటి మారు దర్సనానికి శ్రీకృష్ణుడు దుప్పటి మూసుకుని ఉన్నట్లు ఉంటుంది. అంటే కృష్ణుడిని తెల్లవారు ఝామున లేపాలి అన్నమాట. భక్తులు అల దుప్పటి కప్పుకున్న కృష్ణుడిని దర్సనం చేసుకుంటారు. ఈ దర్శనాన్ని మంగళ దర్సనం అంటారు. ఈ సమయంలో కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. అప్పుడు మధుర గీతాలను ఆలాపన చేసి కృష్ణుడిని నిద్రలేపుతారు.
* తరువాత దర్సనం శృంగార దర్సనం. ఈ సమయంలో కృష్ణుడికి తల నుండి కాలు వరకు సుందరమైన అలంకరణ చేసి పుల మాల  వేసి అద్దంలో అయన ప్రతిబిబం ఆయనకు చూపి ఆయనను ఆనందింప చేస్తారు. అప్పుడు ఆయనకు ఖర్జూరం వంటి ఎండు ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉంటుంది . అయన వేణువును ఊది రాధను ఆనందింప చేయడానికి ఇలా చేస్తారు. 
* మూడవ దర్సనం గ్వాల్  అంటారు. ఈ సమయంలో గోశాల నుండి గోపలనాయకుడు వచ్చి కృష్ణుడికి గోవులన్నీ క్షెమమని విన్నవిస్తాడు. అప్పుడు కృష్ణుడికి వెన్నతో చేసిన మకాన్ మిశ్రి అనే పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఇప్పుడు కృష్ణుడి చేతిలో వేణువు ఉండదు. మేడలో పూలమాల కూడా ఉండదు. నైవేద్యం కూడా తేలికగా ఉంటుంది. అప్పటికి గోపికలు కృష్ణుడికి బలమైన ఆహారం సమర్పిచి ఉంటారు అని విశ్వసిస్తారు.
* తరువాత దర్సనం రాజభోగ్ అంటారు. ఇప్పుడు స్వామిని చాల చక్కగా వస్త, ఆభరణాలు , పూలమాల, వేణువుతో అలంకరించి చాల మచి భోజనం అనేక పదార్ధాలు కిల్లి తో సహా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దర్సనానికి ముందు ఆలయ పూజారి గోపురం ఎక్కి మాలా బేగి లాయియో  అని అరుస్తాడు. అంటే మల త్వరగా తీసుకురా అని అర్ధం. ఇలా అరవగానే అది పూజకు దర్సనానికి సంకేతంగా భావించి భక్తులు దర్శనార్ధం వస్తారు. అప్పుడు చక్కగా డ్రమ్ములు కూడా మ్రోగిస్తారు .ఈ దర్సనం తరువాత కృష్ణుడు మూడు గంటల అనంతరం సఖులతో పచ్చిక బయలులో ఆవులతో విహరించి ఇంటికి చేరుకుంటాడు కనుక మద్యలో దర్సనం ఉండదు.
* ఈ దర్శనాన్ని ఉత్తపాన్ అంటారు. కృష్ణుడు తన సఖులతో గువులను తోలుకుని ఇంటికి చేరిన సమయం ఇది. సాయంత్రం మూడున్నర గంటలకు ఈ దర్సనం ఉంటుంది. ఇప్పుడు విన మిద కీర్తనలు ఆలపిస్తారు.
* ఉత్తాపన దర్సనం  తరువాత ఒక గంట తరువాత అరవ దర్సనం అయిన భోగ దర్సనం ఉంటుంది.  ఇప్పుడు స్వామి తలపాగా, నడుముకు మెరిసే స్కర్ట్ , చేతులకు , ఆభరణాలు , పతకము   అలంకరణతో కనిపిస్తాడు. కృష్ణుడికి అల్పాహారం నైవేద్యంగా సమర్పిస్తారు. చామరం వీచి  దిష్టి తీస్తారు. 
*  సంధ్య హరతి అంటే సాయంత్రం  దర్శనం. ఈ దర్శనం మునిమపు వేళలో ఉంటుంది. ఇప్పుడు క్రుష్ణుడు వస్త్త్ర ధారణ తేలికగ ఉంటుంది. రోజంత శ్రమించిన తరువత విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సుదర్సన చక్రం పైకప్పు మీద ఉంచబడుతుంది. క్రుష్ణుడి ఏడుగురు గోపాల సఖుల గుర్తుగా ఉన్న ఏడు ధ్వజాలు మరునాటి ఉదయం వరకు చుట్టి ఉంచుతారు. రాత్రి ఆహరం నైవేద్యంగా సమర్పించి హరతి తీసి దర్సనం ముగిస్తారు. 
*  ఇది రోజులో ఆఖరి దర్శనం ఇప్పుడు పూజారి మిద్దె మీద నిలబడి వంటమనిషిని పిలిచి రేపు త్వరగ రమ్మని చెప్తాడు. తరువత కృష్ణుడు నిద్రించే సమయం. క్రుష్ణుడికి వివిధమైన ఆహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. మధురమైన కీర్తనలను ఆలపిస్తారు. తాంబూలం నైవేద్యంగా సమర్పిస్తరు.  తరువత క్రుష్ణుడి పడకటింటిని సిద్ధం చేస్తారు. ఒక పత్రలొ ఆహారం, జలపత్రలో మంచి నీరు, కిల్లీలు పక్కన ఉంచుతారు, రాత్రి వేళలో రాధా రాణి కృష్ణుడిని సేవించడానికి వస్తుందని ఆమె దుస్తులు మరియు ఆభరణాలను పక్కన ఉంచుతారు. పడకటింటి వరకు కార్పెట్ పరచి కృష్ణుడి మందిరంలో భక్తులు దర్శనార్ధం ఉంచిన చెక్కల అడ్డాలను తొలగిస్తారు. భక్తులను ఎండ నుండి కాపాడటానికి ఉంచిన చత్రలను సైతం తొలగిస్తారు. శ్రీనాధుడు  నిరాటంకంగా గోపికలతో విహరించ్డానికి అనువుగా ఇటువంటి మార్పులను చేపడతారు. ఈ దర్శనం చిత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుండి ఆశ్విజమస శుక్లపక్ష నవమి వరకు ఉండదు. అప్పుడు క్రుష్ణుడు వ్రజభూమికి వెళతాడని ఈ దర్శం ఆపివేస్తారు. క్రుష్ణుడు ఆసమయాన్ని వ్రజవాసులకు కేటాయిస్తాడు. 


మేము ఉదయపు రెండు దర్శనలను చూసి మద్యలొ కంగ్రోలి ద్వరకకు పక్కనే వెళ్ళి తిరిగి వచ్చి మద్యాహ్న భోజనాలు చేసి. సాయంత్రం నాలుగు గంటల నుండి రెండు దర్శనలు చూసి హోటల్ రూములకు చేరాం. సాయంత్రవేళలో ద్రమ్ములు వాయించడం అక్కడి ఆనందకరమైన ఏర్పాట్లు మమ్ము చలా ఆకర్షించాయి.. మునిమాపు వేళలో ఆరతి దర్శనం సమయంలో కొందరు గోపాలకుల వేషంలో, కొందరు గోపికల వేషంలో ఆలయంలో నిలిచి ఉన్నారు. ఈ వాతావరణం నిజంగా నందగోకులంలో ఆ సమయంలో ఇలా ఉండేదేమో అనిపించేలా చేసింది. దర్శనసమయాలలో భక్తులు విపరీతంగా తోపిడికి గురి చేస్తారు. గోపికలు ఇలా శ్రీకృఇషుడి చెంతకు చేరతారు కబ్నుక్,అ ఆయనను ఇలానే దర్శనం చేయాలని వారి అభిమతమట. ఏది ఏమైనా శ్రీనాధ్ ద్వరక దర్శనం మాకు ఆనందాన్ని వింత అనుభూతిని కలుగ చేసింది. అవకాశం ఉన్న వారు ఎనుమిది దర్శనలు చేస్తారని నిర్వహకులు చెప్పారు. ఒక్కో దర్శనం ఒక వైవిధ్యమైనది కనుక అలాచేస్తారట. 

మరునాడు శ్రీనాధ్ ద్వరకనుండి మేము బయలుదేరే సమయంలో హోటల్ వారు మాకు శ్రీనాధుడి చిత్రపటాలను కనుకగా ఇచ్చి సాగనంపారు. హోటల్ వారి అతిథి సత్కారం కూడా మమ్ము మరింత ఆనందింపచేసింది మరి. చక్కటి అనుభూతిని మనసులో మిగుల్చుకుని మేం   శ్రీనాధ్ ద్వారక విడిచాము. 


1 కామెంట్‌: