12, ఫిబ్రవరి 2013, మంగళవారం

విభిన్న సంప్రదాయాలు

విభిన్న సంప్రదాయాలు 

File:Kreung cabins of unmarried.jpg
ఇదే క్రెయింగ్ ప్రజలు తమ ఆడపిల్లల కొరకు నిర్మించిన నివాసము 

కొరియాలోని రతనకిరి ప్రంతంలోని క్రెయింగ్ తెగ ప్రజలకు ఒక వింత సంప్రదాయం ఉంది.  ఈ తెగలోని ప్రజలు యువతీ యువకులు ఒకరిని ఒకరు చక్కగా అర్ధం చేసుకున్న తరవాతనే వైవాహిక జీవితంలో ప్రవేసించడాన్ని ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా వారు యువతీ యువకులకు పూర్తి  స్వేచ్చను ఇస్తారు. వివాహానికి ముందు వారు వారికి నచ్చిన వారితో కొత కాలం  కలిసి జీవించిన తరువాత వారిరువురికి పరస్పరం  నచ్చిన తరువాతనే వివాహజీవితంలోకి ప్రవేశించే వీలును కుటుంబ సభ్యులే కల్పిస్తారు. 


ఈ విధానంలో ఒక భాగంగా అమ్మాయిలు వయసుకు వచ్చిన తరువాత  ఇంటి వెనుకభాగంలో ఒక మంచెను ఏర్పాటూ చేసి దాని మీద ఆకులు గడ్డితో చిన్నకుటిరాన్ని  అందంగా పక్షి గూళ్ళలా నిర్మిస్తారు. తరువాత ఆ అమ్మాయి అందులో నివసించడనికి అనుమతిస్తారు. ఇలా చేయడం ద్వారా యువతీ యువకులకు కుటుంబానికి మద్య ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఆ కుటీరంలో వారు వారికి నచ్చిన యువకులుతో సహజీవనం చేయవచ్చు. అయినప్పటికీ వారికి నచ్చిన యువకుడు లభించిన తరువాత అప్పటి  వరకూ స్నేహం చేసిన వారితో తెగతెంపులు చేసికొని నచ్చిన యువకుడిని  వివాహం చేసుకుంటరు. ఒక్కో సమయంలో అమ్మయిలు ఒకరికంటే  అధికమైన యువకులతో కూడా స్నేహం చేస్తుంటారు. 

వివాహానికి ముందు యువతులు గర్భం ధరించకుండా ఒక రకం చెట్తు నుండి తీసిన రసం త్రాగే గ్రాగే వారు.  ప్రస్తుత కాలంలో ఆధునిక గర్భనిరోధక వ్యూహాలను అనుసరిస్తున్నారు. వివాహానికి పూర్వం సంతానం  పొందడం కూడా సంభవిస్తూ ఉంటుంది. పరస్పం అంగీకరిస్తే ఆ శిశువు తండ్రితో  వివాహం జరిపిస్తారు. అలా జరగకున్నా వివాహం చేసుకున్న యువకుడు ఆశిశువుకు తండ్రిలా బాధ్యత తీసుకుంటాడు.  ఈ  విధానం కారణంగా శిశులను చెత్తకుండీలలో పారవేయడం కాని భ్రూణ హత్యలకు కాని ఈ తెగలో తావు లేదన్నమాట. 

ఈ విధానం కారణాంగా వారిలో వివాహం తరువాత విభేధాలు తక్కువగా ఉంతాయి. దీర్ఘ కాల వైవాహిక జీవితం కొనసాగుతుంది. వీరిలో వివాహానంతరం విడిపోయే వారి శాతం స్వల్పం. వీరిలో భార్యా భర్తల మధ్య అపార్ధాలు అనుమానాలు ఆత్మహత్యలు హత్యలు అత్యాచారాలు వంటివి లేవు. ఆకర్షణే ప్రేమ అనుకుని వివాహం చేసుకుని  తరువాత సమస్యలతో విడిపోవడం కంటే ఇది మేలన్నది వీరి అభిప్రాయం.  ఆధునిక సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాకున్న సమ్యలు తక్కువగా ఉన్న వైవాహిక సంబంధాలలో ఇది ఒకటి అని భావించ వచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి