14, అక్టోబర్ 2012, ఆదివారం

గంగోత్రి










గంగోత్రి 

File:Gangotri - Debabrata Ghosh, Birati.jpg
గంగోత్రి 

మేము బదరినాథ్  నుండి గంగోత్రి చూడడానికి ప్రయాణం అయ్యాము. అలా బయలుదేరి ప్రయాణం చేసి ఆ రాత్రికి  ఉత్తరకాశి చేరుకున్నాము. మార్గ మద్యంలో మాకు బసులను ఆపి కాఫీ బిస్కెట్లు అందించారు. తిరిగి బసు ఎక్కినా తరువాత బసులలో ఒకటి కదల లేదు. అంతే అందరం బసు దిగి బాసుకు రిపేరు చేయడానికి వదిలాము. మేము దిగిన ప్రదేశం ఒక టి దుకాణం కనుక మేము కూర్చోవడానికి బాగా స్థలం చిక్కింది. లేదంటే మేము చాలా అవస్థ పడేవాళ్ళం. అక్కడ ఆడవాళ్ళం అందరం బాగా బాతాఖాని వేసుకున్నాం. అప్పటికే ఒకరికి ఒకరం బాగా పరిచయం అయ్యాము. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక కుటుంబంలా అయ్యాము. ఎక్కడెక్కడి వరిమో ఇలా హిమాలయాలలో ఇలా ఒకటిగా కుర్చుని ఇలా ముచ్చట్లు చెప్పుకోవడం ఏమిటి ఎలా సంభవం? అంటు వేదాంత దోరిణిలో కూడా మా సంభాషణలు సాగాయి. ఇలాగే రాత్రి అయింది. మాలో కొంత అందోళన చెలరేగింది. ఇక నిర్వాహకులు హోటలు వారితో మాట్లాడి మాకు వారి వంట శాల లోనే వేడి వేడిగా పూరీలు  చేయించారు. అవి తాయారు చెయ్యడానికి వారికి  మాబృందం  వంట వారు సహాయకులు సహకరించడం కొస మెరుపు. అలా  రాత్రి ఫలహారం పూర్తీ కాగానే బసు ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక అక్కడ నుండి బయలు దేరి ఉత్తరాకసిలోని మా బసకు చేరుకున్నాము.

File:Gangotri.JPG
గంగోత్రికి వెళ్ళే కొండ మార్గం 
గంగోత్రి చడబోతున్నాము అన్న  ఊహ మనసుకు అత్యంత ఆనందాన్ని కలిగించింది. గంగానది పుట్టిన చోటు చూడాలంటే మాటలా మరి. ఉత్తరకాశిలో  ఉదయం కాలకృత్యాలు  తిర్చుకుని అందరం కాఫీ  ఫలహారాలు చేసి  బస నుండి  మా బస్సులలో బయలు దేరాము.  మేము ఋషికేస్ నుండి రెండు మినీ బసులలో ప్రయాణం చేస్తున్నాము. ఘాట్  రోడ్డులో మినీ బస్సులు మాత్రమె వెళ్ళగలవు. అలా వెళ్లి సాయత్రం మూడు గంటల సమయానికి గంగోత్రి చేరుకున్నాము. అయినప్పటికీ ఎప్పటిలా మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే మా బస్సులను  నిలపవలసి వచ్చింది. ఈ  ఘాట్ రోడ్డులో ఎక్కడా  బస్సులన్నీ నిలపడానికి కావలసిన ప్రదేశం లభించదు కనుక బసులను ఒక దాని వెంట ఒకటిగా నిలుప వలసి ఉంటుంది . అలా నిలబెట్టిన బసుల క్యూ మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుండి కాలి నడకన వెళ్ళడం మినహా వేరు మార్గం  లేదు.  ఇక మేము మా కాలికి పని చెప్పాము. అందరం చిన్న చిన్న బృందాలుగా నడుస్తూ గంగోత్రికి చేరుకున్నాము. అలాంటి సుదూర ప్రాంతాలలో కూడా మాకు గంగోత్రి వద్ద  పూజ ద్రవ్యాలు లభించాయి. అందరం పూజ ద్రవ్యాలు కొనుక్కుని మెట్లు దిగి నది వద్దకు చేరుకున్నాము.

గోముఖం 
File:Trek to Gaumukh.jpg
గోముఖం కొండ మార్గం 
File:Gomukh, The source of the river Ganga.JPG
గంగానదీ మూలం గోముఖం 
నిజానికి గంగానది పుట్టిన ప్రదేశం ఇంకా  18 కిలోమీటర్ల ఎగువన ఉటుంది. అక్కడ గోముఖ ఆకృతిలో ఉన్న హిమపర్వతామే గంగా నది అసలు పుట్టిన ప్రదేశము. కానీ అక్కడ నది హిమరుపంలో ఉంటుంది కనుక అక్కడ పూజాదికాలు చేయడం కుదరదు. అక్కడకు పోవడం కూడా సామాన్యులకు వీలు పడదు. ఈ గోముఖం అనే హిమ పర్వతం వెడల్పు 2-4 కిలోమీటర్లు. పొడవు 30 కిలూమిటర్లు. అక్కడకు కొందరు పర్వతారోహకులు,  హిందు సన్యాసులు శ్రమకు  ఓర్చి చేరుకుంటారని అక్కడి వారు చెప్పారు. గోముఖం నుండి మంచు  కరిగి నదిలా ప్రవహిస్తుంది. అక్కడి నుండి గంగా  నది రాళ్ళలో మట్టిలో ప్రవహిస్తూ గంగోత్రికి చేరుకునే సమయానికి కొంచెం గోధుమ రంగులో మట్టి కరిగిన జలాలతో  ప్రవహిస్తూ ఉటుంది. నది ఆకప్పటికే వేగంగా ప్రవహిస్తూ  ఉంటుంది.  ఈ నీటిలో ప్రవాహంతో కొట్టుకు వచ్చేరాళ్ళు పదునుగా ఉంటాయి. అక్కడ నది అంత లోతుగా ఉండదు. నీరు చాల చల్లగా ఉంటాయి. కనుక స్నానం చెయ్యడానికి అంతగా వీలు  కాదు.



File:Gomukha gangotri.jpg
గంగిత్రి వద్ద ప్రకృతి సౌందర్యం 

File:Bhagirathi River at Gangotri.JPG
గంగోత్రి వద్ద గంగానది 
.అందువలన అందరం అ నీటిలో కాళ్ళు మాత్రం కడుగుకున్నాము. అయినప్పటకి అక్కడ ఉత్తర భారత దేశానికీ చెందిన ఒక వయసైన  స్త్రీ   నదిలో  ఉన్న రాయి మిద కుర్చుని స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూసి మేము చాలా ఆశ్చర్య పోయాము. మేమెవ్వరము చేయ లేని పని ఆమె చేస్తున్నది కదా మరి. ఇంతలో మాలో ఒకామె నదిలో కాలు పెట్టగానే లోపల ఉన్న రాయి గుచ్చుకుని  కాలు బాగా కోసుకు పోయింది.  అక్కడి రాళ్ళూ అంత పదునుగా  ఉంటాయన్న మాట. ఆమెకు కాలు నుండి కొంత సమయము రక్తం కారుతూ  ఉండి  పోయింది. ఆమె భర్త జాగ్రత్త లేకుండా దిగినందుకు ఆమెకు చివాట్లు పెట్టడం కొస మెరుపు. ఆమెకు  కావలసిన ప్రధమ చికిత్స చేసిన తరువాత మేము మిగిలిన పూజ కార్యక్రమాలు చెయ్యడం మొదలు పెట్టాం.  అందరం సంకల్పం చెప్పించుకున్నాం. గంగోత్రి దగ్గర సంకల్పం చెప్పించుకున్నందుకు ఆనందపది పోయాము. అక్కడ దోప్పలలో పూవులను పెట్టి దానిలో నెయ్యి దీపం పెట్టి అమ్ముతుంటారు. స్త్రీలు  వాటిని తీసుకుని దీపం వెలిగించి నీటిలో వదలాలి. మేము అలా దీపాలు కొని వెలిగించి నీటిలో వదిలాము. ప్రవాహము లోటు లేని కారణంగా దీపాలు అంతగా దూరం పోలేదు. కొన్ని దీపాలు రాళ్ళకు తగిలి ఆగిపోయాయి.  అలా కొంతసేపు వాటిని చూసి ఇక గంగాదేవి ఆలయం చూడడానికి వెళ్ళాము.




