4, ఆగస్టు 2013, ఆదివారం

హరిద్వార్

File:Bholanath Sevashram temple by the Ganges, Haridwar.jpg
హరిద్వార్ 


రుషికేశ్ వదిలి నేరుగా హరిద్వార్ చేరుకున్నాము. అక్కడి నుండి రాత్రికి డిల్లీ చేరాలి కనుక అక్కడ మేము బస ఏర్పాటు చేసుకోలేదు. నేరుగా స్నాన ఘాట్ చేరాము. అక్కడ స్నానాధికాలు ముగించి అక్కడే బసులో ఫలహారం ముగించాము. బసు అక్కడ వదిలి మేము హరిద్వార్ ఆలయాలు చూడడానికి బయలుదేరాము.
File:India - Haridwar - 002 - cows wandering aimlessly among the pilgrims (2086490984).jpg
హరిద్వార్ లో గోవుల సంచారం


File:Ganga arti at Haridwar.JPG
File:Chandi Devi Udankhtola, Haridwar.JPG
File:Ropeway to Chandi Devi Temple, Haridwar.jpg
ముందుగా ఆధునిక హనుమంతుని ఆలయ సమూహాలను దర్శించాము. ఈ ఆలయలలు అద్దం ముక్కలను ఉపయోగించి అత్యాధునికంగా నిర్మించబడ్దాయి. అక్కడ భక్తులకు ప్రత్యేక పూజలవంటివి లేవు. కేవలం సందర్శన మాత్రమే. హరిద్వార్ వెళ్లిన వారు తప్పక చూదవలసినంతగా ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడే అదే శైలిలో నిర్మించబడిన భారతమందిర్ ఉంది. అది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. తరువాత తిరిగి బసు వద్దకు చేరుకున్నాము.


మధ్యాహ్నభోజనాలు ముగించాము
అక్కడి నుండి మేము తిరిగి చండీదేవి ఆలయం మరియు మానసాదేవి ఆలయం చూడడానికి బయలుదేరాం.  ఈ ఆలయాలు చూడడానికి ఒకే ప్రదేసంలో టిక్కెట్లు విక్రయించబడుతుంటాయి. మేము రెండు ఆలయాలను దర్శించడానికి టిక్కెట్లు తీసుకున్నాము. మాలో కొందరు ఒకే ఆలయం దర్శించడానికి టిక్కెట్లు కొనుక్కున్నారు. అందుకు ఒక కారణం ఉంది. హరిద్వార్ గంగానది హారతి చాలా ప్రసిద్ధి చెందినది. వారికి అది చూడాలని ఉంది. మాకు కూడా హారతి చూడాలని ఉన్నా మనసాదేవి ఆలయ దర్శనం కోసం అది వదులుకున్నాము. రెండింటిలో ఏదో ఒకటే సాధ్యం మరి.
File:Mansa Devi Temple, Haridwar.JPG
మానసాదేవి ఆలయం 

File:Mansa Devi Temple, Haridwar 11.jpg
File:Mansa Devi Temple, Haridwar 06.jpgటిక్కెట్లు కొని ముందుగా  ఛండీదేవి ఆలయానికి వెళ్ళాము. ఆలయదర్శనానికి కేబుల్ కారులో ప్రయాణించాము. అందరూ చాలా ఆసక్తిగా ప్రయాణించారు. అక్కడ దేవిని దర్శించుకునాము. అప్పటికే సాయం కాలం అయింది. కొందరు గంగా హారతి చూడడానికి ఘాటుకు తిరిగి వెళ్ళారు. మేము అక్కడి నుండి నడిచి మానసాదేవి ఆలయానికి వెళ్ళ్డానికి ఉద్యుక్తులమయ్యాము. మాకు సరి అయిన దారి తెలియదు. అయినప్పటికీ దారిలో వాటిని అడుగుతూ చిన్నగా దారి తెలుసుకుని కేబుల్ కారు ఉండే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ ఆలయదర్శనానికి ఎదురుచూస్తున్న  చాలామంది చేరి ఉన్నారు. దాదాపు మూడు గంటల సమయం ఎదురుచూసి మానసాదేవిని దర్శించుకున్నాము. తరువాత మేము బసు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ రాత్రి భోజనాలు పూర్తి చేసుకుని డిల్లీకి ప్రయాణం కొనసాగించాము. హరిద్వార్ చేరుకున్నాము కనుక ఇక రాత్రి ప్రయాణం చేయవచ్చు. హిమాలయాల ఘాటురోడ్డులో రాత్రి ప్రయాణాలు నిషిద్ధం. ఇలా మా హిమాలయాల యాత్ర కేదార్నాథ్ మరియు బద్రీనాథుల కరుణా కటాక్షాలతో క్షేమంగా ముసింది. హిమాలయ యాత్ర రోమాంచితమైనది. అయినప్పటికీ ఈ యాత్ర మాకు జన్మసాఫల్యత లభించిన తీరుగా  ఉంది. 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి