2, జనవరి 2013, బుధవారం

జ్యోతిర్మార్గం


జ్యోతిర్మార్గం 

జ్యోతి అంటే వెలుగు. జ్యోతిషం వెలుగును ఆధారంగా చేసుకున్న పరచిన శాస్త్రం. అనేకులు విశ్వసించేది కొందరు విమర్శించేది. ఏది ఏమైనా దీనికీ విశ్వాసం మాత్రమే ఆధారం. ఇందులో గోచారం   ఒక పధ్ధతి. గోళాల సంచారం ఆధారం చేసుకుని నిర్ణయించేది.  దీనిని సంత్సర, మాస,  వార, దిన ఫలితాలు చూడడానికి ఉపయోగిస్తారు. గోచార ఫలితాలు చూడదానికి రాశీ నుడి గణించాలి.  జీవితకాల ఫలితాలు చూడడానికి లగ్నం నుండి లెక్కించాలి.  జ్యోతిషం చూడాలంటే ప్రధానంగా అనే క విషయాలను గణించాలి.
ముందుగా రాశులు. ఇవి పన్నెండు.
సూర్యుని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం చేస్తారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశిలో ప్రవేసించే సమయం సంక్రమణగా వ్యవరిస్తారు. సూర్యుని చుట్టు భూమి చేసే భ్రమణాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే వచ్చినవే పన్నెండు రాసులు. ఒక్కక్క రాశిలో ప్రవేశించే సమయయంలో ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహాలలో ఉండే మార్పులను బట్టి అవి వేరు వేరు నక్షత్రాలని మన ఋషులు పరిశీలింవి గుర్తించారు. అ నక్షత్ర సముహ ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయించారు. 

వాటిలో మొదటిది మేషం., రెండవది వృషభం, మూడవది మిధునం, నాల్గవది కటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, ధనుస్సు, పదవది మకరం, పదకొండవది కుంభం, పన్నెండు మీనం.

1 మేషం రాశిలో అశ్విని నక్షత్ర నాలుగు పదాలు, భరణి నక్షత్రలో నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రలో మొదటి పాదం కలసి తొమ్మిది పాదాలు.
2 వృషభ రాశిలో మిగిలిన మూడు పదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు ఉంటాయి.
3 మిదునరాశిలో మృగశిరలోని రెండు పాదాలు, ఆరుద్రలోని నాలుగు పాదాలు, పునర్వసులోని మూడు పాదాలు ఉంటాయి.
4 కటకరాశిలో పునర్వసు నక్షత్రంలోని నాల్గవ పాదం, పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి.
5 సింహరాశిలో మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని నాలుగు పాదాలు , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని ఒక పాదం ఉంటాయి. 
6 కన్యారాశిలో ఉత్తరఫల్గుణి నక్షత్రంలోని మిగిలిన మూడు పాదాలు, హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు, చిత్త నక్ష త్రంలోని రెండు పాదాలు ఉంటాయి.
7 తులారాశిలో చిత్తానక్ష త్రంలోని మిగిలిన రెండు పాదాలు, స్వాతి నక్ష త్రం లోని నాలుగు పాదాలు, విశాఖనక్ష త్రం లోని మూడు పాదం ఉంటాయి.
8 వృశ్చికరాశిలో  విశాఖ నక్ష త్రం లోనిమిగిలిన ఒక్క పాదం , అనురాధ నక్ష త్రం లోనినాలుగు పాదాలు, జ్యేష్ట నక్ష త్రం లొనినాలుగు పాదాలు ఉంటాయి.
9 ధనుసు రాశిలో మూలా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్ష త్రం లోని ఒక్క పాదం ఉంటాయి.
10 మకరరాశిలో ఉత్తరాషాడలోని మిగిలిన మూడు పాదాలు, శ్రవణా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ధనిష్ఠ నక్ష త్రం లోని రెండు పాదాలు ఉంటాయి. 
11 కుంభ రాశిలో ధనిష్ఠ నక్ష త్రం లోని మిగిలిన రెండు పాదాలు, శతభిష నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్ష త్రం లోని మూడు పాదాలు ఉంటాయి.
12 మినరాశిలో పుర్వభద్ర నక్ష త్రం లోని ఒక్క పాదం, ఉత్తరాభద్ర నక్ష త్రం లోని నాలుగు పాదాలు, రేవతి నక్ష తరం లోని నాలుగు పాదాలు ఉంటాయి.
ఇలా పన్నెండు రాశులలో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి