9, జనవరి 2013, బుధవారం

ఋషికేశ్

File:Rishikesh view across bridge.jpg
ఋషికేశ్ 

ఋషికేశ్ చేరిన మరునాడు మేము తిరిగి చూడడానికి బయలుదేరాం. ఉదయం మేము గంగానదిలో స్నానం చేసాము. ఇక్కడ నదిలో నీరు స్నానానికి అనుకూలంగా ఉంటాయి. స్నానాలు చేసి వచ్చిన తరువాత మాకొరకు చోళా పూరీలు చేసారు. మేము టిఫిన్ వద్దని అక్కడ ఉన్న ఆలయాలను దర్శిస్తామని బయలుదేరాం. అయినా మాకు వంట చేసి అందించే సహాయకులు మమ్మల్ని తినకుండా వెళ్లనీయ లేదు. నిర్వాహకులూ సహాయకులూ యాత్రీకులను అంత శ్రద్ధగా చూసుకుంటరన్నమాట.
File:Shiva in rishikesh.jpg
గంగాతీరంలో ధ్యానంలో శివుడు 

తరువాత మిగిలిన వారు సిద్ధమయ్యే సమయం వృధా కాకుండా మేము మరి కొందరితో బయలుదేరి సమీపంలోని ఆలయాలను చూసి వెనుతిరిగాము. ఇస్కాన్ ఆలయం చూద్దానని అనుకుంటే అది ఇంకా తెరవలేదు కనుక చూడకుండానే  వెనుతిరిగాము. మా కొరకు మిగిలిన వారు ఎదురుచూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోకూడదని త్వరగా వెనుతిరిగాము. మేము వెళ్ళే సమయానికి అందరూ ఆలయ సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. 
File:Sivananda Temple, Divine Life Society, Muni Ki Reti, Rishikesh.jpg
 శివానందాశ్రమం
File:Kailash Ashram, Muni Ki Reti, Rishikesh.jpgFile:Shiva statue at Parmarth Niketan, Muni ki Reti, Rishikesh.jpg మయలుదేరి అక్కడ సమీపంలో ఉన్న శివానందాశ్రమం సందర్శించాము. ప్రశంతమైన శివానందాశ్రమం దర్శించుకుని.  కైలాస ఆశ్రమం చూడడానికి వెళ్లము ఆశ్రమంలోని ఆలయాలను ఆశ్రమాన్ని పూర్తిగా చూసాము. చివరగా అక్కడ ఉన్న ఒకచెట్తు మొదట్లో ఉన్న కొమ్మ వినాయకునిలా ఉన్నదని గైడు మాకు చూపించాడు. అది నిజంగానే  వినాయకుడు తొండం  పైకెత్తి ఉన్నట్లు కనిపించింది. ఆశ్రమంలో ఉన్నది కనుక అక్కడ వినాయకునికి పూజాదికాలు జరుగుతున్నాయి.  ఆశ్రమంలో  మేము మన్చి గంధం చెట్టును మొదట చూసాము. ఆ ఆశ్రమంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు.  గంగా తీరంలో ప్రశాంతవాతావరణంలో అందమైన ఉద్యానవనాలతో నిండిన ఆశ్రమవాసం ఆనందదాయకం కదా.

File:Ram Jhula bridge on the Ganges, Muni Ki Reti, Rishikesh.jpg
రామ్ ఝులా
File:Close up of Pilgrims on Ram Jhula bridge, Rishikesh.jpgFile:Ram Julah Hanging Bridge, Rishikesh, India.jpgకైలాస ఆశ్రమ సందర్శన తరువాత మేమంతా  జీబులు ఎక్కి రామ ఝులా చూడడానికి వెళ్ళాము. అంత వెడల్పైన గంగా నది మీద రెండుతీరాలను కలుపుతూ ఇన్న లక్షణ రామ ఝులా మద్యలో ఏ ఆధారం లేకున్డా ఉన్న చారిత్రాత్మక ఝులా చాల రద్దీగా ఉన్నది.  ఝులా మిద కొంత మంది మోటార్ సైకిళ్ళను కూడా నడుపితున్నారు. వారి వారి పనుల మీద అటూ ఇటూ తిరుగుతున్న మనుషులను చూస్తూ వంతెన కింద ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ వంతెన మీద నడుస్తూ ఆవలితీరం చూసి తిరిగి వచ్చాము. వంతెన నుండి కిందకు ప్రవహిస్తున్న గంగానదిని ప్రవాహం అప్పుడు కొంచెం లోతుగా ఉంది. అయినపటికీ నిండుగా ప్రవహిస్తుంది.

త్రయంబకేశ్వరాలయం
File:Trayambakeshwar.JPG

రామ్ ఝులా చూసిన తరువాత పక్కన ఉన్న త్రయంబకేశ్వరాలయం చూసాము. ఆ ఆలయం అంతస్తులు అన్తస్థులుగా చిన్న చిన్న ఆలయాలతో నిన్డి ఉన్ది. అన్తా తిరిగి కిందకు రాగానే తిరిగి మఠానికి పోవాలని అనుకున్నాము. అయినప్పటికీ మాకు లక్ష్మణ ఝులా కూడా చూడాలని ఉన్ది. విర్వాహకులను అడిగాము. నిర్వాహకులు అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు. అయినా పరవాలేదు మేము చారిత్రాత్మకమైన లక్ష్మణ ఝులా  చూసి తీరాలని 
అనుకున్నాము.
File:A monkey crossing the Laxman Jhula bridge, Uttarakhand.jpg
లక్ష్మణ ఝులా 

అందరూ తిరిగి పోయినా మాలో కొందరం మాత్రం అక్కడి నుండి  లక్ష్మణ ఝులా ఉండే  ప్రదేసానికి ఎలా చేరుకోవాలో విచారిస్తూ వెళ్ళి చూసి లక్ష్మణ ఝులాకు చేరుకుని ఈ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తిరిగి చూసాము. శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణ కొరకు ఇక్కడ తపసు చేసాడు. శ్రీరాముని నీడ వలె వెంట నడిచే లక్ష్మణుడు శ్రీరాముని సేవించడానికి ఇక్కడ వంతెన నిర్మాణం చేసి శ్రీరాముని తపసుకు అవసరమైన వస్తువులను సేకరించి తీసుకువచ్చాడని పురాణకథనం వివరిస్తున్నది. లక్ష్మణుడు నిర్మాణం చేసిన వంతెన జనపనారుతో నిర్మిం చినది. ప్రస్తుత  వంతెన నిర్మాణం 1939లో జరిగింది.  తరువాత మఠానికి వెళ్ళడానికి నడక సాగించాము. మాలో ఓపిక నశించింది. నడవడం కష్టం అనిపించింది. జీబులూ ఆటొలు కూడా కనిపించ ల్డ్దు. ఇరుకైన దాతిలో ఆటో కోసం వెతుకుతూ రెన్డు మూడు కిలోమీటర్లు నడక సాగిన తరువాత ఆటోలు కనిపించాయి. వాటిని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. చిన్నగా ఆటోలు ఎక్కి మఠానికి చేరుకున్నాము. అప్పటికే సాయంత్రం అయింది. ౠషికేష్ ప్రయాణం పూర్తి అయినట్లే. 

నాభాస యోగాల

నాభాస యోగాల

నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.
  • నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
  • ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
  • ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
  • ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
  • కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
  • ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
  • కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
  • ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
  • యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
  • ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
  • శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
  • ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
  • శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
  • ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
  • దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
  • ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
  • అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
  • గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
  • ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
  • వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
  • ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
  • యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
  • ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
  • పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
  • ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
  • వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
  • ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
  • శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
  • ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
  • విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
  • ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
  • వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
  • ఫలితం :-
  • శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
  • ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
  • చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
  • సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
  • ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
  • సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
  • ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
  • ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
  • ఫలితం :-
  • రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
  • ఫలితం :-
  • దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
  • ఫలితం :-
  • గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
  • ఫలితం :-
  • యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
  • ఫలితం :-
  • శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
  • ఫలితం :-
  • కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
  • ఫలితం :-
  • పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
  • ఫలితం :-
  • దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
  • ఫలితం :-
  • వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.

2, జనవరి 2013, బుధవారం

జ్యోతిర్మార్గం

జ్యోతిర్మార్గం 

జ్యోతి అంటే వెలుగు. జ్యోతిషం వెలుగును ఆధారంగా చేసుకున్న పరచిన శాస్త్రం. అనేకులు విశ్వసించేది కొందరు విమర్శించేది. ఏది ఏమైనా దీనికీ విశ్వాసం మాత్రమే ఆధారం. ఇందులో గోచారం   ఒక పధ్ధతి. గోళాల సంచారం ఆధారం చేసుకుని నిర్ణయించేది.  దీనిని సంత్సర, మాస,  వార, దిన ఫలితాలు చూడడానికి ఉపయోగిస్తారు. గోచార ఫలితాలు చూడదానికి రాశీ నుడి గణించాలి.  జీవితకాల ఫలితాలు చూడడానికి లగ్నం నుండి లెక్కించాలి.  జ్యోతిషం చూడాలంటే ప్రధానంగా అనే క విషయాలను గణించాలి.
ముందుగా రాశులు. ఇవి పన్నెండు.
సూర్యుని ఆధారంగా చేసుకుని రాశి నిర్ణయం చేస్తారు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశిలో ప్రవేసించే సమయం సంక్రమణగా వ్యవరిస్తారు. సూర్యుని చుట్టు భూమి చేసే భ్రమణాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే వచ్చినవే పన్నెండు రాసులు. ఒక్కక్క రాశిలో ప్రవేశించే సమయయంలో ఆకాశంలో ఉండే నక్షత్ర సమూహాలలో ఉండే మార్పులను బట్టి అవి వేరు వేరు నక్షత్రాలని మన ఋషులు పరిశీలింవి గుర్తించారు. అ నక్షత్ర సముహ ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయించారు. 

వాటిలో మొదటిది మేషం., రెండవది వృషభం, మూడవది మిధునం, నాల్గవది కటకం, ఐదవది సింహం, ఆరవది కన్య, ఏడవది తుల, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, ధనుస్సు, పదవది మకరం, పదకొండవది కుంభం, పన్నెండు మీనం.

1 మేషం రాశిలో అశ్విని నక్షత్ర నాలుగు పదాలు, భరణి నక్షత్రలో నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రలో మొదటి పాదం కలసి తొమ్మిది పాదాలు.
2 వృషభ రాశిలో మిగిలిన మూడు పదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు ఉంటాయి.
3 మిదునరాశిలో మృగశిరలోని రెండు పాదాలు, ఆరుద్రలోని నాలుగు పాదాలు, పునర్వసులోని మూడు పాదాలు ఉంటాయి.
4 కటకరాశిలో పునర్వసు నక్షత్రంలోని నాల్గవ పాదం, పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉంటాయి.
5 సింహరాశిలో మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని నాలుగు పాదాలు , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోని ఒక పాదం ఉంటాయి. 
6 కన్యారాశిలో ఉత్తరఫల్గుణి నక్షత్రంలోని మిగిలిన మూడు పాదాలు, హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు, చిత్త నక్ష త్రంలోని రెండు పాదాలు ఉంటాయి.
7 తులారాశిలో చిత్తానక్ష త్రంలోని మిగిలిన రెండు పాదాలు, స్వాతి నక్ష త్రం లోని నాలుగు పాదాలు, విశాఖనక్ష త్రం లోని మూడు పాదం ఉంటాయి.
8 వృశ్చికరాశిలో  విశాఖ నక్ష త్రం లోనిమిగిలిన ఒక్క పాదం , అనురాధ నక్ష త్రం లోనినాలుగు పాదాలు, జ్యేష్ట నక్ష త్రం లొనినాలుగు పాదాలు ఉంటాయి.
9 ధనుసు రాశిలో మూలా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పుర్వాషాడ నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ఉత్తరాషాడ నక్ష త్రం లోని ఒక్క పాదం ఉంటాయి.
10 మకరరాశిలో ఉత్తరాషాడలోని మిగిలిన మూడు పాదాలు, శ్రవణా నక్ష త్రం లోని నాలుగు పాదాలు, ధనిష్ఠ నక్ష త్రం లోని రెండు పాదాలు ఉంటాయి. 
11 కుంభ రాశిలో ధనిష్ఠ నక్ష త్రం లోని మిగిలిన రెండు పాదాలు, శతభిష నక్ష త్రం లోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్ష త్రం లోని మూడు పాదాలు ఉంటాయి.
12 మినరాశిలో పుర్వభద్ర నక్ష త్రం లోని ఒక్క పాదం, ఉత్తరాభద్ర నక్ష త్రం లోని నాలుగు పాదాలు, రేవతి నక్ష తరం లోని నాలుగు పాదాలు ఉంటాయి.
ఇలా పన్నెండు రాశులలో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి.

21, అక్టోబర్ 2012, ఆదివారం

మీన లగ్నము

మీన లగ్నము

మీనలగ్నానికి అధిపతి గురువు. మీనలగ్నానికి  చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహములు.  కనుక శుభఫలితం ఇస్తాయి.  శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహములు.  అశుభఫలితాలు ఇస్తారు.  మీన లగ్నంలో ర్యాది గ్రహములు ఉన్నప్పుడు కలుగు ఫలితములు దిగువున ఉన్నాయి.
* సూర్యుడు :- మీన లగ్నానికి సూర్యుడు షష్టాధిపతిగా అకారక గ్రహం ఔతాడు. లగ్నంలో సూర్యుడు ఉన్న కారణంగా పరిశ్రమించే గుణం, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు.
శత్రువులకు భపడని స్వభావం, ఆత్మవిశ్వాసం, కార్యము నందు మనసు నిలిపి శ్రమించుట వీరి లక్షణాలు.  వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. సూర్యుడి సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా  ఉద్యోగములో సాఫల్యత లభిస్తుంది.
* చంద్రుడు :- మీన లగ్నంలో చంద్రుడు పంచమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా వ్యక్తి జీవితం శుభప్రదం , సుఖప్రదంగా ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా సౌందర్యవంతుడుగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఆకర్షణీయమైన మాటలు కలిగి ప్రభావశాలిగా ఉంటాడు. మధుర భాషణ, ఆత్మ విశ్వాసం వీరి సొత్తు.
తల్లితో స్నేహభావం, తల్లి సహకారం ఉంటాయి. చంద్రుడు పూర్ణ దృష్టితో బుధుడి రాశి అయిన కన్యను చూస్తున్న కారణంగా జీవిత భాస్వామి , సంతాన సుఖం సంతోషం కలుగుతాయి.
* కుజుడు :- మీన లగ్నానికి కుజుడు రెండవ మరియి నవమాధిపతి ఔతాడు. మీనలగ్నస్థ కుజుని కారణంగా వ్యక్తి పరాక్ర వంతుడు, శక్తి శాలిగా ఉంటాడు. మొరటుతనం, ఆధ్యాత్మికతలో ఆసక్తి వీరి స్వంతం. ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. ధనం కలిగి ఉంటారు. ధనమును వెచ్చించుటలో కడు జాగరూకత వహిస్తారు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానముల మీద దృష్టి సారించడం వలన మిత్రులు భాగస్వాముల వలన లాభపడతారు. తల్లి , తల్లితో సమానులతో స్నేహం సహకారం లభిస్తుంది.
* బుధుడు :- మీనలగ్నానికి బుధుడు చతుర్ధ, మరియు సప్తమాధిపతి ఔతాడు. పరుల దూషణకు గురి ఔతారు. పరిశ్రమించే గుణం కలిగి ఉండుట బుద్ధి కుశలతతో ధనం సంపాదించుట వీరి గుణం. పితృ సంపద అంతగా లాభం లేకున్నా స్త్రీకారణంగా వచ్చే సంపద విశేషంగా లాభించగలదు. మీన లగ్నం నుండి స్వస్థానాన్ని చూస్తున్న బుధుడి కారణంగా అనుకూలమైన జీవిత భాగస్వామి లభించి వారి నుండి సహాయ సకారాలు అందుకుంటారు.  వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది.
* గురువు :- మీలగ్నానికి గురువు లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఔతాడు. లగ్నాధిపతి కనుక రెండు కేంద్రాల ఆధిపత్య దోషం ఉండదు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు.
దయాస్వభావం వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతుడుగా ఉంటాడు. ధర్మబద్ధత, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు పంచమ, మరియు సప్తమ, నవమ భావాల మీద గురువు దృష్టి సారించడం వలన సంతానం తండ్రి సహకారం అందుకుంటారు. సుఖమయమైన  వైవాహిక జీవితం అనుభవిస్తారు.
* శుక్రుడు :- మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందంగా , ఆకర్షణీయంగా ఉంటాడు. పిత్త వాత ప్రకృతి కలిగిన శరీరం. పనిలో నైపుణ్యం, పరాక్రమం, సాహసం కలిగి ఉంటారు. తల్లి నుండి సంతానం నుండి సహాయ సహకారం తక్కువ. సంతానం వలన కష్టములు కలుగుతాయి. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూసే కారణంగా వైవాహిక జీవితంలో సాధారణ సుఖం లభిస్తుంది.
* శని :- మీన లగ్నానికి శని లాభ వ్యయాధిపతిగా ఉంటాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. స్వశక్తితో నిర్ణయించుకో లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతుంటారు.  శని ప్రభావం కారణంగా నేత్ర రోగస్తుడు అయ్యే అవకాశం ఉంటుంది.  వీరు స్వతంత్ర్య నిర్ణయం చేయ లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతాడు. షేర్లు, పందెం, లాటరీలు లాభిస్తాయి. అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. లగ్నస్థ శని దృష్టి మూడవ స్థానమైన వృషభం , సప్తమ స్థానమైన కన్య మీద, దశమ స్థానమైన ధనస్సు మీద దృష్టి సారిస్తుంటాడు. మిత్రుల సహకారం లభించదు. జీవిత భాగస్వామి వలన హాని వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి.
* రాహువు :- మీన లగ్నస్థ రాహువు వ్యక్తికి కండలు తిరిగిన శరీరం, చక్కని ఆరోగ్యం ఇస్తాడు. చతురత, సమయస్పూర్తి కలిగి ఉంటారు. వారి స్వార్ధం కొరకు  ఇతరులతో  మిత్రుత్వం  వహిస్తారు. సాహసముతో సమయస్పూత్రితో తమ కార్యములను సాధించుకుంటారు. లగ్నస్థ రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారించడం వలన సంతాన విషయంలో కష్టాలు, జీవిత భాగ స్వామికి అనారోగ్యం, గృహస్థ జీవితంలో కష్టాలు కలుగుతాయి.
* కేతువు :- మీన లగ్నస్థ కేతువు వ్యక్తికి అనారోగ్యం కలిగిస్తాడు. నడుము నొప్పి వాత రోగములు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా నిర్ణయించుకో లేరు. కార్య సిద్ధి కొరకు సామాజిక నియమాలను అధిగమిస్తారు. కేతువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి. ఆర్ధిక స్థితి సాధారణంగానే ఉంటుంది.

20, అక్టోబర్ 2012, శనివారం

కుంభ లగ్నం

 కుంభ లగ్నం 

కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమస్థానాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శని శుభగ్రహాలు మరియు కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభగ్రహాలు అకారక గ్రహాలు. కుంలగ్నస్థ గ్రహాలు వాటి ఫలితాలు.
* సూర్యుడు :- కుంభ లగ్నం సూర్యుడి ఉపస్థితి వలన వ్యక్తికి ఆత్మవిశ్వాసం, అందం ఉంటుంది.  శ్వాస సంబంధ సమస్యలు ఉంటాయి. సామాన్యమైన ఆర్ధిక పరిస్థితి కలిగి ఉంటారు. సప్తమ స్థానం సూర్యుడి స్వస్థానం  అయిన  సింహం కనుక  జీవిత భాగస్వామి  అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయసహకారాలు ఉంటాయి.  వర్తక, వ్యాపారాలలో త్వరగా సఫలత లభిస్తుంది.
* చంద్రుడు :- కుంభలగ్నానికి చంద్రుడు అకారక గ్రహం. శీతల  ప్రకృతి కలిగిన శరీరం  కలిగి ఉంటారు. లగ్నంలో చంద్రుడు ఉన్న కారణంగా మనస్సు చంచలంగా ఉంటుంది.
మనసు అంశాంతితో కూడుకున్నదై ఉంటుంది. కుటుంబంలో వివాదములు, కలహములు కలగడానికి అవకాశం ఉంది. సాహసము, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి కార్యసాధన చేస్తారు. చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానమైన సింహ రాశి మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వ కాంక్షతో వ్యవహరిస్తారు.
* కుజుడు :- కుంభ లగ్నస్థ కుజుడు తృతీయ, అష్టమాధిపతిగా అకారక గ్రహముగా అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న కుజుడు వ్యకి ధృఢమైన, బలమైన శరీరం కలిగి ఉంటాడు. ధైర్యం, సాహసం, పరాక్రమం అధికంగా ఉంటుంది. కఠిన పరిశ్రమకు ఓర్చి కార్య సాధన చేస్తారు. తండ్రి మరియు తండ్రి  వైపు బంధువుల నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. స్వభావంలో ఉన్న ఉగ్రత కారణంగా సమస్యలను వివాదాలను అధికంగా ఎదుర్కొంటారు. లగ్నస్థ కుజుడు నాలగవ స్థానమైన వృషభం, సప్తమ స్థానమైన సింహం, ఎనిమిదవ స్థానమైన కన్యల మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి వ్యవహారిక జ్ఞానం కలిగి గుణవంతుడై ఉంటాడు. వైవాహిక జీవిత సుఖం సామాన్యంగా ఉంటుంది. కుజుడు పీడితుడై పాప సంబంధం ఉన్న ఏడల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
* బుధుడు :- కుంభ లగ్నస్థ బుధుడు పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా అకారక మరియు అశుభ గ్రహంగా ఉంటాడు. లగ్నంలో బుధుడి ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడై జ్ఞానిగా ఉంటాడు. శిక్షారంగంలో సఫలత లభిస్తుంది. వీరి మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. జల ప్రదేశములు పడవ ప్రయాణాలు వీరికి ఆసక్తి కలిగిస్తుంది.
బుధ దశ వీరికి కష్టములు, సమస్యలు తెస్తాయి. ప్రధమంలో ఉన్న బుధుడు సింహరాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామితో వివాదాలకు, అభిప్రాయ బేధాలకు చోటు ఉంటుంది. వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.
