24, మే 2012, గురువారం

ఉదయపూరు



ఉదయపూరు


ఉదయపూరు కోట ద్వారం 

అబూ పర్వతం చూసిన తరువాత మరునాటి  ఉదయం బయలుదేరి ఉదయపూరు చేరాం . మా యాత్రలో ఉదయపూరు నిర్వాహకులు  లేకున్నా సమయం ఉన్నందు వలన మాకు అదనంగా చూపిస్తున్నామని చెప్పారు.  ఉదయపూరులో నిర్మాణాలు చాలా వరకు తెల్లగానే ఉన్నాయి. 
ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం(సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. రాజపుత్రులు ఏలిన మేవార రాజ్యానికి ఉదయపూర్ రాజధానిగా ఉండేది. . ఈ నగరాన్ని తూర్పు వెనిస్ నగరం, ప్రేమ నగరం మరియు సరస్సుల నగరం అని
 ఉపనామాలు ఉన్నాయి. మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని  ఆరావళి పర్వత పాద పంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించాడు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో నిండి ఉంటుంది ఉదయ్ పూర్.
 గైడు మాకు  ఉదయపూరును శ్వేతనగరం (వైట్ సిటి) అని అంటారు అని చెప్పాడు. ముందుగా ఉదయపూరు కోట చూసాము. కోటలో ప్రవేశించడానికి టిక్కెట్ కొనుక్కుని లోపలకు వెళ్ళగానే విశాలమైన ప్రాంగణం మమ్ము ఎంతో ఆకర్షించింది. 
ఉదయపురు కోటలో విశాలమైన ప్రాంగణం 

లోపలకు వెళ్ళిన తరువాత రాజప్రాసాదం లోకి ప్రవేశించి అక్కడ కొన్ని చిత్రాలను  చూసాము.  వాటిని ఫోటో తీయడానికి మాకు అనుమతి లేదు కనుక ఫోటోలు తీయలేక పోయాము. మాకు తెలియక కొన్ని పొటోలు తీసిన తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటి సూచన మేరకు కెమెరాలను అక్కడ ఒప్పగించి ముందుకు సాగాము.  లోపల రాజభవనం చాల ఆకర్షనీయంగా  ఉన్నాయి. కోటను దర్సించిన ఆనందంతో వెలుపలకు వచ్చి బస్సు ఎక్కి ముందుకు సాగాము. 
ఉదయపురు రాజవంశం 
ఉదయపురు రాజ చిహ్నము సూర్యభగవానుడు 
వ్యాఖ్యను జోడించు
ఉదయపురు రాజసభ

మద్యాహ్న భోజనాలు అనంతరం  హల్దీఘాట్  చూడడానికి వెళ్ళాము. ఇక్కడ రాజా ప్రతాప్ సింగ్ మొగల్ సేనల సాయంతో దండెత్తి వచ్చిన రాజమాన్ సింగ్ తో యుద్ధం సాగించిన ప్రదేశం.  ఇక్కడ 
రాజా ప్రతాప్ సింగ్ ప్రియతమ అశ్వం చేతక్ యుద్ధంలో తన రెండు కాళ్ళను కోల్పోయిన తరువాత కూడా సాహసంతో  రాజా ప్రతాప్ సింగ్ ను నదిని దాటించి తన ప్రాణాలను విడిచి త్యాగం ప్రదర్శించిన పవిత్ర ప్రదేశం ఇదే. చేతక్ ప్రాణత్యాగం చేసిన ఈ  ప్రదేశంలోరాజా ప్రతాప్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించాడు.  ఇక్కడి ప్రజలు చేతక్  సాహసాన్ని చాల అభిమానిస్తారు.  తమ అభిమానానికి గుర్తుగా ఇక్కడ తాయారు చేయబడుతున్న ద్విచక్ర వాహనాలకు  చేతక్ అని నామకరణం చేసి గర్వపడుతున్నారు.  గైడు చెప్పిన ఈ సంఘటన మా హృదయాలను కదిలించింది.

హల్దీ ఘాట్ చుసిన తరువాత సహేలియోకి భారి చూడడానికి వెళ్ళాం .  సహేలియోకి భారి అంటే చెలికత్తెల పూదోట . రాణి చెలికత్తెలు 48 మంది నిరాహార దిక్ష ఫలితంగా వారి విహారం కొరకు ఈ  పూల తోట  నిర్మాణం జరిగింది. చెలికత్తెలు తమకు విహారానికి తగిన ప్రదేశం లేదని చింతిస్తున్నారని తెలుసుకుని మహారాజు ఈ మనోహర పులతోటను నిర్మించి  వారికి  కానుకగా ఇచ్చాడు. ఈ తోటలో  బరిష్ గార్డెన్ , బర్డ్ గార్డెన్ , హథీ గార్డెన్,  లోటస్ గార్డెన్,  హోలీ గార్డెన్ అనే విభాగాలు ఉన్నాయి.  బారిష్ గార్డెన్ లో నీటి ఫౌంటెన్ సాయంతో వర్షం కురుస్తున్న శబ్దం వినిపించే ఏర్పాటు చేసారు. హథీ గార్డెన్ లో గంభీరమైన పాలరాతి ఏనుగు శిల్పాల నోటి నుండి నీరు చిమ్మే ఏర్పాటు చేసారు.
లోటస్ గార్డెన్ లో తామర కొలను ఏర్పాటు చేసారు.   బర్డ్ గార్డెన్ లో నీటి సాయంతో పక్షుల కిలకిలారవం విపించే ఏర్పాటు చేసారు. హోలీ గార్డెన్ లో హోలీ పాడుగా జరుపుకుంటారు.
సహేలియోకి భారి ప్రవేశ ద్వారం 



పక్షుల తోట 

హథీ గార్డెన్ 

హోలీ గార్డెన్ 

కొలను మధ్యలో శకుంతల మడపం 
సహేలియోకి భారి చుసిన తరువాత ఏక లింగేశ్వర ఆలయం చూడడానికి వెళ్ళాం.  ఏక లింగేశ్వర ఆలయం ఉదయపూరులో  తప్పక చూడవలసిన ఆలయాలలో ఒకటి. ఆలయం రాజ గంభీరంగా ఉంది. ఇక్కడ రాజ కుటుంభం వారు ఈశ్వర ఆరాధన చేస్టారు కనుక ఆలయం అంత రాజ గంభీరంగానే ఉన్నది.  గర్భాలయంలోని ఈశ్వరుడికి  నాలుగు ముఖాలు ఉంటాయి. బ్రహ్మ,విష్ణు  , మహేశ్వరుడు వారితో  నాలుగవ ముఖంగా రాజకుటుంబ ఆరాధ్య దైవం అయిన సూర్యుడు ఉంటారు.  అలయదర్సనం నిజంగా మానసిక ఆనందాన్ని కలిగించింది. ఇలా మా ఉదయపురు సందర్శనం మాకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది.      




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి