23, అక్టోబర్ 2013, బుధవారం

తాజ్ మహల్

File:Taj Mahal 2012.jpg
తాజ్ మహల్ 

మధుర నుండి ఆగ్రా వెళ్ళిన మరునాడు ఉదయం అందరూ అక్బర్ కోట చూడడానికి వెళ్ళారు. మావారికి జ్వరం ఉన్న కారణంగా మేము మాత్రం వెళ్లలేదు. ఆరొఒజు మద్యాహ్నం మాకు నిర్వాహకులు బఫే డిన్నర్ ఏర్పాటు చేసారు. భోజనంలో చాలారకాలు అందించారు. ఇలా యాత్ర సమయంలో వారు తీసుకున్న శ్రద్ధను మెచ్చుకోకుండా ఉండ లేక వారి శ్రమకు చేసిన సేవలకు కృతఙత చెప్పకుండా ఉండలేక భోజనం గురించి చెప్పడమే కాని. యాత్రలో భోజనానికి ముఖ్యత్వం లేదు. మహిమాన్విత క్షేత్ర దర్శనాలకు మాత్రమే ముఖ్యత్వం.
File:El Taj Mahal-Agra India0023.JPG
మసీదు నుండి తాజ్ మహాల్ 

మద్యాహ్న భోజనం తరువాత కొంత విశ్రాంతి తీసుకుని తాజ్ మహల్ చూడడానికి బయలుదేరాము. మా వారికి కొంత ఓపిక వచ్చింది కనుక మేము కూడా తాజ్ మహల్ చూడడానికి వారితో బయలుదేరాం. బసులో ఆజ్ మహలుకు చేరగానే బసు నిలిపి రుసుము చెల్లించి లోపలకు వెళ్ళాము. లోపల అందంగా అలంకరించబడిన ఒంటెల బండ్లు మమ్ము ఆహ్వానించాయి. అవి చూసి అందరం ఆనందించాంఉ. గేటు నుండి లోపలకు వెళ్ళ్డానికి కొంచం దూరం ఉన్నందున పర్యాటకులు ఆ బండ్లలో లోపలకు పోవచ్చు. మేము ఆ బండ్లు ఎక్కి లోపలకు పోయాము.
File:TajEntryArch.jpg
వ్యాఖ్యను జోడించు


File:TajFlowerCloseUp.jpgFile:Taj Mahal 8.jpg తాజ్ మహల్ సౌందర్యం మనసును మైమరపింపజేసింది. అలా పరవశిస్తూ లోపలకు వెళ్ళి ముంతాజ్ సమాధి చూసాము. లోపల నుండి తాజ్ మహల్ చూసి ఆనందించాము. తరువాత వెలుపలికి వచ్చి తాజ్ మహల్ చుట్టూ తిరిగిచూసి తరువాత చాయా చిత్రాలు చూసే పనిలో నిమఙం  అయ్యాము. తనివి తీరా చాయాచిత్రాలు తీసిన తరువాత ఇక వెనుకకు తిరిగాము. 








వెలుపలికి వచ్చిన తరువాత అక్కడ అమ్ముతున్న రాతి శిల్పాలను కొన్నాము. అక్కడ పాలరాతితో చేసిన శిపాలు అందుబాటు ధరలో లభ్యం ఔతుంటాయి. శిల్పాలే కాక కళాఖండాలు కూడా లభ్యమౌతాయి.  అన్నీ చాలా బాగున్నాయి. తాజ్ మహల్ సందర్శన తరువాత తిరిగి బసులో ప్రయాణించి బసకు చేరుకున్నాము. ఆ రాత్రి ప్రయాణించి ఉదయానికి డిళ్ళీ చేరుకున్నాము. రాత్రి ఆహారం పంజాబీ దబాలో చేసాము. అంతటితో మ తాజ్ మహల్ సందర్శన పూర్తి చేసుకున్నాము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి