3, సెప్టెంబర్ 2012, సోమవారం

కేదార్ బదరీ యాత్ర 

మేము కేదార్  యాత్ర చేసి అయిదు సంవత్సాలు పూర్తీ చేసుకున్నాయి. అయినప్పటకి ఆ గుర్తులు మాత్రం ఇంకా మనసులో పదిలంగానే ఉన్నాయి.  నాజీవితంలో కేదార్నాద్ బదరినాద్ చూస్తానని అనుకోలేదు. కానీ ఇలాంటి అవకాశం రావడం అదృష్టం అని భావించాను. అది కూడా బదిరిలో ఆలయం సరిగా తెరిచే రోజుకు చేరుకొని ఆలయ దీపం చూడాలని మాప్లాను. ఆ దీపం ఆరు మాసాల ముందు వెలిగించింది. అది ఆరుమాసాల తరువాత కుడా ఆరకుండా అలాగే వెలగడం అక్కడి ప్రత్యేకత. యాత్ర బుక్ చేయగానే ముందుగా గెట్ టుగెదర్ విందు చేసారు. అప్పుడు ఎవరికీ వారు కొత్తగా  అనిపించారు. కానీ తరువాత వారే ఒక కుటుంబంగా మారి పోతారని ఎవరూ  ఉహించ  లేనిది కదా ! విందు పూర్తి  అయిన తరువాత చిన్నగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యాత్ర   గురించి  వివరించి యాత్రకు  కావలసిన అత్యవసర సామాగ్రి గురించి చెప్పి అవి ఎక్కడ లభ్యం  ఔతాయో వివరించారు. తరువాత ఒక యాత్ర వివరాల గురించిన పుస్తకం ఇచ్చారు.  అందులో యాత్రకు వెళ్ళే వారి అడ్రసులు ఫోన్ నంబర్లు ఉన్నాయి. అందరూ  ఆ  పుస్తకం యాత్రకు వచ్చే సమయంలో తీసుకు రావాలని చెప్పారు. అందులో కొన్ని ఖాళీ పేజీలు ఉన్నాయి వాటిలో యాత్రలో చుసిన వివరాలు వ్రాసుకో వచ్చని చెప్పారు. తరువాత నిర్వాహకులను ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. ఇలా మా గెట్ టుగెదర్ ముగిసింది. తరువాత మేము యాత్రకు కావలసిన సరంజామా తయారు చేసుకుని యాత్రకు సిద్ధం అయ్యాము. 

File:Chennai Central interior.jpg
File:Chennai Central station.jpg
ముందుగా మేము చెన్నై రాల్వే స్టేషన్ చేరుకున్నాము. అక్కడ అప్పటికే నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. వారు అందరిని ఆహ్వానించి మా మా సీట్లలో మమ్మలిని అసీనులను చేసారు.   ఎక్కగానే మాకు అల్పాహారం సరఫరా చేసారు. నెల్లూరు నుండి కొందరు మాతో కలిసారు. వారు వచ్చిన  తరువాత మా ఎదురు సీట్లు భర్తీ అయ్యాయి. మా విభాగంలో ఆరుగురం ఉన్నాము. ఎక్కిన కొన్ని గంటల సమయానికే మేము ఒకరితో ఒకరం చక్కగా పరిచయం అయ్యాము. నిర్వాహకులు కొందరు గ్రూప్ లీ డర్లను ఎంచుకుని వారిని మాకు పరిచయం చేసారు. అలా  ఒకరికి ఒకరం మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు గడిపాము. సాయంత్రానికి ఒకరొకరుగా వచ్చి పరిచయం చేసుకున్నారు. ఇలా రెండవ రోజు ప్రయాణం కూడా సాఫీగానే జరిగింది. ఎలాగైతేనేం డిల్లీ  చేరుకున్నాం.


File:Rajdhani express at NDLS.JPGFile:BCT1.JPG
మా సామాను అంతా దించుకుని అందరూ ఒకే చోట చేరి కూర్చున్నాము. సామాను అంతా బండ్ల మీద  ఎక్కించి స్టేషన్ బయటకు చేర్చారు.  అక్కడ నుండి అందరూ ముందుగా బుక్ చేసిన హోటల్ చేరుకున్నాము.  డిల్లీ ఎందుకో అంత ఆకర్షనీయం గా కనిపించ లేదు. అంతటా దుమ్ము రేగినట్లు ఉంది. వాతావరణంలోదుమ్ము స్పష్టంగా కనిపిస్తూ పరిసరాలు కొంత అస్పష్టంగా కనిపించాయి.   చా ఎత్తు భవనాలు కూడా అలా అస్పష్టంగా కనిపించడం వింతగా ఉంది. ఒకే దేశంలో ఇంట వైవిధ్యమైన వాతావరణం ఆశ్చర్యాన్ని కలిగించింది. మా కందరికీ రూములు చూపించగానే అందరం ఫ్రెషప్ అయి నిర్వాహకులు చెప్పిన స్థలానికి చేరుకుని ఉదపు అల్పాహారం తీసుకున్నాము. హోటల్ లోనే మా వంట వారికి వంట చేసుకోవడానికి కొంత ప్రదేశాన్ని ఇచ్చారు. మా వంట వారు ఎలాంటి ప్రదేశంలో కూడా వంట చేయగలిగిన నేర్పరులు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కి ముందుగా  రాజ్ ఘాట్ చేరుకున్నాము. అక్కడ గాంధీ సమాధి, నెహ్రు సమాధి, రాజీవ్ గాంధీ సమాధి , ఇందిరా గాంధీ సమాధి  నాయకుల సమాధులు ఉన్నాయి. డిల్లీలో చూడవలసిన వాటిలో అది ముఖ్యమైనది కదా ! ముందుగా గాంధీ సమాధి చూడడానికి వెళ్ళాము. ఇదిగో ఇదే గాంధీ సమాధి.



File:India Gate - Delhi, views of India Gate (2).JPG
ఇదే ఇండియా గేట్ 
File:Raj ghat 2.JPG
గాంధీ  సమాధి దీనినే రాజ్ ఘాట్ అంటారు 



అలాగే తరువాత మేము రాజీవ్ గాంధీ , ఇందిరా గాంధీ, నెహ్రు సమాధులను చూసిన  తరువాత అక్కడి నుండి బయలు దేరి ఇండియాగేట్ చేరుకున్నాము. అక్కడ అందరమూ తిరిగి చూసాము.  అలా కుర్చుని ఉండగానే కొందరు ఆడపిల్లలు వచ్చి మాకు మెహంది పెడతామని వచ్చారు. మాలో కొంతమంది చక్కగా మెహంది పెట్టించుకుని ఆనందించారు. అంతా  తీరికగా కుర్చుని భోజనాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము.  ఇండియా గెట్ సందర్సన మాకు చాల ఆనందాన్ని కలిగించింది. ఇంతలో నిర్వాహకులు భోజనాలు తాయారు చేసుకుని వ్యానులో పెట్టుకుని మా వద్దకు వచ్చారు. అందరం భోజనాలు చేసి అక్కడ నుండి బయలు దేరి ఇస్కాన్ చూడడానికి వెళ్ళాము.







అలాగే ఇస్కాన్ లోనికి వెళ్ళగానే లోపల అంతా తిరిగి చూసాము. తరువాత ఇస్కాన్ లో
షో చూడడానికి
వెళ్ళాము. షో   
ఆర్షణీయంగా 
ఉంది.షోలో భాగంగా 
ఒక్కో షో  చూ పించి అలాగే వేరొక షో చూడడానికి పంపిచారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ చూడడం ఒక కొత్త అనుభూతి. ఇలా అశోలో మేము ఐదారు రకాల షోలు చూసాం. ఇస్కాన్ ఆలయం ఇంతకు ముందు చూసినా ఇలాంటి షో చూడడం ఇది మొదటి సారి.ఒక్కో షో ఒక్కో మాదిరిగా ఉంది. ఇలా షో  పూర్తికాగానే అందరం బస్సు చేరుకుని హోటల్ రూంకు చేరుకొని భోజనాలు చేయడానికి  హోటల్ రూఫ్ గార్డెన్ చేరుకున్నాం. అక్కడి నుండి డిల్లీ అందంగా కనిపించింది.  పూర్తి చేసుకు తరువాత నిర్వాహకులు మాతో  తరువాత మా ప్రయాణానికి చాలినన్ని దుస్తులు తీసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. మిగిలిన సామానులు హోటల్ లోనే బధ్రపరిచారు. మేము ఇక మినీ బసులలో ప్రయాణం చేయాలి. అంటే రెండు బసులలో ప్రయాణించాలి. ఘాట్ రోడ్ లో ప్రయాణించడానికి మినీ బసులు మాత్రమే  ఉపకరిస్తాయి. అందరం  హోటల్ నుండి సదరన్ ట్రావెల్ కార్యాలయానికి చేరుకొని మా మా బసులను అధిరోహించి ప్రయాణం కొనసాగించాము. మా ప్రయాణం రాత్రి సమయంలో జరిగింది. బసు ఎక్కగానే అందరం నిద్రలోకి జారుకున్నాం.



హరిద్వార్ 
File:Rishikesh, Lakshman Jhula.jpg
ఋషికేస్ 

అలా రాత్రి ప్రయాణించి తెల్లవారే సమయానికిహరిద్వార్ చేరుకున్నాము. కానీ ఇప్పుడు మేము హరిద్వార్ వద్ద ఆగలేదు. తిరుగు ప్రయాణంలో మాత్రమే హరిద్వార్ చూడాలని  నిర్వాహకులు చెప్పారు. హరిద్వార్ దాటి ఋషీ కేస్ చేరుకున్నాము. అక్కడ మేము చిన్న జీయర్ ఆశ్రమంలో బస చేసాము. జీయర్ ఆశ్రమంలో మాకు రూములు కేటాయించారు. కొందరు గంగానది స్నానానికి వెళ్లి వచ్చారు. మేము రూ ములలో స్నానాలు ముగించి ఆశ్రమంలో అల్పాహారం తీసుకుని తరువాత మేము  తిరిగి  ప్రయాణం కొనసాగించాము.


ఇలా  మేము హిమాలయ  పర్వత శిఖరాలను అధిరోహించడం మొదలు పెట్టాము.  అలా వెళుతూ కొండచరియలు చూసుకుంటూ ఘాట్ రోడ్లలో ప్రయాణిస్తున్నాము. హిమాలయాల అందాలు  మనసును దోచుకుంటుంది. హిమాలయాలు చూస్తున్నామన్న అనుభూతి చాల ఆనందంగా ఉంది. మధ్యాహ్న సమయానికి ఒక పెట్రోలు బంకు వద్ద భోజనం కొరకు ఆగాము. బసు నిలిపి భోజనం చేయడానికి అలంటి ప్రదేశాలలో మాత్రమే అవకాశం ఉంటుంది.
Headlinesindia Image Gallery
హిమాలయ లోయలు 

అక్కడ నుండి హిమాలయ లోయలు చాల అందంగా కనిపించాయి. మచ్చుకి ఈ చిత్రం చుడండి. ఇలా కొండ చరియలను ఇలా పంట భూములుగా మార్చుకుంటారు. ఇలాంటి పంట భూములు మనదేశంలో ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. అక్కడ మేము మా మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసుకుని కొంత దూరం ప్రయాణం  చేసాము. మధ్యాహ్నం దాటి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతలో బసును తిరిగి నిలిపారు. మాతో వచ్చిన వంట వారు మాకు అక్కడ రోడ్డు  మీదే కాఫీ టీ లు పెట్టి కాఫీ టీ లు బిస్కట్లతో అందించారు. మా వంట వారికీ అలాంటి సామర్ధ్యం అధికం. వేడిగా పానీయాలు సేవించి తిరిగి బసు ఎక్కి ప్రయాణం కొనసాగించాము. రోడ్డు పక్కన బృందగా భోజనాలు చేయడం కాఫీ టీలు త్రాగడం చాల సరదాగా ఉంది.