దస్త్రం:గంగోత్రిలో భాగీరధుడు.JPG
భగీరధుడు 

File:Gangothri.jpg
గంగాదేవి ఆలయం 
గంగాదేవి ఆలయం లోపలకు వెళ్లి అక్కడ  అమ్మవారికి కానుకలు సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ అంతగా భక్తుల రద్దీ లేదు. పాలరాతితో చేసిన అమ్మవారి విగ్రహం కూర్చున్నట్లు ఉంది. తరువాత పక్కనే ఉన్న భాగిరదుడి ఆలయం చూసాం. అది చాల చిన్నదిగా ఉంది. లోపల పూజారి భాగిరదుడికి పూజలు చేస్తున్నాడు. గంగా నదిని స్వర్గ లోకం నుండి కిందికి తీసుకు వచ్చి అక్కడి నుండి పాతాళానికి తీసుకుని వెళ్ళి తన పితరులకు తర్పణం  విడిచి వారిని పైలోకాలకు పంపి తరింపజేసిన మహానుభావుడు కదా భగీరధుడు. పట్టువదలని ప్రయత్నానికి నిదర్సనమైన భాగిరదుడికి నమస్కరించాము. అంతటితో మా గంగోత్రి యాత్ర పూర్తీ అయింది. మేము తిరుగు ప్రయాణంలో తిరిగి ఉత్తర కాశిలో మా బసకు చేరుకున్నాము.

కన్యా లగ్నం


 కన్యా లగ్నం 

* సూరుడు :- కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి ఔతాడు. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యాలగ్నానికి అకరక గ్రహం ఔతాడు. కన్యాలగ్నస్థ సూర్యుడి కారణంగా వ్యక్తి  ప్రభావశాలిగా ఉంటాడు. అందమైన, లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ప్రాప్తించే అవకాశం ఉంది. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. వ్యవసాయం వీరికి అనుకూలిస్తుంది. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం మంచిది.
* చంద్రుడు :- కన్యాలగ్నానికి  చంద్రుడు ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. లగ్నం  నుండి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం చేత జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది. వీరికి అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశం ఉంది. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితము తక్కువగా ఉండును.
*  కుజుడు :- కన్యాగగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి ఔతాడు. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా
వీరికి  క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటారు. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లి తండ్రులతో అభిప్రాయబేధాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టములు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచనకు గురి కావచ్చు.
* బుధుడు :- బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్గాయుషు ఇస్తాడు. వీరి ఆత్మ బలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగతి సాధిస్తారు. వీరికి సమాజంలో గౌరవం, ఆదరం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత  గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయముగా, ఆనందమయముగా  ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.
* గురువు :- కన్యాలగ్నానికి గురువు కారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధములు కలుగుతాయి.  పుత్రుల నుండి ఆదరణ సహకారం లభిస్తుంది. పుత్ర సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుండి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్గాయువు, పుత్రసంతతి, ఖ్యాతి  కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న శుభ ఫలితాలు తగ్గుతాయి.
* శుక్రుడు :- కన్యాలగ్నానికి శుక్రుడు ధానాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకు వెడతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావములు అధికం. వీరికి వ్యవసాయ రంగంలో సాఫల్యం లభిస్తుంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ రంగం నుండి సహాయసహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది.
* శని :- కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షష్టమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య  గ్రహంగా కారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పరి వారిక జీవితం అశాంతికరం.  సంతానంతో సత్సంబంధాలు ఉండక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుక సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం , ఆధ్యాత్మికత కలిగి ఉంటారు.  కాని మొండి తనం, క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
* రాహువు :- కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్య వంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
* కేతువు :- కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాత రోగం, నడుము నొప్పి  కలిగే అవకాశం కలుగుతుంది.
లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వైవాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.



12, అక్టోబర్ 2012, శుక్రవారం

సింహ లగ్నం


 సింహ లగ్నం

* సూర్యుడు :- సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. సింహగ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉన్న కారణంగా వ్కక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడికా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణంగా సన్మానాలను అందుకుంటారు.వీరు ఏకార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. త్వరిత గతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదారస్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం, పరాక్రమం  కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం శాంతి మయం ఔతుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారం లభించదు.
* చంద్రుడు :- సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానాధిపతిగా అకారక గ్రహమై అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధైర్య  మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. స్వభావికంగా వీరు మంచి వారు. వీరికి తల్లి తండ్రుల నుండి సహాయ సహారాలు అందుతాయి. రాజాకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి. చంద్రుడికి పాపగ్రహ చేరిక, దృష్టి ఉన్న అశుభఫలితాలు తగ్గుతాయి.
* కుజుడు :- సింహలగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక కారక గ్రహమై శుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ కుజుడు పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు చతుర్ధ స్థానమైన మిద , సప్తమ అష్టమ స్థానముల
మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విబేధాలు, జీవితభ్గస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. మిత్రుల, భాస్వాముల సహాయసహకారాలు లోపిస్తాయి. శత్రు పీడ ఉంటుంది.
* సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు కనుక ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు. వీరికి కళారంగ సంబంధములు ఉంటాయి. వీరికి శత్రుభయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం వీరికి తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు. భాగస్వామ్యం వీరికి కలసి రాదు.
* సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణంగా గురువు కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. దయాస్వభావం కలిగి ఉంటారు. ధనం బధ్రపరచు గుణం కలిగి ఉంటారు. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింప చేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘములో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి, పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుంది.
* శుక్రుడు :- శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి ఔతాడు. సింహలగ్న శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్థ  శుక్రుడి కారణంగా అందమైన శరీరం కలిగి  ఉంటారు. వీరికి భౌతిక సుఖముల మీద ఆసక్తి అధికం. మెట్టింటి నుండి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా వ్యయం చేస్తారు. వివాహేతర సంబంధాలకు ధనవ్యయం చేస్తారు. సప్తమ  భావంలో ఉన్న శుభగ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్గి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు.
* శని :- సింహ లగ్నానికి శని అష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు.  సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని  కలిగిస్తుంది. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టములు ప్రాప్తిస్తాయి. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుండి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలు తగ్గవచ్చు.
* రాహువు :- సింహ లగ్నస్థ రాహువు అశుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు వీరికి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. ఆ కారణంగా స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడు కోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం. లగ్నస్థ రాహువు వలన వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుండి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు.
* కేతువు :- శత్రురాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు అశుభ ఫలితాలను ఇస్తాడు. లసింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్త గలవు. వీరికి తల్లి తండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి  కారణంగా వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. జీవిత భాస్వామి అనారోగ్యానికి గురి కాగలరు.

కటక లగ్నం

కటక లగ్నం

* సూర్యుడు: కట్క లగ్నానికి సూర్యుడు ధనస్థానాఢిపతి ఔతాడు. కటక  లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. రవి దశలో ఆరోగ్య సమస్య లు ఎదుర్కొంటారు.
వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వీరికి వ్యాపారం మీద ఆసక్తి , ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుండి సమస్యలు ఎదురౌతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వీరికి నిలకడ ఉండదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
* చంద్రుడు: కట్క లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై శుభఫలితం ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవత్భక్తి, పెద్దల ఎడ గౌరవ మర్యాదలు, పరోపకార గుణం కలిగిస్తాడు. వీరిలో మనోబలం ఎక్కువగా ఉంటుంది. స్వప్రయత్నంగా సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. సత్య వాక్కే అయినా కఠినంగా మాట్లాడటం వలన వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు  పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి  సౌందర్యం ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. 
* కుజుడు : కటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి ఔతాడు. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. అయినా లగ్నస్థ కుజుడు 
వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. వీరికి మహత్వకాంక్ష అధికం. వీరికి రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుండి కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్ధిక లాభం అలాగే అధిక వ్యయం కలిగిస్తాడు. ధనసంపాదన వీరికి కఠిన విషయం. తెలివి తేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహపూరితంగా ఉంటుంది.
* బుధుడు: కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారంలో ఆసక్తి తక్కువ, ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువ. కనుక జీవనోపాధికి ఉద్యోగాన్ని ఎన్నుకుంటారు. వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితం అశాంతి మయంగా ఉంటుంది,  భాగస్వాముల వలన హాని కలుగుతుంది. శత్రువుల వలన కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది.
* గురువు: కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిపతి ఔతాడు. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు పరి పూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం అయిన వృశ్చికాన్ని,  సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి ఔతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, దయాస్వభావం కలిగి ఉంటారు.
* శుక్రుడు: కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి ఔతాడు. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితతనం, భయం కలిగిస్తాడు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ వఆపారాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాములు అనుకూలురై శ్రమిస్తారు.
* రాహువు: కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి ష్ఖభోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన పరిశ్ర తరువాత వ్యాపారంలో సఫలత సాధిస్తారు. ఉద్యోగములో అతిత్వరితంగా సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామీ  వలన నష్టములు కలుగ వచ్చు.
* కేతువు: కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతుదశా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సమాజం నుండి గౌరవ, సన్మానాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గుప్తమైన శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలను ఎదుర్కొంటారు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ స్థానకారకత్వమును బాధిస్తుంది. వవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది.


10, అక్టోబర్ 2012, బుధవారం

మిధున లగ్నం


 మిధున లగ్నం 

* సూర్యుడు ;- మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి ఔతాడు. సూర్యుడు లగ్నంలో ఉన్న కారణంగా ముఖవర్ఛస్సు ఉంటుంది. అందం, ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసము, ధైర్యము, పురుషలక్షణం అధికంగా ఉండును.
* చంద్రుడు :- మిధున లగ్నానికి చంద్రుడు ధనాధిపతి. కుంటుంబ అధిపతి. కనుక చంద్రుడు మిధున లగ్నానికి శుభం ధనాధిపతి లగ్నంలో  ఉండడం కారణంగా చంద్రుడు మిధున  లగ్నం వారికి  శుభం కలిగిస్తాడు. వీరికి   తల్లి సహకారం ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉంటే ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత స్వభావం కలిగి ఉంటారు. లగ్నం నుండి కళత్ర స్థానమైన దృష్టి  సారిస్తాడు కనుక ఆకర్షణీయమైన జీవిత భాగస్వామి లభిస్తారు. ఆకర్షణీయంగా మాట్లాడతారు. కుటుంబం వీరికి సహకరిస్తుంది. సంపన్న జీవితం గడపగలుగుతారు.
* కుజుడు :- మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నములో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడుగా ఉంటాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురౌతుంది. యాత్రచేయుటలో ఆసక్తి ఉంటుంది. రక్షణవ్యవస్థలో రాణిస్తారు. తల్లి తండ్రుల నుండి సహకారం లభించదు.శత్రువుల వలన కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టములు ఎదురౌతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యసమస్యలు ఉంటాయి.
* బుధుడు :-  మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధునలగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాక్ధాటి, మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు. వీరు సహజంగానే వ్యాపార మేళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధనసంపాదనా మార్గాలను మార్చుతుంటారు కనుక అర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ప్రసన్నత సహకారం లభించును.
* గురువు :- మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు.
లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.
దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం మర్యాద లభించును. గురువు తాను కాకత్వం వహించే విషయాలలో శుభఫలితాలు ఇస్తాడు. పుత్ర స్థానం, పంచమ స్థానం అయిన తుల, సప్తమ స్థానమైన ధనసు, నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక పుత్రులు, జీవిత భాగస్వామి, తండ్రి నుండి అనుకూలత లభిస్తుంది.
* మిధున లగ్నానికి శుక్రుడు పంచమ, ద్వాదశాధిపతి ఔతాడు. త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో మిత్ర స్థానమున ఉన్న శుక్రుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూకుగా అందంగా ఉంటాడు. భౌతిక సుఖాలపట్ల వీరు అత్యంత ఆసక్తులుగా ఉంటారు.
సుఖంగా ఉండడానికి ధనవ్యయం అధికంగా చేస్తారు. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు. వివాహేతర సంబంధాలు ఉండవచ్చు.
* శని :- మిధున లగ్నానికి శని అష్టమ, నవమ స్థానాధిపత్యం వహిస్తాడు. త్రికోణ స్థానాధిపత్యం వలన అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు. అందువలన శని మిధున లగ్నకారులకు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాడు. వాత, పిత్త, చర్మ రోగములు కలిగిస్తాడు. శని భాగ్య స్థానాధిపతి కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. లగ్నస్థ శని తృతీయ స్థానం శతృ స్థానం అయిన సింహం మీద, సప్తమ స్థానం అయిన ధనసు మీద, దశమ స్థానం అయిన మీనం మీద దృష్టిని సారిస్తాడు కనుక కామం కనిష్ట సోదరులతో విరోధం, కామం అధికంగా ఉండుట,  ప్రభుత్వ పరమైన దండన అనుభవించుట కలుగవచ్చు. తల్లి తండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. పరిశ్రమించగల గుణం ఉంటుంది.
* రాహువు :- రాహువుకు మిధునం  మిత్ర స్థానం. ఈ కారణంగా వ్యక్తి మేధావిగా, కార్యకుశలత కలిగి ఉంటారు. కుశలతతో కార్యాలను చేపడతారు. ఆరోగ్యం, ఆకర్షణ కలిగిన శరీరం కలుగుతుంది. సాహసం అధికంగా ఉంటుంది. మిధున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందుటలో సమస్యలను  ఎదుర్కొంటారు. రాహువు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకుంటాయి.
* కేతువు :- మిధున లగ్నంలో కేతువు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు. స్వతంత్రంగా పని చేసే సామర్ధ్యం ఉండదు. ఇతరులతో చేరి పని చేయుటలో ఆసక్తి కలుగి ఉంటారు.వ్యాపారం చేయుటలో కోరిక ఉంటుంది. అలాగే ఉద్యోగం అందు ఆసక్తి ఉంటుంది. స్వార్ధం అధికంగా ఉంటుంది. వాత పిత్త రోగములు బాధిస్తాయి. కామం ఎక్కువ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.  వివాహానంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగుతాయి.



వృషభ లగ్నం


 వృషభ లగ్నం

* సూర్యుడు :- సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభ కారక గ్రహమై ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం, ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు ఇస్తాడు. ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ సహకారం అందుకుంటారు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధి పతి లగ్నంలో ఉన్న కారణంగా సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. సంతానం నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మనోధైర్యం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వమి కోపస్వభావం కలిగి ఉంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. 
* చంద్రుడు :- వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధి పతి ఔతాడు. కాని చంద్రుడు వృషభంలో ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక చంద్రుడు వృషభ లగ్న జాతకులకు శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు రావచ్చు. మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితం అంటే మక్కువ చూపుతారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృ వర్గ బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. తల్లి తండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనా శక్తి అధికం. ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులు ఔతారు. జలం, నౌకాప్రయాణం, జలప్రదేశాలు వీరిని ఆకర్షిస్తాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు.చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు కనుక వీరికి అందమైన ప్రేమ పూరితమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వీరికి భాగస్వామ్యం అనుకూలిస్తుంది. భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
* కుజుడు :- వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి ఔతాడు. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై శుభఫలితాలు అందిస్తాడు. వృషభ లగ్నంలో లగ్నాధిపతిగా కుజుడు ఉన్న కారణంగా వ్యక్తి ఆకర్షణీయం బలిష్టం అయిన శరీరం ఇస్తాడు. విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్షితులౌతారు. కోపస్వభావం కనబరుస్తారు. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. లగ్నస్థ కుజుడు చతుర్ధ దృష్టిని మిత్ర స్థానం అయిన సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది. లగ్నస్థ కుజుని సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. కాని జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. లగ్నస్థ కుజుని అష్టమ స్థాన దృష్టి మిత్ర్ స్థానమైన ధనస్సు మీద ప్రసరిస్తాడు కనుక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భాగస్వాములతో వీరికి అభిప్రాయ బేదాలు తలెత్తుతాయి. భాగస్వామ్యం వీరికి సాధారణంగా ఉంటుంది. మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి.
* బుధుడు :- వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్థుడు ఔతాడు కనుక బుధుడు వృషభ లగ్నానికి కారక గ్రహమై శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ బుధుని కారణంగా వ్యక్తి బుద్ధికుశలత, సాహసం కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారం అనుకూలిస్తుంది. ధైర్యం అధికం. స్వంత నిర్ణయాలు మనోబలంతో తీసుకుని విజయం సాధిస్తారు. సాహసవంతమైన వృత్తులను స్వీకరించి నైపుణ్యం చూపించగలరు. శిక్షణకు సంబంధించిన ఉపాద్యాయ వృత్తిలోరాణిస్తారు. బుధుని పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృషభం మీద ఉంటుంది కనుక మీత్రుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. స్నేపూరితమైన అందమైన ప్రేమను చూపించే జీవితభాస్వామి లభిస్థుంది. జీవిత భాగస్వామి సహాయ సహకాతారు అందుకుంటారు. భాగస్వామ్యం వీరికి అనుకూలం. వీరికి భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
* గురువు :- వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానములకు ఆధిపత్యం వహిస్తాడు. లగ్నత్ష గురువు ఆకర్షణీయమైన, సౌందర్యం ఇస్తాడు.కనుక వృషభలగ్నానికి  అకారక గ్రహమై అశుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం ఇస్తాడు. వ్యాపార రంగం కంటే ఉద్యోగంలో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు. ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు. గురువు పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రసరిస్తాడు కనుక బుద్ధి కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరాభిమానం చూపించే సంతానం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక గురువు మిత్రస్థాన దృష్టి జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం చూపించి సహాయసహకారాలు చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. భాస్వామ్యం వీరికి కలిసి వస్తుంది. భాగస్వాలు వీరికి సంపూర్ణ సహకారం అందిస్తారు. గురువు నవమ స్థాన దృష్టి మకరం మీద ప్రసరిస్తాడు కనుక తండ్రితో సాధారణ సంబంధాలు ఉంటాయి. పిత్రార్జితం స్వల్పంగా సంక్రమిస్తుంది.
* శుక్రుడు :- వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి ష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపతిగా శుక్రుడు కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నాధిపతిగా శుక్రుడు అందమైన శరీరం ఇస్తాడు. అరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు ఉంటాయి. మనోబలం అధికం. జనాకర్షణ కలిగిఉంటారు. కళారంలో వీరు ప్రతిభ చూపగలరు. కళాసంబంధిత వృత్తులలో రాణిస్తారు. వలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపుతారు. సుఖజీవితం కొరకు ఎక్కువగాఖర్చు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలను చేపడతారు. ఆర్ధిక పరిస్థితిబాదా ఉంటుండీ. ధనార్జన బాగా చేస్తారు. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన వృశ్చికం మీద సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి విలాసాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కోపస్వభావం కలిగిన అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక జీవిత సుఖం సాదారణం. మిత్రులు, భాగస్వాములు ఉద్రేక పూరిత గుణం కలిగి ఉంటారు. భాగస్వామ్యం వీరికి సాదారణ ఫలితాన్ని ఇస్తుంది.
* శని :- వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపత్యం వహిస్తాడు. ధర్మకర్మాధిపత్యం చేసే శని మిత్ర స్థానమైన వృషభ లగ్నానికి శుభుడై శుభ ఫలితాలు ఇస్తాడు. శని లగ్నాధిపత్యం వలన సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు. పరిశ్రమించి ఉన్నత కార్య సాధన చేస్తాడు. ఆర్ధిక స్థితి సాధారణం. తల్లితో వీరికి సఖ్యత సాదారణం. సోదరులతో సఖ్యత ఉండదు. కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి గురి ఔతారు.  శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారం ఉండదు. లగ్నష శని పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చికము మీద ప్రసరిస్థాడు కనుక పరుష వాక్కులు పలికి క్రోధ స్వభావం కలిగి, శ్రమించే గుణం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందవు. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. భాగస్వాముల సహకారం లభించదు. మిత్రుల సహకారం ఉండదు. లగ్నస్థ శని నవమ స్థాన దృష్టి కారణంగా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలకు, సహాయసహకారాలకు దూరం ఔతారు.
* రాహువు :- వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరాన్ని ఇస్తాడు. కపట స్వభావం ఉంటుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం బాధిస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. 
* వృషభ లగ్నస్థ కేతువు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. స్త్రీ పురుషుల మద్య మీద ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.

9, అక్టోబర్ 2012, మంగళవారం

మేషలగ్నస్థ గ్రహములు


 మేషలగ్నస్థ గ్రహములు 

మేష లగ్నములో ఉండే గ్రహముల వలన కలిగే ఫలితాలు.
* సూర్యుడు :- మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉన్న కారణముగా వ్యక్తి అందము ఆకర్షణ కలిగి ఉంటాడు. విద్యావంతుడు ఔతాడు. జీవిత సరళిలో తండ్రితో విభెదాలు తల ఎత్త వచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాక ఉన్న ప్రభుత్వపక్షము నుండి సహాయము అందుతుంది. సుర్యుడి ప్రభావము వలన సంతానప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణదృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి సూర్యుడు కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. కాని వివాహ జీవితములో ఒడి దుడుకులు ఉంటాయి.
* చంద్రుడు :- చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి కనుక జాతకుడు శాంత స్వభావుడైనా కొంటె తనము కలిగి ఉంటారు. కల్పనాశక్తి, మరియు భోగలాలస కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితము మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి తల్లి నుండి తల్లి పక్షము నుండి సహాయము లభిస్తుంది. భూమి, భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగిఉంటారు. చలి వలన కలిగే జలుబు, దగ్గుల వలన బాధలు ఉంటాయి. చలి సంభందిత రోగములకు అవకాశము ఉంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వము, ప్రభుత్వ పక్షము నుండి ప్రయోజనము ఉంటుంది. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి కలిగి, గుణసంపద కలిగి, సహాయసహకారాలు  అందించే వారుగా ఉంటారు.
* కుజుడు :- కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక జాతకుడు కండలు తిరిగిన శరీరముతో సాహసవంతుడు, పరాక్రశాలిగా ఉంటాడు. కోపము, మొరటుదనము ఎక్కువ. కఠినమైన పనులను కూడా ఆత్మబలముతో చేయకలిగిన సామర్ధ్యము కలిగి ఉంటారు. సమాజములో  పేరు, ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. దుర్ఘటనలు జరగడానికి అవకాశము ఉంది. భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక వైవ్వహిక జీవితము బాధించ బడుతుంది.
* బుధుడు :- బుధుడు మేషలగ్నానికి తృతీయ మరియు షష్టమభఅవాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా, బుద్ధిమంతుడిగా చేయును. కళాక్షేత్రములో, లేఖకుడిగా అవకాశములు లభిస్తాయి. బుధ దశలలో బంధుమిత్రులతో వివాదములు, అశాంతి ఉంటాయి. షష్థమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాదులు, మూర్చ వ్యాధి, ఆజన్మ రోగములు,  మతిమరుపు కలిగిస్తాడు. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది.  బుదుడి సప్తమ దృష్టికారణముగా సంతాన సంబంధాలలో సమస్యలు ఎదురౌతాయి. జీవితభాగస్వామికి ఆరోగ్యసమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి దృష్టి కారణముగా జీవితభాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితము సాధారణముగా ఉంటుంది.
* గురువు :- మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి ఔతాడు. ద్వాదశస్థానాధిపత్యము కారణముగా గురువు మేషలగ్నానికి అకారణమైన అసుభఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యముతో అశుభము తొలగి పోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మేధావి మరియు  జ్ఞాని ఔతాడు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి స్వంతము. వీరికి ప్రజా సన్మానము, ప్రతిష్థ కలుగుతాయి. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యము ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణముగా తండ్రికి శుభములు కలుగుతాయి.
* శుక్రుడు :- శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి ఔతాడు. శుక్రుడు లగ్నస్థముగా కష్టములు, రోగములు కలిగిస్తాడు. జాతకుడు అందంగా కనిపించినా ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటాడు. శుక్రదశలో వీరు అధికముగా కష్టములను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా స్త్రీ పురుషల మద్య ఆకర్షణ అధికము.
* శని :- లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభములను, ఏకాదశాధిపతిగా అశుభమును కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణముగా జాతకుడు సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల సహకారము లభించుట కష్టము. ఉద్యోగ వ్యాపారములలో నిలకడ ఉండదు. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి.
* రాహువు :- మేషలగ్నములో రాహువు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. జీవితములో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాదులు ఉంటాయి. ఉద్యోగవ్యాపారాలలో అతి కష్టము మీద సఫలత సాధిస్తారు. వ్య్యాపారము చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమదృష్టి కారణముగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితము బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు.
* కేతువు :- మేషలగ్నస్థ కేతువు కారణముగా శారీరక బలము కలిగిఉంటారు. వీరి దరికి రోగములు చేరవు. ఆత్మవిశ్వాసము , ధైర్య సాహసములు కలిగి ఉంటారు. కనుక శత్రువులు భయభక్తులతో ఉంటారు. సమాజములో గౌరవము, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుండి సఫలత లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సంతానము నుండి సమస్యలను ఎదుర్కొంటారు.