8, జులై 2012, ఆదివారం

నక్షత్రాలు గుణగణాలు 2


మఖనక్షత్రము గుణగణాలు
మఖ కేతుగ్రహ నక్షత్రం  కనుక ఈ నక్షత్రజాతకులకు మంత్రోపాసన,  వైరాగ్యం , భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికం. కేతువు ఆధిపత్యం, రాక్షస గణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికం. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావం  అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం  వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బ్యాంల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాదాన్యత ఇస్తారు.  తన పరిసరాలను పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు.  ఎవరికీ తలవంచని మనస్తతత్వం  వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం  భద్రం  చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు  కాని నిద్ర లేమిని సహించరు. సహన గుణం  తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి బాధపదతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం , గృహ యోగం, ఆర్ధిక యోగం, విదేశీయాన యోగం  కలసి వస్తాయి. నక్షత్ర అధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు,  రాక్షస గణం కారణంగా పట్టుదల,  రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవీక కార్య నిర్వహణ,  రాజకీయ ఆధిపత్యం ,  వృ త్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకు వస్తాయి.

 పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు

పూర్వఫల్గుణీ నక్షత్రం  అధిపతి శుక్రుడు వీరికి బాల్యం  కొంత వరకు సుఖమయ జీవితం గడుస్తుంది. ఆటంకం  లేకుండా విద్యాభ్యాసం  కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రధిపతి శుక్రుడు, మానవగణం  కారణంగా  లౌక్యం , అధికారం  కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యోగ  వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. సౌమ్యులే అయినా గంభీరంగా  ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదాదానం చేస్తారు. సివిలు కేసులను ఎదుర్కొంటారు.స్వయంకృతాపరాధం వలన తాను శ్రమించి  సాదించిన దానిని వైరి వర్గానికి ధారపోస్తారు. స్నేహితుల  ఉచ్చు నుండి కొందరు  జీవితకాలం వరకు బయట పడలేరు. బయట కనిపించే  జీవితం  కాక రహస్య జీవితం  వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నంగా   సంతానాన్ని వేరు రంగాలలొ ప్రోత్సహిస్తారు. సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మంచి  పరిచయాలు ఉంటాయి. వీరి జీవితం  స్నేహానికి అంకితం. వీరవిద్యలలో రాణిస్తారు.


 ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు

ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, మనుష్య గణం , రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి  వలన ప్రయోజనం  పొందుతారు. సహోదర వర్గం  బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికం. వివాహం సకాలంలో ఔతుంది, ఉద్యోగం  లేక వ్యాపారం ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనం అధికంగా గుప్తంగా  ఉంటాయి. తనకు అంతగా పరిచయం  లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి  పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయం లో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చుపెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వందరెట్లు  ఫలితం  ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యం అధికం. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపంచం సరిగా అర్ధం చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితం  మీద ఉన్న భయం  వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు 

హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాశి అధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుంటారు. అడగకనే సహాయం  చెస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు  జీవితములో ప్రధాన ప్రస్తావన ఔతుంది. వ్యుహాలు రహస్యం  అయినా కొందరికి మాత్రం  చెప్తారు. చేసిన తప్పులను  అడగకుండా మీకు మీరుగా ఒప్పుకుంటారు. దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జివితంలో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపు  కొంత  కాలం వేచి ఉండాలి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడం వలన వైవాహిక జివితం సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గం పట్ల  అభిమానం  కలిగి ఉంటారు. అనుకున్న ప్రదేశంలో  ఇష్టమైన  విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారంలో ఉంటాయి. సంతానం  పేరు ప్రతిష్టలు  తెస్తారు.


 చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు

చిత్తా నక్షత్రానికి  అధిపతి కుజుడు, రాక్షసగణం , జంతువు పులి, వృక్షం  తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లేక స్వజనులకు దురంగా పెరుగుటకు అవకాశం  ఉంది. ఇతరుల ఆర్ధిక సాయంతో జీవితంలో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం ఔతారు. వాదనా పఠిమ కారణంగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుల్యంలో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపం, పోరుబెట్టడం, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం  వలన కావలసిన వారికి అందరికి  దూరం  ఔతారు. ప్రయోజనం  లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానం ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యంగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడం (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మద్య భాగంలో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంట  వ్యవసాయం  పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.
స్వాతి నక్షత్రం గుణగణాలు 

స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుప్రభావంతో కల్పనా శక్తి శుక్రప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్రజాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విధ్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్ధికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగిఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఈతరుల అసూయకు లోను ఔతారు. అకారణమైన నిందకు గురి ఔతారు. ఒక వైపు వాదనలు విని ఏక పక్ష నిర్ణయాలు తీకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు.
దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.


 విశాఖనక్షత్రము గుణగణాలు 


విశాఖ గురుగ్రహ నక్షత్రం, రాక్షస గణం, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితం ప్రారంభం ఔతుంది కనుక బాల్యం  సుఖంగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం  మొదలౌతుంది. వీరికి మొండితనం ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం  వ్యర్ధం. వీరికి సహాయం  చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో  చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ  సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశం  చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం  వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం  వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబధం  ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం  ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టం  ప్రయోజనం  సమంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం  ఉంటుంది. విదేశీపౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.
కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయం  పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జివితంలో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరం  జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం  సుఖవంతంగా జరుగుతుంది.


 అనూరాధనక్షత్రము గుణగణాలు




అనూరాధా నక్షత్రం  అధిపతి శని. ఇది దేవగణ  నక్షత్రం . అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షతరంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మం , పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం  కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల  ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ  శ్రే యస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మకద్రోహం ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం , దూరప్రాంత ఉద్యోగం , దూరప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యం మిశ్రమం  చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం  వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధం  ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం  సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం  అన్ని విధాలుగా బాగుంటుంది.


 జ్యేష్టానక్షత్రము గుణగణాలు


జ్యేష్టా నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం , అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం  కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం  చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే  కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన  ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం  వీరికి సుఖంను కలిగిఉస్తుంది. సంతానం నష్టం  కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నెహం ఉండదు. సాంకేతిక రంగం లో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది.  విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.  ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రం లో గ్రపరిస్థితులను అనుసరించి  ఫలితాలలో మార్పులు ఉంటాయి.









5, జులై 2012, గురువారం

నక్షత్రాలు గుణగణాలు


 అశ్విని నక్షత్రము గుణగణాలు

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము  వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆశక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆశక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి  కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు.  ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆశక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు.  నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

భరణినక్షత్రము గుణగణాలు

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.
ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.


 కృత్తికానక్షత్ర జాతకుల గుణగణాలు


కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సుర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు.
బాల్యములో మంచి  పోషణ, పపెంపుదల  ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నం  మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. వీరికి మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. మద్యవర్తిత్వం  బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. పద్దెనిమిది ఇరవై మూడు  సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ  ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు  ఉంటాయి.


రోహిణి నక్షత్ర గుణగణాలు 


రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలయందు  ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాతృవర్గం  మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద  కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శ  ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళా  ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి  అవార్దులు పొందగలరు.
సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖపెదతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము  అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

 మృగశిరా నక్షత్రము గుణగణాలు
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంస్థలు  స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మముగా  న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు.  సైనికపరమైన, ఆయుధ సంబందిత, విద్యాసంబంధిత  ఉద్యోగావ్యపరాలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో రాణిస్తారు. తల్లి తండ్రుల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానమందు  క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

 ఆరుద్ర నక్షత్రము గుణగణాలు 

ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిగిఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవగణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు నక్షత్ర అధిపతి రాహువు కనుక  విద్యా వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖసంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వ్రత్తి, వ్యాపారాలు  కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందర పాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందరిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చినా  కూడ ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు.  వీరి జీవితంలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.

 పునర్వసు నక్షత్రము గుణాగణాలు

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసట  కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మాటలు  స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడడంలోనే ఆశక్తి అధికం కనబరుస్తారు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయట  పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.

 పుష్యమి నక్షత్రము గుణగణాలు 
పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనం  వచ్చిన తరువాత జీవితం  అదృ ష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యంగా  ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదారుల వలన సమాజంలొ అప్రతిష్టకు లోనౌతారు. వారి సలహాల కారణంగా వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రంగంలో  అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.
 ఆశ్లేష నక్షత్రము గుణగణాలు 

ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే  వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు.
వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరంగా  ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను  సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.
లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల(జవుళీ)వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు. గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు  దూరముగా ఉంటారు. ఒడు దుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలకడగా ఉంటుది.

29, జూన్ 2012, శుక్రవారం

పింక్ సిటీ

రాణివాస స్త్రీలు ఉత్సవాలను తిలకించే హవా మహల్ 

పింక్ సిటీ

రాజగంభీరంగా  ఉన్న రాజ్ మందిర్ 
రాజ్ మందిర్ లోపలి దృశ్యం 
నగర సందర్సనం చేసే సమయంలో బసులో గైడ్ మాకు జైపూర్ లో చూడదగిన వాటిలో రాజ్ మందిర్ సినిమా దియేటర్ ఒకటి అని చెప్పాడు. నిర్వాహకులు సినిమా చూడాలని అనుకున్నవారికి టిక్కెట్ తీసిపెడతామని  చెప్పారు. దాదాపు అందరూ అంగీకారం చెప్పారు. అందరిలోనూ సినిమా చూడాలన్న ఆసక్తి కంటే దియేటర్ చూడాలన్న ఆసక్తి అధికంగా ఉంది.  అమర్ కోట చూసి హోటల్ చేరుకున్న తరువాత మేము కొంత విశ్రాంతి తీసుకుని రాత్రి అల్పాహారం తీసుకుని ఆరోజు గైడు చెప్పిన రాజ్ మందిర్ చూడడానికి బయలుదేరాము.  అయితే హోటల్ వాళ్ళు మేము అనుకున్నట్లు టిక్కెట్టు ఏర్పాటు చేయలేదు అయిన  మేము అనుకున్నట్లు వెళ్ళాలని అందరం ఆటోలు మాట్లాడుకుని దియేటర్ దగ్గరకు చేరుకున్నాము. హిందీ  సినిమాకు టిక్కెట్టు కొనుక్కుని లోపలకు ప్రవేశించాగానే లోపలి దృశ్యం మా అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. దియేటర్ నిజంగానే రాజగంభిరంగా ఉంది. సినిమా  చూసి
వెలుపలికి వచ్చి అ రాత్రి సమయంలో హిందిలో మాకు మేమే ఆటోలు మాట్లాడుకోవడానికి శ్రమ పడ్డాం. అలాగే సరిగ్గా రాత్రి సమయంలో దారి  కనుక్కుని కొత్త ఊరిలో హోటలుకు చేరడం కూడా మాకు సమస్య అయింది. వచ్చిరని హిందిలో మాట్లాడి ఎలాగో హోటలుకు చేరాము.
సహాయ బృందంలో కొందరు 
సహాయ బృందానికి కానుకలు 
మర్నాటి ఉదయం మాకు ఫ్రీ డే. మేము అనుకున్న చోటకు పోవచ్చు.  చివరి రోజు కనుక మాకు కావలసిన వస్తువులు కొనవచ్చు. అందుకే ఈ  వెసులుబాటు. ఉదయం  అల్పాహారం అయిన తరువాత  చివరి రోజు కనుక నిర్వాహకులు మాకు సహకరించిన యాత్ర సిబ్బందికి బహుమతి ప్రదానం ఏర్పాటు చేసారు. అందరికి కృతజ్ఞతలు చెప్పి వారి శాలువలు కప్పి చిన్న చిన్న కానుకలను ఇచ్చారు. అలాగే మా బృందంలో ఒకరికి పుట్టిన  రోజును కూడా జరిపారు.
పింక్ సితిలో ఒక దృశ్యం 


నగరంలో ప్రవేశించే ద్వారాలలో ఇది ఒకటి 
తరువాత మేము బృందాలుగా విడిపోయి ఆటోలు మాట్లాడుకుని పింకు సిటీకి వెళ్ళాము. జైపూరు షాపింగ్ కేంద్రం పింక్ సిటియే. అన్ని రకాల దుకాణాలు ఉన్న వ్యాపార కూడలి ఇదే. ఇక్కడ భవనాలు వెలుపలి భాగం ముదురు రోజారంగు  మాత్రమే వేయాలని ఇక్కడి చట్టం ఉందని గైడు నిన్న చెప్పాడు. అతిక్రమించిన వారికి  25 వేల నుండి జరిమానా విధిస్తారని చెప్పాడు. సాధారణంగా నగర ప్రజలు కూడా తమ నగర ప్రతిష్ట కాపాడు కోవడానికి ముదురు రోజారంగు మాత్రమే వేస్తారట. లోపలకు ప్రవేశించడానికి అనేక ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇలా చూస్తూ మేము ఒక ద్వారం ద్వారా నగరంలోకి వెళ్లి మా షాపుంగ్ మొదలు పెట్టాం. జయపూర్ లో అందరం తప్పక కొనాలని అనుకున్నది దేవుడి పాలరాతి శిల్పం. అందరం  వారి వారి ప్రత్యెక అభిరుచి ప్రకారం వారు శిల్పాలను వెతకడం మొదలు పెట్టారు.


జైపూర్ నగరాన్ని దేవతా  నగరం అని కూడా అంటారట. ఇక్కడ చెక్కిన శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేవాలయాలలో ప్రతిష్టించి పూజలు చేస్తారట. అందుకే  ఈ నగారాన్ని ఇలా పీలుస్తారట. ఇలా మేము శిల్పాలను చూస్తూ ఉన్న సమయంలో నిర్వాహకులు మాకు ఫోన్ చేసి శిల్పాలను కొనడానికి వారి సహకారం అందిస్తామని చెప్పారు.


సరస్వతి గణపతి లక్ష్మీ 


గోపాల కృష్ణుడు 
మేము వారిని కలుసుకుని అక్కడ వారి సహాయంతోశిల్పాలను కొన్నాము. వారు మాకు కొన్ని ప్రత్యెక శిల్పాలను కూడా చూపారు. ఆ  శిల్పాల సౌందర్యం మ్మము ముగ్ధులను చేసింది. మచ్చుకి పైన రెండు చిత్రాలు ఉన్నాయి చూడండి. మూడు అడుగుల పైగా ఉన్న ఈ  శిల్పాలు మూడు నుండి ఐదు లక్షల వరకు విలువ చేస్తాయట. ఎంత అందంగా ఉన్నాయో.  అందరం కొనుగోలు చేసి ముగించే సరికి మద్యాహ్న భోజన సమయం అసన్నం  అయింది. జైపూర్ లో మంచి పేరున్న ఎల్ ఎమ్ బి హోటల్ కు వెళ్లి భోజనాలు చేసి వెలుపలి షాపులలో తిరిగి అక్కడ దుప్పట్లు, చీరలు , చుడిదార్ మొదలైనవి

కొనుక్కుని అలసటతో హోటల్ కు చేరాం .  మిగిలిన సమయం అలా అలా అందరం కలుసుకుని సరదాగా మాట్లాడుకున్నాం. ఆరోజు అలా గడిచి పోయింది.

జైపూర్ స్టేషన్ వెలుపలి భాగం 

మరునాటి ఉదయం మాకు యాత్రలో చివరి రోజు సాయంత్రం 6.30 రైల్వే స్టేషన్లో ఉండాలి . అయినా అప్పటి వరకు ఉరకే ఉండాలి కదా ! అందుకని తిరిగి పింక్ సిటి షాపింగ్ చూడడానికి వెళ్ళాము. ఈ  రోజు కొంతమంది హోటల్ లో ఉన్నారు. కొంత మందిమి మాత్రమే బయలు దేరాం .  ఈ రోజు కొంత కవరింగ్ నగలు బెడ్ షీట్స్ వంటివి ఇంకా  ఇతర వస్తువులు కొనుగోలు చేసి మద్యాహ్న సమయం వరకు తిరిగి హోటల్ కు చేరి భోజనాలు చేసి సమానులు సర్దేపని మొదలు పెట్టాం. సమానులు అన్ని గదుల వెలుపల పెట్టగానే హోటల్ గదులు కలి చేయవలసిన సమయం ఆసన్నం అయింది. హోటల్ వాళ్ళు మాకు ఇంకా సమయం ఉంది కనుక మాకో రెండు గదులు మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారు. మళ్లీ ఆడవాళ్ళంతా మాటల్లో దిగాం . ఇలా నాలుగున్నర వరకు సమయం గడిపి ఆ గదులు కూడా ఖాళీచేసి కిందకు దిగాం . మాలో కొంత మంది ఇక స్టేషన్ కి వెళ్ళాలని నిర్ణయం చేసాం . మేము ఎవరికీ వాళ్ళం ఆటోలు మాట్లాడుకుని స్టేషన్ చేరాం . స్టేషన్ వెలుపల చక్కగా అలంకరించబడి ఉంది . ఇది దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం కనుక ఇలా అందంగా తిర్సిదిద్దినట్లు ఉంది . 

స్టేషన్ చేరిన తరువాత అనేకంగా బృందం వాళ్ళం విడిపోయాం . మా బెర్త్  లు  వేరు వేరు కంపార్ట్ మెంట్లలో రావడమే అందుకు కారణం. సామాన్లకు కావలి ఉండవలసి రావడం మరో కారణం. సామాన్లన్నీ మద్యలో పెట్టుకుని చుట్టూ కూర్చుని  కాఫీ, టీలు సేవిస్తూ తిరిగి  మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ఇంటికి రమ్మని ఆహ్వానాలు చెప్పుకుంటూ రెండు మూడు గంటలు గడిపిన తరువాత మేము ఎక్కవలసిన రైలు వచ్చింది . ఇక ఎవరి దారి వారిదే మరి. ఇంతటితో మా పంచ ద్వారకల యాత్ర ముగిసింది .


17, జూన్ 2012, ఆదివారం

అమర్ కోట

అమర్  కోట

దూరం నుండి అమర్ కోట 

జైపూర్ నగరానికి 11 కిలోమీటర్ల  దూరంలో ఉన్న అంబర్  అనే ఊరుకు  పక్కన ఉన్న కొండ మీద ఆటవిక ప్రాంతంలో కట్టబడిన అమర్ ఫోర్ట్  చూడడానికి బస్సు కొంత దూరంలో నిలిపి మద్యాహ్న భోజనాలు చేసి అక్కడ నుండి బసు వెళ్ళలేదు కనుక ఆటోలు మాట్లాడుకుని అమర్ ఫోర్ట్ వెళ్ళాము. అక్కడి ఆటోలు పెద్దవిగా ఉంటాయి. దాదాపు 10 మంది మనుషుల వరకు ఎక్క వచ్చు. రాష్ట్రం అంతటా ఇవి లభ్యం ఔతాయి. ఆటోలు దిగి ఏటవాలు దారిలో కొంత దూరం నడిచి కోట లోపల ప్రవేశించి విశాలమైన కోట అవరణలోకి వెళ్ళాము. ఆవరణలో ఒక వైపు
ఏనుగుల మీద సవారీ చేస్తున్న పర్యాటకులను చూసాము. రుసుము చెల్లించి ఇలా ఏనుగుల మీద సవారీ చేయచ్చు. అది చూసి మా బృందం వారు ఉత్సాహభారితులు అయ్యారు.
గణేష్ పోల్ 


తరువాత మేము గణేష్ పోల్ వద్దకు చేరుకున్నాము. అక్కడ గైడు మా కేమేరాలన్నీ తీసుకుని మాకు గ్రూఫ్ ఫోటోలు తీసి ఇచ్చాడు. మేమంతా మెట్ల మిద కూర్చుని చక్కగా గ్రుఫ్ ఫోటోలు తీసుకున్నాము. ఫోటోలు చాల బాగా వచ్చాయి. ఎంతైనా అది అయన వృత్తిలో ఫోటోలు తీయడం కూడా ఒక భాగం కదా !  గణేష్ పోల్ వద్ద మహారాజు విజయయాత్ర చేసి విజయోత్సాహంతో కోటలో ప్రవేశం చేసిన సమయంలో మహారాణి స్వాగతం పలికి సత్కరించి లోపలకు తీసుకుని పొతుంది అని గైడు మాకు చెప్పాడు.

శిలాదేవి ఆలయం 

గణేష్ పోల్ 

మెట్లదరిలో లోపలకు పోతున్న సమయంలో శీలాదేవి ఆలయం చూసాము. అయినప్పటికీ  ఆ ఆలయం ముసి ఉన్నందు వలన మేము దానిని చూడలేక పోయాము. శీలాదేవి అంటే దుర్గాదేవి మరో అవతారం. రాజ కుటుంబీకులు ఇక్కడ పూజలు చేస్తారట. తరువాత మేము పైకి పోయి మొదటి అంతస్తు చేరుకున్నాము.

దివాన్ ఐ అమ్ 

సభ మంటపం 
దివాన్ ఐ అమ్ 
మొదటి అంతస్తులో '''దివాన్ ఐ అమ్''' అనే పేరుతొ సభ మంటపం ఉంది. ఇక్కడ మహారాజు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం వంటి రాజ్య కార్యకలాపాలు సాగిస్తారట. సభామండపం కళాత్మకంగా రాజగంభిరంగానూ ఉంది.

రాజభవనం 


తరువాత మేము మహారాజా నివాసానికి చేరుకున్నాము. గణేష్ పోల్ నుండి ఇక్కడకు నేరుగా చేరుకోవచ్చు. ఇక్కడ మహారాజు తన కుటుంబం పరివారముతో నివసించే భవనాలు ఉన్నాయి. ఇక్కడ ఎదురెదుగా  జై మందిర్  మరియు రెండవ వైపున్న సుఖ్ మందిర్  ఉన్నాయి. మద్యలో వీటిని వేరు చేస్తూ మొగల్ శైలి ఉద్యానవనం ఉంది.
మొగల్  గార్డెన్

శేషమహల్ 

శేష మహల్ కుడ్యము 
శేషమహల్ పైకప్పు 
మొగల్ గార్డెన్ ఒక వైపు  జై మందిర్ ఉమది. దీనిని   శేషమహల్ అని కూడా అంటారు. శేషమహల్ గోడలు అద్దాలతో చిన్న చిన్న అద్దాలతో సుందరమైన డిజైన్లతో అలంకరణ చేసారు. ఇది చాల  ప్రశంశనీయంగా ఉంది. పై కప్పులో కూడా  వివిధ వర్ణ రంజితమైన అద్దాల డిజైన్ చేయబడి ఉంది. ఈ  గోడలు రంగుల ఫాయిల్ మరియు ప్రకాశవంతమైన  రంగులతోను అలంకరించిన కారణంగా ఇవి రాత్రి వేళలో మైనపు వత్తుల కాంతులలో వెలుగులు చిందిస్తూ రత్నాల పేటికలా  ఉంటుంది అని  గైడ్ వర్ణించి చెప్పాడు. దీనిని అద్దాల మందిరం అని కూడా పిలుస్తారట. ఇక్కడి రాజభవనం నుండి '''మోత''' సరసును చూడచ్చు .
మ్యాజిక్ ఫ్లవర్ 

 సుఖ్ మహల్ మరియు  మ్యాజిక్ ఫ్లవర్ 

సుఖ్ మహల్ 
శేష మహల్  గోడలలో చెక్కబడిన ఒక మ్యాజిక్ ఫ్లవర్ ను గైడు చూపాడు . ఈ చిత్రంలో ఒకే దిజైనులో ఏడు రకకల డిజైన్లను చూడవచ్చు. గైడు చేతులతో కొంతభాగం కప్పుతూ వాటిని చూపి వర్ణించి చెపాడు. ఆ ఏడు డిజైన్లు ఇవే చేపతోక, తామర పుష్పం,  పాముపడగ,  ఏనుగు తొండం , సిహంతోక, తేలు , మొక్కజోన్నపోత్తి .

రెండవ వైపు ఉన్న భవనాన్ని సుఖ్ మహల్ ఉంది . గంధపు చెక్కతో చేసిన ద్వారం దాటి ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడ ఒక కాలువ ద్వారా నీటిని ప్రవహింప చేసి దానిని మొగల్ గార్డెన్ లోకి చేరేలా ఏర్పాటు చేసారు. ఇందు వలన వాతావరణం చల్లగా ఉంటుంది.

రాణివాసం 

రాణివాస కూడలి 

తరువాత పైకి ఎక్కి రాణివాసం చేరుకున్నాము. ఒకప్పుడు ఇక్కడికి మగవారికి ప్రవేశం లేదు. ఇది మహారాజు భార్యలు 12 మంది కొరకు నిర్మాణం చేయబడింది. రాణులు వారి పరిజనం నివసించడానికి వీలుగా 12 ప్రత్యెక భాగాలుగా వీటిని నిర్మించారు. ఒక నివాసం నుండి  వేరొక నివాసానికి ఎటువంటి ద్వారాలు ఉండవు.  అయినా మద్య భాగంలోఅందరూ సమావేశం  కావడానికి  అనువుగా మద్య పెద్ద కూడలి ఉంది. ఒక్కో నివాసం నుండి  మహారాజ నివాసానికి రహస్య మార్గాలు ఉంటాయని మహారాజు రాక  పోకలు ఎవరికీ తలియదని గైడు  చెపాడు.  మహారాజుతో రాణి వెలుపలికి పోయిందో కూడా రహస్యంగా ఉంచబడుతుంది  అని చెప్పాడు. అన్ని నివాసాలు ఒకే మాదిరి ఉంటాయని గైడ్ చెప్పాడు. లోపల పరిచారికలకు అతిథులకు వేరు వేరు గదులు  ఉన్నాయి. రాజమాతకు కూడా అక్కడ నివాసం ఉంటుంది.
వంటశాల 
రాజభావనంలోని వంటశాల 
తరువాత మేము పట్టుబట్టి మహారాజు వంటశాల చూసాము. మహారాజుల వంటశాల ఎలా ఉంటుందో  చూడాలన్న కుతూహలం అందరిలో కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు అది ఆహార పదార్ధాల  విక్రయశాలగా ఉంది. వంటశాల లోపలకు వెళ్లి చూసాము. ఇప్పుడక్కడ వంటలు జరగడం లేదు కనుక ఇప్పుడది ఖాళీగా ఉంది. మేమంతా శీతలపానీయాలు  కొనుక్కుని అక్కడి నుండి కిందికి దిగాము.  దాదాపు మేము కోటను చూసినట్లే.

పాముల ఆట 

ఇక కిందకు దిగడానికి మొదలు పెట్టాము. కిందకు దుగుతూ
పాములను ఆడించడం 
అక్కడ పాములు ఆడించడం చూసి కొంత సమయం ఆగి పాములు అడిం చడం చూసాం . మా బృందంలో   కొందరు పాములను చూస్తూ పాములలా  నృత్యం  చేయడం మొదలు పెట్టారు. వాతావరణం ఉత్సాహ భరితంగా మారింది. అందరం అక్కడ ఛాయా చిత్రాలు తీసుకుని అక్కడి నుండి కదిలి కిందకు వచ్చాము. కిందకు  రాగానే అక్కడ ఉన్న కాఫీ స్టాల్ వద్ద నిర్వహకులు  మాకు కాఫీ టి లు ఇప్పించారు. అక్కడ ఉన్న మరి కొన్ని స్టాల్స్ వద్ద కొన్ని వస్తువులను కూడా కొనుక్కొని తిరుగు ప్రయాణం అయ్యాము.
కోట నుండి అంబర్ ఊరు 

అంబార దృశ్యం 

 కోట నుండి కింద కనిపిస్తున్న అంబర్ ఊరు  లోని దృశ్యాలు ఆకర్షణీయంగా  ఉన్నాయి. అక్కడ నిలిచి కొంత  సమయం చూసి అ దృశ్యాలను మా కెమెరాలలో బంధించి  గణేష్ పోల్ ద్వారా వెలుపలికి వచ్చాము.  మాలో చాలా  మందికి కోట ఇంక చూడాలనే ఉంది. కానీ సమయాభావం కారణంగా వేనుతిరిగా ము. అదికాక చీకటి పడే లోపల కోటను వదిలి పెట్టాలి కనుక  మేమంతా మామా అటోలను ఎక్కి బస్సు వద్దకు వెళ్ళాము. బసు ఎక్కి గైడు వర్ణన చేస్తుండగా  పింక్  సిటీని చూసాము. హావా  మహల్ గురించి విన్నాము కానీ చూడ లేదు. చివరగా గైడు చెప్పడం వలన మేము ప్రభుత్వ ఎంపోరియం చూసి అక్కడ చాలా  వస్తువులను కొనుగోలు చేసాము. ఆ తరువాత మా హోటల్ చేరుకున్నాము. ఇక మా యాత్ర పూర్తి  అయినట్లే  కనుక బసు తిరిగి పోయింది. మరునాడు మాకు ఫ్రీ టైం .అంటే ఎవరు అనుకున్న చోటుకి వారు వెళ్లి  వారి వారికి  కావలసిన వస్తుసామాగ్రి కొనుగోలు చేసుకోవచ్చు.  ఆ మరునాడు ట్రైన్ ఎక్కాలి. 



16, జూన్ 2012, శనివారం

జైపూర్

జైపూర్ నగరం 

 

 పుష్కర్ నుండి బయలుదేరిన తరువాత మేము మా చివరి మజిలీ అయిన జైపూర్ చేరుకున్నాము . జైపూర్ చూడాలన్న  మా చిరకాల వాంఛ  ఇప్పుడు నెరవేరింది. మా కేదార్నాద్  యాత్ర  సమయంలో జైపూర్ నగరంలో బాంబులు పేలిన కారణంగా  చివరి సమయంలో జైపూర్ సందర్సన  ఆగిపొయింది. అయినా తిరిగి ఇప్పుడు మాకీ అవకాశం లభించింది  కనుక చాలా  సంతోషం కలిగింది .  ఎలాగైతేనేం జైపూర్ నగరంలో రాత్రి సమయంలో నిద్రలో జోగుతూ ప్రవేశించాము. జైపూర్ హోటల్ మా అందరికి బాగా  నచ్చింది. మేము బస చేసిన హోటల్ పేరు రూబీ  .

మేము బస చేసిన హోటల్ రూబీ
మా రూములో చక్కని పెయింటింగ్ కూడా ఉంది. అక్కడ భోజనశాల చాల విశాలంగా ఉంది.  హోటల్ వాతావరణం
రాజస్తాన్ సంప్రదాయాన్ని తెలుయ చేసేలా ఉంది. అ రాత్రి ఆహారం తిని విశ్రాంతి తీసుకోవడానికి ముందు నిర్వాహకులు మరునాడు జైపూర్ నగర సందర్సనకు   సిద్ధంగా ఉండమని  చెప్పారు.
మా హోటల్ గదిలోని వర్ణ చిత్రము

బిర్లా  మందిరము 
బిర్లా మందిరం ముందు ఉన్న చాయ చిత్రకారులు 
మరునాడు ఉదయం అల్పాహారం కాఫీలు వంటివి  అయిన తరువాత  మేము మాకు ఏర్పాటు చేసిన బసులో నగరం చూడడానికి బయలుదేరాము. ముందుగా  బిర్లా మందిరం చూసాము. బిర్లామందిరం కొంత దూరం నుండే ఛాయాచిత్రాలు తీయడం నిషేధం ఉంది. కనుక మేము అధికంగా చిత్రాలు తీయలేదు కానీ ముందుగా కొన్ని  చిత్రాలను  తీసాము. బిర్లా మందిరం చాల  ప్రశాంతముగా ఉంది. లోపల దైవాలను  దర్సించి  బయట చుట్టూ తిరిగి చూసి వెలుపలికి  వచ్చే సమయంలో ప్రవేశ ద్వారం వద్ద  ఉన్న గేటు వద్ద  ఫోటో గ్రాఫర్లు రాజస్థానీ దుస్తులను ఇచ్చి పర్యాటకులకు ఛాయా చిత్రాలను తీస్తూ ఉన్నారు.

ఆల్బర్ట్ ప్రదర్సన శాల



ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న కవచం 
ఆల్బర్ట్ మ్యూజియంలో ఒక చిత్రం 
బిర్ల మదిరం చుసిన తరువాత మేము ఆల్బర్ట్ ప్రదర్సన శాల చూడడానికి వెళ్ళాము. ఆల్బర్ట్ ప్రదర్సన శాల  మహారాజు తన మిత్రుడైన ఆల్బర్ట్ మిద అభిమానంతో కట్టించాడని మాతో బసులో వచ్చిన గైడు మాకు చెప్పాడు. తరువాతి కాలంలో ఆ భవనాన్ని మ్యూజియంగా మార్చబడింది. ఆల్బర్ట్ హాలు లోపల బద్రపరచిన వస్తువులు చాల చక్కగా ఉన్నాయి.  లోపల ఆకర్షనీయమైన వస్తువులు అనేకంతో పాటు చాలా మినియేచర్ బొమ్మలు ఉన్నాయి. అనేక భంగిమల యోగాసనాలు ప్రత్యేక  ఆకర్షణగా ఉన్నాయి. ఇలాంటి శిల్పాలను చూసే అవకాశం లభించడం చాల అరుదని నేను భావించాను. ఇలా అంతా చుసిన తరువాత మ్యుజియం వెలుపల కొన్ని వస్తువులను కొనుక్కుని అక్కడి నుండి బయలుదేరి అంబర్ కోట  చూడడానికి వెళ్ళాము. అంబర్  కోట  చూడడానికి ముందు మేము మా బసులో కూర్చుని మద్యాహ్న భోజనాలు చేశాము. తరువాత అక్కడ లభించే నిమ్మకాయ షోడా  తాగాం. నిజానికి ఈ  యాత్ర మొత్తంలో  నిమ్మకాయ షోడాలు
చాలా ప్రత్యెక రుచిగా ఉన్నాయి . ఈ షోడలలో కొందరు నిమ్మకాయ రసం, మసాలా కారం,  ఐస్ , ఉప్పు చేర్చి చేస్తారు.  ఇవి రుచిగా ఉండడమే కాక చక్కగా సేదతీర్చడం కారణంగా అందరూ యాత్రలో వీటిని త్రాగడానికి ఆసక్తి చూపారు. కొదరు వీటిలో తాజా పుదినా చేర్చి చేస్తుంటారు అవి కూడా చాల బబాగున్నాయి .  కొదరు ఈ మసాలాల తో చల్లని నీటిని కలి చేస్తున్నారు. అవి కూడా రుచిగానే ఉన్నాయి. ఇక్కడి వారికి  ఇలాంటివి చేయడంలో నైపుణ్యం ఉన్నట్లు ఉంది.
మేము జైపూర్ చూడడానికి ఏర్పాటు చేసిన బస్సు


మేము జైపూరు చూడడానికి ఏర్పాటు చేసిన బస్సులో మాతో ఒక గైడు కూడా వచ్చాడు. గైడు మాకు ఒక్కో ప్రదేశం  గురించి వివరిస్తూ వచ్చాడు. గైడు హిందిలో లేక అంగ్లంలో మాత్రమే చెప్పడం మాకు ఇబ్బంది కలిగించింది  . అయన  చెప్పెతిరు కూడా అంత స్పష్టంగా  లేక పోవడం కూడా మా  అసంతృప్తికి ఒక కారణం. అది డబల్ డెక్కర్ బసు. బసు పైన చిన్న పందిరిలా ఉంది దాని కింద సీట్లు ఉన్నాయి. మాలో కొంత  మది ఆసక్తిగా బసు  సైట్లలో కుర్చుని కూర్చున్నారు.  

      

   

4, జూన్ 2012, సోమవారం

పుష్కర్

పుష్కర్ 

పవిత్రమైన పుష్కర్ సరసు

శ్రీనాధ్ ద్వారక నుండి ఉదయమే బయలు దేరి  మేము పుష్కర్కు ప్రయాణం అయ్యాము. పుష్కర్ లో బ్రహ్మదేవుడు యాగం చేసిన సరసు ఉంది. భారతదేశంలో హిందూపురాణలలో వర్ణించిన అయిదు పవిత్ర సరసులలో పుష్కర్ ఒకటి. ఇక్కడ  బ్రహ్మదేవుడు యాగం నిర్వహించాడు. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి.
దస్త్రం:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg
భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. 

స్థలపురాణం 

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉన్నది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతె తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మపురాణంలో చెప్పబడిన కధను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుదంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మద్య పుష్కర్, చివరిది కనిష్ట పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనె సరస్వతి అని కూడ పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. నారదుడు వెళ్లె సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా వున్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రంహ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. శివుడు,
 విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోని కి పంపి శుద్దిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన సావిత్రి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్దాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి బార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది.
సరస్వతీ ఆలయం నుండి పుష్కర్ దృశ్యం
 తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం వున్నది. అక్కడే చిన్న సెలఏరు కూడ వున్నది. దీన్నె సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలొ స్నానం చేస్తె నిత్య సుమంగళి గా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం వున్నది.

సరసులోపలి దృశ్యం


పుష్కర్ సరసులోపల సరసు చుట్టూ కట్టడాలు నిర్మించబడి ఉన్నాయి. 53 స్నానఘట్టాలు ఉన్న బృహత్తరమైన సరసు ఇది. ఈ సరసు ధార్ ఎడారికి 20 కిలోమీటర్ల దూరంలో ధార్ ఎడారి ఉంది. మకు సమయం చాలని కారణంగా ఎడారిని చూడలేక పోయాము. అయినా ఎడారి ప్రభావం పసర భూములలో కనిపిస్తూనే ఉంది. ఈ ఊరుకు కేంద్రం పుష్కర్ సరసు ఒకటే. ఇక్కడ ఉన్న వారందరూ పర్యాటకుల మీద ఆధారపడిన వారే. సరసు చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణలో అనేక ఆలయాలు ఉన్నాయి. అయినా ప్రధాన ఆలయాం బ్రహ్మదేవుడిదే. అందు వలన భక్తులు బ్రహ్మదేవుడి ఆలయం తప్పక చూస్తారు. ప్రాకారం చుట్టూ అనేక ద్వారాలు ఆలయాలు ఉన్నాయి.


విశాలమైన ఆవరణలో పర్యాటకులకు ఈ సరసు యొక్క పురాణ కధనాన్ని గైడులు చెప్తూ ఉంటారు. ఇక్కడ లోపల పూజలు ఆరాధనలు జరుగుతూఉంటాయి. ఇక్కడ భక్తులు నీటిని బక్కెట్లతో పట్టి స్నానం చేయాలి లోపలకు దిగి స్నానం చేయడానికి వీలు లేదు. మాలో కొందరు మాత్రం స్నానాలు చేసారు. అంతగా స్నాన వసతి లేని కారణంగా అనుకున్న వారందరూ స్నానం ఆచరించస్ లేదు. సరసు పై భాగంలో రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. అక్కడ కావలసిన పూజాదికాలు నిర్వహించబడుతున్నాయి.


సరసు మధ్యలో ఒక మందిరం ఉన్నది. లోపల పక్షులు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. చుట్టూ ఉన్న కట్టడాలతో ఈ సరస్సు దృశ్యం ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. చుట్టు దూరంగా కనిపిస్తున్న కొండల మధ్య సరసు ఒక సుందర దృశ్యంగా కనిపిస్తుంటుంది. 

సరసులోపలి మండపం 
పుష్కర్ చాలా చిన్న ఊరు. ఈ ఊరిలో సరసుకు పోయే మార్గంలో యాత్రీకుల కొరకు అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలలో యాత్రీకులు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. రాజస్థానుకే ప్రత్యేక మైన వస్తువులు ఈ దుకాణాలలో అభిస్తాయి.  మేము అలా బసును నిలిపి దిగి నడుచుకుంటూ 
సరసు వద్దకు వెళ్ళి లోపక దిగి నీటిలో పాదములు కడుగుకొని కొత నీటిని తల మీద చల్లుకుని చుట్టూ ఉన్న దృశ్యాలను కొంతసేపు చూసి లోపల ఆవరణలో వీలైనంత తిరిగి అక్కడ ఉన్న బ్రహ్మదేవుడిని దర్శించాము. తరువాత సరసు నుండి వెలుపలికి వచ్చాము.



పుష్కర్ లోపలి దృశ్యాలు

సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.



పుష్కర్ లో విశ్రాంతిగా కూర్చున్న అలంకరించబడిన ఒంటె


పుష్కర్ లో ప్రవేవ్శించినప్పటి నుండి అక్కడక్కడా ఉన్న ఓంటెలు దర్శనం ఇస్తాయి. పర్యాటకులు వాటిమీద సవారి చెయ్య వచ్చు. మాలో కొంతమంది వాటి మీద సవారీ చేసి ఆనందించారు. ఆ ఒంటెలను చూసి మాకు ఉత్సాహం వేసింది.


పుష్కర్ లోని మరికొన్ని దృశ్యాలు



ఊరు సాధారణంగా కనిపిస్తున్నా ఇది చాలా పర్యాటక ఆకర్షణ కలిగిన ఊరు. ఇది హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రం. అలాగే థార్ ఎడారి సమీప ప్రాంతం కనుక ఇక్కడ ఒంటెల సంత కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ప్రజలలో కనిపిస్తున్న రాజస్థానీ సంస్కృతి కూడా విదేశీ పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. భారతదేశానికి అధికంగా విదేశీ పర్యాటకులు విచ్చేసే ప్రదేశాలలో పుష్కర్ ఒకటి. ఇక్కడ జరిగే సంతలో ఒంటెల అమ్మకం విశేషంగా జరుగుతుంది. ఒంటెలతో పాటు ఒంటెలకు కావలసిన అలంకార సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ జరిగే సంతలో ఏటా దాదాపు 50,000 ఒంటెల అమ్మకం సాగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంతకు ఒంటెలను అత్యంత ప్రయాసలకు ఓర్చి దూరప్రాంతాల నుండి తీసుకు వస్తారు.
దస్త్రం:Inde pushkar foire.jpg
వ్యాఖ్యను జోడించు


 హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం షుమారుగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన
 ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రధానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో
  స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు మరియు గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు. పవిత్రమైన సరస్సుకు ప్రఖ్యాతి చెందిన ఈ పుష్కర్ క్షేత్రం గులాబీ మరియు మల్లెల వాసనలను కూడా వెదజల్లుతూ శోభిల్లుతుంటుంది. అంతర్జాతీయంగా 4,000 నుండి 6,000ల మందికి పైగా విదేశీ పర్యాటకులను ఈ పుష్కర్ ఒంటెల సంత ఆకర్షిస్తుంటుంది. పుష్కర్‌లొ 10 నుండి 15 రోజుల వరకు జరిగే సంతలు సంవత్సరానికి 12కు పైగా జరుగుతుంటాయి. 







30, మే 2012, బుధవారం

అమరనాధ్

 అమరనాధ్ యాత్ర

Cave Temple of Lord Amarnath.jpg
అమర్నాథ్ గుహ ముఖద్వారం

అమరనాథ్ స్థలపురాణం

హిందువులు కోరుకునే యాత్రలలో అమరనాధ్ యాత్ర ఒకటి. అమరనాధుడంటే జరామరణములు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో " నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను " అని బదులిచ్చాడు. పార్వతీ దేవి " నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నవు ఇది ఎలా సాధ్యం " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పలి " అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కొరకు వెతకి చివరకు ఈశ్వరుడు  అమరనాధ్ గుహను ఎంచుకున్నాడు. పహల్ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్ళాడు, షిషాంగ్ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు, మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు, తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమనాధ్ గుహలోపలికి వెళ్ళాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వరహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాలజంట ఈ  రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయి. ఇప్పటికీ భక్తులకు ఆ పావురాల జంట దర్శనం ఇస్తాయి. అని వినికిడి.

అమర్నాథ్ యాత్రీకుల శిబిరాలు

 

వేరొక కధనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహిపజేసాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణ కధనాలు చెప్తున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. అప్పటి నుండి ఇక్కడకు లక్షలాది భక్తులు వచ్చి శివారాధన చేసి శాశ్వమైన పరమానందం అనుభవిస్తున్నారు. భక్తులు ఇక్కడకు రావడానికి అత్యంత కఠినమైన పర్వత మార్గంలో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ప్రాయాణంచేసి ఈ గుహను చేరుకుంటారు. శ్రావణ మాసపు ఆరంభంలో భక్తులు ఇక్కడకు చేరుకుని అప్పటికే పూర్తిగా ఏర్పడిన ఘనీభవించిన మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుటారు. ఈ లింగం చంద్ర కళలకు అనుకూలంగా కరుగుతూ పెరుగుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ లింగానికి ఇరువైపుల ఉన్న రెండు లింగాలాను మాతాపార్వతీ దేవి మరియు గణేశ్ రూపాలుగా భావించి ఆరాధనలు చేస్తుంటారు.
అమర్నాథ్ ఆలయానికి పయనిస్తున్న యాత్రీకులు 
ప్రస్తుత కాలం 
ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కధనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు.  బూటా మాలిక్ వాటిని తీసుకుని  ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు  పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.

  గుహాలయం 

 అమర్నాథ్ ఆలయంలోని మంచు లింగం
లిడ్డెర్ వ్యాలీ పహల్ గాం నుండి 46 కిలోమీటర్లదూరంలో, భూమట్టం నుండి 3,888 అడుగుల ఎత్తులో బాల్ తాల్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఈ అమరనాథ్ గుహ ఉంది. చార్ ధాం అని పిలువబడే వాటిలో ఒకటి అయిన అమరనాథ్ యాత్రను శ్రీనగర్ నుండి ఆరంభం ఔతుంది అయినా ఇది 96 కిలోమీటర్ల చాలా సుదీర్గమైన యాత్ర కనుక సాధారణంగా 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్ వారి నుండి యాత్రకు వెడుతుంటారు.

సంప్రదాయ యాత్రా మార్గం

 

* జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారు చాలా ఉదయాన మాత్రమే వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యం ఔతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మిని బస్సులు లభ్యం ఔతాయి. లిడ్డర్ నతీ తీరం వెంట ఈ బసు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు.  సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతి వచ్చే అనుభూతికి లోను ఔతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.




* పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతస్మంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పాలకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.





యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.



యాత్ర ప్రణాళిక ఎలా వెయ్యాలి 


* జమ్ము - పహల్ గాం- అమరనథ్ :- జమ్ము - చందన్ వాలి- పిస్సుటాప్- సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్నాథ్ మార్గంలో అమర్నాధ్ యాత్ర చేయ వచ్చు.
* హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్నాథ్ చేరుకో వచ్చు.
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంచానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 


* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 

* యాత్రీకులు "శ్రి ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 

* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు ఔతుంది.


యాత్రీకులు చేయవలసినవి 


* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరెలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యకు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమిన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించిన సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోడి. అయవసర సమయాలలో అది ఉపకరిస్తుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణ కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయ్ణం చేసే సమయంలో వేగించిన పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీమీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
* చందాలను డొనేషన్ బాక్సులో వేయండి.

యాత్రీకులు చేయకూడనివి 

* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మదూపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.