File:Devprayag - Confluence of Bhagirathi and Alaknanda.JPG
దేవ ప్రయాగ 
File:Rudra Nath Temple, Rudraprayag, Uttarakhand.jpg
రుద్ర ప్రయాగలో శివాలయం 

శివాలిక్ పర్వతాల గుండా ప్రయాణించి మద్యలో దేవప్రయగ ద్వారా మా ప్రయాణం  కొనసాగించాము. దేవప్రయాగ వద్ద అలకనందనది గంగానదిలో సంగమిస్తుంది. అలా  వెళుతూనే రుద్రప్రయాగ చేరుకునే సమయానికి రాత్రయింది రాత్రి సమయంలో హిమాలయ ఘాట్ రోడ్లలో ప్రయాణం ప్రమాదకరం కనుక ప్రయాణానికి అనుమతించరు. రుద్రప్రయాగ వద్ద రూములలో విశ్రాంతి తీసుకున్నాము. మరుసటి రోజు తిరిగి  ప్రయాణం కొనసాగించి బదరినాద్ చేరుకోవడానికి బయలు దేరాము.

File:Ropeway at Joshimath, Uttarakhand.jpg
జోషి మఠంలో రోప్ వే 
Adi Badri
జోషీ మతంలో ఆలయం 

మార్గ మాధ్యమంలో జోషీ మఠం  చేరుకున్నాము. అక్కడతో భారతదేశ సరిహద్దులు మొదలుతాయి. కనుక ఇక మిగిలిన ప్రాంతం మిలిటరీ అధినంలో ఉంటుంది. జోషీ మఠం మరొక ప్రత్యేకత కలిగి ఉంది. అది భవిష్యత్  బడరినాద్ గా పిలువబడుతుంది. బదరీ నాధుడు అక్కడ అరు మాసాల కాలం నిత్యపూజలు అందుకుంటాడు. అంటే శితాకాలంలో  బదరీ దర్శనం ఆపివేసిన ఆరుమాసాల కాలం  బదరీ నాధుడు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటాడు. అలాగే ఇక్కడ శంకరాచార్యుడు  నివసించిన మఠం కూడా ఉంది. మా బసు ఆ మఠం ఉన్న ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆగింది. మమ్ము అక్కడ నుండి నడిచి వెళ్ళమని చెప్పారు. మేము ఉత్సాహంగా బయలు దేరినా అక్కడకు ప్రయాసతో మాత్రమే చేరుకున్నాము. అక్కడ ఉన్న నరసింహ స్వామిని దర్శించుకుని శంకర మఠం చూసి వెలుపలకు రాగానే నిర్వాహకులు బసు వద్దకు చేరుకోవడానికి మా కోసం వ్యానులను  ఏర్పాటు చేసారు. అవి చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చింది. నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పి మేము వ్యానులలో  బసు చేరుకొని తిరిగి బదరీ ప్రయాణం కొనసాగించాము. 
జిషి మతం నుండి ఘాట్ రోడ్డు దృశ్యం 
దూరంగా కనిపిచే చిన్న చిన్న ఉర్లు 

చీకటి పడే లోపు బదరి చేరుకోవాలి. మార్గమధ్యలో ఎక్కడ ఘాట్ రోడ్ వద్ద బసు ఆపడానికి కుదరదు. ఆపిన బసు దిగి కిందకు దిగడానికి వీలు కాదు. అటు ఇటు పెద్ద లోయలు ఉంటాయి. ఎదురు వచ్చే బసులు కూడా టర్నింగ్ వద్ద మాత్రమే ఒకదానిని ఒకటి దాట వలసిన అవసరం ఉంది. అక్కడ మాత్రమే రెండు బసులు తిరగడానికి కావలసిన ప్రదేశం  ఉంటుంది. రెండు బసులు దాటే సమయంలో ఒళ్ళు గగర్పోడుస్తూ ఉంటుంది. మార్గాలు అంత  ఇరుకుగా ఉంటాయి. మరొక ప్రమాదం వర్షం. ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో వర్షం వస్తే కొండ చరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది.  అలాగే నీరు రోడ్లను ఉచకోత కోస్తూ ప్రవహిస్తుంది కనుక మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నిరంతరంగా మర్గాలసు సరి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మార్గాలు నిరతరంగా రిపేరుకు గురి ఔతునే ఉంటాయి. కొన్ని మార్గాలలో అటు ఇటు అదాలు ఏమి ఉండవు. మార్గం వృక్ష రహితంగా ఉంటుంది కనుక  తప్పితే నేరుగా లోయ అడుగు భాగానికి చేరవలసిందే. కనుక ఘాట్ రోడ్డు ప్రయాణం బహు జగారుకతతో చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతలో అనుకోకుండా మా బసులలో ఒకటి రిపేర్ అయింది. చీకటి పడే సమయం దగ్గర పడింది. చీకటి పడే లోపు బదిరీ చేరుకోక పొతే బసును లోనికి రానివ్వరు. నిర్వాహకులు చాల ఆందోళనకు గురి అయ్యారు. ఒకరి కొకరు ఒకరు తోడు అన్నట్లుగా రెండు బసులు ఆపి చిన్నగా బస్సు బాగు చేసుకుని బదిరీ  చేరుకున్నాము. బసు దిగగానే మాకు చలి బాధ బాగా తెలిసింది. భరించలేనంత చలి వేసింది. బసు నేరుగా చిన్న జియారు మఠం వద్ద ఆపారు. మేము బిలబిలమంటూ లోనికి పరుగులు తీసాం అంతగా చలిగా ఉంది మరి.


3, ఆగస్టు 2012, శుక్రవారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-9

పూర్వాభాద్రా 

  1. పూర్వాభాద్ర  నక్షత్ర మొదటి పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర మొదటి పాదం మేషరాసిలో ఉంటుంది.   మేషరాసి అధిపతి కుజుడు   పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు . వీరి మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధనులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.వీరికి భూ సంబంధిత, సైనిక పరమైన, సాహసాలు ప్రదర్శించ కలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకులిస్తాయి. వీరికి శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు ,  వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది. వీరికి 14 సంవత్సరాల వరకు గురుదశ  ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగ వచ్చు. సంపాదనకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ   కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ   కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  2. పూర్వాభాద్ర  నక్షత్ర రెండవ పాదం :- వృషభరాశి అధిపతి శుక్రుడు.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు .  కనుక వీరి మీద శుక్ర గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మతభోధకులు, మతగురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి 10 సంవత్సరాల వరకు గురుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వ్రుద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  3. పూర్వాభాద్ర  నక్షత్ర మూడవ పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర మూడవ పాదం  మిధునరాశిలో ఉంటుంది. మిధునరాశి అధిపతి బుధుడు.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు.వీరి మీద బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. భూ సంబంధిత,  విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి విధ్యా సంస్థలను స్థాపించి నిర్వహించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి 6 సంవత్సరాల వరకు మాత్రమే గురుదశ ఉంటుంది. 6 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రద్శ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది.  వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.
  4. పూర్వాభాద్ర  నక్షత్ర నాలుగవ పాదం :-  పూర్వాభాద్ర  నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో  ఉంటుంది.  పూర్వాభాద్ర  నక్షత్ర  అధిపతి గురువు.  కటకరాశి అధిపతి చంద్రుడు.  ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.  పసుపు వర్ణ, శ్వేతవర్ణ  వస్తు సంబంధిత ఉద్యోగలు, వృత్తులు, వ్యాపారాలు అనుకులిస్తాయి. ఔషధ  సంబంధిత  వృత్తులు , వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి  అనుకూలిస్తాయి. వీరికి 2 సంవత్సరాల వరకు మాత్రమే గురుదశ ఉంటుంది. 2 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విద్యలో సాధించ వచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగ వచ్చు. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధదశ   కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది   జివితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే విదేశీపర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం ప్రవేశిస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా, సౌఖ్యంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సుఖంగా జరుగుతుంది.

ఉత్తరాభాద్రా  

  1. ఉత్తరాభాద్ర నక్షత్ర మొదటి పాదం :-  ఉత్తరాభాద్ర నక్షత్ర మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.   సింహరాశి   అధిపతి సూర్యుడు.   ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని. వీరి మీద  సూర్య శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం. వీరికి తండ్రితో వ్యతిరేకత ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం  ఉంటుంది. శ్రమించి  పనిచేయగలరు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు,   కర్మాగారాలు  వ్రత్తి, ఉద్యోగ,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి  ఆత్మవిశ్వాసం , అతిశయం కలిసి ఉంటాయి.  వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.  వీరికి 17 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశి ఉద్యోగావకాశాలు,  విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  2. ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ  పాదం :-   ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ  పాదం కన్యా రాశిలో ఉంటుంది.  కన్యా రాశి అధిపతి బుధుడు.  ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని. వీరి మీద  బుధ  శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి  వ్యాపారం అంటే అత్యంత ఆసక్తి ఉంటుంది. వీరికి  వ్యాపారం బాగా అనుకులిస్తుంది.    వీరికి విద్యా  సంబంధిత , పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం  అనుకూలిస్తాయి.    వీరికి సాంకేతిక  విద్యలు,  వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.   వీరు బుద్ధికుశలత కలిగి ఉంటారు.  వీరికి 13 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే  7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.   కేతుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  3.   ఉత్తరాభాద్ర నక్షత్ర మూడవ  పాదం :-   ఉత్తరాభాద్ర నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.    తులారాశి అధిపతి శుక్రుడు .  ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి  శని . వీరి మీద  శుక్ర  శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ  నక్షత్రం.  వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి పరిశుభ్రమైన పరిసరాలలో నివసించడానికి ఆసక్తి ఉంటుంది. వీరికి   ప్రత్యెక ఆకర్షణ  ఉంటుంది .వీరికి నౌకలలో ఉద్యోగాలు వ్యాపారాలు  అనుకూలిస్తాయి.    వీరికి సాంకేతిక  విద్యలు,  వృత్తి  విద్యలు వీరికి  అనుకూలిస్తాయి. వీరికి 9 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో  అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత   వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా  సాగుతుంది. 
  4. ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగవ  పాదం  :-  ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది.   వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీరి మీద కుజ  శని గ్రహ ప్రభావం ఉంటుంది.  ఇది మానవగణ  నక్షత్రం.   వీరికి సమయానుకూలంగా  ప్రవర్తించే  సామర్ధ్యం  ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. అయిన తమ మీద తమకు నియంత్రణ ఉంటుంది. వీరికి  విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం  ఉద్యోగం అనుకూలిస్తాయి.  వీరికి సాంకేతిక  విద్యలు,   వృత్తి   విద్యలు వీరికి  అనుకూలిస్తాయి.   వీరికి 5 సంవత్సరాలు  శనిదశ  ఉంటుంది.  శనిదశ  కాలంలోవిద్య  మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధదశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే  7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ  అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత  వచ్చే శుక్రదశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది.  తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల  వచ్చే18 సంవత్సరాల  రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.  రాహుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి.

రేవతి 

  1. రేవతి  నక్షత్ర మొదటి పాదం :-  రేవతి  నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు .  రేవతి  నక్షత్ర  అధిపతి బుధుడు .  వీరి మీద  గురు బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది  .అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి  విధ్యా   సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి  విద్యా సంబంధిత   వృత్తులు వ్యాపారం  ఉద్యోగం  అనుకూలిస్తాయి. వీరికి 16  సంవత్సరాల వరకు బుధదశ   ఉంటుంది. వీరు  విద్యారంభం  నుండి ప్రతిభ కనబరుస్తారు. 16  సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.  తరువాత 23  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 66   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశి ఉద్యోగావకాశాలు,   విదేశి పర్యటనలు కలిసి వస్తాయి. 
  2. రేవతి నక్షత్ర  రెండవ  పాదం :-  రేవతి   నక్షత్ర  రెండవ  పాదం మకరరాశిలో ఉంటుంది. మకరరాశి అధిపతి   శని.  రేవతి నక్షత్ర  అధిపతి బుధుడు.  వీరి మీద   శని  బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది.  అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి  భూ  సంబంధిత, వాయు సంబంధిత  ఉగ్యోగాలు, వృత్తులు,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య  అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకులిస్తుంది.   వీరికి 12  సంవత్సరాల వరకు బుధదశ   ఉంటుంది.  వీరు  విద్యారంభం  నుండి ప్రతిభ కనబరుస్తారు. 12  సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.19 సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్యకంటే విలాసాల మిద ఆసక్తి అధికం కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 62   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహు దశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు, విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  3. రేవతి నక్షత్ర  మూడవ  పాదం  :-  రేవతి నక్షత్ర  మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి   అధిపతి   శని. రేవతి నక్షత్ర  అధిపతి బుధుడు.  వీరి మీద   శని  బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది.  అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.  వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత  ఉగ్యోగాలు, వృత్తులు,  వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య  అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకులిస్తుంది. వీరు  స్థిరమైన భిప్రాయాలు కలిగి ఉంటారు.   వీరికి 5  సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ   ఉంటుంది.  కనుక వీరికి   విద్యారంభంలో ఆటంకాలు ఎదురౌతాయి 5 సంవత్సరాల తరువాత 7 సంవత్సరాల కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.    ప్రయత్నపూర్వకంగా  అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి.  కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు.   12  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 55   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18   సంవత్సరాల   రాహుదశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.   రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు,   విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 73 సంవత్సరాలకు వచ్చే  16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  4. రేవతి నక్షత్ర  నాలుగవ పాదం :-   రేవతి నక్షత్ర  నాలుగవ పాదం మీనరాశిలో ఉంటుంది.  రేవతి  నక్షత్ర  అధిపతి బుధుడు .  వీరి మీద  గురు బుధ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం.  వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది  .అధ్యత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి  విద్య  సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి  విద్యా  సంబంధిత   వృత్తులు వ్యాపారం  ఉద్యోగం  అనుకూలిస్తాయి.  వీరికి 4  సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ   ఉంటుంది.  కనుక వీరికి   విద్యారంభంలో ఆటంకాలు ఎదురౌతాయి  4   సంవత్సరాల తరువాత 7  సంవత్సరాల  కేతుదశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.   కేతుదశ   అనుకూలిస్తే  సమస్యలు ఉండవు. 11  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల  శుక్రదశ  కాలంలో విద్యలో  అభివృద్ధి  ఉంటుంది.  శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మిద ఆసక్తి అధికం  కనుక మనసును  ప్రయత్నపూర్వకంగా విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి . సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 54   సంవత్సరాల  వరకు జీవితం  సాఫీగా   జరుగుతుంది. తరువాత  వచ్చే 18  సంవత్సరాల  రాహుదశ  కాలంలో కొన్ని సమస్యలు  ఎదుర్కొంటారు.  రాహుదశ   అనుకూలిస్తే  విదేశిఉద్యోగావకాశాలు, విదేశిపర్యటనలు కలిసి వస్తాయి. 72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుద  కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.     

2, ఆగస్టు 2012, గురువారం

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-8

శ్రవణం 

  1. శ్రవణా నక్షత్ర మొదటి పాదం :-  శ్రవణా నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు. శ్రవణా నక్షత్ర  అధిపతి చంద్రుడు. వీరి మీద  కుజ చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు  దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు.  ఆవేశపూరిత  స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ తమ భావాల మీద  నియంత్రత కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలను, కోపతపాలను మార్చిమార్చి ప్రదర్శిస్తారు. వీరు ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.  శ్వేతవర్ణ, రక్తవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక, ఔషధ సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలమే. విద్యుత్, అగ్ని సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 8 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 15 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో  కాలేజ్ విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది.  అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా రహితంగా సాగిపోతుంది.
  2.   శ్రవణా నక్షత్ర రెండవ  పాదం :-   శ్రవణా నక్షత్ర రెండవ  పాదం వృషభరాశిలో ఉంటుంది.  వృషభరాశి అధిపతి శుక్రుడు. శ్రవణా నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరి మీద శుక్ర చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. వీరు దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరికి కొంత స్థిర స్వభావం ఉంటుంది. వీరు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. కళాత్మక  వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపుతారు. విలాసజీవితం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది. వీరికి శ్వేతవర్ణ సంబంధిత వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జలసంబందిత, పర్యాటక సంబంధిత, ఔషధ సంబంధిత  వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.  6 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 13 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో మాధ్యమిక విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో ఉంది. 47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది.  అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా  సాగిపోతుంది. 
  3.   శ్రవణా నక్షత్ర మూడవ  పాదం :-  శ్రవణా నక్షత్ర మూడవ  పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు. శ్రవణా నక్షత్ర  చంద్రుడు. వీరి మీద బుధ చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. వీరు దేవగణ  ప్రధానులు. కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరు బుధ్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి ఉంటుంది. వీరు  ఔషధ తయారీ సంస్థను స్థాపించి నిర్వహించగలరు. వీరికి  విద్యాసంబంధిత, భూ సంబంధిత, ఔషధ సంబంధిత వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు అనుకూలిస్తాయి.  4 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 11 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ   కాలంలో   విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు.  రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు  వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా సాగిపోతుంది. 
  4.   శ్రవణా నక్షత్ర నాలుగవ  పాదం :-  శ్రవణా నక్షత్ర నాలుగవ  పాదం కటకరాశిలో ఉంటుంది.  కటకరాశి అధిపతి చంద్రుడు,    శ్రవణా నక్షత్ర అధిపతి చంద్రుడు. కనుక వీరి మీద పరిపూర్ణంగా చంద్రుడి ప్రభావం ఉంటుంది. వీరు  దేవగణ  ప్రధానులు.   కనుక సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం  అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు వీరికి తల్లితో  అనుబంధం అధికంగా ఉంటుంది. వీరు  తరచూ భావోద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉంది. వీరి భావాలు తరచూ మారుతూ ఉంటాయి. వీరు ప్రేమ, అభిమానం, కోపతాపాలు కూడా మార్చి మార్చి ప్రదర్శిస్తారు.  శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారం , ఉద్యోగం వీరికి అనుకూలం. ఔషధ రంగానికి సంబంధించిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  2 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో  వరకు వీరికి బాలారిష్టాలు (బాల్యంలో ఆరోగ్య సమస్యలు ) ఉంటాయి.  తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 9 సంవత్సాలకు వచ్చే18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించ వచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 27 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఏంతో  ఉంది. 43 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికం ఔతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 62 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యా  రహితంగా సాగిపోతుంది.

ధనిష్ఠ 

  1.  ధనిష్ఠ  నక్షత్ర మొదటి పాదం :-    ధనిష్ఠ   నక్షత్ర మొదటి పాదం  సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి అధిపతి సూర్యుడు,   ధనిష్ఠ   నక్షత్ర అధిపతి కుజుడు. వీరి మీద సూర్య కుజ  గ్రహప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాసం ఉంది. వీరికి ధైర్యసాహసాలు, అతిశయం, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కొంచం అధికంగా ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు ఉద్యోగం వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 6 సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 59 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  2.  ధనిష్ఠ  నక్షత్ర రెండవ  పాదం :-  ధనిష్ఠ   నక్షత్ర రెండవ  పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు.  వీరి మీద బుధ  చంద్ర గ్రహప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి   పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి.   వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి బుద్ధికుశలత అధికంగా ఉంటుంది.వీరికి వ్యాపారం అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. సైనిక పరమైన  వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా  ఉంటాయి.  వీరికి 4  సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 57 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  3. ధనిష్ఠ  నక్షత్ర మూడవ  పాదం :-   ధనిష్ఠ  నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.   ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు.   వీరి మీద శుక్ర  కుజ  గ్రహప్రభావం ఉంటుంది.  ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరికి   పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరు  పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. వీరు  కళాత్మకమైన వస్తుసేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్ , జల, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం , వ్యాపారం అనుకులిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి నౌకా దళంలో ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి 2 సంవత్సరముల వరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. 20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 55 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు  కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన, తీర్ధయాత్రలు  అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
  4. ధనిష్ఠ  నక్షత్ర నాలుగవ  పాదం:-  ధనిష్ఠ  నక్షత్ర నాలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటాయి.  వృశ్చికరాశి అధిపతి కుజుడు,  ధనిష్ఠ  నక్షత్ర అధిపతి కుజుడు. వీరి మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. వీరికి ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి. ఉద్యమాలలో వీరు  ముందు ఉంటారు.  వీరికి సైనిక సంబంధమైన  ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి1  సంవత్సరమువరకు కుజదశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి.  రాహుదశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంది. వీరికి రాహుదశ కాలం తల్లి తండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా జరిగి పోతుంది. 19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సౌఖ్యం ఆరంభం ఔతాయి. ఈ  దశ లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం చాలా చాలా అవసరం. లేకుంటే తరుత వచ్చే  శనిదశ  కాలంలో ఇబ్బందులు ఎదురౌతాయి. 35తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.

శతభిష 

  1. శతభిషా నక్షత్ర మొదటి పాదం :-  శతభిషా నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.  ధనసురాశి అధిపతి గురువు,   శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం  ఉంటుంది.  వీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది.  పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి 16 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లి తండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో కాలేజ్ చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవడం వీరికి చాలా చాలా అవసరం. లేకుంటే  32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులు కలుగుతాయి. 51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు అవకాశం  ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  2.  శతభిషా నక్షత్ర రెండవ  పాదం :-  శతభిషా నక్షత్ర రెండవ  పాదం  మకరరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శని.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరికి రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది.   ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు  శ్రమించి పని చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వరుత్తులు, వ్యాపారాలు  అనుకూలిస్తాయి.  వీరికి 12 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లి తండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో మాధ్యమిక  చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవడం వీరికి చాలా చాలా అవసరం. లేకుంటే  28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికం ఔతాయి కనుక ఇబ్బందులు కలుగుతాయి. 47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు  అవకాశం  ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  3.  శతభిషా నక్షత్ర మూడవ  పాదం :-  శతభిషా నక్షత్ర మూడవ  పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి మీద శని రాహు గ్రహప్రభావం ఉంటుంది.   ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు  శ్రమించి పని చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వరుత్తులు, వ్యాపారాలు  అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.  వీరికి 8 సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురౌతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లితండ్రుల సహచర్యంలో  రాహుదశ సమస్యలు తక్కువగానే జరిగి పోతుంది. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శనిదశ వస్తుంది కనుక  సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు   అవకాశం  ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.
  4.  శతభిషా నక్షత్ర నాలుగవ  పాదం :-  శతభిషా నక్షత్ర నాలుగవ  పాదం మీనరాశిలో ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు.  శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. వీరి  మీద గురు రాహు ప్రభావం ఉంటుంది.  వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం  కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం  ఉంటుంది.  వీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది.  పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి 4 సంవత్సరాల కాలం మాత్రమే రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్య నిరాటంకంగా సాగుతుంది.  4 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా చదువు చక్కగా సాగుతుంది.  ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నిస్తే వీటిని అధిగమించి విజయం సాధించా వచ్చు. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు   అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం   సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది.

నవాంశ ఆధారిత నక్షత్ర ఫలితాలు-7

మూలా 

  1. మూలా నక్షత్ర మొదటి పాదం :-  మూలా నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు.   మూలా నక్షత్ర అధిపతి కేతువు. కనుక వీరి  మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక  ఉద్యమాలలో వీరు  ముందు ఉంటారు.   వీరికి ఆత్మవిశ్వాసం , ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. వీరు సైనిక పరమైన ఉద్యోగాలంటే  ఆసక్తి కలిగి ఉంటారు. పోలిస్ శాఖ కూడా వీరికి అనుకూలమే.  అగ్ని, విద్యుత్, భూ సంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. 6 సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్రదశ  వస్తుంది. కనుక విద్యారంభం బాగా ఉంటుంది. విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం  ఉంది కనుక ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఏంతో  ఉంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది.  సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.  49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గు ముఖం పట్టి సౌఖ్యం ఆరంభం ఔతుంది. మిగిలిన జీవితం బాగుంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  2. మూలా నక్షత్ర  రెండవ పాదం :-  మూలా నక్షత్ర  రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది.  మకరరాశి అధిపతి శుక్రుడు.  మూలా నక్షత్ర  అధిపతి కేతువు. వీరిమీద శుక్రుడు  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  అకర్షణీయంగా మాట్లాడగలరు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తు పోగల అవకాశాలు ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు  ఔతారు . 4 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుండి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  3. మూలా నక్షత్ర మూడవ పాదం :-  మూలా నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు .  మూలా నక్షత్ర అధిపతి కేతువు.  వీరిమీద బుధ  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.   వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధికుశలతతో ప్రదర్శిస్తారు .  వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకులిస్తాయి.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు , వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు  ఔతారు . 3 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుండి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 3 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.
  4. మూలా నక్షత్ర నాలుగవ పాదం:-  మూలా నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది.    కటకరాశి అధిపతి చంద్రుడు. మూలా నక్షత్ర అధిపతి కేతువు.వీరి మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది.  వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను . వీరు కోపతాపాలను, అభిమానాన్ని  మర్చి మర్చి ప్రదర్శిస్తారు. వీరు అధిక భక్తి  పరవశతకలిగి ఉంటారు. వీరికి శ్వేతవర్ణ వసువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  వీరు బాల్యం నుండి కళారంగంలో ప్రకాసించగలరు. వీరు దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. వీరికి విద్య నిరాటంకంగా సాగుతుంది. 2 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు  అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.  జీవితంలో త్వరగా స్థిరపడతారు.  సకాలంలో వివాహం జరుగుతుంది. 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జివితలో తిరిగి అభివృద్ధి, సౌఖ్యం  కొనసాగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా ఉంటుంది.

పూర్వాషాఢ 

  1. పూర్వాషాఢ నక్షత్ర  మొదటి పాదం :-  పూర్వాషాఢ మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది.  సింహరాశి సూర్యుడు .  పూర్వాషాఢ  నక్షత్ర  అధిపతి శుక్రుడు . వీరి మీద సూర్య , శుక్ర  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది. వీరికి అతిశయభావం, ఆధిఖ్యభావం, నిర్వహణ సామర్ధ్యం ఉంటుంది.  విలాసాల మీద ఆసక్తి,  సౌందర్యపోషణ మీద ఆసక్తి ఉంటుంది. కళాత్మకమైన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు  బాల్యం నుండి కళారంగంలో రాణించగలరు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాలు  సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 18 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 41 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  2. పూర్వాషాఢ నక్షత్ర  రెండవ  పాదం:-  పూర్వాషాఢ నక్షత్ర  రెండవ  పాదం కన్యారాశిలో ఉంటుంది.  కన్యారాశి అధిపతి బుధుడు.  పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. వీరి మీద శుక్ర , బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు  బుద్ధికుశలత కలిగి ప్రవర్తిస్తారు.  వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది సౌదర్య పిపాస కూడా ఎక్కుగా ఉంటుంది. కళాత్మక వస్తువుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు  బాల్యం నుండి కళారంగంలో ప్రకాశించ కలుగుతారు.  పర్యాటక ప్రదేశాలలో వీరికి ఉద్యోగావకాశాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత , కళా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.   విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి  14 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 37 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.
  3. పూర్వాషాఢ నక్షత్ర మూడవ  పాదం :-  పూర్వాషాఢ నక్షత్ర మూడవ  పాదం తులారాశిలో ఉంటుంది.  తులారాశి అధిపతి శుక్రుడు.  పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు.  వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది కనుక వీరిమీద పరిపూర్ణంగా శుక్రుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు  కళారంగంలో విశేషంగా ప్రకాశిస్తారు. వీరికి కళాపిపాస అత్యధికంగా ఉంటుంది. కళాత్మక వస్తుసేకరణ అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది . పరిశుభ్రమైన వాతావరణంలో నివసిస్తారు. పరిశుభ్రంగా ఉంటారు. పర్యాటక ప్రదేశాలలో, విహార ప్రదేశాలలో, విలాస ప్రదేశాలలో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. బాల్యం నుండి కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి  9 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 32 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 50 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 66 సంవత్సరాల కాలంలో 19  సంవత్సరాల శనిదశ కాలంలో వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది.  
  4. పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ పాదం :-  పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది.   వృశ్చికరాశి అధిపతి కుజుడు,   పూర్వాషాఢ నక్షత్ర  అధిపతి.  వీరి మీద కుజ శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరిచే నేర్పు ఉంటుంది . వీరు భావతీవ్రత కలిగి ఉంటారు. అయిన తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. వీరు భూ సంబంధిత , కళా సంబంధిత, పర్యాటక సంబంధిత ,  జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  బాల్యం నుండి కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుండి బాగా సాగుతుంది. శుక్రదశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది.  మనసును ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 5 సంవత్సరాల వరకు వీరికి శుక్రదశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో  తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 28 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  రాహుదశ అనుకూలిస్తే విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 61 సంవత్సరాల కాలంలో 19 సంవత్సరాల శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగిలిన జీవితం బాగా జరుగుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది. 

ఉత్తరాషాఢ 

  1. ఉత్తరాషాఢ నక్షత్ర  మొదటి పాదం :-   ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదం ధనసురాశిలో ఉంటుంది.   ధనసురాశి అధిపతి గురువు.  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం , అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాద్యాయులు పని చేయడం వీరికి అనుకులిస్తుంది. ప్రజానయకులుగా,  ప్రజా అధికారులుగా వీరు  సమర్ధతో పనిచేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత,  పసుపు  వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 5 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  2. ఉత్తరాషాఢ నక్షత్ర  రెండవ పాదం :-  ఉత్తరాషాఢ నక్షత్ర  రెండవ పాదం మకరరాశిలో ఉంటుంది.  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు .   మకరరాశి అధిపతి శని కనుక వీరి మీద శని సూర్య గ్రహప్రభావం ఉంటుంది.  వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరు  తండ్రి పట్ల  కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం  ఉంటుంది. వీరికి  ప్రభుత్వ పరిశ్రమలు , కర్మాగాలలో   ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. విరుశ్రమించి పనిచేయగలరు. వీరు నిర్వహకులుగా  చక్కగా పని చేయగలరు. వీరు  పరిశ్రమలను స్థాపించి నిర్వహించగలరు.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగ వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  3. ఉత్తరాషాఢ నక్షత్ర  మూడవ పాదం :-   ఉత్తరాషాఢ నక్షత్ర  మూడవ పాదం కుంభరాశిలో ఉంటుంది.  కుంభరాశి అధిపతి శని .  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.  కనుక వీరి మీద శని సూర్య గ్రహప్రభావం ఉంటుంది.   వీరు  తండ్రి పట్ల  కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం  ఉంటుంది. వీరికి  ప్రభుత్వ పరిశ్రమలు , కర్మాగాలలో   ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. విరుశ్రమించి పనిచేయగలరు. వీరు నిర్వహకులుగా  చక్కగా పని చేయగలరు. విరు పరిశ్రమలను స్థాపించి నిర్వహించగలరు. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 2 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటె ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
  4. ఉత్తరాషాఢ నక్షత్ర  నాలుగవ పాదం :-  ఉత్తరాషాఢ నక్షత్ర  నాలుగవ పాదం మీనరాశిలో  ఉంటుంది.  మీనరాశి అధిపతి గురువు .  ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు.   వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవగణానికి చెందిన వారు కనుక సమయానుకూలంగా ప్రవర్తించ  కలిగిన సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం , అతిశయం కలగలుపుగా ఉంటాయి.  ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాద్యాయులు, ఉన్నతోపాద్యాయులు పని చేయడం వీరికి అనుకులిస్తుంది. ప్రజానయకులుగా,  ప్రజా అధికారులుగా వీరు  సమర్ధతో పనిచేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత,  పసుపు  వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 1 సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. 11 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 18 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే  ఉన్నత విద్య విదేశాలలో కొనసాగా వచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. 36 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి .సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సౌఖ్యం తిరిగి అరభం ఔతుంది. 52 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికం ఔతాయి. 71 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.