* గురువు :- కుంభ లగ్నానికి గురువు ద్వితీయ స్థానాధిపతిగా, లాభాధిపతిగా అకారక గ్రహంగా ఉంటాడు. లగ్నంలో గురువు ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడు, జ్ఞాని ఔతాడు.
వీరికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. ధనసేకరణలో నైపుణ్యం కలిగి ఉండటం వలన ఆర్ధిక స్థితి స్థిరంగా ఉంటుంది. లగ్నస్థ గురువు పంచమ స్థానమైన మిధునం, సప్తమ స్థానమైన సింహం మీద, నవమ స్థానమైన తుఅ మీద దృష్టి సారిస్తాడు కనుక బంధు మిత్రుల నుండి జీవిత భాగస్వామి నుండి లాభం కలుగుతుంది. జీవితభాగస్వామి నుండి పుత్రుల నుండి సుఖం ప్రాప్తిస్తుంది. తండ్రి పక్షము నుండి సహాయసహకారాలు అందుకుంటారు.
* శుక్రుడు :- కుంభలగ్నానికి శుక్రుడు సుఖ స్థానానికి, భాగ్య స్థానానికి అధిపతిగా ఉండి కారక గ్రహమై శుభఫలితాలు ఇవ్వాలి. లగ్నస్థ శుక్రుడి కారణంగా సౌందర్యం, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు బుద్ధి కుశలత, సుగుణ సంపద కలిగి ఉంటారు. వీరికి పూజలు, భజనలు, ధార్మిక కార్యాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూమి, భవనం, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమస్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం బాధిస్తుంది. అభిప్రాయ బేధాలు తలెత్తగలవు.
* శని :- కుంభ లగ్నస్థ శని లగ్నాధిపతిగా ద్వాదశాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి అరోగ్యవంతమైన రోగరహిత శరీరం కలిగి ఉంటాడు. శని లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మవిశ్వాసానికి కలిగి ఉండి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. లగ్నస్థ శని తృతీయమైన మేషరాసిని, సప్తమ స్థానమైన సింహరాశిని, దశమ స్థానమైన వృశ్చికరాశి మీద దృష్టి సారిస్తాడు కనుక సోదరులతో, జీవిత భాగస్వామితో సమస్యలను ఎదుర్కొంటారు.
* రాహువు :- కుంభలగ్నంలో రాహువు ఉంటే జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. వీరికి రాహుదశాకాలంలో ఉదర సంబంధ వ్యాదులు ప్రాప్తిస్తాయి. వర్తక వ్యాపారాలలో
సమస్యలు ఎదుర్కొంటారు. వ్యవసాయంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసం తక్కువ కనుక స్వయం నిర్ణయాలు చేసుకోలేరు. భాగస్వాముల వలన అదాయం తక్కువ. లగ్నస్థ రాహువు పూర్ణదృష్టిని సప్తమ రాశి అయిన సింహం మీద దృష్టిని సారిస్తాడు. కళత్ర స్థానమైన సింహం మీద రాహు దృష్టి ఉంటుంది కనుక జీవితభాస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం తక్కవ.
* కేతువు :- కుంభ లగ్నస్థ కేతువు ఉన్న వ్యక్తి జీవితం అస్థిరంగా ఉంటుంది. వీరి మనసు భోగలాలసత్వంతో కూడినదై ఉండుటుంది. తల్లి తండ్రులతో వివాదములు ఉంటాయి.
స్త్రీలైన పురుషుల అందు పురుషులైన స్త్రీ ల అందు ఆకర్షితులౌతారు. సప్తమ భామం మీద కేతువు దృష్టి సారిస్తాడు. శత్రు స్థానమైన సింహం మీద కేతువు దృష్టి కార్తణంగా
దాంపత్యజీవితం కలతలతో నిండి ఉంటుంది. శుభగ్రహ చేరిక, సంబంధం ఉన్న అశుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి.

19, అక్టోబర్ 2012, శుక్రవారం

మకర లగ్నస్థ గ్రహాలు

 మకర లగ్నస్థ గ్రహాలు 

మకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు.
* సూర్యుడు :- మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది. ఎముకల నొప్పి, ఉదర సంబంధ రోగములు కలిగే అవకాశం ఎక్కువ. నేత్ర వ్యాధులలు కలుగుతాయి. పేరాశ, స్వార్ధ చింతన ఎక్కువ. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్తితిని ఎదుద్కో వలసి వస్తుంది. కటిన పరిస్థితులలోఆత్మబలంతో  పరిశ్రమతో విజయం సాధిస్తారు. గృహస్థ జీవితంలో ఓడి దుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.
* చంద్రుడు :- మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి.  శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సౌం దర్యం ఇస్తాడు. కాని చంద్రుడు శత్రు స్థానంలో ఉన్న కారణంగా విచిత్ర మనస్తత్వం ఉంటుంది. నేత్రములు, చెవుల అందు వ్యాధులు ఉంటాయి. చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థామును మీద దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉండును. జీవిత భాగ స్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.
* కుజుడు :- మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి మరియు లాభాధిపతి ఔతాడు. కుజుడు లగ్నంలో ఉంటే ఆవ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల
సహకారం లభిస్తుంది. తండ్రి వలన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శని ప్రభావం  కారణంగా తండ్రి వైపు ఆస్థులు త్యాగం చేయవలసిన పరిస్థితి సంభవించగలదు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానాల మీద దృష్టి సారిస్తాడు కనుక ధార్మికత ఉంటుంది.  కుటుంబ జీవితంలో కలతలు కలుగుతాయి.  మకర లగ్నంలో కుజుడు ఉచ్చ స్థితి కారణంగా వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటారు.  తల్లి కూడా ఉద్రేక స్వభావం కలిగి ఉంటుంది.
* బుధుడు :- మకర లగ్నానికి బుధుడు షష్టమాధిపతి మరియు నవమాధిపతి ఔతాడు. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. వీరికి దైవ భక్తి, దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి.  సప్తమ స్థానం మీద బుధ దృష్టి ఫలితంగా  జీవిత భాగస్వామి అందంగా సామర్ద్యశాలిగా  ఉండును. షష్టామాధిపతి దృష్టి  కారణంగా  భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడానికి జాప్యం కలుగ వచ్చు.
* గురువు :- మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగిస్తాడు.  వీరికి  క్షమాగుణం మెండు అయినా వీరు వారి యోగ్యతను గుణమును సద్వినియోగపరచ లేరు. ఇతరుల కలతలు వీరిని ప్రభావితంచేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదు ర్కొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి సారిస్థాడు కనుక వివాహానంతరం అదృష్టం ప్రాప్తిస్తుంది.
* శుక్రుడు :- మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్ధపరులుగా చేస్తుంది. తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు. వీరు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలైన పురుషుల పట్ల పురుషులైన స్త్రీల పట్ల ఆకర్షితులు ఔతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం కారణంగా వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖ దుఃఖంలో సహాయ సహకారలను అందిస్తారు.
* శని :- మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ కారక గ్రహం ఔతాడు. ఈ కారణంగా ఈ వ్యక్తి భాగ్యశాలి కాగలడు. ఆకర్షణీయమైన బలిష్టమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయముగా మాట్లాడ లేరు. ప్రభుత్వ సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తిస్తాయి.  వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి.
* రాహువు :- మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర తిరుగుడు అధికం. కార్య హాని జరగడానికి అవకాశం ఎక్కువ. అనుకున్న కార్యాలు సాధించడంలో సమయలు తలెత్తుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుది. వ్యవసాయంలో సమస్యలు కష్టములు అధికంగా కలుగుతాయి. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుండి మిత్రుల నుండి తగిన సహకారం లభించదు.
* కేతువు :- మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు ఔతాడు. అన్ని సమయములలో అన్వేక కష్టములను ఎదుర్కొంటారు. శత్రువుల వలన హాని కలుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలు ఔతారు. లగ్నస్థ కేతువు స్ర్తీలకు పురుషుల అందు పురుషులకు స్త్రీల అందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి. భాస్వామి సహాయ సహకారాలు లభించవు.