6, మే 2012, ఆదివారం

ప్రభాస తీర్ధం సోమనాద్


ప్రభాస తీర్ధం  సోమనాద్ 

మేము మరునాడు ఉదయం తెల్లవారు ఝామున తయారై మేము బస చేసిన హోటల్ సమీపంలో ఉన్న ప్రభాస తిర్దానికి ఆటలలో వెళ్ళాం. అక్కడ మూడు నదులు సంగమిస్తాయి. నది సంగమం కనుక అది పవిత్ర క్షేత్రం. భారతంలో ఈ  క్షేత్రం  పలుమార్లు ప్రస్తావన చాలా మార్లు చేయబడినది.  అర్జునుడు తీర్ధయాత్రా చేసినప్పుడు ఒక సారి పాండవులు మహాప్రస్థానం వెళ్ళినప్పుడు ఒక సారి నారదుడు తీర్ధ యాత్రల గురించి ధర్మరాజుకు వివరానా చేసినప్పుడు ఇలా అనేక మార్లు ఇది ప్రస్తావన చేయబడినది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ యాదవకుల పరిసమాపతి జరిగింది. శ్రీకృష్ణుడు ఇక్కడ నిర్యాణం చెందాడు. ఇన్ని రోజుల తరువాత కూడా ఆ ప్రదేశం సందర్శన మాకు కొంత విషాదం కలిగించినది.  మనో భారంతోనే ఆ ప్రదేశం సందర్శన చేసాం. అక్కడ  ఇంకా చీకటి తొలగక ముందే అక్కడి ఆలయ సముదాయాలను చూసాం. మాలో కొందరు సంగమంలో పసుపు కుంకుమ లను రావికతో సహా సమర్పించారు. నేమేము ఆ ఏర్పాటుతో రానందుకు కొంత బాధపడిన మాట వాస్తవం. చేయలేని వారందరూ నిర్వాహకులను ముందుగా ఎందుకు చెప్పలేదని అడిగారు. లేత చీకటిలో త్రివేణి సంగమ  దర్సనం మంచి అనుభూతిని కలుగ చేసింది.  
తిరిగి బసకు చేరుకుని సోమనాధ ఆలయానికి తిరిగి వెళ్లాం.  ఈ సారి పాత ఆలయం చూసాం. భుగర్భం  లో ఉన్న ఆలయంలోని  శివుడిని వెనుక ఉన్న చంద్రుడిని చూసాం. ఇక్కడ చంద్రుడు నల్ల రాతితో చేయబడి ఉన్నాడు. ఆలయంలో ఉన్న శివుడికి భక్తులు అందరు స్వయంగా పాలతో  అభిషేకం చేయవచ్చు.  మేమంతా అక్కడ విక్రయిస్తున్నా పాల పాత్రలను తీసుకుని శివునికి అభిషేకం చేసి ఆనందించాము.  తిరిగి బస చేరుకుని ఫలహారులు తిని సిద్ధిపూరు ప్రయాణం ఆరంభం చేసాం. 
తిరిగి బసులో మా ప్రయాణం కొనసాగింది. మద్యలో మూలా ద్వారకను చూసి తరువాత మద్యాహ్న భోజనాలు చేసాం.  ఆ ప్రదేశం చాల బాగుంది కనుక భోజనం చేసి మా వయసులు మరచి ఉయ్యాలలు తూగుటుయ్యాలలు జారుడు బండలు ఆ డాము.


తరువాత వాల్మీకి మహర్షి రామాయణం రచన చేసిన  ప్రదేశం చూసాం.  పురాణ ప్రసిద్ధి చెందిన ప్రదేశం చూసినందుకు ఆనందం కలిగింది. అలాగే కంచి మత నిర్వహణ చేస్తున్న కామాక్షి  ఆలయాన్ని దర్సన చేసాం.  ఆ ఆలయంలోని ప్రాకారంలో ఉన్న  అనేక శక్తి స్వరూపాలను కూడా చూసాం.  ఆ ఆలయంలో తమిళ పూజారులను చూసి దక్షిణ  భారతదేశ  అనుభూతికి లోను అయిన మాట వాస్తవం. ఆ తరువాత ప్రయాణించి రాత్రి 12 గంటలకు సిద్ధిపూరు చేరుకున్నాము. ఆ వూరు చిన్నది కనుక మాకు అందరికి ఒకే హోటలులో గదులు చిక్కలేదు. అర్ధరాత్రి మా మా గదులకు చేరడానికి బాగా అవస్థ పడ్డాము.  కొన్ని గంటలు కాలిలో ఎదురు చూసి మెల్లిగా మా గదులకు చేరి నిద్రపోయాము.  తెల్ల వారు ఝామున నిద్ర లేచి వెళ్ళాలని తెలుసుకుని మాలో కొందరు కొంత నిరసపడ్డ మాట వాస్తవమైనా శ్రమ పడకుండా కొత్త ప్రదేశాలు చూడలేము కదా అని సరి పెట్టుకున్నారు. కానీ మరునాటి ప్రదేశం ఆసక్తి కరమైనది.

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి