1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

గంగోత్రి




File:Gaumukh Gangotri glacier.jpg
గోముఖ్ వద్ద గంగోత్రి 


File:Nanda Devi, from Joshimath.jpg
జోషీ మఠ్ వద్ద మనోహరంగా కనబడుతున్న నందాదేవీ శిఖరం 
File:Ropeway at Joshimath, Uttarakhand.jpg
జోషి మట్ వద్ద ఉన్న రోప్ వే 


బద్రీనాథ్ నుండి మేము బయలుదేరి తిరిగి జోషిమఠ్ చేరుకున్నాం. జోషిమఠ్ వద్ద ఉన్న భవిష్య బదరీనాథ్ ఆలయం చూడడానికి బస్సును ఆ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆపారు. హిమాలయ ఘాట్ మార్గంలో అన్ని ప్రదేశాలలో బసులు నిలపడానికి కావలసినంత విశాలమైన ప్రదేశం లభ్యం కాదు కనుక బసులను మార్గం వెంట ఒకదాని వెంట ఒక దానిని నిలుపుతూ ఉంటారు. అలా నిలిపే సమయంలో ఒక్కో సమయంలో మనం చూడవలసిన ప్రదేశానికి  3-4 కిలోమీటర్ల దూరంలో ఆపవలసిన అవసరం ఉంటుంది. ఇక చేసేది లేక కళ్ళకు బుద్ధి చెప్పి అందరం నడక సాగించాం. ఘాటు మార్గం ఎగుడు దిగుడు మధ్య మూడు కిలోమీటర్ల దూరం నడకకు అందరం అలసి పోయాము. కానీ మాకంటే వయసైన కొందరు అలసట చెందక పోవడం కొస మెరుపు. చిన్నగా మేము భవిష్య బదరి ఆలయం చేరుకున్నాము.
జోషి మఠ్ వద్ద నరసింహ ఆలయం 
జోషి మత వద్ద శంకరా చార్యుల మఠం 

భవిష్యత్తులో బద్రీ నాథ్ మార్గం మూత పడవచ్చని అప్పుడు జోషి మఠ్ ఆలయం బద్రీనాథ్ ఔతుందని అష్టాదశ  పురాణాలలో ఒకటైన భవిష్య పురాణంలో పేర్కొనబడింది. అప్పుడు బద్రి నాథు నికి పూజలు ఇక్కడే జరుగుతాయని ఋషి వాక్కు సూచిస్తూ ఉంది. ప్రస్తుతం శితా కాలంలో  బద్రి నాథ్ ఆలయం ముసి వేసిన తరువాత బద్రీనాథ్ స్వామికి పూజాదికాలు ఇక్కడ నిర్వహించ బడుతూ ఉంటాయి. మేము ఆలయ దర్శనం చేసి తరువాత పక్కనే ఉన్న 
ఆది శంకరా చార్యుల మఠాన్ని సందర్శించాం. వేణు తిరిగి పోతున్న సమయంలో నిర్వాహకులు మాకొరకు వ్యానులు మాట్లాడుకుని తీసుకు వచ్చారు. మాకు వాటిని చుసి ఉత్సాహం వచ్చింది. ఏదో ఆసక్తి తో వచ్చాం కాని తిరిగి వెళ్ళే ఓపిక అంతగా లేదు.  ఇక అక్కడి నుండి బయలుదేరి రాత్రి సమయానికి ఉత్తర కాశి చేరుకున్నాము.మా తరువాత ప్రణాళిక గంగోత్రి చూడడం. అందుకని ఉత్తర కాశిలో బస చేసి మరుసటి రోజు గంగోత్రి వెళ్ళాలి.

File:DraupadiKaDanda-HimalayanPeak-Garhwal,India.jpg
ఉత్తర కాశి లో ఉన్న ద్రౌపదీ కా దండా శిఖరం


File:Trek to Gaumukh.jpg
గోముఖ్ పర్వత మార్గం 
ఇదే గంగాదేవి ఆలయం


 ఉత్తర  చేరుకొని ఆరాత్రికి విశ్రమించి మరునాడు ఉదయానికి మేము తిరిగి గంగోత్రికి బయలు దేరాం. అలా బసులో ప్రయాణం చేసి షుమారు 3-4 లోపల గంగోత్రికి చేరుకున్నాము. గంగోత్రికి కుడా మూడు కిలోమీటర్ల దూరంలో బసు ఆగింది. అక్కడి నుండి చిన్నగా కాలి నడకన గంగోత్రి చేరుకున్నాము. గోముఖ్ శిఖరానికి దిగువన గంగా నది చిన్న ప్రవాహ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తవానికి గంగానది జన్మస్థానం గుముఖ్ శిఖరం. అక్కడకు సన్యాసులు, పర్వతారోహకులు కాలినడకన చేరుకుంటారు. అక్కడ గంగాదేవి హిమరుపంలో ఉంటుంది . గగాదేవి ఆలయానికి దాదాపు 40-50 కిలోమీటర్ల ఎగువగా అది ఉంటుంది. మేము ఎలాగైనా అక్కడకు వెల్ల లేము కనుక. దిగువన ఉన్న గంగాదేవి ఆలయం చూసి వేనుతిరగాలన్నది మా ప్రణాళిక. ముందుగా పూజ సామాను కొని నది వద్దకు చేరుకున్నాం. ఉన్న బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకుని, అక్కడ స్త్రీలు అమ్ముతున్న దీపం  కొనుక్కుని గంగానదిలో వదిలి కాళ్ళు  కడుక్కుని గంగాజలం తల మీద చల్లుకున్నాం. 

File:Bhagirathi River at Gangotri.JPG
ఇదిగో ఇదే గంగోత్రి 

గంగోత్రిని అలా సంభ్రమంగా చూస్తూ ఉండి పోయాం. గంగాజలం చిన్న చిన్న రాళ్ళను దొర్లించు కుంటూ పై నుండి వేగంగా కిందికి దిగివస్తూ దర్శనం ఇచ్చింది. రాళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. కాళ్ళు  కూడా జాగరూకత వహించి కడుగు కోవాలి. అలా చేయకుంటే కాళ్లు చీలిపోయే ప్రమాదం ఉంది. మా బృందంలో ఒకావిడకు కాళ్ళు కడిగే సమయంలో దెబ్బ తగిలి రక్తం కారింది. అంత పదునుగా ఉంటాయి అక్కడ రాళ్ళు. గంగా నది ఆరంభ స్థానం కనుక  నీళ్ళు అంత లోతు ఉండదు. అయినప్పటికీ నీళ్ళలో మట్టికరిగి ఉంటుంది కనుక గంగా జలం లేత గోధుమవర్ణంలో ప్రవహిస్తుంది. గంగాజలం చాలా చల్లగా జిల్లున ఉన్నాయి. అక్కడ అంతగా స్నానం చేయరు. కాని అంత చల్లని జలాలలో వయసైన ఆవిడ ఒకామె స్నానం చేయడం కొసమెరుపు. గంగోత్రి దర్శనం పూర్తి చేసుకుని మేము పక్కనే ఉన్న గంగా దేవి ఆలయానికి చేరుకున్నాం. 
File:Gangothri.jpg





ఇదిగో ఇదే గంగీత్రి వద్ద గంగాదేవి ఆలయం. ఆలయం చేరుకుని అక్కడ గంగాదేవికి పూజాదికాలు ముగించుకుని మెల్లగా వెలుపల  ఉన్న భాగీరధుడిని దర్శించుకున్నాము.ఆలయం పక్కగా భగీరధుడికి చిన్న మందిరం ఉన్నది. గంగాదేవి భూమికి దిగిరావడానికి కారణమైన భగీరధుడికి ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తుంటారు . ఇలా గంగోత్రి దర్శనం పూర్తి అయింది. అక్కడ నుండి కదిలి వెళ్ళాం. అక్కడ ఆరుగంటల తరువాత గంగానదికి హారతి ఇస్తారని అన్నారు. అది చూడాలని ఉన్నా తరువాత బసు వద్దకు నడిచి వెళ్లి బసక చేరుకోవడానికి ఆలస్యం ఔతుంది కనుక హారతి చూడకుండానే వెనుతిరిగాం. తిరిగి బసు వద్దకు నడిచి వెళ్లి బసకు చేరుకున్నాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి