8, మే 2012, మంగళవారం

అంబాజీ

అంబాజీ
అంబాజీ ఆలయ ముఖద్వారం 
మాతృ గయలో శ్రాద్ధకర్మలు ఆచరించిన తరువాత నిర్వాహకులు మాకు షడ్సోపెతనమైన భోజన ఏర్పాట్లు చేసారు.  మాములుగా శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పాయసం, గారెలతో ప్రత్యెక భోజనం ఏర్పాటు చేస్తారు కదా అలాగే  మాకు చేసారు నిర్వాహకులు.  భోజనాలు చేసి మేము  అక్కడి నుండి మేము బసులో సాయంత్రానికి బయలుదేరాము.  సాయం సమయానికి 6.30 సమయానికి అంబాజీ చేరాము.  అంబాజీలో సూర్యాస్తమయం చూడాలన్న ఏర్పాటు గదుల ఏర్పాటులో జరిగిన అస్తవ్యస్త పరిస్తితుల వలన మారి పోయింది.  కొంచెం ఆలస్యంగా ఆలయానికి వెళ్ళాము.  అంబాజీ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం ప్రధానంగా  ఈ  ఉరు రూపుదిద్దుకున్నది.  ఆలయం చాల విశాలంగా  ఉంది.  శిల్పకళ  కూడా  మెచ్చ తగినదిగా  ఉంది.

అంబాజీ ఆలయం ఆరావళి పర్వతసానువుల్లోని గబ్బారు కొండ మీద ఉన్నది. ఇది పురాణ ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం. సతీదేవి హ్రదయం పడిన ప్రదేశం ఇది.  ఈ ఆలయంలో దేవిని ఉపాసిస్తారు.  లోపలకు వెళ్లి అమ్మవారి దర్సనం చేసుకుని అల వెలుపలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రసాదం కొనుగోలు చేసాం.  ప్రసాదంతో ఒక చిన్న వర్ణ వస్త్రాన్ని ఇస్తారు. భక్తులు దానిని మేడలో మాల మాదిరిగా ధరిస్తారు. గుజరాతులో చాలా ఆలయాలలో ఇవి ఇస్తారు. ఆలయంలో దేవి నాణేలను కూడా భక్తులు కొనుగోలు చేస్తారు. వీటిని దానం భద్రం చేసుకునే ప్రదేశాలలో పెట్టితే మంచిదని  నిర్వాహకులు చెప్పారు.  అందరు వీటిని కొనుగోలు చేసారు. ఒక్కోటి 25 రూపాయలు.  ఇలా మా దర్సనం  ముగించుకుని వెలుపలికి వచ్చాం. ఆలయ ప్రాంగణంలో  ఉన్న దుకాణాలలో కొన్ని దేవుని చిత్రం వంటి వస్తువులను కొనుగోలు చేసి మా బసకు చేరుకున్నాం. 

మరునాటి ఉదయం గబ్బర కొండ శిఖరం పైన  ఉన్న దేవి దర్సనానికి  వెళ్ళాం. అక్కడకు చేరుకోవడానికి కేబుల్ కార్లు ఉన్నాయి. మెట్లదరిలో కూడా చేరుకోవచ్చు. అయినా 999 మెట్లు ఎక్కాలి. ఆసక్తి కరమైన కేబుల్ కార్లను వదిలి మెట్లదారిలో పోవడానికి ఎవరు మొగ్గు చూప లేదు. పైగా మాకు సమయం కూడా లేదు మరి. కొండ శిఖరం చేరుకుని అమ్మవారి దర్సనం చేసుకున్నాం. అక్కడ అమ్మవారు శ్రీ చక్రం  మాత్రమె. శ్రీ చక్రం ముందు ఒక అఖండ దీపం వెలుగుతుంది. భక్తులు ఆ దీపానికి నమస్కారం చేసుకున్నారు. అమ్మవారి దర్సనం చేసుకున్న తరువాత అదే కేబుల్ కార్లలో కిందకు దిగాం.  అక్కడ పప్పెట్ ప్రదర్సన చేసే వారు మమ్ము ఆహ్వానించారు. అందరం ప్రదర్సన చూసి మాకు తోసినది ఇచ్చాం.  ఇలా అంబాజీ దర్సనం పూర్తీ చేసుకుని బసకు చేరుకుని భోజనాలు చేసి అక్కడికి సమీపంలో ఉన్న అబూ పర్వతానికి  ప్రయాణం సాగించాము.  


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి